ఇస్రో రాధాకృష్ణన్‌ను విచారించిన సీబీఐ
న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థ దేవాస్‌తో యాంత్రిక్స్ కుదుర్చుకున్న అక్రమ ఒప్పందానికి సంబంధించి ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్‌ను సీబీఐ అధికారులు విచారించారు. ఇస్రో వాణిజ్య విభాగమైన యాంత్రిక్స్ సంస్థకు సైతం ఆయనే చైర్మన్‌గా ఉండడంతో బెంగళూరులోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం రెండు గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. దేవాస్‌తో ఒప్పందాన్ని రద్దుచేసుకోవడంతో యాంత్రిక్స్పై అంతర్జాతీయమధ్యవర్తిత్వ కోర్టు రూ.4,400 కోట్ల జరిమానా విధించిన నేపథ్యంలో సీబీఐ కేసు నమోదుచేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా ఆయనను ప్రశ్నించింది. చేతిలో ఇమిడే సాధనాల్లో శాటిలైట్ ఆధారిత మల్టీమీడియా సర్వీసులకు కావాల్సిన స్ప్రెక్టమ్‌ను వాడుకునేందుకు దేవాస్.. యాంత్రిక్స్‌తో గతంలో ఒప్పందం కుదుర్చుకుంది.