YSRCP
-
నేషనల్ హైవే కమిటీ సభ్యులుగా ఎంపీలు బోస్, అవినాష్‌రెడ్డి
సాక్షి, కోనసీమ జిల్లా: నేషనల్ హైవే కన్సల్టింగ్ కమిటీ సభ్యులుగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, లోక్‌సభ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నియమితులయ్యారు.ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. -
టాస్క్ ఫోర్స్ పోలీసులు నన్ను చిత్ర హింసలకు గురి చేశారు
-
ఏటీఎంలా పోలవరం..చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వ్యంగ్య ట్వీట్
-
రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తారా బాబూ..?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా?. పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరు మెదపడం లేదు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఈ మేరకు బుధవారం తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..1. చంద్రబాబు గారూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా?పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరు మెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆ మేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం కాదా? దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలనే దెబ్బతీస్తున్నారు కదా? దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారు? ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేదు? చంద్రబాబు గారూ.. ఎప్పుడు ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించినా రాష్ట్ర భవిష్యత్‌ను, ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెడతారని, మీ స్వార్థ రాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను నట్టేటా ముంచేస్తారని మరోసారి నిరూపిస్తున్నారు కదా?2. పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే, 41.15 మీటర్లకే మీరు ఎందుకు పరిమితంచేస్తున్నారు? తద్వారా 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటినిల్వ 115 టీంఎసీలకే పడిపోతుందని తెలిసికూడా మీరు ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు? ఈ కారణంగా వరద వస్తే తప్ప కుడి, ఎడమ కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయలేని దుస్థితి నెలకొంటుంది. గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. సరిగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేం. శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం మహానగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చలేం. అన్నికంటే సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఉన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్రకు అన్యాయమే జరుగుతుంది. మీ మద్దతు మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న వాస్తవ పరిస్థితుల మధ్య రాష్ట్ర భవిష్యత్‌కు అత్యంత కీలమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో మీరు ఎందుకు చేతులెత్తేస్తున్నారు? ఎందుకు బేలతనం చూపుతున్నారు? దీనివెనుక మీ స్వార్థం ఏంటి చంద్రబాబు గారూ..!3. పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్పుడైనా, ఇప్పుడైనా మీరు చేసిన, చేస్తున్న దుర్మార్గాలకు అంతులేకుండా పోతోంది. మొదటనుంచీ మీరు స్వప్రయోజనాలే చూసుకున్నారు. మీ బంధువులకు, మీ పార్టీ నాయకులకు కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును మీ చేతిలోకి తీసుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ డ్రామాతో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. నామినేషన్ల పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టి పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం మాదిరి డబ్బులు గుంజుకునే యంత్రంలా మారిందని సాక్షాత్తూ ఆనాడు ప్రధానమంత్రి ప్రజల సాక్షిగా అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నాడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బకొట్టిన మీరు మళ్లీ రాష్ట్రానికి జీవనాడి, పోలవరం విషయంలో అంతే నష్టం చేస్తున్నారు.4. చంద్రబాబు గారూ.. గతంలో మీరు మీ స్వార్థం కోసం ప్రాజెక్టు నిర్మాణాన్ని అస్తవ్యస్తం చేశారు. ఒక పద్ధతి, ఒక వ్యూహం, ఒక ప్రణాళిక లేకుండా డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేశారు. స్పిల్‌వేను పూర్తిచేయకుండా కాపర్ డ్యాంలు మొదలుపెట్టారు. వీటిని పూర్తి చేయకుండానే ఖాళీలు