Yendala Lakshmi Narayana
-
కారులో పెరిగిన కసి.. ఆ గడ్డ ఇక ముందు ఎవరి అడ్డా?
పునాదులు లేని చోట కమలం పార్టీకి హఠాత్తుగా ఓ ఎంపీ ఎన్నికయ్యాడు. అనుకోకుండా లభించిన విజయాన్ని ఆస్వాదించడంతో పాటు దాన్ని కాపాడుకోవడం కూడా అవసరమే. పార్టీకి మరిన్ని విజయాలు అందించడానికి అక్కడున్న నేతలంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. కాని ఆ జిల్లాలోని కమలం రేకుల మధ్య ఐక్యత కనిపించడంలేదు. ఇంతకీ కాషాయ సేనలో అంతర్గత పోరు నడుస్తున్నదెక్కడ? ఎంపీ వర్సెస్ కన్వీనర్లు ఇందూరు కమలం పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. గతంలో అంతర్గతంగా ఉండే విభేదాలు ఇప్పుడు వీధిన పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన బీజేపి ఇంటర్నల్ సమావేశం రసాభాసగా ముగిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లుగా.. ఇప్పటివరకు ఉన్నవారికి కాకుండా కొత్తవారికి ఇవ్వడంపై ఒకింత అసహనం..ఆగ్రహం వ్యక్తం అయ్యాయి. ఈ సమావేశం వల్ల మరోసారి బీజేపి నేతల మధ్య ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదోవిడత పాదయాత్ర నేపథ్యంలో ఇంఛార్జుల నియామకంలో తమను పట్టించుకోలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలపై కూడా పలు మండలాల నాయకులు అగ్గిమీద గుగ్గిలమైనట్టు సమాచారం. ఇప్పటికే ఇందూరు బీజేపీలో ఎంపీ అరవింద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నట్టుగా ఫైట్ సాగుతోంది. అరవింద్ తనకిష్టమైనవారికే పదవులిప్పించుకుంటున్నారని.. అలాగే ఇంఛార్జులు, కన్వీనర్ల నియామకాల్లోనూ తమను పట్టించుకోలేదంటూ.. కొందరు నేతలు సుమారు రెండు గంటల పాటు సమావేశంలోనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పైగా ఎంపీ అరవింద్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలూ చేసినట్టు సమాచారం. చదవండి: (మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్) నోట నవ్వుతారు.. నొసలు చిట్లిస్తారు..! బీజేపీ పదాధికారుల సమావేశంలో.. ముఖ్యంగా ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల నేతలు అరవింద్‌పై పెద్దఎత్తున ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఈ మధ్య అరవింద్ ఆర్మూర్ లోనే ఉండి పాలిటిక్స్ చేస్తున్నారు. మరోవైపు బోధన్ లోనూ బీజేపీ ఎమ్మెల్యే సీటు ఆశావహుల సంఖ్య పెరగడంతో.. ఆయా గ్రూపుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఇంతకాలం అరవింద్‌కు అనుకూలంగానే ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనర్సయ్య కూడా ఈమధ్య అరవింద్‌తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతుండగా.. త్వరలోనే పార్టీ జిల్లా అధ్యక్షుడినీ మార్చబోతున్నారంటూ.. గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అధ్యక్షుడిగా పనిచేసి.. ప్రస్తుతం అరవింద్‌కు సన్నిహితంగా ఉంటున్న పల్లె గంగారెడ్డితో పాటు.. మరికొందరి పేర్లను జిల్లా అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కారులో పెరిగిన కసి ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్ లో 11 మంది కార్పోరేటర్లు బీజేపి నుంచి ఇతర పార్టీల్లోకి వలస వెళ్ళారు. అధ్యక్ష పదవి మళ్ళీ తనకే ఇవ్వకపోతే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడైన బసవ కూడా పార్టీ మారే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ను ఢీ అంటే ఢీ కొడుతూ ఉవ్వెత్తున ఎగిసిపడిన బీజేపీ.. అంతేస్థాయిలో అంతర్గత కలహాల్లో కూరుకుపోతోంది. పైగా రానున్న ఎన్నికల్లో గట్టిగా పోరాడితే కమలం పార్టీకి అవకాశాలున్న నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ వంటి స్థానాల్లోనే ఈ అంతర్గత విభేదాలు పొడచూపడం పార్టీని కలవరపెడుతోంది. వడివడిగా ఎదిగిన బీజేపీ.. అంతే వడివడిగా సంక్షోభాలు.. అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ మళ్లీ ఇందూరుపై సీరియస్ గా దృష్టి సారిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపి బలహీనతలే ప్రత్యర్థులకు బలమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమంటూ.. నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే
