Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Chief YS Jagan Key Suggestions To Party MPs Ahead Of Parliament Sessions1
ఎక్కడా రాజీ పడొద్దు.. గట్టిగా గళం వినిపించండి: వైఎస్ జగన్‌

తాడేపల్లి: ఈనెల 10వ తేదీ నుంచి పార్లమెంటు మలి విడత బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌లో సమావేశమయ్యారు. ఉభయ సభల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ ఎంపీలు గట్టిగా గళం వినిపించాలని సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.టీడీపీ ఎంపీలు ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు..రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సందర్భంగా సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కాగా, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తు ఎంతో కీలకమని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. అలాంటి ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అన్నది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం అని, కేంద్ర క్యాబినెట్‌లో ఇద్దరు టీడీపీ మంత్రులు ఉన్నా, వారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించక పోవడం దారుణమని ఆయన అన్నారు.కాగా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ టీడీపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని సమావేశంలో వైయస్సార్సీపీ ఎంపీలు ప్రస్తావించారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లేందుకు తాము వెనకాడ్డం లేదని, టీడీపీ ఎంపీలతో కలిసి ప్రధాని సహా కేంద్రంలో సంబంధిత మంత్రులను కలవాలని కూడా ప్రతిపాదించామని, కానీ టీడీపీ ఎంపీలు ముందుకు రాలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు వెల్లడించారు. పోలవరం ఎత్తు విషయంలో రాష్ట్రం తరఫున పార్లమెంటులో గట్టి పోరాటం చేయాలని, ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పార్టీ ఎంపీలను వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడుకోవాలి..అలాగే ఆంధ్రుల హక్కుగా, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడుకోవాలని, ఆ సంస్థ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా పార్టీ ఎంపీలు పోరాడాలని వైఎస్‌ జగన్‌ నిర్దేశించారు. నియోజకవర్గాల పునర్విభజనపై రకరకాలుగా చర్చ జరుగుతోందని, దీని వల్ల ఉత్తరాదిలో పెరిగనట్లుగా దక్షిణాదిన సీట్లు పెరగవన్న ప్రచారం సాగుతోందని సమావేశంలో ఎంపీలు వెల్లడించారు. దీనిపై స్పందించిన వైఎస్‌జగన్, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా పార్లమెంటలో ప్రస్తావించాలని సూచించారుబ్యాలెట్‌ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్‌ చేయండివన్‌ నేషన్‌. వన్‌ ఎలక్షన్‌’పై ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని గుర్తు చేసిన ఎంపీలు.. ఒకేసారి కేంద్రం, రాష్ట్రంలో జరిగే ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్‌ చేయాలని నిర్దేశించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో ఈవీఎంలతో పోలింగ్‌ నిర్వహించిన దేశాలు కూడా, ఆ తర్వాత బ్యాలెట్‌ విధానానికి మళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజారోగ్య రంగంపై పార్లమెంట్‌లో ప్రస్తావించండినిరుపేదలకు వైద్య విద్యను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టగా, వాటిలో పూర్తైన మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దిశలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సమావేశంలో ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగంపై సీఎం చంద్రబాబు కత్తికట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎంపీలు ప్రస్తావించగా, ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు..పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు, ప్రతి జిల్లాలో పేదలకు అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా అందించే ఉద్దేశంతో కొత్త మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చామని వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. ఎన్నో వ్యవప్రయాసలకోర్చి, అన్ని రకాలుగా నిధులు, భూములు సేకరించి కాలేజీలను నిర్మించామని, కానీ ఈరోజు వాటిని ప్రైవేటుపరం చేస్తూ మంచి ఉద్దేశాలను నీరు గారుస్తున్నారని, అందుకే ఈ అంశాన్ని పార్లమెంటులో గట్టిగా ప్రస్తావించాలని స్పష్టం చేశారు వైఎస్‌ జగన్‌. వైఎస్‌ జగన్‌ భద్రతపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన ఎంపీలువైఎస్‌ జగన్‌ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు బట్టిన ఎంపీలు.. మాజీ ముఖ్యమంత్రిగా, జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న నేతకు తగిన భద్రత కల్పించడం లేదని ఆక్షేపించారు. జగన్‌గారి గుంటూరు మిర్చి యార్డు సందర్శన సమయంలో, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా విడిచి పెట్టబోమన్న వారు, ప్రజా నాయకుడిగా ఉన్న జగన్‌ ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి, ఆయనకు భద్రతా సమస్యలు సృష్టించడానికి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. అందుకే ఈ విషయాన్ని కూడా పార్లమెంటులో గట్టిగా లేవనెత్తుతామని వైఎస్సార్‌సీపీ ఎంపీలు వెల్లడించారు.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (వైఎస్సార్‌సీపీ) నేత వై.వీ.సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ నాయకుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో పాటు, ఎంపీలు గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎం.గురుమూర్తి, తనూజారాణి, రఘునాథరెడ్డి ఇంకా పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