వదిలేసి డయాఫ్రం వాల్ కట్టారు. ఆ నిర్మాణాల్లో కూడా లోపాలే. కాఫర్ డ్యాంలో సీపేజీకి కారకులు మీరు. మీ అసమర్థత కారణంగా కాఫర్ డ్యాంలు పూర్తిచేయకుండా ఖాళీలు విడిచిపెట్టారు. ఆ ఖాళీలుగుండా వరదనీరు ఉధృతంగా ప్రవహించి డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి మీ నిర్వాకాలే కారణమని సాక్షాత్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇటీవలే తన నివేదికలో కుండబద్దలు కొట్టి చెప్పింది. చివరకు స్పిల్వేలలో పిల్లర్లు కూడా పూర్తిచేయకుండా గేట్లు పెట్టామంటూ ఫొటోలకు ఫోజులిచ్చిన చరిత్ర మీది. అయినా తప్పులు అంగీకరించడానికి, చేసిన వాటిని సరిదిద్దుకోవడానికి మీకు మనసు రాదు. మీ చేతిలో ఉన్న మీడియాతో నిరంతరం అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేసి ఆ తప్పుల నుంచి బయటపడడానికి నిరంతరం ప్రయత్నిస్తారు తప్ప, పోలవరం పట్ల మీలో ఇసుమంతైనా నిజాయితీ లేదు.5. మీరు చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది, ప్రతి ఏడాదీ వరుసగా వరదలు వచ్చినా, కోవిడ్‌లాంటి సంక్షోభం వచ్చినా కీలకమైన పనులన్నీ వైయస్సార్సీపీ హయాంలో చేశాం. స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, ఎగువ కాఫర్‌డ్యాం, దిగువ కాఫర్ డ్యాం ఇలా కీలకమైన పనులన్నీ పూర్తిచేశాం. 2022లో గోదావరి మహోగ్రంగా ఉప్పొంగినా ప్రాజెక్టు ఎక్కడా చెక్కుచెదరలేదు. అంతేకాదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల వల్ల పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి రూ.12,157 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. కానీ.. చంద్రబాబు గారూ.. మీరు ఎప్పటిలానే దుర్భుద్ధిని చూపించి, ఎన్డీయేతో పొత్తు ఖరారైన తర్వాత, ఎన్నికలకు ముందు రావాల్సిన ఆ డబ్బును రానీయకుండా, అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బును విడుదల చేస్తున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.6. చంద్రబాబు గారూ.. ఇక ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా కొట్టుకుపోయిన ఆ డయాఫ్రం వాల్‌ను పూర్తిచేసి, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాంను కట్టడంతోపాటు ఈలోగా మిగిలిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. ఇవన్నీ పూర్తిచేస్తామంటూ మీరు, మీ కూటమి పార్టీలు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు తెచ్చుకుని, అధికారంలోకి వచ్చారు. వచ్చీరాగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి సరే అంటున్నారు, ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? వెంటనే ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి దాన్ని సరిదిద్దండి. పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించి, నిర్వాసితులందరికీ న్యాయంచేసి పూర్తిచేయండి. లేకపోతే ప్రజలే మీపై తిరుగుబాటు చేస్తారు. -
మహిళ అని చూడకుండా.. పోలీసుల పైశాచికత్వం
రామవరప్పాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా టీడీపీ గూండాల దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులను టార్గెట్ చేస్తూ దౌర్జన్యకాండ సాగిస్తున్నారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించి మహిళ అని కూడా చూడకుండా దుర్బాషలాడుతూ అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర దూమారం రేపింది. విజయవాడరూరల్ మండలం ప్రసాదంపాడు కొమ్మా రాము వీధిలో నివాసం ఉంటున్న గంధం వెంకటలక్ష్మికు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు గంధం సంతోష్, రెండో కుమారుడు రవి.సంతోష్ వైఎస్సార్సీపీలో యువ నేత. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా కృషి చేశాడు. ఓ కేసు నిమిత్తం వంశీమోహన్ విజయవాడ కోర్టులో వాయిదాకు వచ్చిన సమయంలో సంతోష్ కలవడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ప్రసాదంపాడుకు చెందిన టీడీపీ నాయకుడు, ఉపసర్పంచ్ గూడవల్లి నరసయ్య టీడీపీ నాయకులను, పోలీసులను ఉసికొల్పాడు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంతోష్ నివాసం ఉంటున్న ఇంట్లోకి మంగళవారం చొరపడి ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. తొలుత సంతోష్ తల్లి తలుపు తీయగా.. దౌర్జన్యంగా నెట్టుకుంటూ ఇంట్లోకి చొరబడి ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తూ ఆమెను వెనక్కి నెట్టేశారు.