విశాఖలో బిగ్ ‘సి’ నూతన షోరూమ్
విశాఖ: రాష్ట్ర మొబైల్స్ విక్రయ రంగంలో ప్రముఖ సంస్థ బిగ్ ‘సి’ వైజాగ్ డాబా గార్డెన్స్‌లో తన కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ శనివారం ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం షోరూమ్‌లో జరిగిన బిగ్ ‘సి’ 11వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సంస్థ డెరైక్టర్ వై. స్వప్న కుమార్ మాట్లాడుతూ, డాబా గార్డెన్స్‌లో ఇది తమ 2వ షోరూమ్ అని అన్నారు. 2000 చదరపు అడుగుల విశాలమైన తమ ఈ తాజా షోరూమ్‌ను వరల్డ్ క్లాస్ లైవ్ ఎక్స్పీరియన్స్ షోరూమ్‌గా తీర్చిదిద్దినట్లు వివరించారు. 50కిపైగా మొబైల్స్ లైవ్ డెమోను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. కస్టమర్ల విశ్వాసం, ఆదరణే తమ ఈ 11 వసంతాల విజయ ప్రస్థానానికి ప్రధాన కారణమని అన్నారు. అందుకే ఈ 11వ వార్షికోత్సవ సందర్భంలో కస్టమర్ల కోసం 11 ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టామని వివరించారు. సినీతార శ్రీయ మాట్లాడుతూ, అందుబాటు ధరల్లోనే అధునాతన ఫీచర్ల మొబైల్స్‌ను ప్రజలకు అందించడం హర్షణీయమన్నారు.