AP Assembly Budget Session 2025: March 6th Updates2
శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ వర్సెస్ టీడీపీ

👉బడ్జెట్‌పై చర్చలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు👉రెండున్నర కోట్ల మంది మహిళలు మోసపోయారు👉తల్లికివందనం లబ్ధిదారులను వంచన చేశారు👉అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు👉నిరుద్యోగ భ్రుతిని భ్రాంతికి కలిగించారు👉మహిళల మాన ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ బడ్జెట్ ని రూపొందించారు👉ఇది బాహుబలి బడ్జెట్ కాదు.. కట్టప్ప బడ్జెట్👉హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను కట్టప్పలా వెన్నుపోటు పొడిచారు👉మేడిపండులా ఈ బడ్జెట్ ఉంది👉టీడీపీ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్లను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలరా..?👉ఎన్నికల్లో వచ్చేది బాబే...ఇచ్చేది బాబే అన్నారు...👉బాబు వచ్చారు.. ఏమిచ్చారు..👉మద్యం అమ్మకాలను పెంచుతామని బడ్జెట్ లో చెప్పడం దారుణం👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, అనిత👉మద్యం కోసం మాట్లాడే అర్హత లేదంటూ మంత్రి బాలవీరాంజనేయులు వ్యాఖ్యలు👉ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధం ఎత్తేసింది చంద్రబాబు కాదా..? అంటూ కౌంటర్ ఇచ్చిన వరుదు కళ్యాణి👉మద్యం అమ్మకాలను పెంచి ఆదాయం పెంచుతామని చెప్పడం దారుణం👉25 శాతం అమ్మకాలు పెంచి ఆదాయం పెంచుతామనడం దారుణం కాదా..?👉మద్యం ద్వారా 27 వేల కోట్ల ఆదాయం పెంచుతామనడం సమంజస మేనా..?👉ఆడబిడ్డ నిధి, , ఉచిత బస్సు , తల్లికివందనం, 50 ఏళ్లకే పెన్షన్ పథకానికి నిధులు ఎగనామం పెట్టారు👉తొమ్మిది నెలల్లోనే 1.35 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వానిదే ఆర్థిక విధ్వంసం👉మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం👉ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు హామీపై చర్చించాలని వాయిదా తీర్మానం👉చంద్రబాబు మోసాలను శాసన మండలిలో ఎండగడుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు 👉మండలి సాక్షిగా ఆడుదాం ఆంధ్రాపై టీడీపీ అబద్ధపు ప్రచారం గుట్టురట్టు👉ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని శాసన మండలిలో కూటమి సర్కార్‌ ప్రకటన👉తల్లికి వందనంపై పచ్చి దగా.. మండలి సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన లోకేష్‌👉వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నతో తల్లికి వందనంపై మంత్రి నారా లోకేష్‌ తప్పుడు లెక్కలు విడుదల చేసి అడ్డంగా దొరికిపోయారు👉అన్నదాతలను పట్టించుకోని కూటమి సర్కార్‌..👉పంటలు పండక, పండినవాటికి మద్దతు ధర లేక అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం👉నిన్న (బుధవారం) అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ నడిచింది.👉2014–19 మధ్య రైతులను రుణమాఫీ పేరిట వంచించారు👉అన్నదాత సుఖీభవను అర్హులైన అందరికీ అందించాలి👉సర్కారు వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ వాకౌట్‌

Champions Trophy 2025: Cleric Shahabuddin Razvi Slams Mohammed Shami For Not Observing ROZA During India, Australia Match3
షమీ పెద్ద నేరం చేశాడు.. అతనో క్రిమినల్‌.. ముస్లిం మత పెద్ద సంచలన వ్యాఖ్యలు

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్‌ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్‌ రజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవిత్ర రంజాన్‌ మాసంలో షమీ పెద్ద నేరం చేశాడని ఆరోపించాడు. షమీ ఓ క్రిమినల్‌ అని సంభోదించాడు. షమీపై రజ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దూమారం రేపుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్‌ తాగుతూ కనిపించాడు. దీనిపై ముస్లిం మత పెద్ద రజ్వీ తీవ్రంగా స్పందించాడు. #WATCH | Bareilly, UP: President of All India Muslim Jamaat, Maulana Shahabuddin Razvi Bareilvi says, "...One of the compulsory duties is 'Roza' (fasting)...If any healthy man or woman doesn't observe 'Roza', they will be a big criminal...A famous cricket personality of India,… pic.twitter.com/RE9C93Izl2— ANI (@ANI) March 6, 2025పవిత్ర రంజాన్‌ మాసంలో షమీ రోజా (ఉపవాసం​) పాటించకుండా పెద్ద నేరం చేశాడని అన్నాడు. రంజాన్‌ మాసంలో ఆరోగ్యకరమైన వ్యక్తి రోజా పాటించకపోతే నేరస్థుడవుతాడని తెలిపాడు. రంజాన్‌ మాసంలో ముస్లింలంతా రోజా పాటిస్తుంటే షమీ ఇలా చేయడమేంటని ప్రశ్నించాడు. రోజా పాటించకుండా షమీ ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపుతున్నాడని అన్నాడు. రోజా పాటించనందుకు షమీని క్రిమినల్‌తో పోల్చాడు. ఇలా చేసినందుకు షమీ దేవునికి సమాధానం​ చెప్పాలని ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. షమీపై రజ్వీ చేసిన వ్యాఖ్యలపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. మతాన్ని క్రీడలతో ముడిపెట్టకూడదని అంటున్నారు. షమీ దేశం కోసం​ ఆడుతూ రోజా ఉండలేకపోయాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ముస్లిం సమాజంతో పాటు యావత్‌ దేశం​ షమీకి మద్దతుగా నిలుస్తుంది. షమీ ఈ విషయాన్ని పక్కన పెట్టి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌పై దృష్టి పెట్టాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో షమీ 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అనంతరం పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌ల్లో షమీ వికెట్లు తీయలేకపోయాడు. సెమీస్‌లో ఆసీస్‌పై విజయం సాధించి భారత్‌ ఫైనల్‌కు చేరింది. మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. 2000 ఎడిషన్‌ (ఛాంపియన్స్‌ ట్రోఫీ) తర్వాత భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో భారత్‌తో తలపడిన రెండు సందర్భాల్లో న్యూజిలాండే విజేతగా నిలిచింది. 2000 ఎడిషన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ భారత్‌పై జయకేతనం ఎగురవేసి ఐసీసీ టైటిళ్లు ఎగరేసుకుపోయింది.

Major Blaze in  Fishing Harbour in Bhubaneswar4
ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 30 బోట్లు దగ్ధం

భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్రంలోని ఫిషింగ్‌ హార్బర్‌ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పారాదీప్‌ ఫిషింగ్‌ హార్బర్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 30 ఫిషింగ్‌ బోట్లు దగ్థం.. కోట్లలో ఆస్తి నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Would Like To Mentor Rahul Gandhi Mani Shankar Aiyar Reply5
‘20 ఏళ్లుగా అనుకుంటున్నా.. కానీ రాహుల్ అనుకోలేదు’