వైఎస్సార్సీపీ నాయకులను చూసుకుని మిడిసిపడుతున్నారని.. మీ పెద్ద కుమారుడిని అరెస్టు చేయాలంటూ హడావుడి చేశారు. సంతోష్ నిద్రిస్తున్నాడని చెబుతున్నా వినకుండా దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి సంతోష్‌పై దాడి చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే చిన్న కుమారుడు రవి తన సెల్ఫోన్లో ఈ ఘాతుకాన్ని వీడియో తీస్తుండగా బలవంతంగా ఫోన్ లాక్కుని దుర్భాషలాడారు. తన కుమారుడిని ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ వెంకటలక్ష్మి పోలీసులను ప్రశ్నించగా.. ‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు.. టీడీపీ నాయకులకు ఎదురెళితే ఇలానే ఉంటుంది’ అంటూ పోలీసులు సంతోష్‌ను ఈడ్చుకెళ్లారు. స్టేషన్లో విచక్షణా రహితంగా దాడిటాస్క్ఫోర్స్ పోలీసులు సంతోష్‌ను బలవంతంగా పటమట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అక్కడి పోలీసులు.. వంశీని ఎందుకు కలవడానికి ప్రయత్నించావని ప్రశ్నించారు. తన అభిమాన నేతను కలవడంలో తప్పేముందని సంతోష్ బదులిచ్చాడు. దీనికి ఆగ్రహించిన ఎస్ఐ హరికృష్ణ సంతోష్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. కాగా, తన కుమారుడిపై అకారణంగా దాడి చేశారని సీసీ ఫుటేజ్‌ను ఆధారంగా చూపుతూ సంతోష్ తల్లి వెంకటలక్ష్మి పటమట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. సమస్యను సీపీ, ఏసీపీ, పడమట సీఐ దృష్టికి తీసుకొచ్చినా స్పందించలేదని వాపోయింది. కాగా బాధితుడు సంతోష్ పోలీసులు పాల్పడిన దుశ్చర్యపై ప్రైవేట్ కేసు కూడా పెట్టడం గమనార్హం. -
అధైర్యపడొద్దు.. మంచి రోజులొస్తాయి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పులివెందులలో పార్టీ శ్రేణులు, అభిమానులతో మమేకమయ్యారు. ఉదయం 9.15 గంటల నుంచి ఆయన పులివెందుల క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానులకు అందుబాటులో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనికి వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తదితరుల వెంట వెళ్లిన కేడర్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సూచనలు చేశారు.ఆపన్నులకు అండగావివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కాలు విరిగిన ఇప్పట్ల గ్రామానికి చెందిన శ్రుతిలయ తన దీననగాథను కుటుంబ సభ్యుల ద్వారా వివరించారు.ఆర్థికంగా కుటుంబం చితికిపోయిందని వారు జగన్ వద్ద వాపోయారు. అదేవిధంగా కడపకు చెందిన ముస్లిం మైనార్టీ దంపతులు వారి కుమార్తె అనారోగ్యాన్ని వివరించి, వైద్య సహాయం చేయాలని అర్థించారు. వెంటనే స్పందించిన జగన్ అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీ అవినాష్‌రెడ్డిని ఆదేశించారు.పెద్దనాన్నతో కాసేపు..వయోభారంతో ఉన్న పెద్దనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి ఇంటికి వైఎస్ జగన్ బుధవారం వెళ్లారు. ఆయనతో కొంతసేపు ముచ్చటించారు. ఆరోగ్య సమస్యలు తెలుసుకొని తగిన సూచనలు చేశారు. అక్కడే ఉన్న వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మ«ధురెడ్డితో పాటు ఇతర బంధువుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.నూతన జంటలకు ఆశీర్వాదంఇటీవల వివాహాలైన నూతన జంటలను మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. సమీప బంధువు శ్రీధర్‌రెడ్డి కుమారుడు యశ్వంత్‌రెడ్డి, శ్రీనిజ జంటను ఆశీర్వదించారు. దొండ్లవాగు వైఎస్సార్సీపీ నాయకుడు విద్యానందరెడ్డి సోదరి వివాహం ఇటీవల జరిగింది. విద్యానందరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్ నూతన జంట మాధురి, నరేంద్రరెడ్డిని ఆశీర్వదించారు. అక్కడే ఉన్న వారి బంధువర్గాన్ని పేరుపేరునా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. -
పోలవరాన్ని జీవచ్చవంలా మార్చే చంద్రబాబు నీచ కుట్ర
-
విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ (UNGA) 29వ సెషన్‌కు వెళ్లే బృందంలో ఆయనకు స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారాయన.న్యూయార్క్(అమెరికా)లోని యూఎన్జీఏ 29వ సెషన్లో పాల్గొనబోయే బృందంలో ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం దక్కడం పట్ల ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.ఐరాస లాంటి గౌరవప్రదమైన వేదికపై దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడంతో పాటు ప్రపంచ ఆసక్తులలో దేశ భాగస్వామ్యాలను మరింతంగా పెంచే అర్థవంతమైన చర్చల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నాం అని ట్వీట్ చేశారాయన. నవంబర్ 18 నుంచి 23వ తేదీ దాకా ఈ సెషన్ జరగనుంది. -
‘ఇసుక దొంగలను వదిలేసి.. వైఎస్సార్సీపీ నేతలపై కేసులా?’
