yetapaka police station
-
తెలంగాణ సరిహద్దులో శ్రీరామనవమి.. అదిగో భద్రాద్రి.. ఎటపాక ఇదిగో..
సాక్షి, ఎటపాక: సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ సరిహద్దున ఉన్న ఎటపాక మండలంలో జటాయువు మండపం, గుండాల గ్రామంలోని ఉష్ణగుండాల గోదావరి నదిలో వేడినీళ్ల బావిని భక్తుల దర్శనార్థం సిద్ధం చేశారు. ఏటా భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం,ముక్కోటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు జటాయువు మండపం,ఉష్ణగుండాలను దర్శించుకుంటారు. ఈనెల 10న శ్రీరామనవమి రోజున స్వామి వారి కల్యాణం, 11న శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవాలకు భద్రాచలంలోని రామాలయంలో నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిగో భద్రాద్రి..గౌతమి అదిగో చూడండి... అంటూ శ్రీరామదాసు పిలుపునందుకుని సీతారాముల కల్యాణానికి భక్తులు తరలివస్తున్నారు. శ్రీరామనవమి అంటే చాలు భక్తిపారవశ్యంతో పులకించే భక్తులు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే వేలాది మంది భద్రాద్రికి ఏటా వస్తుంటారు. అంతేకాకుండా రామయ్య పెళ్లి వేడుకల్లో అన్నీ తామై ముందుంటారు. తలంబ్రాల తయారీ, పెళ్లి తంతులో ఉపయోగించే కొబ్బరి బొండాలు భద్రాద్రి సీతారాముల కల్యాణానికి భక్తులు ఉభయగోదావరి జిల్లాల నుంచే తీసుకెళుతుంటారు. కరోన కారణంగా స్వామి వారి కల్యాణాన్ని గత రెండేళ్లుగా వీక్షించే భాగ్యాన్ని భక్తులు నోచుకోలేదు.అయితే ఈఏడాది జరిగే వేడుకలకు భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి కల్యాణ వేడుకల్లో పాల్గొనేందుకు లక్షకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. మిథిలా స్టేడియాన్ని సుందరంగ అలంకరించారు. పట్టణంలోని ప్రధానకూడల్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఉçష్ణగుండాల గోదావరి నదిలో వేడినీళ్ల బావి ఉష్ణగుండాల ప్రాశస్త్యం సీతమ్మ వారు వనవాస సమయంలో గోదావరిలో స్నానమాచరించే క్రమంలో చన్నీళ్లు పోసుకునేందుకు కొంత అసౌకర్యానికి గురైనట్టు చరిత్ర. ఆ సమయంలో లక్ష్మణుడు తన విల్లంబును ఇసుక తిన్నెల్లో ఎక్కుపెట్టి సంధించగా అక్కడ వేడి నీళ్లు వచ్చాయని ప్రతీతి. ఆ ప్రాంతంలోని గోదావరి ఇసుక తిన్నెల్లో బావి తీస్తే ఇప్పడు కూడా వేడి నీళ్లు వస్తుంటాయి. ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వేడినీటిని తలపై చల్లుకుంటారు. జటాయువు విశిష్టత సీతారాముల వనవాస సమయంలో సీతమ్మ వారు పర్ణశాల కుటీరంలోనే తలదాచుకున్నారు. రావణాసురుడు ఇక్కడనే సీతమ్మ వారిని అపహరించారు. ఆకాశ మార్గాన ఎత్తుకెళ్తున్న సమయంలో జటాయువు అనే పక్షి రావణాసురున్ని నిలువరించేందుకు భీకర పోరాటం చేసిన క్రమంలో రెక్క ఒకటి తెగి పడిన ప్రదేశమే ఎటపాక. మొదట్లో జటాయుపాక, ఆ తరువాత జటపాక, కాలక్రమంలో ఎటపాకగా రూపాంతరం చెందింది. పక్షి కాలుపడిన గుర్తులు నేటికీ ఇక్కడ పదిలంగా ఉన్నాయి. చిన్నపాటి మండపాన్ని గ్రామస్తులే నిర్మించారు. యోగరాముడు (శ్రీరామగిరి క్షేత్రం) ఇది గోదావరి, శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రదేశం. నిండుగా ప్రవహించే గోదావరి నదీతీరాన ఎత్తైన కొండపై నెలకొన్న క్షేత్రం. ఆ కొండకే శ్రీరామగిరి అని పేరు. ఈ కొండపై శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై చాతుర్మాస్యవ్రతాన్ని ఆచరించినట్టు స్థలపురాణం చెబుతోంది. సీతాపహరణం తర్వాత శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ దండకవనం (వనక్షేత్రం) చేరి, సేదతీరి మళ్లీ సీతమ్మను వెదుకుతూ ఈప్రాంతానికి చేరుకున్నారు. ఇది అప్పుడు మాతంగముని ఆశ్రమ ప్రాంతం. ఇక్కడే శబరిని కలిసి ఆమె యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆ తల్లికి ముక్తిని ప్రసాదించాడని తెలుస్తోంది. ఆ శబరి మాత పేరుతోనే ఇక్కడి నదిని శబరి నది అంటారు. సబరియే నదిగా మారిపోయిందనే కథ కూడా ఉంది. ఈ విధంగా శ్రీరామాయణ కథకు సన్నిహితసంబంధం గల పవిత్రప్రాంతమిది. ఈప్రాంతానికి సమీపంలో రేఖ పల్లిలో (రెక్కపల్లి)(జటాయువు యొక్క రెండవ రెక్క పడిపోయిన చోటు) రెక్కను చూసి జటాయువును చూశారు. రామలక్ష్మణుల ప్రాణవిశిష్టగా ఉన్న జటాయువు ద్వారా సీత వృత్తాంతాన్ని తెలుసుకుని మరణించిన జటాయుకు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలుచేశారు. గోదావరి తీరంలో ఓపెద్ద శిలపై దానికి పిండ ప్రదానం చేసినట్టు స్థల చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ ఆ శిలను మనం దర్శించవచ్చు. ముందు ఈ కొండపై రామలక్ష్మణుల రెండు విగ్రహాలే ఉండేవి. ఆ తర్వాతి కాలంలో మాతంగి మహర్షి వంశీయులైన మహర్షులు సీతమ్మ తల్లివారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు స్థల చరిత్ర చెబుతోంది. ఇక్కడి స్వామిని సేవించిన వారికి అన్ని రకాల మానసిక చింతలు తొలగి ధైర్య స్థైర్యాలు, స్థితి ప్రజ్ఞత ఏర్పడతాయని పెద్దలు చెబుతుంటారు. -
వయా తెలంగాణ
రాష్ట్ర విభజనతో తలెత్తిన ఇబ్బందులు ఎటపాక మండలవాసులను వెన్నాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మండల కేంద్రం వెళ్లేందుకు వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉండగా మండల కేంద్రం ఎటపాక తెలంగాణలో ఉంది. ఈ మండల కేంద్రాన్ని మార్చాలని మండలంలోని ప్రజలు కోరుతున్నారు. నెల్లిపాక (రంపచోడవరం): రాష్ట్ర విభజన తరువాత భద్రాచలం మండలంలోని 21 గ్రామ పంచాయతీలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలతో కలిసి మొత్తం 70 గ్రామ రెవెన్యూలు ఈ మండలంలో ఉన్నాయి. ఈమండలంలో సుమారు 40వేల మంది జనాభా ఉన్నారు. వీరికి తొలుత నెల్లిపాక మండల కేంద్రంగా ప్రకటిస్తూ జీఓ జారీ చేశారు. అయితే ఏమైందో ఏమో కానీ కొద్దిరోజుల్లోనే మండల కేంద్రాన్ని ఎటపాకను చేస్తూ ప్రభుత్వం మరో జీఓ జారీ చేసింది. అప్పటి నుంచి ఈ మండల ప్రజలకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఎటపాక మండల కేంద్రాన్ని వెళ్లిరావడం దూరాభారం కావడంతో నానా అవస్థలు పడుతున్నారు. నాటి టీడీపీ పాలకుల నిర్ణయమే తమను ఇబ్బందులు పాల్జేసిందని మండల ప్రజలు చెబుతున్నారు. మండల కేంద్రం ఎటపాక వెళ్లాలంటే సరిహద్దున ఉన్న తెలంగాణ పట్టణం దాటి మరో నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. మారుమూల గ్రామస్తులు మండల కేంద్రం వెళ్లాలంటే 35 కిలోమీటర్లు పైబడి ప్రయాణించాల్సి వస్తోంది. ఎటపాకలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ప్రధాన రహదారి నుంచి కాలినడకన వెళ్లాలి. అక్కడ గొంతు తడుపుకునేందుకు నీరు కూడా దొరకడం లేదు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పలుమార్లు ఎటపాక వెళ్లి రాలేక నిరుపేదలు నీరుగారిపోతున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు వందల సంఖ్యలో పలు సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. టీడీపీ నాయకుల స్వార్ధప్రయోజనాలకోసం ఎటపాకను మండల కేంద్రంగా చేయించారని విమర్శిస్తున్నారు. మండల కేంద్రం మార్పునకుపెరుగుతున్న డిమాండ్ మండలానికి మధ్యలో ఉండే నెల్లిపాక పంచాయతీ చుట్టూ 18 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందని మండలవాసులు చెబుతున్నారు. ఇదిలాఉండగా ఎటపాక మండలంలోని తోటపల్లిలో వ్యాపార సముదాయాలు, ఆస్పత్రులు, బ్యాంకులు, హోటళ్లు, పరిసరాల్లో పోలవరం నిర్వాసితుల పునరావాస కాలనీలు ఉండటంతో మండల కార్యాలయాలు తోటపల్లిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో అవినీతి, భూదందాలు, కమీషన్లు, నిర్లక్ష్య పాలనకు నిదర్శనంగా నిలిచిన ఎటపాక మండల కేంద్రాన్ని మార్చాలనే డిమాండ్ ఎక్కువగా ఉంది. నూతనంగా కొలువుదీరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ మండల కేంద్రం మార్పుపై తగు నిర్ణయం తీసుకుంటుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వంతగు నిర్ణయం తీసుకోవాలి నూతనంగా ఏర్పాటైన జగనన్న ప్రభుత్వం ప్రజల అభీష్టంమేరకు ఎటపాక మండలం కేంద్రం మార్పుపై తగునిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వ నూతన కార్యాలయ భవనాలు అనువైన ప్రాంతంలో నిర్మించాలి.–తానికొండ వాసు, నందిగామ ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు మండల కేంద్రం ఎటపాక వెళ్లివచ్చేందుకు సామాన్య, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలి.–దుద్దుకూరి హరనాథబాబు, తోటపల్లి -
మావోయిస్టుల్లోనే కొరియర్లు ఉన్నారు
జిల్లా ఎస్పీ ఎన్. రవిప్రకాష్ నెల్లిపాక : పోలీసులకు మావోయిస్టుల్లోనే కొరియర్లు ఉన్నారని జిల్లా ఎస్పీ ఎన్. రవిప్రకాష్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం ఎటపాక లో విలేకరుల సమావేశంలో దీనిని మావోయిస్టుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్లంటూ అమాయక ప్రజలను కిరాతకంగా హత్యలు చేయటం మానుకోవాలని ఆయన మావోయిస్టులను హెచ్చరించారు. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్న మావోయిస్టులకు ప్రజలే తగిన బుద్ధి చెపుతారన్నారు. ఇటీవల చింతూరు మండలంలో ఓపాస్టర్గా పనిచేస్తున్న గొత్తికోయను మావోయిస్టులు హత్య చేయడాన్ని ఎస్పీ తీవ్రంగా ఖండించారు. ఆ పాస్టర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. బూటకపు హత్యలు చేస్తున్న మావోయిస్టులను అంతమొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఏజెన్సీ ప్రజలకు తాము పూర్తి అండగా ఉంటామని, గిరిజనులు, వలస ఆదివాసీలు ధైర్యంగా ఉండాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎటపాక ఓఎస్డీ డాక్టర్ ఫకీరప్ప, చింతూరు ఏఎస్పీ శ్వేత, ఎటపాక సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై నాగరాజు పాల్గొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు చింతూరు : మావోయిస్టులకు వ్యతిరేకంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం పోస్టర్లు వెలిశాయి. లచ్చిగూడెం గ్రామానికి చెందిన మారయ్య అనే పాస్టర్ను శనివారం మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో ఆ చర్యను ఖండిస్తూ పోస్టర్లు వెలిశాయి. మారయ్య ఫొటోలతో ఉన్న ఈ పోస్టర్లలో మానవత్వాన్ని మంటగలిపిన మావోలు. మాటల్లోనే సమాజ స్థాపన.. చేతల్లో అమాయకుల, ప్రజా సేవకుల హత్యలు. మావోయిజం అంటే హత్యలతో, మందుపాతర్లతో భయభ్రాంతులను చేయడమేనా అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.