పవన్ కళ్యాణ్ 'సిఫారసు' రూమర్లపై వైవీఎస్ ఖండన
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విజ్ఞప్తి మేరకే ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు 'రేయ్' చిత్రంలో అవకాశం కల్పించినట్టు వస్తున్న రూమర్లను ఆ చిత్ర దర్శకుడు వైవీఎస్ చౌదరీ ఖండించారు. సాయి ధరమ్ తేజ్ తో చిత్రాన్ని నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ అనుమతి తీసుకున్న మాట వాస్తవమే అని వైవీఎస్ తెలిపారు.
అయితే తన అనుమతి అవసరం లేదు. మీరు సాయిని అప్రోచ్ అవ్వవచ్చు అని పవన్ కళ్యాణ్ తెలిపారని వైవీఎస్ అన్నారు. సాయి కోసం పవన్ కళ్యాణ్ ఎన్నడూ సిఫారసు చేయలేదు అని చౌదరీ స్పష్టం చేశారు.
సలహా తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ ను సాయి సంప్రదించగా, వెంటనే యాక్టింగ్ స్కూల్ లో చేరమని చెప్పారని.. అంతేకాకుండా గుర్తింపు కోసం మెగా కుటుంబం పేరును ఉపయోగించుకోవద్దని సలహా ఇచ్చారని వైవీఎస్ తెలిపారు.
సినీ పరిశ్రమ ఏ ఒక్క కుటుంబానికి చెందినవారిది కాదని.. ఎవరైనా పరిశ్రమలో రాణించవచ్చు అని ఇటీవల రేయ్ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.