సాక్షి, అనకాపల్లి: ఇసుక దొంగలను వదిలేసి వైఎస్సార్సీపీ నేతలపై తప్పులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. ఇసుకను టీడీపీ నేతలు అక్రమంగా రాత్రికి రాత్రే తరలించుకుపోతున్నారని ధ్వజమెత్తారు. ఇసుక దొంగలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే, తిరిగి వారి మీదే అక్రమ కేసులు బనాయించారంటూ మండిపడ్డారు.పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తప్పుడు కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. స్పీకర్ అయ్యన్న ఒత్తిడితోనే వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీసులు పెట్టే తప్పుడు కేసులకు మేము భయపడం. వైఎస్సార్సీపీ నేతలతో కలిసి నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తామని ఉమాశంకర్ గణేష్ హెచ్చరించారు. -
పులివెందులలో రెండో రోజు జనంతో జగన్
-
అడ్డూ అదుపులేని పచ్చ మూక.. వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
సాక్షి, వైఎస్సార్: కూటమి ప్రభుత్వంలో పచ్చ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ప్రతీచోటా వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా జమ్మలమడుగులో టీడీపీ మూకలు.. వైఎస్సార్సీపీ కార్యకర్త హనుమంతరెడ్డిపై దాడులు చేశారు.వివరాల ప్రకారం.. జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరు గ్రామంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీప కార్యకర్త హనుమంతరెడ్డిపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. తాజాగా ఓ స్థల వివాదాన్ని అడ్డుపెట్టుకుని హనుమంతపై మారణాయుధాలతో దాడి చేశారు. పచ్చ మూక దాడిలో హనుమంతరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నారు.అయితే, గతంలో కూడా టీడీపీ నేతలు హనుమంతపై దాడులు చేశారు. 2019లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన కేసులో హనుమంత రాజీకి రావాలని బెదిరింపులకు గురిచేశారు. నాడు రాజీకి రాలేదని కోర్టు వద్దే హనుమంతపై పచ్చ నేతలు హత్యాయత్నం చేశారు. తాజాగా ఎల్లో మూక చేసిన దాడిలో మరో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. -
జగనన్ను జైలుకు పంపే కుట్ర?.. వైఎస్ విజయమ్మ లేఖకు స్ట్రాంగ్ కౌంటర్
-
కరువు, చంద్రబాబు కవల పిల్లలు : ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,అమరావతి: చంద్రబాబు, కరువు అవిభక్త కవలలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారుఏపీలో వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నంబరు15 జారీచేసింది. ఈ జీవోపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. బాబు వస్తే కరువు వస్తుందిచంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి. వైయస్సార్సీపి…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 30, 2024బాబు వస్తే కరువు వస్తుంది.చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి.వైఎస్సార్సీపీ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని పక్కన పెట్టి రైతుల ఉసురు తీసుకుంటున్నారు’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో తాండవించిన కరువు.. కాగా, రాష్ట్రంలో దుర్భిక్షం మొదలైంది. వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది.వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో నంబరు 15 జారీచేసింది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపింది. 27 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్లలో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. -
పచ్చ నేతల కబ్జాలో ఇసుక, మద్యం.. కోట్లలో వ్యాపారం: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఇసుక మొత్తం కూటమి నేతల కబ్జాలోకి వెళ్లిపోయిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. పచ్చ నేతలు ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జాచేసి అక్రమంగా కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రంలో ఇసుక మొత్తం @JaiTDP నేతల కబ్జాలోకి వెళ్ళిపోయింది. ధరను అమాంతం పెంచేసి కోట్లలో దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోంది.రాష్ట్రంలో ఇసుక మొత్తం @JaiTDP నేతల కబ్జాలోకి వెళ్ళిపోయింది. ధరను అమాంతం పెంచేసి కోట్లలో దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోంది.#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule#MosagaduBabu#SadistChandraBabu pic.twitter.com/XzHu2XX3D8— YSR Congress Party (@YSRCParty) October 30, 2024 ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జా చేసిన @JaiTDP నేతలు ఇప్పుడు ఏకంగా సివిల్ వర్క్స్, నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. పనులు తమకు అప్పగించి వెళ్లిపోవాలని హుకుం జారీచేస్తున్నారు. రాక్షస పాలనకు ఇది కదా నిదర్శనం.ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జా చేసిన @JaiTDP నేతలు ఇప్పుడు ఏకంగా సివిల్ వర్క్స్, నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. పనులు తమకు అప్పగించి వెళ్లిపోవాలని హుకుం జారీచేస్తున్నారు. రాక్షస పాలనకు ఇది కదా నిదర్శనం.#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule… pic.twitter.com/BSpiuSDcsL— YSR Congress Party (@YSRCParty) October 30, 2024 ఊరూరా తయారైన ఇసుకాసురులు.. ఇసుక కావాలంటే @JaiTDP నేతలకి కప్పం కట్టాల్సిందే! అని చెప్పుకొచ్చింది. ఊరూరా తయారైన ఇసుకాసురులు.. ఇసుక కావాలంటే @JaiTDP కి కప్పం కట్టాల్సిందే!#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule#MosagaduBabu#SadistChandraBabu pic.twitter.com/5n2GAFyeP1— YSR Congress Party (@YSRCParty) October 30, 2024 -
విజయమ్మ లేఖ వెనుక ఎవరున్నారు?
-
కార్యకర్తల జోలికి వస్తే.. కూటమి పై విరుపాక్షి కామెంట్స్
-
కూటమి అరాచకాలపై వైఎస్ఆర్ సీపీ నేత ఫైర్
-
మహిళలపై అరాచకాలు జరుగుతుంటే.. ఏపీలో లిక్కర్ దందా!
