త్రోబాల్ జిల్లా జట్టు ఎంపిక
నిడదవోలు : మండలంలోని పెండ్యాల జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం అండర్ – 17 త్రోబాల్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా బాలుర జట్టుకు పెండ్యాల జెడ్పీ హైస్కూల్ నుంచి ఎం.బుల్లిరాజు, వాకా రాము, ఎస్.నరేంద్రబాబు, కె. సాయి వంశీ, కె.సత్యనారాయణ స్వామి, ఇరగవరం జెడ్పీ హైస్కూల్ నుంచి సుభానీ బాషా, ఎం.సురేష్, ఎంఎం పురం జడ్పీ హైస్కూల్ నుంచి కె.చంద్రశేఖర్, జి.సతీష్, ఎస్.లీలా సతీష్, జి.యాదగిరి లక్ష్మీనరసింహ, ఖండవల్లి జెడ్పీ హైస్కూల్ నుంచి సీహెచ్ వీర నివా ఎంపికయ్యారు. బాలికల జట్టుకు పెండ్యాల జెడ్పీ హైస్కూల్ నుంచి వి.మీనా సుప్రియ, కె.ప్రసన్న, కె.శిరీష, పేరిపాలెం జెడ్పీ హైస్కూల్ నుంచి కె.వల్లీదేవి, టి.దీప్తి, ఇరగవరం జెడ్పీ హైస్కూల్ నుంచి పి.సాయి మీనాక్షి, పోలవరం ఎస్ఎఫ్ఎస్హెచ్ఎస్ హైస్కూల్ నుంచి కె.వసుంధర, బి.కనకదుర్గ, బి.స్నేహ మాధురి, కె.అమల, భీమడోలు జెడ్పీ హైస్కూల్ నుంచి ఎస్కే నవీన్ ఎంపికైనట్టు ఆర్గనైజర్ పీఈటీ ఎస్.నాగరాజు తెలిపారు. ఎంపికైన జట్లు కడపలో ఈ నెల 19 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు.