రాణించిన అజయ్
జింఖానా, న్యూస్‌లైన్: అజయ్ దేవ్ 6 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంతో యంగ్ సిటిజన్ జట్టుకు విజయం దక్కింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కన్సల్ట్ జట్టు 36 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేసిన యంగ్ సిటిజన్ మూడు వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసి విజయం సాధించింది. కన్సల్ట్ జట్టు ఆటగాడు మహేష్ 2 వికె ట్లు తీశాడు.
మరో మ్యాచ్‌లో బాయ్స్ టౌన్ జట్టు ఆటగాడు ప్రగున్ ధూబే(134 నాటౌట్), అజ్మత్ ఖాన్ (90) చెలరేగడంతో 186 పరుగుల భారీ తేడాతో ధ్రువ్ ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది. బాయ్స్ టౌన్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగగా, మూడు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ధ్రువ్ ఎలెవన్ జట్టు 98 పరుగుల వద్ద కుప్పకూలింది.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
విజయానంద్: 148 (విక్రాంత్ 37; సాత్విక్ 7/45), మణికుమార్: 151/3 (సిద్ధార్ధ 60, రామ్‌దేవ్ 39, రాహుల్ 33). గ్రీన్లాండ్: 228/7 (శ్రీచరణ్ 36, సుందర్ 66; కౌషిక్ 3/39), సత్య సీసీ: 136 (కౌషిక్ 50; ప్రత్యూష్ 3/41, ఆశిష్ 3/2). టీమ్ కెఎన్వి: 298 (వరుణ్ గౌడ్ 109, రుత్విక్ 100 నాటౌట్), ఫ్యూచర్ స్టార్: 119 (అశోక్ 34; అక్షిత్ 5/25) విజయ్ భరత్: 152 (నరసింహ 41; షాజీల్ 6/56), హైదరాబాద్ పాంథర్స్ ఎలెవన్: 155 (జీషాన్ అలీ ఖాన్ 102 నాటౌట్, అక్రమ్ 32 నాటౌట్).