యూడైస్, చైల్డ్ఇన్ఫో నమోదుకు 25 దాకా గడువు
– బడి బయట పిల్లలపై సమగ్రంగా సర్వే చేయాలి
– సీఆర్పీలకు అధికారుల ఆదేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : పాఠశాలలు, విద్యార్థులకు సంబంధించి యూడైస్, చైల్డ్ ఇన్ఫో, ఆధార్ నమోదును ఈ నెల 25 తుది గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర పరిశీలకుడు శేషశర్మ, విద్యాశాఖ ఏడీ పగడాల లక్ష్మీనారాయణ సూచించారు. సోమవారం ఉదయం అనంతపురం, గుత్తి డివిజన్లు, మధ్యాహ్నం ధర్మవరం, పెనుకొండ డివిజన్ల పరిధిలోని సీఆర్పీలకు స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ బడి బయట పిల్లలను గుర్తించేందుకు సర్వే చేయాలన్నారు.
సర్వే ఆధారంగానే రాబోయే వార్షిక ప్రణాళికలు, బడ్జెట్ రూపొందించబడతాయని స్పష్టం చేశారు. కేటాయించిన ప్రాంతంలో ప్రతి ఇంటినీ సందర్శించి బడి బయట పిల్లల వివరాలను సేకరించాలన్నారు. ప్రొఫార్మాలో వివరాలు నమోదు చేసి అన్లైన్ చేయాలన్నారు. ప్లానింగ్ కోఆర్డినేటర్ గోపాల్‌నాయక్, ఐఈడీ కోఆర్డినేటర్ పాండురంగ, అలెస్కో బాలమురళీ, ఏఎస్ఓలు జయచంద్రనాయుడు, చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.