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంతగానో సేవ చేసిన తనను పార్టీ ప్రస్తుతం గుర్తించకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి మణి శంకర్ మళ్లీ పెదవి విప్పారు. పార్టీకి ఇంకా సేవ చేద్దామని ఉన్నా తనను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తానొక వృద్ధుడిని అని పక్కన పెట్టేశారని, తాను మరీ అంత వృద్ధుడినేమీ కాదన్నారు 83 ఏళ్ల మణిశంకర్ అయ్యర్‌. జాతీయ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మణి శంకర్ అయ్యర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.‘ ఇప్పుడు నేనేమీ మాట్లాడినా బీజేపీ వక్రీకరిస్తుంది. వారు కచ్చితంగా ఆ పని చేస్తారు. మీతో మాట్లాడిన దానిని వక్రీకరిస్తారు. కానివ్వండి.. వారు అలా చేస్తే మనం చేసేదేమీ ఉండదు.. మా పార్టీలోని పవన్ ఖారే నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. నా సేవలు పార్టీకి అవసరం లేదని తేల్చి చెప్పేశారు. ఏ రకంగానే నా సేవలు అవసరం లేదన్నారు. ఇక ‘గాంధీ’ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ షిప్ పై మణి శంకర్ అయ్యర్ స్పందించారు. ‘ మా ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. వారు నన్నేమీ శత్రవుగా చూడటం లేదు. కానీ రాహుల్ గాంధీ.. నన్ను బాగా వృద్ధుడిగా చూస్తున్నారు. నేను వృద్ధుడ్నే కానీ.. మీరు అనుకునేంత వృద్ధుడ్ని కాదు. ఇదే వారు నన్ను సంప్రదించకపోవడానికి ప్రధాన కారణం’ అని చెప్పుకొచ్చారు.ఇక రాహుల్ గాంధీకి మెంటార్ గా వ్యవహరిస్తారా అని అడిగిన ప్రశ్నకు.. మణిశంకర్ అయ్యర్ తనదైన శైలిలో జవాబిచ్చారు. ‘ రాహుల్ కు మెంటార్ గా ఉండాలని గత 20 ఏళ్లగా సిద్ధంగా ఉ‍న్నా. కానీ వారు నన్ను కోరుకోవడం లేదు. నా అభిప్రాయాన్ని వారు మీద నేను బలవంతంగా రుద్దలేను కదా. నేను ఉండాలని కోరుకుంటున్నా. కానీ రాహుల్ అనుకోవడం లేదు’ అని అ‍న్నారు. కాంగ్రెస్ లో కొంతమంది తనపై లేనిపోనివి చెప్పి తనను వారి నుంచి దూరం చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు అయ్యర్.మరి ఈ విషయాల్ని రాహుల్ గాంధీ సమక్షంలోనే నివృత్తి చేసుకోవచ్చు కదా అని అడిగిన మరో ప్రశ్నకు అయ్యర్ బదులిస్తూ.. ‘ నేను ఎలా కలుస్తాను.. వారు కలిసే అవకాశం ఇవ్వకపోతే నేను కలవగలను. 2004లొ రాహుల్ నా మాట గౌరవం ఇచ్చేవారు. ఆ సందర్భంలో మీరు నా తండ్రికి స్నేహితుడు.. అందుకు మీ మాట వింటాను.. మా తండ్రి మీ మాట విన్నారు.. నేను కూడా మీ మాట వింటాను’ అని ఒకానొక సందర్భంలో సంగతిని అయ్యర్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వారిని కలిసే పరిస్థితి లేదన్నారు. వారే తనను దూరం పెడుతున్నారన‍్నారు. అటు రాహుల్, ఇటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎవర్నీ నేను కలవలేకపోతున్నా. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగా లేకపోయినా కలవడానికి లేకుండా ఉంది. నేను వారు గురించి ఎందుకు డిస్టర్బ్ కావాలి. నాకేమైనా ఇప్పుడు ఎంపీ పోస్ట్ కోసం వారిని కలవాలా? ఏంటీ, అని అయ్యర్ తిరిగి ప్రశ్నించారు.

No Mangalsutra, No Bindi, Judge Asks Woman Why Her Husband Would Be Interested6
‘మెడలో తాళి, నుదుటున బొట్టు లేదు.. మీ భర్త మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు’: కోర్టు

ముంబై : వాళ్లిద్దరూ భార్యా, భర్తలు. అయితే, భర్త తనని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోరింది. ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో న్యాయమూర్తికి, మహిళకు మధ్య జరిగిన సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.పూణేకు చెందిన అంకుర్‌ ఆర్‌ జగిధర్‌ లాయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ తనని సంప్రదించిందని, అందుకే ఆమె తరుఫున వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తన క్లయింట్‌ కేసు పూణే జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని, విచారణ సమయంలో న్యాయమూర్తితో జరిగిన వాదనలను భార్య తరుఫు లాయర్‌ లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారు. ఆ పోస్టులో పూణే జిల్లా కోర్టులో ‘‘నా క్లయింట్‌ విడాకుల కేసు విచారణ జరిగింది. విచారణలో భర్త తన డిమాండ్లను నెరవేర్చాలని కోర్టును కోరింది. అయితే, ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి నా క్లయింట్‌ను ఇలా ప్రశ్నించారు. ‘‘ఏమ్మా.. మిమ్మల్ని చూస్తుంటే మొడలో మంగళసూత్రం, నుదుట బొట్టు పెట్టుకునేవారిలా కనిపించడం లేదే? వివాహం జరిగిన స్త్రీగా మీరు కనిపించకపోతే.. మీ వారు.. మిమ్మల్ని ఎలా ఇష్టపడతారు? అందుకే భర్తలతో ప్రేమగా ఉండండి. కఠువగా ఉండకండి అని సలహా ఇచ్చారు.అంతేకాదు.. మాటల మధ్యలో న్యాయమూర్తి ఇలా అన్నారు. ‘‘ఒక స్త్రీ బాగా సంపాదిస్తే, ఆమె ఎప్పుడూ తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న భర్తనే కోరుకుంటుంది. తక్కువ సంపాదిస్తున్న వ్యక్తి చాల్లే అని సరిపెట్టుకోదు. అదే బాగా సంపాదించే వ్యక్తి తాను వివాహం చేసుకోవాలనుకుంటే, తన ఇంట్లో పాత్రలు కడిగే పనిమనిషినైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి మీరు మీ భర్త పట్ల కాస్త ప్రేమను చూపించండి. కఠినంగా ఉండొద్దు అని ఇద్దరు దంపతుల్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారని వివరిస్తూ’’ సదరు న్యాయవాది రాసిన సోషల్‌ మీడియా పోస్టు నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది.