సాక్షి, నిజామాబాద్ : రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీకి ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కేసీఆర్.. ప్రజలకు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో తమ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగానే ఉందన్నారు. ఈ నెలలో(సెప్టెంబరు) బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పర్యటన ప్రారంభించి.. పాలమూరు నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలిపారు. -
లెక్కలు తప్ప మొక్కలు లేవు: యెండల
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నాటామని చెబుతున్న మొక్కలు కాగితాల్లో తప్ప ఎక్కడా లేవని బీజేఎల్పీ మాజీ నేత యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 80 కోట్ల మొక్కలు నాటినట్టుగా ప్రభుత్వం లెక్కలు చెబుతోందని, దీని ప్రకారం ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం 65 వేల నుంచి 68 వేల మొక్కలు ఉండాలన్నారు. కానీ, ఏ గ్రామంలో ఇన్ని వేల మొక్కలు ఉన్నాయో చూపాలని ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. కాగితాల్లో లెక్కలు తప్ప మొక్కలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో పేదలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు. గ్రామజ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకంగా ఎలా చెప్పుకుంటారని సీఎంని, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని యెండల ప్రశ్నించారు. బీసీ జనగణన విషయంలో కోర్టు ప్రశ్నించే అవకాశముందని తెలిసినా నిర్దేశిత విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించలేదని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎంతో కసరత్తు చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని, ఎన్నికలను వాయిదా వేయడానికి అన్ని రకాల కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో 12,751 గ్రామపంచాయతీలుంటే కేవలం 3,494 పంచాయతీలకే కార్యదర్శులున్నారని పేర్కొన్నారు. సచివాలయానికి రాని సీఎం గ్రామకార్యదర్శులతో ఎలా సమావేశమవుతారని ఎద్దేవా చేశారు. తక్షణమే గ్రామ కార్యదర్శుల నియామకాలు చేపట్టి, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా రేష్మ రాథోర్ సినీనటి రేష్మరాథోర్ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. నియామకపత్రాన్ని యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్ అందజేశారు. ప్రధాని మోదీ చేపడుతున్న పథకాలు నచ్చడం వల్లే పార్టీలో చేరుతున్నట్టు ఆమె చెప్పారు. -
నేడు ‘సార్వత్రిక’ ఓట్ల లెక్కింపు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రోజుకో సమీకరణ.. సమీక్ష, కొంతసేపు ఉత్సాహం... ఆ వెంటనే నిరుత్సాహం. గతం లో ఎన్నడూ లేని విధంగా తిరిగాం... డబ్బు ఖ ర్చు పెట్టాం కదా! అన్న ధీమా. ఆ కొద్దిసేపటికే ఎన్నికల నిధులు నేరుగా ఓటర్లుకు చేరాయా? ద్వితీయ శ్రేణి నాయకుల వద్ద ఆగిపోయాయా? ఓ సర్వేలో అనుకూలం.. మరోటి ప్రతికూలం.. ఇలా సార్వత్రి క ఎన్నికలలో పోటీ చేసిన లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులలో సాగిన ఉత్కంఠకు శుక్రవా రం తెరపడనుంది. సర్వేలు, సొంత లెక్కలను కట్టిపెట్టి ‘గుబులు గుబులుగా గుండెల దడగా’ అభ్యర్థులు, వారి అనుచరులు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు హాజరుకానున్నారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీలకు కొంత మోదం, ఇంకొంత ఖేదం కలిగించగా.. ఆ ఎన్నికలు ఫలితాలు సైతం ప్రధాన పార్టీల నేతలను ఆందోళనకు గురి చేశాయి. ఏదీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్న నేతలను ఓ వైపు సర్వేలు.. మరో వైపు క్రాస్ ఓటింగ్ భయపెడుతుండగా వారి భవితవ్యం నేడు తేలనుంది. టెన్షన్.. టెన్షన్ ప్రధాన రాజకీయ పార్టీల నేతలలో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉత్కంఠ కొనసాగనుంది. ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో సుమారు 16 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నవారిలో మళ్లీ నేడు వెలువడే ఫలితాలు గుబులు రేపుతున్నా యి. వరుసగా మూడు ఎన్నికలు, సుమారుగా రెండు నెలలపాటు విరామ మెరుగని ప్రచారంతో అలసిన నేతల భవితవ్యం తేలనుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇందూరు జిల్లాలో కీలకంగా మారాయి. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా, నిజామాబాద్ పార్లమెంట్, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై అందరి దృష్టి నెల కొంది. పోటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ స్థానాలలో కాంగ్రెస్ ప్రముఖులు డీఎస్, షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, సురేష్‌రెడ్డిల గెలుపు ఓటములపై చర్చ ఆసక్తికరంగా మారింది. హోరాహోరిగా సాగిన పోరులో గెలుపుపై అందరూ ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఆసక్తికరం నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోటీ చేయగా బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ, సిట్టింగ్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పోటీపై ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, కొత్తగా వివిధ పార్టీల నుంచి బరిలో దిగిన సింగిరెడ్డి రవీం దర్‌రెడ్డి, అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నాయుడు ప్రకాశ్ తదితరుల గెలుపు ఓటములపై చర్చ జరుగుతోంది. అయితే పోలింగ్ శాతం, సరళిని అంచనా వేస్తూ పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రం ఎవరికీ వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. డిచ్పల్లి సీఎంసీ వేదికగా నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 16 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 101 మంది పోటీలో ఉన్నారు. మొత్తం తొమ్మిది నియోజకవర్గాలలోని 2,057 పోలింగ్ కేంద్రాలలో 5,332 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. 18,52,970 మంది ఓటర్లకు 13,25,045 మంది (71.51 శాతం) తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. డిచ్పల్లి సమీపంలోని సీఎంసీ కళాశాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవనుండగా, డిచ్పల్లి సీఎంసీ వేదిక అభ్యర్థుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, పారా మిలటరీ బలగాలను మోహరించిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల అనుమతి, కౌంటిం గ్ పాసులు ఉంటేనే ఎవరినైనా అనుమతించే అవకాశం ఉంది. -
తిక్కుంది కానీ లెక్కలేదు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు తిక్క ఉందిగానీ లెక్క లేదని టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి కల్వకుం ట్ల కవిత విమర్శించారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఉద్యమంలో అన్ని పార్టీలను, వ్యక్తులను కలుపుకుని పోరాటం చేశామని అన్నారు. ప్రస్తుత బీజేపీ లోక్‌సభ్య అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తరపున గత ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించామన్నారు. ఆయితే ఆయన ఎప్పుడు కూడా ఉద్యమంలో పాల్గొన లేదన్నారు. నిజామాబాద్ నగరాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌తోనే తెలంగాణ వచ్చిందన్నారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉండగా ఒరగబెట్టింది ఏమి లేదన్నారు. 2004లో కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసిన సోనియా బలిదానాలు జరుగుతున్నా పది సంవత్సరాలు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ తూడ్చుకు పెట్టుకుపోయే ప్రమాదం ఉందని గ్రహించి తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలో 16 మంది ఎంపీలను గెలిపిస్తే చట్టం తీసుకొచ్చి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఇతర పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకుని ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని కోరారు. -
టీడీపీతో పొత్తు ఖరారు కాలేదు: యెండల
హైదరాబాద్: టీడీపీతో బీజేపీ పొత్తు ఖరారు కాలేదని బీజేపీ ఫ్లోర్ లీడర్ యెండల లక్ష్మీనారాయణ బుధవారం సాయంత్రం ఓ ప్రకటన చేశారు. బీజేపీతో పొత్తు ఖారారైనట్టు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని యెండల తెలిపారు. పొత్తులు ఖరారన్న ఎర్రబెల్లి ప్రకటన సరికాదని యెండల వ్యాఖ్యలు చేయడం ఇరుపార్టీల్లో గందరగోళం నెలకొంది. గత కొద్దినెలలుగా బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నా.. ఎలాంటి సానుకూలత రాలేదు. ఓదశలో తెలుగుదేశం పొత్తుకు ప్రయత్నిస్తుండగా.. టీఆర్ఎస్ కూడా పొత్తుకు సిగ్నల్ ఇచ్చింది. దాంతో తెలుగుదేశం, బీజేపీ పొత్తుపై అనేక సందేహాలు నెలకొన్నాయి. అయితే ఎర్రబెల్లి పొత్తు ఖరారైందని చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత యెండల ఖండించడం మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.