-
కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఐక్యంగా పోరాడండి... వైఎస్సార్సీపీ నాయకులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
విజయమ్మ లేఖపై వైఎస్ఆర్ సీపీ బహిరంగ లేఖ
-
ఐక్యంగా పోరాడండి: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘వైఎస్సార్సీపీ నాయకులు ఐక్యంగా పోరాటం చేయాలి. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి...’ అని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మంగళవారం హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్న ఆయన నేరుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సు«దీర్‌రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ భరోసా కలి్పంచాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ఆదేశించారు.కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, గంగుల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్బీ అంజాద్‌బాషా, రాచమల్లు శివప్రసాదరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులతో సమావేశమై పలు విషయాలు చర్చించారు. అనంతరం పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ పార్టీ నాయకులతో మమేకమయ్యారు.బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఆయా ప్రాంతాల నాయకులతోను వివిధ అంశాలపై చర్చించారు. కాగా, పులివెందులలో దారిపొడవునా తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ... ఆగి పలకరిస్తూ... వారి వినతులు స్వీకరిస్తూ... వైఎస్ జగన్ భాకరాపురంలో ఉన్న తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద సెల్ఫీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల రూ.530 కోట్లతో నిరి్మంచారు. 605 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తిచేశారు. ఎన్ఎంసీ తనిఖీల అనంతరం 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే కూటమి ప్రభుత్వం మంజూరైన 50 ఎంబీబీఎస్ సీట్లు తిరస్కరిస్తూ లేఖ రాసింది. దీంతో ఈ ఏడాది పులివెందుల మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు నిలిచిపోయాయి.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వేంపల్లె నుంచి పులివెందులకు వెళుతూ మార్గమధ్యంలోని మెడికల్ కళాశాల వద్ద ఆగి సెల్ఫీ తీసుకున్నారు. అక్కడ ఉన్న స్థానికులు, కొంతమంది ఉద్యోగులు మెడికల్ సీట్లు భర్తీ చేసి వైద్య కళాశాలను నిర్వహించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం తిరస్కరించిందని వైఎస్ జగన్‌కు వివరించారు. ఇక్కడ నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను సైతం ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారని తెలిపారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. -
బెయిల్ రద్దుకే కుట్ర.. బాధితుడు జగనే
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి న్యాయపరమైన ఇబ్బందులు కలిగించి ఆయన బెయిల్ రద్దుకు జరుగుతున్న కుట్రపూరిత వ్యవహారాలను వైఎస్ విజయమ్మ తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్లకు లొంగి సరస్వతి కంపెనీ షేర్ల సర్టిఫికెట్లు పోయాయంటూ.. జగన్ సంతకాలు లేకుండానే షేర్లు బదిలీ చేయడం మోసపూరితం కాదా? అని నిలదీసింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయడమే కాకుండా ఆయన కుమారుడు వైఎస్ జగన్‌ను అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ ఎన్నికలకు కొద్ది గంటల ముందు విజయమ్మ వీడియో రికార్డింగ్‌ను విడుదల చేసినప్పుడు వైఎస్సార్ అభిమానులు తీవ్రంగా కలతచెందారని తెలిపింది. వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై స్పందిస్తూ ఈమేరకు వైఎస్సార్సీపీ ఆమెను ఉద్దేశించి ఓ లేఖను విడుదల చేసింది. షర్మిల ఎన్నో రకాలుగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా జగన్ ఒక్కరోజు కూడా తన చెల్లెలిని ఒక్క మాట కూడా అనలేదనే విషయాన్ని గుర్తు చేసింది. చెల్లెలుపై ప్రేమాభిమానాలతోనే జగన్ తన స్వార్జిత ఆస్తుల్లో షర్మిలకు వాటా ఇచ్చేందుకు ఎంవోయూ చేశారని... అవి కుటుంబ ఆస్తులే అయితే ఎంవోయూ చేయాల్సిన అవసరం ఉండదు..