LPU 2025 Btech Final Year Student Bags Rs 1.03 Cr Placement Package7
LPU: ప్లేస్‌మెంట్‌లో తెలుగు కుర్రాడి సత్తా.. కళ్లు చెదిరే ప్యాకేజీతో జాబ్‌

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్‌ డూపర్‌ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్‌పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్‌ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్, నుటానిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో, పేపాల్‌ అమెజాన్‌ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్‌ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్‌ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్‌లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్‌మెంట్లు.గత ప్లేస్‌మెంట్‌ సీజన్‌ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్‌ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్‌ (రూ.48.64 LPA), ఇన్‌ట్యూట్‌ లిమిటెడ్‌ (రూ. 44.92 LPA), సర్వీస్‌ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్‌ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్‌వాల్ట్‌ (రూ. 33.42 LPA), స్కేలర్‌ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్‌పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, టీసీఎస్‌ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ రోల్స్‌ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పొజిషన్‌ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ కూడా 418 మంది విద్యార్థులను జెన్‌సీ రోల్స్‌ కోసం తీసుకుంది. ఎల్‌పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్‌ (279 మంది), టీసీఎస్‌ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్‌ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్‌మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, సిలికాన్‌ ల్యాబ్స్‌, ట్రైడెంట్‌గ్రూప్‌, నుటానిక్స్‌, ఆటోడెస్క్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. ఎల్‌పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్‌ కంపెనీల నుంచి ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్‌పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్‌మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్‌ సాధించిన రికార్డు ఎల్‌పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్‌పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్‌పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్‌పీయూ ఫౌండర్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వివరించారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Actress Ashwini Nambiar Makes Shocking Allegations Against A Malayalam Film Director8
ఆ డైరెక్టర్‌ వల్ల బతకొద్దనుకున్నా.. సింగపూర్‌లో 13 ఏళ్లు టీచర్‌గా..: హిట్లర్‌ నటి

