ఏడుపాయలను దర్శించుకున్న శ్రీకాంత్
పాపన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం మహాయజ్ఞంలా కొనసాగుతోందని, ప్రతి మొక్క భూమాతకు పచ్చని బుట్టులా మారాలని సినీ నటుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. శుక్రవారం ఏడుపాయలకు వచ్చిన ఆయన దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. ముందుగా ఈఓ వెంకట్‌కిషన్‌రావు, విష్ణువర్దర్‌రెడ్డి, ఆయల సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.
అనంతరం శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏడుపాయలను దర్శించుకోలేదన్నారు. దట్టమైన అడవి మధ్యన మంజీరా, ప్రహరీలా ఉన్న రాతి గుట్టల్ని చూస్తుంటే మనస్సు పులకించిందన్నారు. హరితహారంలో యావత్ సినీ పరిశ్రమ పాల్గొని మొక్కలు నాటిందన్నారు. ఆయన వెంట బంధువులు, ఆలయ సిబ్బంది గోపాల్, రవి, శ్రీనివాస్, అచ్చన్నపల్లి శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, పూజారులు శంకరశర్మ, పార్థివశర్మ ఉన్నారు.
సెల్ఫీల కోసం ఆరాటం
తమ అభిమాన నటుడితో సెల్ఫీలు తీసుకునేందుకు యువకులు, మహిళలు పోటీపడ్డారు. చిరుజల్లులు పడుతున్నా శ్రీకాంత్ ఓపిగ్గా అందరినీ పలకరించి, ఫొటోలు దిగడం విశేషం.