చట్టా రీత్యా హక్కు వస్తుంది కదా? అని పేర్కొంది. అసలైన బాధితుడైన జగన్‌కు బాసటగా ఉండటం విజయమ్మ ధర్మమని స్పష్టం చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణిగా, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తిగా విజయమ్మను అమితంగా గౌరవిస్తామని పేర్కొంది. వాస్తవాలను ఆమెకు, ప్రజల ముందు ఉంచేందుకు వైఎస్సార్సీపీ విడుదల చేసిన లేఖ పూర్తి పాఠం ఇదీ... కాంగ్రెస్‌కు ఓటేయమని విజయమ్మ ఎలా అంటారు? ఆనాడే వైఎస్సార్ అభిమానులు తీవ్ర కలత చెందారు 2024 ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఒకవైపున ఉంటే... అటువైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు అంతా జట్టు కట్టారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్ పార్టికి, తన కుమారుడు జగన్‌ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టికి ఓటేయమని కోరుతూ విజయమ్మ వీడియో విడుదల చేశారు. వైఎస్సార్సీపీని ఇబ్బంది పెడుతూ.. తాను షర్మిలవైపు ఉన్నాననే విషయాన్ని తద్వారా చాలా స్పష్టంగా చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా ఇలా వ్యవహరించడం ధర్మమేనా..! రాజకీయాలు పక్కనపెడితే ఒక తల్లిగా ఆరోజు విజయమ్మ మద్దతు సంగతి దేవుడెరుగు...కనీసం తటస్థ వైఖరిని మరిచిపోయి పక్షపాతం వహించిన వైనం చూసి వైఎస్సార్ అభిమానులు తీవ్ర కలత చెందారు. బాధపడ్డారు. సర్టిఫికెట్లు పోయాయని.. మోసపూరితంగా షేర్ల బదలాయింపు సరస్వతీ కంపెనీ వ్యవహారంలో షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్ల ప్రభావంతో షేర్ల సర్టిఫికెట్లు పోయాయని విజయమ్మ చెప్పారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండానే, జగన్ సంతకాలు లేకుండానే ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా షేర్లు బదిలీ చేశారు. తన కుమారుడికి న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయని, అది బెయిల్ రద్దు కుట్రకు దారితీస్తుందని తెలిసినా అలా చేశారు. తద్వారా తాను షర్మిలతోనే ఉన్నానని మరోసారి స్పష్టంగా చెప్పారు. షర్మిలను ఏనాడూ ఒక్క మాట అనని జగన్.. వైఎస్ జగన్‌కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన లేఖ టీడీపీ సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యక్షమైంది. విజయమ్మ కూడా సంతకం చేసిన ఆ లేఖను టీడీపీ విడుదల చేయడం ఏమిటి...? ఇంత జరిగినా జగన్ ఏనాడూ తన చెల్లెలను ఉద్దేశించి ఒక్కమాట కూడా మాట్లాడ లేదు. కానీ షర్మిల ఎన్నోసార్లు వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో విజయవాడలో జగన్‌పై దాడి జరిగితే హేళనగా మాట్లాడారు. షర్మిలను సరిదిద్దాలని విజయమ్మ ఏనాడూ ప్రయత్నించకపోవడం ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. బాధితుడు జగనే... కోర్టు కేసులపై ప్రతికూల ప్రభావితం పడేలా షర్మిల ప్రవర్తన, చర్యలు ఉంటున్నాయి. ఓ వైపు ఆస్తులపై హక్కులు కోరుతూ మరోవైపు అందుకు విరుద్ధంగా ఆమె వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులపై వైఎస్ జగన్ పోరాటం చేస్తుంటే... వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై తనకు ఎలాంటి ఆందోళనలేనట్టు ఆమె ప్రవర్తిస్తున్నారు. జగన్‌ను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనుగుణంగానే ఆమె వ్యవహరిస్తున్నారు. షర్మిల వేసే ప్రతి అడుగూ ప్రత్యర్థులకు లబ్ధి చేకూర్చేలా ఉంటోంది. మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా జగన్ ఓపికతో, సహనంతో, మౌనంగా ఆ బాధను భరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు...? ఒక తల్లిగా విజయమ్మ ఎవరికి బాసటగా ఉండాలనే బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రచ్చ కెక్కిందీ... పరువు తీసిందీ షర్మిలే రాజకీయాల పేరిట తెలంగాణలో అడుగుపెట్టిన దగ్గరనుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి జగన్‌ను షర్మిల ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అక్కడ నుంచి ఒక్కసారిగా మాయమై వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టికి... అన్నను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించిన పార్టికి ఈ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా వచ్చారు. రాజకీయాలు ఇంతే అనుకున్నా ప్రజాస్వామ్య విమర్శల పరిధిని దాటి ఆజన్మ శత్రువు మాదిరిగా జగన్‌ను షర్మిల అనరాని మాటలు అంటున్నారు. ఎన్నికల సమయంలో జగన్‌పై దాడి జరిగితే ఎగతాళి చేసి అమానవీయంగా మాట్లాడింది షర్మిల కాదా..? వీటన్నింటినీ జగన్ ఓపికతో భరించారు. మరి రచ్చకెక్కింది ఎవరు... పరువుతీసింది ఎవరు... నిజమైన బాధితుడు ఎవరు... జగనే కదా..!! విచక్షణ విస్మరించిన విజయమ్మ కుమార్తె ప్రభావం, ఒత్తిళ్లతో విజయమ్మ విచక్షణ విస్మరించారు. కుమార్తెను వెనకేసుకువచ్చే ధోరణితో సరస్వతీ కంపెనీ విషయంలో తనవంతు పాత్ర పోషిస్తూ చట్టవ్యతిరేక పనులకు తోడ్పడ్డారు. తన కుమారుడు ఎదుర్కోబోయే చట్టపరమైన సంక్షిష్ట పరిస్థితులేంటో తెలిసి కూడా విజయమ్మ దాన్ని విస్మరించారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం ఇదే. ఉమ్మడి ఆస్తులే అయితే ఒకరి కంపెనీల్లో ఒకరికి ఎందుకు వాటాలు లేవు? వైఎస్సార్ ఆ ఆస్తులను షర్మిలకు ఎందుకు పంచలేదు? వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నపుడే జగన్ కంపెనీలు నడిపారు. అలాగే షర్మిల తన కంపెనీలను తాను నడిపారు. ఉమ్మడి ఆస్తులు అయితే మరి ఒకరి కంపెనీల్లో ఒకరికి వాటాలు ఎందుకు లేవు? వైఎస్సార్ మనోభావాలు, ఆజ్ఞ వేరేలా ఉంటే ఇలా ఎందుకు జరిగింది ? తన కుమార్తెకు వైఎస్సార్ పూరీ్వకుల ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను ఇచ్చారు. జగన్ ఆస్తులు తనవి కాదు కాబట్టే ఇవ్వలేదు. ఎందుకంటే అవన్నీ జగన్ స్వార్జితం కాబట్టి. తన స్వార్జిత ఆస్తులను షర్మిలకు ఇచ్చిన జగన్ షర్మిలకు వివాహమైన 20 ఏళ్ల తర్వాత జగన్ తన స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలిపై ప్రేమానురాగాలకొద్దీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో 2019లో ఆమెకు మంచి చేస్తూ ఒక ఎంఓయూ రాసి ఇచ్చారు. అంతేకాకుండా గడచిన పదేళ్లలో దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు జగన్ ద్వారా షర్మిల పొందినా ఆమె తన సోదరుడిపట్ల ఏమాత్రం కృతజ్ఞత చూపలేదు. షర్మిల ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా ? ఇంత యాగీ చేస్తున్న షర్మిల ఈ సంస్థల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా? ఒక్కరోజైనా కంపెనీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారా? కంపెనీలకున్న రూ.1400 కోట్ల అప్పుల్లో తన వాటా కింద వ్యక్తిగత పూచీకత్తు ఇస్తూ సంతకం పెట్టారా? రూ.500 కోట్ల నష్టాల్లో అయినా ఆమె పాత్ర పోషించారా? ఈ కంపెనీలకు సంబంధించిన కష్టాల్లో, చిక్కుల్లో, కోర్టు కేసుల్లో ఏరోజైనా తానుగా బాధ్యత తీసుకున్నారా? వాటాలు ఉంటే ఇలా నష్టం చేస్తారా? ఈ కంపెనీల మీద, జగన్ మీద ఎవరైతే కేసులు పెట్టారో వారికి రాజకీయ ప్రయోజనం కల్పించేలా షర్మిల వారిని బలపరుస్తున్నారు. కంపెనీలను బలహీనపరుస్తున్నారు. ఆమె నడవడిక, వైఖరి చూస్తే ఈ కంపెనీల్లో వాటాలు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా? నిజంగా వాటాలు ఉంటే ఇలా చేస్తారా? ఇలా జగన్‌ను, ఆయన కంపెనీలను ఇబ్బందులు పాలు చేస్తారా? కోర్టులే నిర్ణయిస్తాయి ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ వ్యవహారం కోర్టులో ఉంది. ఇరువురి వాదనలు ప్రజలముందు ఉన్నాయి. ఎవరు చేసింది సరైనదో, ఎవరివైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయి.ఉమ్మడి ఆస్తులే అయితే ఎంవోయూ ఎందుకు? తన స్వార్జిత ఆస్తులను ప్రేమానురాగాలతో షర్మిలకు ఇస్తున్నట్లు జగన్ ఎంఓయూ రాస్తే... దానిపై విజయమ్మ, షర్మిల ఇద్దరూ సంతకాలు చేశారు. అంటే దీని అర్థం జగన్ స్వార్జిత ఆస్తుల్లో హక్కులేదని, ఆరోజు వారు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టేగా? మరి ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు అంటూ లేఖలో పేర్కొనడం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే కదా. నిజంగా ఉమ్మడి ఆస్తులే అయితే వాటిని పంచుకునే పద్ధతి ఇలా ఎంఓయూల రూపంలో ఉండదు... చట్టరీత్యా హక్కుగా వస్తుందని ప్రతి కుటుంబానికి తెలుసు. జగన్ స్వార్జిత ఆస్తి కోసం షర్మిల యాగీ ఏమిటి? జగన్ స్వార్జితమైన ఆస్తిలో ఎలాంటి హక్కులేకపోయినా, ఆ ఆస్తిలో తనకు భాగం కావాలని షర్మిల ఇంత రాద్ధాంతం చేయడం ఏంటి? ఇంత యాగీ చేయడం ఏంటి? ఇన్ని లేఖలు రాయడం ఏంటి? ఆ లేఖను టీడీపీ విడుదల చేయడం ఏంటి? ఆమె పద్ధతి, ప్రవర్తన మారి తన ప్రేమానురాగాలను చూరగొంటే, కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత ఆమెకు ఏమేరకు మంచి చేయాలో, ఎంత చేయాలో, ఏం చేయాలో ఆరోజు నిర్ణయం తీసుకుంటానని జగన్ ఇదివరకే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇంకెంతమాత్రం మునిగిపోకూడదని, ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తామని ఇదివరకే మా పార్టీ స్పష్టం చేసింది. బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ఎందుకు ప్రస్తావించ లేదు?ప్రజలను పక్కదోవ పట్టించడమే వైఎస్ జగన్మోహన్రెడ్డిని న్యాయపరంగా ఇబ్బంది పెట్టేందుకు... తద్వారా బెయిల్ రద్దుకు పన్నిన కుట్ర వ్యవహారాన్ని విజయమ్మ తన లేఖలో కనీసం ప్రస్తావించ లేదు. అది ప్రజలను పక్కదోవ పట్టించడమే. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్మెంట్ ఉంది. తెలంగాణ హైకోర్టు స్టేటస్కో ఆదేశాలు ఉన్నాయి. యాజమాన్య బదిలీ జరిగేలా క్రయవిక్రయాలు చేయకూడదని అటాచ్మెంట్లో ఉందనే విషయం అందరికీ తెలుసు. సరస్వతీ కంపెనీ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో సహా పలువురి న్యాయసలహాలు ఉన్నాయి. అయినప్పటికీ తప్పని తెలిసినప్పటికీ.. మోసపూరితంగా, కుట్రపూరితంగా షేర్లు బదిలీ చేసిన మాట వాస్తవమే కదా...! షర్మిల భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై వైఎస్ జగన్మోహన్రెడ్డికి న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి తెలిసి కూడా విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టడం నిజమేకదా...! విజయమ్మ తన లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులను పక్కదోవ పట్టించడమే. -
