వైఎస్ చలువతోనే | Ys caluvatone | Sakshi
Sakshi News home page

వైఎస్ చలువతోనే

Published Sun, Nov 9 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

వైఎస్ చలువతోనే

వైఎస్ చలువతోనే

 ప్రజలకు తాగునీరు
 వెలుగోడు:
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలువతోనే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఆత్మకూరు, పరిసర గ్రామాల ప్రజలకు త్వరలోనే తాగునీరు అందించనున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన వెలుగోడు తాగునీటి పథకాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా బుడ్డా మాట్లాడుతూ 2006లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మకూరు, పరిసర గ్రామాల 13గ్రామ పంచాయతీల ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆత్మకూరు ప్రజల చిరకాల కోరిక అయిన నీటి పథకం పూర్తయిందని ఈనెల 10వ తేదీన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఆత్మకూరు పట్టణంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామన్న హామీని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. మొత్తం 12.5కోట్ల వ్యయంతో చేపట్టి ఈ పథకంలో తాగునీటి కష్టాలు దూరమవుతాయన్నారు. ఈ పథకానికి సంబంధించిన పంప్‌హౌస్, పైప్‌లైన్, మోటార్లు, జనరేటర్ల ఏర్పాటు తదితర విషయాలను ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ వేడుకొండలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రవిబాబు, సర్పంచ్ ఎంఏ కలాం, మాజీ సింగిల్‌విండో చైర్మన్ అన్నరపు శేషిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మద్దెల శంకర్‌రెడ్డి, జీవన్‌కుమార్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement