yasaswi
-
'చూసుకో' అంటోన్న యంగ్ హీరోయిన్.. ఆకట్టుకుంటోన్న కెమిస్ట్రీ!
ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఏ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రైవేట్ సాంగ్స్‌ను కూడా సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం తగ్గకుండ రూపొందిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో యంగ్ హీరో, హీరోయిన్లు మెరిశారు. త్రిగుణ్, ఆయుషి పటేల్ జంటగా ‘చూసుకో’ అనే వీడియో ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'చూసుకో అంటూ' సాగే ఈ పాటను యంగ్ సెన్సేషన్ యశస్వి కొండెపూడి, హరిణి ఇవటూరి సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటకు సాహిత్యాన్ని సురేష్ బాణిశెట్టి అందించగా.. అన్వేష్ రావు కగిటాల బాణీని సమకూర్చారు. తాజాగా రిలీజైన ఈ మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళలోని అందమైన విజువల్స్‌ను మరింత అందంగా చూపించారు. ఈ సాంగ్‌లో త్రిగుణ్, ఆయుషి కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కాగా.. ప్రస్తుతం ఆయుషి పటేల్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మార్చి 22న కలియుగం పట్టణంలో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరో మూడు ప్రాజెక్టులు చిత్రీకరణలో ఉన్నాయి. మరో వైపు త్రిగుణ్ సైతం ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అచ్చ తెలుగమ్మాయి అయిన ఆయుషి అందాలు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
ఆ పాట వద్దు అని అన్నాను కానీ ఆ పాటనే నన్ను బతికించింది
-
బిత్తిరి సత్తి సాంగ్ పాడితే ఎలా ఉంటుంది..?
-
మా పెళ్ళికి అందరూ ఓకే అన్నారు : సింగర్ యశస్వి
-
లతా మంగేష్కర్ ను గుర్తు చేస్తూ సింగర్ యశస్వి పాట
-
కోడి ఈకలు.. చేపల పొలుసుతో ఇటుకలు
సాక్షి, అమరావతి: కోడి ఈకలు, చేప పొలుసు వంటి వ్యర్థాలను పర్యావరణ హితంగా మార్చి వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుట్టింది విజయవాడ విద్యార్థిని మట్ల యశస్వి. ఈ వినూత్న ఆలోచనకు జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ అవార్డు వరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా యశస్వి ఈ అవార్డును అందుకోనుంది. ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ పోటీలకు సైతం నామినేట్ అయింది. గత ఏడాది పదో తరగతి చదువుతున్నప్పుడు యశస్వి దీనిని రూపొందించింది. ప్రస్తుతం ఆమె ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఇంకా మరెన్నో.. కోడి ఈకలు వాయు కాలుషం నివారణలో ఉపయోగపడతాయని యశస్వి నిరూపించింది. ఈ ఈకలను డిస్క్ మాదిరిగా చేసి ఫ్యాక్టరీ పొగ గొట్టాలు, వాహనాల సైలెన్సర్ల వద్ద ఉంచినప్పుడు కాలుష్యం తగ్గింది. అంతేకాకుండా కోడి ఈకలు, చేప పొలుసు, నీరు, గ్లిసరిన్ కలిసి వేడి చేస్తే బయో ప్లాస్టిక్ తయారవుతోంది. ఇది సులభంగా మట్టిలో కలిసిపోయి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. చేప పొలుసును నీటితో కలిపి వేడి చేస్తే ఫిష్ జెల్ తయారవుతోంది. దీనిని ఐరన్ రాడ్లకు పూస్తే తుప్పు పట్టకుండా నివారిస్తోంది. మోకాళ్ల నొప్పులకు సంబంధించి కార్టిలేజ్ ట్రీట్మెంట్లో చేపల పొలుసులు ఉపయోగపడనున్నాయి. ఇందులో కొలాజిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఈ జెల్‌ను ఉపయోగిస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పెయింట్ వేసేటప్పుడు ఈ జెల్‌ను కలిపి వాడితే గోడలకు చెమ్మ రాకుండా, పెచ్చులూడకుండా నివారించవచ్చు. ఏపీసీవోఎస్టీ అవార్డులు అందుకుంటున్న యశస్వి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైంది ఇలా జాతీయ ఇన్స్పైర్ అవార్డు కోసం దేశం నలుమూలల నుంచి మొత్తం 581 మంది ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇందులో యశస్వి రూపొందించిన ప్రాజెక్ట్ కూడా ఉంది. కరోనా నేపథ్యంలో జాతీయస్థాయి ఎంపికలు ఈ నెల 4నుంచి 8 వరకు వర్చువల్ విధానంలో జరిగాయి. ఇందులో యశస్వి ప్రాజెక్ట్ అవార్డుకు ఎంపికైంది. ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్ జె.నివాస్‌కు వివరిస్తున్న యశస్వి తయారీ ఇలా.. కోడి ఈకలలోని కొలాజిన్, చేపల పొలుసులోని కెరోటిన్లతో పర్యావరణ హితమై భూమిలో కలిసిపోయే బయో ప్లాస్టిక్, తేలికపాటి సిమెంట్ ఇటుకలు, బయో ఎరువులు, పెయింట్ల వినియోగంలో పెచ్చులూడి పోకుండా చేయడం, వాహనాల ద్వారా వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించడం, కొలాజిన్ వినియోగంతో ఐరన్ తుప్పు పట్టే గుణం తగ్గడం, కార్టిలేజ్ ట్రీట్మెంట్ వంటి వాటిపై పరిశోధనలు చేసిన యశస్వి వాటిని శాస్త్రీయంగా నిరూపించింది. కోడి ఈకలు, చేప పొలుసును సిమెంట్, ఇసుక, నీటితో కలిపి తేలికగా ఉండే సిమెంట్ ఇటుకలను తయారు చేసింది. ఈ ఇటుకలను ల్యాబ్‌లో పరిశీలించగా బలంగానే ఉన్నాయని నిరూపణ అయ్యింది. యశస్విని సత్కరిస్తున్న జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రోత్సాహం మరువలేనిది కోడి ఈకలు, చేప పొలుసు కాలువల్లో నీటికి అడ్డుపడటంతోపాటు, పర్యావరణానికి హాని కలిగించటం గమనించా. వీటితో పర్యావరణ హితమైన వస్తువులను తయారు చేయాలనిపించింది. ఇందుకు మా గైడ్, సైన్స్ టీచర్ హేమంత్‌కుమార్, ప్రిన్సిపల్ రామభారతి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మా అమ్మ, నాన్న శ్రీలక్ష్మి, దేవరామరాజు మొదటి నుంచీ పరిశోధనలపై ఆసక్తి చూపేలా చేశారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. – యశస్వి, ఇన్స్పైర్ అవార్డు గ్రహీత -
మా విషయం స్టేజ్‌పై చెప్పగానే జాను పేరెంట్స్ కాస్తా..
ఒకే ఒక్క పాటతో ఓవర్‌నైట్ స్టార్ సింగర్ అయ్యాడు యశస్వి కొండెపూడి. జాను చిత్రంలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటను అద్భుతంగా పాడి బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ పాట తర్వాత యశస్వి క్రేజ్ అమాంతం పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘సరిగమప-13’ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన యశస్వి...ఏడో తరగతిలోనే తన లవ్‌స్టోరీ మొదలైందని చెప్పుకొచ్చాడు. తన ప్రేయసి జానూ కోసమే 7స్కూళ్లు మారానని చెప్పాడు. నిజానికి తనకు పైలట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఆశ ఉండేదని, అయితే తన ప్రేయసి కోసమే బైపీసీలో జాయిన్ అయ్యానని పేర్కొన్నాడు. 'నా లవ్‌స్టోరీ గురించి ఇంట్లో తెలుసు. కానీ ఏదో సరదాగా అంటున్నానని లైట్ తీసుకున్నారు. ఇంత సీరియస్ అని అనుకోలేదు. జానూని ఓ షోలో పరిచయం చేస్తున్నానని చెప్పినప్పుడు ఇప్పుడే ఎందుకు అందరికి తెలియడం అని మా పేరెంట్స్ అన్నారు. అయితే ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా..అందరికి తెలిస్తే తప్పేంటి అని చెప్పా. ఇక జానూ వాళ్ల ఇంట్లో ఈ విషయం చెబితే..అలా పబ్లిక్‌లో బయటపెట్టడం ఎందుకు అని కాస్త ఆలోచించారు. కానీ మేం అవన్నీ వదిలేశాం. జీతెలుగు ద్వారా మేం ప్రేమికులం అని తెలిసిపోయింది' అని తన లవ్‌స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. చదవండి : మ్యూజిక్ నేర్చుకోలేదు: యశస్వి కొండేపూడి ‘ఫస్ట్ ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ అయిపోతాననుకున్నా’ -
ఆంధ్రా వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్థరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత యశస్వి(22) అనే విద్యార్థి గదిలో ఉన్న కిటికీకి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. యశస్వి స్వస్థలం గుంటూరు జిల్లా చిలకలూరి పేట. యూనివర్సిటీలో ‘లా’ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.