టీడీపీతో పొత్తు ఖరారు కాలేదు: యెండల
హైదరాబాద్: టీడీపీతో బీజేపీ పొత్తు ఖరారు కాలేదని బీజేపీ ఫ్లోర్ లీడర్ యెండల లక్ష్మీనారాయణ బుధవారం సాయంత్రం ఓ ప్రకటన చేశారు. బీజేపీతో పొత్తు ఖారారైనట్టు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని యెండల తెలిపారు. పొత్తులు ఖరారన్న ఎర్రబెల్లి ప్రకటన సరికాదని యెండల వ్యాఖ్యలు చేయడం ఇరుపార్టీల్లో గందరగోళం నెలకొంది.
గత కొద్దినెలలుగా బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నా.. ఎలాంటి సానుకూలత రాలేదు. ఓదశలో తెలుగుదేశం పొత్తుకు ప్రయత్నిస్తుండగా.. టీఆర్ఎస్ కూడా పొత్తుకు సిగ్నల్ ఇచ్చింది. దాంతో తెలుగుదేశం, బీజేపీ పొత్తుపై అనేక సందేహాలు నెలకొన్నాయి. అయితే ఎర్రబెల్లి పొత్తు ఖరారైందని చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత యెండల ఖండించడం మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.