వైవీ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న తెలంగాణ స్టేట్ బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్
ఎస్‌వీఎన్ కాలనీ (గుంటూరు): ప్రముఖ విద్యావేత్త, విశ్రాంత ప్రిన్సిపాల్ యర్రం వెంకటరెడ్డి (వైవీ రెడ్డి) (86) గుంటూరు ఎస్వీఎన్ కాలనీలోని ఆయన స్వగృహంలో శనివారం మృతిచెందారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం యర్రంవారిపాలెం ఆయన స్వస్థలం. బెనారస్ యూనివర్సిటీలో ఆంగ్లం, చరిత్ర అధ్యయనంలో పీజీ పూర్తిచేసిన ఆయన గుంటూరు ఏసీ కళాశాలలో ట్యూటర్‌గా బాధ్యతలు చేపట్టి అనతికాలంలోనే ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగారు. గుంటూరు మహిళా డిగ్రీ కళాశాలతోపాటు, ఖమ్మం, తణుకు, రేపల్లె, కనిగిరి, కోదాడ, నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ కళాశాలలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.
ఏటా 200 మంది విద్యార్థులను తన స్వంత ఖర్చులతో వైవీ రెడ్డి చదివిస్తున్నారు. ఆయనకు భార్య శేషమాంబ, కుమారులు రవీంద్రరెడ్డి (రిటైర్డ్ కల్నల్), నిరంజన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి ఉన్నారు. వైవీ రెడ్డి పార్థివదేహాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్, జేఎస్‌ఏపీఆర్‌ఏ పూర్వపు కార్యదర్శి డాక్టర్ ఆర్. నాగలక్ష్మి, పే అండ్ అకౌంట్స్ అధికారి బాలూ నాయక్.. గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, తణుకు, కోదాడ తదితర జిల్లాలకు చెందిన విద్యావేత్తలు, పలువురు ప్రిన్సిపాల్స్ సందర్శించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment