Your service
-
‘మీసేవ’ ద్వారా డిస్కం సేవలు
తిరుపతి : సదరన్ డిస్కం పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు ‘మీసేవ’ ద్వారా మరిన్ని విద్యుత్ సేవలను అందుబాటులోకి తెచ్చామని ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్‌వై.దొర బుధవారం తెలిపారు. సర్వీస్ పేరు, లోడ్ కేటగిరీల మార్పు, వీధి దీపాలు, పబ్లిక్ వాటర్వ ర్క్స్, గృహావసరాలు, వాణిజ్యం, కమర్షియల్ హోర్డింగ్స్ ఏర్పాటు తదితర కేటగిరీలకు సంబంధించి కొత్త సర్వీసులకు వినియోగదారులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, డాక్యుమెంట్ల నకళ్లను జతపరచి నిర్ధేశిత దరఖాస్తు ఫారాలను నింపి మీసేవ కేంద్రాల్లో సమర్పించాలన్నారు. ఆయా సేవలకు చెల్లించాల్సిన ఫీజులను కూడా మీసేవలోనే చెల్లించవచ్చన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే లక్ష ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యుత్ కాల్‌సెంటర్లతో పాటు మీసేవ కేంద్రాల్లో పైన పేర్కొన్న సేవల ను వినియోగదారులు పొందవచ్చునని, ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వినియోగదారులకు విజ్ఞప్తి చేశా రు. వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి వీలుగా తిరుపతిలోని డిస్కం ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు 1800 425 1555333 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని దొర తెలిపారు. -
స్మార్ట్‌గా దోపిడీ
ఓటరు కార్డుల పంపిణీలో చేతివాటం రూ.20 నుంచి రూ.50 వసూలు మీ సేవ కేంద్రాల్లోనూ ఇదే తంతు అమలుకు నోచుకోని ఎన్నికల సంఘం హామీ పట్టించుకోని రెవెన్యూ శాఖ అధికారులు యథేచ్ఛగా వసూళ్ల పర్వం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఓటర్లకు ఉచితంగా అందజేయాల్సిన ఓటరు స్మార్ట్‌కార్డుల పంపిణీలో పలువురు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.పది విలువ జేసే కార్డుకు రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ప్రతి ఓటరుకు బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో ఉండేలా పూర్తిస్థాయి వివరాలు, చిరునామాలతో స్మార్ట్‌కార్డుల పంపిణీకి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఓటు కోసం ఇటీవల ఆరు వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు గతంలో దరఖాస్తు చేసుకున్న 13 వేల మందికి ఎన్నికల సంఘం స్మార్ట్‌కార్డులను జారీ చేసింది. వీటిని పంపిణీ చేసేందుకు నియోజకవర్గంలో 213 మంది బూత్ లెవల్ సిబ్బందిని నియమించింది. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా... వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మూడు వేలకు పైచిలుకు స్మార్ట్‌కార్డులు జారీ అయ్యూరుు. 225 మంది బూత్ లెవల్ సిబ్బంది స్మార్ట్‌కార్డుల పంపిణీ చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఓటర్లకు ఉచితంగా అందచేయాల్సిన స్మార్ట్‌కార్డులకు ధర నిర్ణయించి ఓటర్లను దోపిడీ చేస్తున్నారు. ఒక్కో కార్డుకు రూ.20 నుంచి రూ.50 వరకు తీసుకుని పంపిణీ చేస్తున్నారు. వసూళ్ల దందాపై చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది మీనమేషాలు లెక్కిస్తుండడంతో అక్రమార్కులదే ఇష్టారాజ్యంగా మారింది. ఉచితంగా ఇవ్వాల్సిన కార్డులకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఎవరైనా అడిగితే... ‘మీ ఇష్టం... ఎండలో తిరుగుతున్నాం... ఎంతో కొంత ఇవ్వాల్సిందే...’ అని దబాయిస్తుండడం గమనార్హం. మీ సేవ కేంద్రాల్లోనూ వసూళ్లు ఎన్నికల సంఘం ఓటర్లకు ఉచితంగా అందజేయాల్సిన స్మార్ట్‌కార్డులను ఎక్కువగా మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేస్తున్నారు. బూత్ లెవల్ సిబ్బంది సకాలంలో ఓటరు స్మార్ట్‌కార్డులను పంపిణీ చేయకపోవడం... ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కార్డుల కోసం ఓటర్లు మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇదే అదునుగా... మీ సేవ కేంద్రాల నిర్వహకులు ఓటర్ల నుంచి అధికసొమ్ము వసూలు చేస్తున్నారు. ఒక్కో కార్డుకు రూ.50 నుంచి రూ.100 వరకు దండుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి... ఉచితంగా స్మార్ట్‌కార్డుల జారీ చేస్తామన్న ఎన్నికల సంఘం హామీ అమలుకు కృషి చేయూలని ఓటర్లు కోరుతున్నారు. -
ఇక పోస్టాఫీసుల్లో ‘మీ సేవ’
ఎన్జీవోస్కాలనీ, న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు పోస్టాఫీసుల్లో ప్రజలకు ‘మీ సేవ’ ద్వారా సేవలు అందిస్తున్నట్లు హన్మకొండ పో స్టల్ సూపరింటెండెంట్ బీవీ.సత్యనారాయణ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వంతో తపాలశాఖ ఒప్పందం చేసుకుందని ఆయన చెప్పారు. మొదటి విడతలో జిల్లాలోని జనగామ, పరకాల ప్రధాన తపాల కార్యాలయాల్లో మీ సేవలు ప్రారంభమయ్యాయన్నారు. రెవెన్యూ, రిజి స్ట్రేషన్, స్టాంపులు, మునిసిపాలిటీ, పోలీసు, ఆ ధా ర్, రవాణ, సివిల్ సప్లై, విద్య, వ్యవసాయం, సాం ఘిక సంక్షేమ శాఖలకు సంబంధించిన వివిధ రకాల సేవలను తపాలశాఖలో ఏర్పాటు చేసిన మీ సేవ ద్వారా పొందవచ్చని తెలిపారు. హన్మకొండ తపాల డివిజన్లోని అన్ని ప్రధాన, ఉప తపాల కార్యాల యాల ద్వారా ఇన్స్టంట్ మనీఆర్డర్ సర్వీస్ అందుబాటులో ఉందని, ఈ సర్వీస్ ద్వారా సొమ్ము ను బదిలీ చేసుకోవచ్చని చెప్పారు. మనీ ఆర్డర్ ఇచ్చి న రోజునే సీక్రెట్ కోడ్ తెలిపి అదే రోజు సొమ్ము పొం దవచ్చని ప్రజలకు సూచించారు. తపాలశాఖలో మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ పథకం కూడా అందుబాటులో ఉందని, ఈ పథకం ద్వారా వేరొకరు పం పిన సొమ్మును పొందేందుకు సంబంధిత వ్యక్తికి వ చ్చిన సంక్షిప్త సమాచారాన్ని చూపాలన్నారు. అలాగే తిరుమల దేవస్థానానికి చందా పంపిన భక్తుల చిరునామాకు స్వామివారి అక్షింతలు, ఫొటోను పోస్టు ద్వా రా అందించనున్నుట్లు ఆయన పేర్కొన్నారు,