Yusuf
-
కంగువ ఎడిటర్ నిషాద్ హఠాన్మరణం
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కంగువ’కి ఎడిటర్‌గా చేసిన నిషాద్ యూసుఫ్ (43) ఆకస్మిక మృతి చెందారు. నిషాద్ స్వస్థలం కేరళలోని చంగనస్సేరి. తన భార్య, పిల్లలతో కలిసి కొచ్చిలోని పనంపిల్లి నగర్లో నివాసం ఉంటున్నారు. స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున ఆయన విగత జీవిగా కనిపించారు.ఇక నిషాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఆర్థిక సమస్యలా? కుటుంబ కలహాలా? ఎవరైనా గిట్టని వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ‘చావెర్, ఉండా, తల్లుమాలా, సౌదీ వెళ్లాక, వన్, ఆపరేషన్ జావా’ వంటి పలు సినిమాలకు ఎడిటర్‌గా చేశారు నిషాద్. ఆయన పని చేసిన చివరి చిత్రాలు ముమ్మట్టి నటించిన ‘బజూక’, సూర్య నటించిన ‘కంగువ’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. -
పఠాన్ బ్రదర్స్ క్రికెట్ అకాడమీ
వచ్చే నెల చివర్లో బరోడాలో అందుబాటులోకి... ముంబై: భారత క్రికెటర్లు యూసుఫ్, ఇర్ఫాన్ పఠాన్లు బరోడాలో క్రికెట్ అకాడమీని నెలకొల్పారు. తమకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఆటకు కొంతైనా సేవ చేసేందుకు దీన్ని ఏర్పాటు చేశామన్నారు. వచ్చే నెల చివరి నుంచి ఈ అకాడమీ అందుబాటులోకి రానుంది. ‘చాలా కాలంగా అకాడమీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ అకాడమీలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. మొదట 8-9 వారాల కోర్సు పూర్తి చేసిన తర్వాత రెండో దశకు వెళ్తారు. ఆటకు సంబంధించిన మౌలిక వసతులున్న పాఠశాలకు వెళ్లి అక్కడ కూడా కోచింగ్ ఇస్తాం. ఏడాది మొత్తం ఇది అందుబాటులో ఉంటుంది’ అని పఠాన్ బ్రదర్స్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో అకాడమీని మరో మూడు నగరాలకు విస్తరించనున్నామని చెప్పిన బ్రదర్స్... 2015 చివరికి 50 అకాడమీలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అకాడమీలోని కోచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్, కామె రూన్ ట్రెడ్వెల్లతో తాము ఒప్పందం చేసుకున్నామన్నారు. అకాడమీల సంగతిని పక్కనబెడితే తమలో 5 నుంచి 7 ఏళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందని వెల్లడించారు. -
సింగ ర్ను చేస్తానని బాలిక కిడ్నాప్
=దుబాయ్‌కి అక్రమ రవాణా చేసేందుకు యత్నం = విమానాశ్రయంలో ఉద్యోగాలంటూ మోసాలు = నిందితుడు యూసుఫ్‌ను అరెస్టు చేసిన పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: ‘కేరళ సినీ రంగంలో సింగర్‌ని చేస్తా.. బ్యూటీషియన్‌ను చేసి నీ పేరు మారుమోగేలా చేస్తా’.. అంటూ యూసుఫ్ అనే వ్యక్తి నగరానికి చెందిన బాలికను కిడ్నాప్ చేశాడు. కేరళకు తీసుకెళ్లిన అతను అక్కడి నుంచి బాలికను దుబాయ్ పంపే ప్రయత్నాల్లో ఉండగా హుమాయున్‌నగర్ పోలీ సులు వెళ్లినిందితుడి అరెస్టు చేసి.. బాలికను కాపాడారు. ఈ కిడ్నాపర్ మాయమాటలతో కొందరికి ఆర్థికంగానూ టోకరా వేశాడని పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు తెలిపారు. మైనర్ బాలికను ఆమె ఇష్టపూర్వకంగా తీసుకుపోయినా అది అపహరణే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. మాయమాటలతో నమ్మించి... చెన్నైలోని పప్పల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముస్తాఫా