బస్సు - ట్రక్ ఢీ: 13 మంది మృతి
హరారే: జింబాబ్వేలో హరారే - నయంపండ జాతీయ రహదారిపై ప్రయాణికుల బస్సు - భారీ ట్రక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు.
క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రభుత్వ రవాణ సంస్థకు చెందిన బస్సు మలావీ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. గత వారంలో మాస్వింగో - బైట్ బ్రిడ్జ్ జాతీయ రహదారిపై బస్సు, ట్రక్ ఢీ కొన్న ఘటనలో 19 మంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారని పోలీసులు గుర్తు చేశారు.