YS Reddy
-
విద్యావేత్త వైవీ రెడ్డి కన్నుమూత
ఎస్వీఎన్ కాలనీ (గుంటూరు): ప్రముఖ విద్యావేత్త, విశ్రాంత ప్రిన్సిపాల్ యర్రం వెంకటరెడ్డి (వైవీ రెడ్డి) (86) గుంటూరు ఎస్వీఎన్ కాలనీలోని ఆయన స్వగృహంలో శనివారం మృతిచెందారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం యర్రంవారిపాలెం ఆయన స్వస్థలం. బెనారస్ యూనివర్సిటీలో ఆంగ్లం, చరిత్ర అధ్యయనంలో పీజీ పూర్తిచేసిన ఆయన గుంటూరు ఏసీ కళాశాలలో ట్యూటర్‌గా బాధ్యతలు చేపట్టి అనతికాలంలోనే ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగారు. గుంటూరు మహిళా డిగ్రీ కళాశాలతోపాటు, ఖమ్మం, తణుకు, రేపల్లె, కనిగిరి, కోదాడ, నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ కళాశాలలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఏటా 200 మంది విద్యార్థులను తన స్వంత ఖర్చులతో వైవీ రెడ్డి చదివిస్తున్నారు. ఆయనకు భార్య శేషమాంబ, కుమారులు రవీంద్రరెడ్డి (రిటైర్డ్ కల్నల్), నిరంజన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి ఉన్నారు. వైవీ రెడ్డి పార్థివదేహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్, జేఎస్ఏపీఆర్ఏ పూర్వపు కార్యదర్శి డాక్టర్ ఆర్. నాగలక్ష్మి, పే అండ్ అకౌంట్స్ అధికారి బాలూ నాయక్.. గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, తణుకు, కోదాడ తదితర జిల్లాలకు చెందిన విద్యావేత్తలు, పలువురు ప్రిన్సిపాల్స్ సందర్శించి నివాళులర్పించారు. -
వైఎస్ చలువతోనే
ప్రజలకు తాగునీరు వెలుగోడు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలువతోనే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఆత్మకూరు, పరిసర గ్రామాల ప్రజలకు త్వరలోనే తాగునీరు అందించనున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన వెలుగోడు తాగునీటి పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బుడ్డా మాట్లాడుతూ 2006లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మకూరు, పరిసర గ్రామాల 13గ్రామ పంచాయతీల ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆత్మకూరు ప్రజల చిరకాల కోరిక అయిన నీటి పథకం పూర్తయిందని ఈనెల 10వ తేదీన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామన్న హామీని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. మొత్తం 12.5కోట్ల వ్యయంతో చేపట్టి ఈ పథకంలో తాగునీటి కష్టాలు దూరమవుతాయన్నారు. ఈ పథకానికి సంబంధించిన పంప్‌హౌస్, పైప్‌లైన్, మోటార్లు, జనరేటర్ల ఏర్పాటు తదితర విషయాలను ఆర్డబ్ల్యూఎస్ డీఈ వేడుకొండలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవిబాబు, సర్పంచ్ ఎంఏ కలాం, మాజీ సింగిల్‌విండో చైర్మన్ అన్నరపు శేషిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మద్దెల శంకర్‌రెడ్డి, జీవన్‌కుమార్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.