మంచి కథతో...
యానీ క్రియేషన్స్ పతాకంపై కిరణ్‌కుమార్ దర్శకత్వంలో గంటా రామకృష్ణ నిర్మించిన చిత్రం ‘అయ్యో రామ’. సంతోష్ కవల సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో హైదరాబాద్‌లో విడుదలైంది. బిగ్ సీడీని ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బ్యానర్ లోగోను మహర్షి చాముండేశ్వరినాథ్ ఆవిష్కరించారు. ఆడియో సీడీని దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి విడుదల చేసి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు.
ఈ చిత్రం మంచి విజయం సాధించాలని రామసత్యనారా యణ ఆకాంక్షించారు. మంచి కథ, కథనాలతో రూపొందిం చిన ఈ చిత్రానికి చక్కని పాటలు కుదిరాయనీ, అన్ని వర్గాలవారినీ ఈ చిత్రం ఆకట్టుకుంటుందనీ దర్శక, నిర్మాతలు అన్నారు. హీరోహీరోయిన్లు పవన్సిద్దు, కామ్నా సింగ్, నిషిత, బీజేపీ రాష్ట్ర సెక్రటరీ రంగారెడ్డి, కపిల్ తదితరులు పాల్గొన్నారు.