‘కేఎల్ఐ సాగునీరు వైఎస్సార్ పుణ్యమే’
బిజినేపల్లి : తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు ఇవ్వడానికి బడ్జెట్ రూపకల్పన చేసింది వైఎస్సారే అని కేఎల్ఐ సాగునీరు ఆయన పుణ్యమేనని సీపీఐ రా ష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈర్ల నర్సింహ అన్నా రు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేఎల్ఐ ప్రాజెక్టు కు రూపకల్పన చేసింది నాగం జనార్దన్‌రెడ్డి అని ప్రాజెక్టు నిర్మాణం కోసం కష్టపడితే నిధుల కొరత తో ఏమి చేయలేకపోయారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అలికిపెట్టిన గూట్లో గువ్వ గుడ్డు పెట్టిన ట్లు చెప్పుకుంటుందని విమర్శించారు. వరద జ లాలు వాడుకోవాలని బ్రిజేష్ కమిటీ చెబుతుంటే ప్రభుత్వ నికర జలాలను వాడుకుంటుందని చె ప్పారు. పాలమూరు, రంగారెడ్డి పథకానికి కేంద్ర జలవనరుల శాఖ అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టుపై సుప్రీం కోర్టుకు కూడా వెళ్లిం దన్నారు. జీఓ 123పై ప్రభుత్వాకి కోర్టు మొట్టికాయలు వేసినా మార్పు రాలేదన్నా రు. వైఎస్సార్ జలయజ్ఞాన్ని టీఆర్ఎస్ ధనయజ్ఞంగా మార్చడం సరికాదన్నారు. 1980లో సీపీఐ పాదయాత్రలు చేపడితే వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై దష్టి పెట్టారన్నారు. సమావేశంలో కష్ణాజీ, యాదయ్య, భూపేష్ తదితరులు పాల్గొన్నారు.