Yokohama
-
ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్
-
ఏపీలో జపాన్ దిగ్గజ కంపెనీ యకహోమా ఎటిసి టైర్ల కంపెనీ
-
సీఎం జగన్ చేతుల మీదుగా ‘ఏటీసీ టైర్స్’ ప్రారంభం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూప్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో నెలకొల్పిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. సుమారు రూ.2,200 కోట్ల పెట్టుబడి అంచనాతో రెండు దశల్లో ఇది ఏర్పాటు కానుంది. తొలిదశలో రూ.1,384 కోట్లతో హఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా టైర్ల ఉత్పత్తిని పరిశీలించిన ఏటీసీ నేటి నుంచి వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ ఆరు ఖండాల్లో 120కిపైగా దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తమిళనాడులోని తిరునల్వేలి, గుజరాత్‌లోని దహేజ్‌లో ఇప్పటికే మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పింది, అచ్యుతాపురం యూనిట్ మూడోది. తొలి దశ యూనిట్లో ఉత్పత్తిని ప్రారంభించిన అనంతరం రూ.816 కోట్లతో చేపట్టే రెండో దశ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ నిర్వహించనున్నారు. మొత్తం రెండు దశల్లో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. 8 యూనిట్లు.. మరో రూ.వెయ్యి కోట్లకుపైగా పెట్టుబడులు ఏటీసీ రెండో దశ విస్తరణతో పాటు మరో 8 యూనిట్ల నిర్మాణ పనులకు సంబంధించి కూడా సీఎం జగన్ భూమి పూజ నిర్వహించనున్నారు. ఇందులో ఏడు అచ్యుతాపురం సెజ్‌లోనే ఏర్పాటు కానుండగా ఒకటి పరవాడ ఫార్మాసిటీలో ఏర్పాటవుతోంది. మొత్తం ఎనిమిది యూనిట్ల ద్వారా రూ.1,002.53 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానుండగా 2,664 మందికి ఉపాధి లభించనుంది. వీటికి ప్రభుత్వం 250 ఎకరాలు కేటాయించింది. ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే హైదరాబాద్, పరవాడలలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేసిన ఈ సంస్థ పరవాడలో రూ.125 కోట్ల పెట్టుబడితో మరో యూనిట్ స్థాపనకు ముందుకొచ్చింది. 8 కంపెనీల వివరాలు ఇవీ పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రత్యేక రసాయనాల ఉత్పత్తిలో పేరొందిన పిడిలైట్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో రూ.202 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తోంది. వాటర్ ప్రూఫింగ్ ఉత్పత్తుల తయారీ, కోటింగ్, సీలెంట్స్ తదితర ఉత్పత్తులను అచ్యుతాపురం సెజ్‌లో తయారు చేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా 380 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మేఘ ఫ్రూట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్బొనేటెడ్ ఫ్రూట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ఫ్రూట్ జ్యూస్‌ల టెట్రా ప్యాకింగ్, పెట్ బాటిల్స్ తదితర ఉత్పత్తుల బెవరేజెస్ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పనున్నారు. ఇప్పటికే మంగుళూరు, సంగారెడ్డిలో యూనిట్లు ఉన్న ఈ కంపెనీ అచ్యుతాపురం సెజ్‌లో రూ.185.25 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో దాదాపు 700 మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు. ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ తయారీలో పేరొందిన ఈ సంస్థ దేశంలో ఇప్పటికే 38 తయారీ యూనిట్లను నెలకొల్పింది. రూ.145 కోట్ల పెట్టుబడితో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గాన్ తదితరాలను ఇక్కడ తయారు చేయనున్నారు. విన్ విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ లిమిటెడ్ అత్యాధునిక సాంకేతికతతో కూడిన వోల్టేజ్ సిరామిక్ ఇన్సులేటర్స్, పాలిమెరిక్ ఇన్సులేటర్ల తయారీలో పేరుగాంచిన ఈ కంపెనీ దాదాపు రూ.107.70 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్ ఏర్పాటు చేయనుంది. సైనాప్టిక్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ దాదాపు రూ. 81.75 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్ ఏర్పాటుకు సిద్ధమైంది. స్టైరాక్స్ లైఫ్‌సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ దాదాపు రూ. 87.77 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇషా రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కోక్, కోల్ స్క్రీనింగ్ కొరకు ఈ సంస్థ రూ.68.06 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్ నెలకొల్పనుంది. విశాఖపట్నం పెదగంట్యాడలో ఇప్పటికే కోక్, కోల్ స్క్రీనింగ్, గ్రేడింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది. -
శరవేగంగా ఏటీజీ టైర్స్ నిర్మాణ పనులు
సాక్షి, అమరావతి: జపాన్‌కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) విశాఖలో ఏర్పాటుచేస్తున్న తయారీ యూనిట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్టణంలోని అచ్యుతాపురం సెజ్ వద్ద సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ నిర్మాణ పనులను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు. తొలుత రూ.1,250 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు చేయగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఏటీజీ ఈ మొత్తాన్ని రూ.2,500 కోట్లకు పెంచింది. ఇప్పటికే యూనిట్ ప్రధాన షెడ్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు. 2023 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తొలిదశలో 36,750 టన్నుల రబ్బరు వినియోగ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ, నిర్మాణ, అటవీ రంగాల్లో వినియోగించే భారీ యంత్రాల టైర్లను తయారు చేస్తారు. రెండు దశలు పూర్తయితే ఐదువేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, ఇందులో సగం మంది స్థానిక మహిళలకే అవకాశం కల్పిస్తామని ఏటీజీ అధికారులు తెలిపారు. దేశంలో మూడో ప్లాంట్ జపాన్‌కు చెందిన ఏటీజీకి దేశంలో ఇప్పటికే గుజరాత్‌లోని ధహేజ్లో, తమిళనాడులోని తిరువన్వేళిలో తయారీ యూనిట్లున్నాయి. విశాఖలో ఏర్పాటు చేస్తున్నది మూడో యూనిట్. ధహేజ్ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 1.26 లక్షల టన్నులు కాగా 2,600 మందికి ఉపాధి కల్పిస్తోంది. తిరువన్వేళి యూనిట్ సామర్థ్యం 86,800 టన్నులు కాగా 2,300 మంది ఉపాధి పొందుతున్నారు. -
విశాఖలో యోకొహామా టైర్ల ప్లాంట్