మలయాళ డైరెక్టర్‌ తనను ఇబ్బందిపెట్టాడంటోంది నటి అశ్విని నంబియార్‌ (Ashwini Nambiar). సినిమా గురించి మాట్లాడాలని పిలిపించి దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడని చెప్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయన ఒక పెద్ద డైరెక్టర్‌. ఒకరోజు సినిమా గురించి ఏదో మాట్లాడాలని ఆఫీసుకు రమ్మన్నాడు. నిజానికి నేనెక్కడికి వెళ్లినా అమ్మ నా వెంటవచ్చేది. ఆమె తోడుంటే వెయ్యి ఏనుగుల బలం ఉండేది. ఆ రోజు తనకు ఆరోగ్యం బాగోలేదు. హెయిర్‌ డ్రెస్సర్‌గా పనిచేసే మహిళను తోడు తీసుకెళ్లమంది. అప్పుడు నేనింకా టీనేజర్‌ను.సినిమా గురించి రమ్మని చెప్పి..అతడి ఇల్లు, ఆఫీస్‌ అంతా ఒకేచోట ఉంటాయి. నాతోవచ్చిన మహిళ కిందే ఆగిపోయింది. నేను ఆడుతూ పాడుతూ పైగదిలోకి వెళ్లాను. అక్కడెవరూ కనిపించలేదు. ఇంతలో బెడ్‌రూమ్‌లో నుంచి ఇటురా.. అన్న పిలుపు వినిపించింది. ఆ డైరెక్టర్‌ (Malayalam Director)తో అంతకుముందు ఓ మలయాళ సినిమా చేశాను. ఆ చనువుతో దగ్గరకు వెళ్లాను. కూతురి వయసున్న నన్ను అసభ్యంగా తాకాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక నా పెదాలపై నవ్వు మాయమైంది. సరదాగా ఉండే నేను మూగబోయాను. నేనేమైనా తప్పు చేశానా? ఆయనకు నేనే అవకాశం ఇచ్చానా? అని రకరకాలుగా ఆలోచించాను. అమ్మ ఏడుపు చూసి..నా ముఖం చూడగానే ఏమైందని అమ్మ ఆరా తీసింది. జరిగిందంతా చెప్పడంతో తాను రాకపోవడం వల్లే ఇలా జరిగిందని ఏడ్చేసింది. నా వల్ల అమ్మ బాధపడటం చూసి తట్టుకోలేకపోయాను. ఏంచేయాలో తెలియక ఆ రోజు రాత్రి నిద్రమాత్రలు మింగాను. వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడారు. అప్పుడు మా అమ్మ.. జరిగినదాంట్లో నా తప్పు లేదని అర్థమయ్యేలా చెప్పింది. నేను లేకపోతే తను బతకలేనని బాధపడింది. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పని చేయొద్దని ప్రాధేయపడింది. ఆ డైరెక్టర్‌కు నా తండ్రి వయసుంటుంది. (చదవండి: మహేశ్‌ వల్లే సినిమాలకు దూరమైన నమ్రత.. రిలేషన్‌లో ఉన్నప్పుడు)రీఎంట్రీ..అమ్మ మాటలతో ధైర్యం తెచ్చుకున్నాను. తిరిగి షూటింగ్‌లో అడుగుపెట్టాను. కొన్నిసార్లు అమ్మ లేకపోయినా సెట్‌కు వెళ్లేదాన్ని. దేన్నైనా ఎదుర్కోగలను అన్న ధైర్యంతోనే ముందడుగు వేశాను అని చెప్పుకొచ్చింది. 18 ఏళ్లపాటు వెండితెరకు దూరంగా ఉన్న అశ్విని ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌ వెబ్‌ సిరీస్‌ సుడల్‌ 2తో రీఎంట్రీ ఇచ్చింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. పెళ్లవగానే యాక్టింగ్‌ మానేస్తానని ఎక్కడా చెప్పలేదు. ఎప్పటికైనా మళ్లీ సినిమాల్లోకి వస్తానన్న నమ్మకం నాకుంది. ప్రస్తుతం నా కూతురు కాలేజీలో చదువుతోంది. ఇదే సరైన సమయం అనిపించింది. ఇదే సరైన ఛాన్స్‌ అని..షూటింగ్స్‌ కోసం సింగపూర్‌ నుంచి పదేపదే చెన్నై రావడం అంత ఈజీ కాదు. సింగపూర్‌లో ఉండగా నేను మాస్టర్స్‌ పూర్తి చేశాను. కాలేజీలో 13 ఏళ్లపాటు టీచర్‌గా పని చేశాను. ప్రోగ్రామ్స్‌ చేసేదాన్ని. గతేడాది నా కూతురు కాలేజీలో జాయిన్‌ అయింది. ఇదే సరైన సమయం అనుకున్నాను. సరిగ్గా అప్పుడే సుడల్‌ 2 సిరీస్‌ నుంచి పిలుపొచ్చింది. ఈ సిరీస్‌ రచయితలు పుష్కర్‌- గాయత్రితో అంతకుముందు పనిచేసిన అనుభవం ఉండటంతో సులువుగా ఒప్పేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. అశ్విని మొదట సీరియల్స్‌లో నటించింది. హిట్లర్‌ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కనిపించింది. ఆంటీ, పెళ్లి చేసుకుందాం, పోలీస్‌ చిత్రాలతో తెలుగువారిని పలకరించింది. మలయాళ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసింది.

Infosys to Implement 10 Days Work From Office Mandate From March 10th9
నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్!

కరోనా తరువాత దాదాపు అన్ని కంపెనీలు.. వర్క్ ఫ్రమ్ విధానానికి మంగళం పాడాలని నిర్ణయించుకున్నాయి. దశల వారీగా ఈ విధానం తొలగించడానికి సిద్దమయ్యాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్.. టెక్నాలజీ టీమ్, నెలలో కనీసం 10 రోజులు ఆఫీసు నుంచి పని చేయాలనే ఆదేశాలను జారీ చేసింది.ఎక్కువ మంది ఆఫీస్ నుంచే పనిచేయాలనే.. ఉద్దేశ్యంతో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 10 నుంచి ఈ రూల్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల.. ఆదరినీ ఆఫీసుకు రప్పించాలని, ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా.. కనీసం 10 రోజులు ఆఫీస్ నుంచి, మిగిలిన రోజులు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది.ఈ విషయంపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించలేదు. అయితే సంస్థలో పనిచేస్తున్న 3.23 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగుల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి.. ఈ తరహా హైబ్రిడ్ సిస్టం ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: తగ్గిన బెంచ్ టైమ్.. ఐటీ ఉద్యోగులకు ఊరట!ఈ కొత్త రూల్ లెవల్ 5, అంతకేనట తక్కువ స్థాయి ఉద్యోగులకు వరిస్తుందని తెలుస్తోంది. ఇందులో టీమ్ లీడర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, సిస్టమ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు ఉన్నారు. ఎవరైనా 10 రోజులు ఆఫీసుకు రానట్లయితే.. లేదా ఒకటి, రెండు రోజులు తగ్గితే.. వాటిని ఉద్యోగి సెలవుల బ్యాలెన్స్ నుంచి తీసివేసే అవకాశం ఉంది.

