‘ఎబోలా’ తగ్గేలా లేదు: డబ్ల్యూహెచ్‌వో
న్యూయార్క్: పశ్చిమ ఆఫ్రికాలో దాదాపు 10 లక్షల మందిపై ప్రభావం చూపుతున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఇదో మానవ సంక్షోభంగా మారే ప్రమాదముందని హెచ్చరించింది.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అసాధారణ చర్యలు అవసరమని పేర్కొంది. మరోవైపు ఈ వైరస్‌కు పరిశోధనల స్థాయిలో ఉన్న జెడ్-మ్యాప్ అనే ఔషధం శాంపిల్ డోస్‌లను అమెరికాకు చెందిన ఓ కంపెనీ లైబీరియాకు పంపినట్లు మీడియా పేర్కొంది.