ముంబై: జపాన్ దిగ్గజం యోకొహామా గ్రూప్‌లో భాగమైన అలయన్స్ టైర్ గ్రూప్ (ఏటీజీ) విశాఖలో తమ టైర్ల ప్లాంటు ఏర్పాటు చేయనుంది. దీనిపై 165 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,240 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. 2023 తొలి త్రైమాసికంలో ఇది అందుబాటులోకి రాగలదని యోకొహామా ఇండియా చైర్మన్, ఏటీజీ డైరెక్టర్ నితిన్ మంత్రి వెల్లడించారు. దీనితో కొత్తగా 600 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆఫ్–హైవే టైర్ల తయారీ సంస్థ అయిన ఏటీజీకి ప్రస్తుతం 5,500 మంది సిబ్బంది ఉన్నారు. దేశీయంగా గుజరాత్‌లోని దహేజ్, తమిళనాడులోని తిరునల్వేలిలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. విశాఖలో ఏర్పాటు చేసేది మూడోది అవుతుంది. తాము గత మూడేళ్లుగా ఫ్యాక్టరీకి అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తున్నామని, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి ముందే వైజాగ్‌ను ఎంపిక చేసుకున్నామని తెలి పారు. ఏటీజీకి ఇజ్రాయెల్‌లో 45,000 టన్నుల ప్లాంటుతో పాటు ప్రధాన అభివృద్ధి, పరిశోధన (ఆర్అండ్డీ) కేంద్రమూ ఉంది. దేశీయంగా తమిళనాడు ప్లాంటులోనూ ఆర్అండ్డీ సెంటర్ ఉంది. పెరగనున్న ఉత్పత్తి సామర్థ్యం.. అచ్యుతాపురం పారిశ్రామిక పార్కులోని స్పెషల్ ప్రాజెక్టుల జోన్లో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్‌లో ఆఫ్–హైవే టైర్లను తయారు చేయనున్నారు. దీని రోజువారీ సామర్థ్యం 55 టన్నులు (రబ్బరు బరువు)గా ఉండనుంది. ప్రస్తుతం రెండు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.3 లక్షల టన్నులుగా ఉండగా, ఈ ఫ్యాక్టరీతో మరో 20,000 టన్నులు పెరగనుంది. దహేజ్, తిరునల్వేలి ఫ్యాక్టరీలు ప్రధానంగా మూడు ఆఫ్–హైవే టైర్ల బ్రాండ్లు తయారు చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల కోసం అలయన్స్ పేరిట, నిర్మాణ.. పారిశ్రామిక ఉత్పత్తుల కోసం గెలాక్సీ పేరిట, అటవీ ప్రాంతాల్లో వినియోగించే వాహనాల కోసం ప్రైమెక్స్ పేరిట టైర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. 90 శాతం ఉత్పత్తిని 120 పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. యోకొహామా గ్రూప్‌నకు జపాన్, ఇండియా, ఇజ్రాయెల్, వియత్నాంలలో ఎనిమిది ఆఫ్–హైవే ప్లాంట్లు ఉన్నాయి. 2016లో ఏటీజీని కొనుగోలు చేసింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 3,000 రకాల టైర్లను విక్రయిస్తోంది. -
స్లో అండ్ స్టడీ..
ఎక్కడైనా క్యాబ్ వాళ్లు మిమ్మల్ని వేగంగా గమ్యస్థానానికి చేరుస్తాం.. కళ్లు మూసి తెరిచేలోపల మీక్కావాల్సిన చోట దింపేస్తాం అంటూ యాడ్లు ఇస్తారు. కానీ జపాన్‌లోని యోకోహామాలో టర్టిల్ ట్యాక్సీ వాళ్లు మాత్రం పేరుకు తగ్గట్లే.. మేం నత్తనడకన పోతాం.. బాగా నెమ్మదిగా ట్యాక్సీ నడుపుతాం.. అరగంటలో వెళ్లాల్సినదానికి గంట సమయం తీసుకుంటాం అని యాడ్ ఇచ్చారు. మన దగ్గరైతే.. టర్టిల్ ట్యాక్సీ అట్టర్ ఫ్లాప్ అయ్యేది. కానీ జపాన్‌లో ఇదో పెద్ద హిట్ అయి కూర్చుంది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలతో ప్రయాణించేవారు, సిటీ చూడ్డానికి వచ్చే పర్యాటకులు ఈ ట్యాక్సీకే ఓటేస్తున్నారు. టర్టిల్ ట్యాక్సీ డ్రైవర్లు అతి నెమ్మదిగా.. కుదుపులు లేకుండా కారు నడుపుతారు. దీని కోసం ముందుగా మనం ట్యాక్సీ ఎక్కగానే.. సీటువద్ద ఉండే ఓ బటన్‌ను నొక్కాల్సి ఉంటుంది. దాన్ని నొక్కితే.. నెమ్మదిగా వెళ్లమని డ్రైవర్‌కు సంకేతం పోయినట్లే.. దీనికి బాగా డిమాండ్ పెరగడంతో వచ్చే ఏడాది టోక్యోతోపాటు మరిన్ని నగరాల్లో ఈ సర్వీసును ప్రవేశపెట్టనున్నారు.