తీవ్రవాదులను జైలు నుంచి తప్పించిన ఆల్‌ఖైదా
వాషింగ్టన్: యెమెన్‌లో ఆల్ ఖైదా తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. షాబ్వా ప్రావెన్స్లోని జైల్‌పై శుక్రవారం దాడి చేసి... బందీలుగా ఉన్న ఆరుగురు ఖైదీలను విడిపించి...తమతో తీసుకు వెళ్లారు. ఈ మేరకు భద్రత దళానికి చెందిన ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. సదరు ఖైదీలంతా మరణశిక్ష పడిన వారని తెలిపారు. సైనిక శిబిరంపై దాడి చేసి రక్తసిక్తం చేసిన మరుసటి రోజు ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
అయితే యెమెన్‌లోని తమతమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నట్లు సౌదీ అరేబియాతోపాటు పలుదేశాలు ఇప్పటికే ప్రకటించాయి. యెమెన్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.