అవినాష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి ష్యూరిటీ పత్రాల సమర్పణ
హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ కోసం కోర్టు ఆదేశాల ప్రకారం సొంత పూచీకత్తు సమర్పించారు. మంగళవారం ఉదయం జామీను పత్రాలతో అవినాష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి.... నాంపల్లి కోర్టుకు వచ్చారు. పత్రాలను న్యాయమూర్తి పరిశీలించిన అనంతరం కోర్టు ఆర్డర్స్ ఇవ్వనుంది. కాగా నాంపల్లి కోర్టు వద్దకు జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే భారీగా మోహరించిన పోలీసులు వారిని లోనికి అనుమతించటం లేదు.