స్వగ్రామానికి చేరుకున్న వంశీ మృతదేహం
నల్గొండ(మునగాల): పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన యర్రంశెట్టి వంశీ (19) భౌతిక కాయం ఆదివారం స్వగ్రామమైన నల్లగొండ జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామ పంచాయతీ పరిధిలోని రామలింగాలబండకు చేరింది. స్నేహితులతో కలసి గత శుక్రవారం సరదాగా పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ వద్ద డ్యామ్‌కు వెళ్లారు.
అందులో ఈతకు దిగగా ముగ్గురు విద్యార్థులు మునిగారు. ఇద్దరు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకోగా వంశీ నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రయోజకుడై వస్తాడనుకున్న కుమారుడు విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.