అలియాస్ యూసుఫ్ రెండేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి ఫెరోజ్ గాంధీనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. తాను ఇతర దేశాల నుంచి వివిధ వస్తువుల్ని దిగుమతి చేసి విక్రయిస్తుంటానని ఇంటి యజమానికి చెప్పాడు. ఇరుగు పొరుగుతోనూ పరిచయాలు పెంచుకున్న ముస్తాఫా యజమాని కుమార్తె (14)పై కన్నేశాడు. సంగీతంపై ఆమెకున్న ఆసక్తిని గమనించి ఆమెతో మాటకలిపాడు. తనకు కేరళ సినీ రంగానికి చెందిన అనేక మందితో పరిచయాలున్నాయని నమ్మించాడు. తనతో వస్తే గాయనిని చేస్తానని, సినీ రంగంలో బ్యూటీషియన్గానూ పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు కల్పిస్తానని వలవేసి ఈనెల 11న తనతో ఆమెను తీసుకుపోయాడు. బోగస్ ఓటర్ ఐడీ తయారీ... ఇతడి మాటల గారడీలో పడిన బాలిక తన ఇంట్లో చెప్పకుండా అతనితో వెళ్లిపోయింది. యూసుఫ్ ఆమెను కేరళలోని అలెప్పీలో ఉన్న తన స్నేహితుడు పీఏ హషీమ్ (ఆటోడ్రైవర్) ఇంట్లో ఉంచాడు. బాలికను దుబాయ్‌కి అక్రమ రవాణా చేయాలని పథకం వేసిన ఇతను ఆమెకు పాస్‌పోర్ట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకు అవసరమైన ధ్రువీకరణలు సమకూర్చుకొనేందుకు ఆ బాలిక వయస్సు 18 ఏళ్ల నిండినట్లు చూపిస్తూ, నకిలీ పేరు, బోగస్ వివరాలతో అలెప్పీలోనే ఓటర్ ఐడీ తయారు చేయించాడు. ఓడలో సుదూర ప్రయాణం చేయిస్తానంటూ బాలికను మభ్యపెడుతూ వచ్చాడు. ఈలోపు బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హుమాయున్‌నగర్ పోలీసులు.. యూసుఫ్ అలెప్పీలో ఉన్నట్టు కనిపెట్టారు. నగరం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం నిందితుడిని అరెస్టు చేసి బాలికను కాపాడింది. దర్యాప్తులో మోసాలు వెలుగులోకి... యూసుఫ్ వ్యవహారాలపై దర్యాప్తు చేసిన పోలీసులు అతడు వేరే మోసాలకూ పాల్పడినట్టు గుర్తించారు. తనకు రావాల్సిన సరుకు విమానాశ్రయంలో ఆగిపోయిందని, కొంత నగదు చెల్లించాల్సి ఉందని పలువురిని నమ్మించి డబ్బు వసూలు చేశాడని తేలింది. అలాగే సయ్యద్ మిరాజుద్దీన్ అనే వ్యక్తికి ఉద్యోగం పేరుతో ఎరవేశాడు. తనకు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పని చేసే ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని నమ్మబలికాడు. మిరాజుద్దీన్ కుమారుడికి విమానాశ్రయంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.4.5 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. హుమాయున్‌నగర్‌కు చెందిన బంగారం వ్యాపారి రామేశ్వర్లాల్తో పరిచయం పెంచుకున్న యూసుఫ్.. తన భార్యకు నాలుగు బంగారు ఉంగరాలు కావాలని వాటిని తీసుకున్న యూసుఫ్ భార్యకు చూపించి వచ్చి నగదు ఇస్తానంటూ ఉడాయించాడు. ఇతడిపై ఈ రెండు కేసులూ కూడా నమోదయ్యాయి. కేరళ, తమిళనాడులకు వేలిముద్రలు... యూసుఫ్ వ్యవహారాలపై లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితుడి గత చరిత్రను తెలుసుకొనేందుకు అతని వేలిముద్రల్ని కేరళ, తమిళనాడుల్లో ఉన్న క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలకు పంపుతున్నామన్నారు. తదుపరి విచారణ కోసం న్యాయస్థానం అనుమతిలో యూసుఫ్‌ను కస్టడీలోకి తీసుకుంటామన్నారు. ఇతడి చేతిలో ఇంకా ఎవరైనా మోసపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీసీపీ కోరారు.