మృత్యుంజయుడు
పార్వతీపురం,న్యూస్‌లైన్: ఈ ఫొటోలో ఉన్న బాలు డు రెండున్నరేళ్ల అఖిల్. శుక్రవారం సాయంత్రం రెండంతస్తుల భవనం పైనుంచి పడిపోయాడు. స్వల్పగాయాలతో బయటపడి మృత్యుంజయుడయ్యాడు. పార్వతీపురం నెహ్రూ కాలనీలో రెండంతస్తుల భవనంపై గవర సత్యం, యశోద కుమారుడు అఖిల్ ఆడుకుంటున్నాడు. భవనం పిట్టగోడ చిన్నదిగా ఉండడంతో అఖిల్ దానిపైనుంచి రేకులపై.. అక్కడి నుంచి కిందకు పడ్డాడు. నేల కూడా మెత్తటి మట్టితో ఉండడంతో ప్రమాదం తప్పింది.