అంబేద్కర్ విగ్రహంపై ‘కూటమి’ కుట్ర: జూపూడి
సాక్షి, తాడేపల్లి: విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని చూస్తే కూటమి నాయకుల కడుపులు మండిపోతున్నాయని, ఎలాగైనా ఆ విగ్రహాన్ని తొలగించి స్వరాజ్ మైదాన్ ప్రాంతాన్ని లూలూ గ్రూప్‌కి ఇచ్చేయాలన్న కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగంతో పాలన జరుగుతుంటే ఏపీలో మాత్రం రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు.విగ్రహాన్ని తొలగించే కుట్రకు తెరలేపారా?ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. ప్రపంచ మేధావి, పేద బడుగు వర్గాలకు మేలు చేసిన అంబేద్కర్ విగ్రహానికి కూడా కూటమి నేతలు నివాళులు అర్పించని విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ పేరును దుండగలు తొలగించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. తాజాగా రెండు రోజుల క్రితం అంబేద్కర్ పేరు కూడా తొలిగించి రాజ్యాంగ నిర్మాతను ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. విడతల వారీగా ఆయన విగ్రహాన్ని తొలగించే కుట్రకు తెరలేపారా అనే అనుమానాలు కలుగుతున్నాయని జూపూడి ఆందోళన వ్యక్తం చేశారు. మహనీయుడు అంబేడ్కర్ విగ్రహాన్ని అడవుల్లో పెట్టాలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ ఉదాసీనతే..గతంలో వైఎస్ జగన్ పేరును తొలగించినప్పుడే వైఎస్సార్సీసీపీ నాయకులు, అంబేద్కర్ వాదులు పోలీసులకు, నేషనల్ ఎస్సీ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తే.. విగ్రహం ఏర్పాటు చేసిన వారి పేరునే ఉంచాలని ప్రభుత్వానికి చెప్పినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న కారణంగానే తాజాగా అంబేద్కర్ పేరును కూడా తొలగించే ధైర్యం చేశారని ఇది కచ్చితంగా ప్రభుత్వ ఉదాసీనతేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: గురి తప్పిన బాణం వెనుక..!అంబేద్కర్ వ్యతిరేక విధానాలకు టీడీపీ, జనసేన వత్తాసుఅంబేడ్కర్ వ్యతిరేక.. బీజేపీ విధానాలకు జనసేన, టీడీపీ నాయకులు వత్తాసు పలుకుతూ ఆయన పేరును శాశ్వతంగా ప్రజల మనసు నుంచి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. విజయవాడ నడిబొడ్డున రాజ్‌భవన్, కలెక్టర్ కార్యాలయం పక్కనే ప్రభుత్వ కార్యాలయాల మధ్యన ఉన్న అంబేడ్కర్ విగ్రహం విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటే.. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు. తక్షణమే ఈ ఘటనకు కారణమైన ఆకతాయిలను పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అంబేడ్కర్ వాదుల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఏపీలో మహిళల భద్రత గాల్లో దీపం..
-
ఏపీలో మహిళల భద్రత గాల్లో దీపం.. ఎన్హెచ్ఆర్సీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: జాతీయ మానవ హక్కుల సంఘం యాక్టింగ్ చైర్పర్సన్ విజయభారతిని వైఎస్సార్సీపీ మహిళా నేతల బృందం మంగళవారం కలిసింది. ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. మహిళా నేతల బృందంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎంపీ డాక్టరు తనుజారాణి, మాజీ ఎంపీలు చింత అనురాధ, మాధవి ఉన్నారు.కూటమి ప్రభుత్వంలో 77 మంది మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరిగిన విషయాన్ని కమిషన్ దృష్టికి వైఎస్సార్సీపీ తీసుకెళ్లింది. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ మద్యం, అక్రమ ఇసుక దందాల్లో సీఎం హోంమంత్రి బీజీగా ఉన్నారని.. మహిళల రక్షణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన దిశా యాప్‌ను నిరుపయోగం చేశారని ఫిర్యాదులో వెల్లడించారు.దిశా యాప్ నిర్వీర్యం చేయడంతో మహిళల భద్రత గాల్లో దీపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ అంశాల్లో వెంటనే జోక్యం చేసుకోవాలని మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రతకు తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైఎస్సార్సీపీ నేతలు విన్నవించారు.