ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
పాపన్నపేట(మెదక్): ఆటోబోల్తా పడి ఇద్దరికి గాయాలైన సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్పేట గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగింది. పాపన్నపేట నుంచి మెదక్వైపు వెళ్తున్న ప్యాసింజర్ యూసుఫ్పేట వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న రాములు, సుశీల అనే ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే 108లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.