KSR Comment On MLC Elections in Telugu States10
అధికార పక్షాలకు వార్నింగ్‌ ఇచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు!

శాసనమండలికి ఇటీవల జరిగిన ఎన్నికలు అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణల్లోని అధికార పక్షాలకు చిన్నపాటి వార్నింగ్‌ ఇచ్చాయి! ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందినా కీలకమైన ఉపాధ్యాయ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ, జనసేనలు ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం ముఖ్యమైన రాజకీయ పరిణామమే అవుతుంది. ఈ ఓటమి కూటమి ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర టీచర్ల అసంతృప్తికి ప్రతీక.మరోవైపు ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు కూడా కాంగ్రెస్‌కు ఇబ్బంది పెట్టేదే. పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి ఆయా వర్గాలు దీనిని అవకాశంగా తీసుకోవచ్చు. టీచర్ల నియోజకవర్గాలకు జరిగిన పోటీలో లేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నా, ఒక స్థానంలో బీజేపీ బహిరంగంగా బలపరిచిన వ్యక్తి గెలవడం మాత్రం అధికార పార్టీకి మంచి సంకేతం కాదు. మరో స్థానంలో పీఆర్‌టీయూ తెలంగాణలో అధికారంలోకి రావాలని యత్నిస్తున్న బీజేపీకి ఇది కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే బీఆర్‌ఎస్‌ పోటీ చేయకపోవడం, ఎవరికి మద్దతు ఇవ్వకపోవడం వల్ల రాజకీయ సమీకరణలు భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటాయని చెప్పలేం.ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేనలు ఏపీటీఎఫ్‌ అభ్యర్ధి రఘువర్మకు బహిరంగంగానే మద్దతు ప్రకటించాయి. అధికారిక ప్రకటనలు కూడా చేశాయి. కాని బీజేపీ మద్దతివ్వకపోవడం గమనించవలసిన అంశమే. స్వతంత్ర అభ్యర్ధిగా పీఆర్‌టీయూ పక్షాన పోటీచేసిన గాదె శ్రీనివాసులు నాయుడు వర్మను ఓడించడంతో కూటమికి దిమ్మదిరిగినంత పనైంది. ప్రభుత్వ ఉద్యోగులలో ఏర్పడిన అసమ్మతికి ఇది నిదర్శనమన్న భావన ఏర్పడింది. గత జగన్ ప్రభుత్వంలో టీడీపీ, జనసేనలు ప్రభుత్వ టీచర్లను విపరీతంగా రెచ్చగొట్టాయి.ప్రతి నెల మొదటి తేదీకల్లా జీతాలు ఇవ్వడం లేదని, స్కూళ్లలో విద్యార్థులకు అజమాయిషీ బాధ్యతలు అప్పగించి ఇబ్బంది పెడుతున్నారని దుష్ప్రచారం చేశాయి. సీపీఎస్‌ రద్దు పై పరిశీలన చేస్తామని, డీఏ బకాయిలు ఇస్తామని,.. ఇలా రకరకాల హామీలను గుప్పించారు. విద్యా వ్యవస్థకు జగన్ ప్రభుత్వం ఎంతో గుర్తింపు తెచ్చినా, ఒక ఐఏఎస్‌ అధికారి కొంత కఠినంగా వ్యవహరించారన్న భావన అప్పట్లో టీచర్లలో ఉండేది. దానివల్ల కూడా అప్పట్లో వైఎస్సార్‌సీపీకి కొంత నష్టం జరిగింది.శాసనసభ ఎన్నికలలో ఆ మేరకు కూటమి లబ్ది పొందింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఇచ్చిన హామీలు నెరవేరతాయని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆశించాయి. కాని ప్రభుత్వంలో వీరిని పట్టించుకునే వారే లేకుండా పోయారు. పీఆర్సీ ఊసే ఎత్తలేదు. ఇక మధ్యంతర భృతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? సీపీఎస్‌ బదులు జగన్ ప్రభుత్వం జీపీఎస్‌ తీసుకు వస్తే విమర్శలు చేసిన టీడీపీ, జనసేనలు ప్రభుత్వంలోకి వచ్చాక దానినే కొనసాగిస్తున్నాయి. అంతేకాక సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారన్న భావన ఎటూ ఉంది.రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏపీలో కూటమి సాగిస్తున్న విధ్వంసాన్ని, అరాచక పరిస్థితులను టీచర్లు గమనించి కూడా ఈ ఫలితాన్ని ఇచ్చారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికలో టీచర్లు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని టీడీపీ నేతలు ఊహించలేకపోయారు. అందుకే బహిరంగంగా రఘువర్మకు మద్దతు ప్రకటించడమే కాకుండా మీడియా సమావేశాలు పెట్టి ప్రచారం చేశారు. తీరా ఓటమి చవిచూసిన తర్వాత వెంటనే టీడీపీ గాత్రం మార్చేసింది. గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు కూడా తమ అభ్యర్ధేనని కొత్త వాదనను తెచ్చింది. మంత్రి అచ్చెన్నాయుడు తాము ఇద్దరు అభ్యర్ధులకు మద్దతు ఇచ్చామని చెప్పగా, శ్రీనివాసులు నాయుడు అలాగా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించి గాలి తీశారు. మరో వైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వర్మకు మద్దతుగా చేసిన వీడియోని అంతా చూశారు. దాంతో అచ్చెన్న పరువు పోయినట్లయింది.ఇక ఎల్లో మీడియా కూడా తమ లైన్ మార్చుకున్నాయి. ఎన్నికలకు ముందు పీఆర్‌టీయూకు చెందిన గాదె, యుటిఎఫ్ అభ్యర్ధి గౌరి పరస్పరం సహకరించుకుని రెండో ప్రాధాన్య ఓటు విషయంలో అవగాహన పెట్టుకున్నారని రాశారు. వీరిద్దరూ కలిసినా తమకు ఎదురు ఉండదని అనుకుని బోల్తా పడ్డారు.అ క్కడికి డబ్బు, తదితర ప్రలోభాలకు తెరదీసినా, ఉత్తరాంధ్రలో టీచర్లు మాత్రం అధికార కూటమికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఈ ఫలితం తేల్చింది. రెండు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో కూటమి గెలిచినా, ఉత్తరాంధ్రలో ఓటమి చంద్రబాబును అధికంగా కుంగదీస్తుంది. తన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండగా టీచర్లు ఈ షాక్ ఇవ్వడం మరీ చికాకు కలిగిస్తుంది.కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్ధులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పి.రాజశేఖర్ లు గెలవడం కూటమి పాలనకు సర్టిఫికెట్టా అన్న చర్చ రావచ్చు. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ తీరుపై అభిప్రాయ వ్యక్తీకరణకన్నా, ఆయా అభ్యర్ధుల ప్రభావం. వారు చేసే కసరత్తు, కుల సమీకరణలు, డబ్బు వ్యయం చేసే వైనం, అధికార దుర్వినియోగం, గొడవలు సృష్టించడం, రిగ్గింగ్ వంటివి ప్రభావం చూపాయన్న భావన ఉంది. పీడీఎఫ్‌ అభ్యర్ధి కె.ఎస్.లక్ష్మణరావు మాచర్ల ప్రాంతంలో, మరికొన్ని చోట్ల ఎన్నికలలో అక్రమాలు ఎలా జరిగాయో సోదాహరణంగా వివరించారు.వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత జగన్ ఈ ఫలితంపై వ్యాఖ్యానిస్తూ శాసనమండలి ఎన్నికలలో సైతం రిగ్గింగ్ చేయించి చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారని ఎద్దేవ చేశారు. అదే టీచర్ల నియోజకవర్గంలో రిగ్గింగ్ చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్బు ఏ రకంగా పంచారో చెప్పడానికి పిఠాపురంలో బయటకు వచ్చిన వీడియోనే నిదర్శనం. ఆలపాటికి ఉన్నంత ఆర్ధిక వనరు లక్ష్మణరావుకు లేదు. పైగా ఆయన ఆ రకంగా ఖర్చు చేసే వ్యక్తి కూడా కాదు.మాచర్ల, మంగళగిరి వంటి ప్రాంతాలలో కూటమి నేతలు పోలింగ్ స్టేషన్ల వద్ద అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇది తమకు అనుకూల నిర్ణయమని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కాని వాస్తవం ఏమిటో అందరికి తెలుసు. టీడీపీ అభ్యర్ధులు గెలిచారు కనుక ఇక సూపర్ సిక్స్ ఇవ్వనవసరం లేదని కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పగలుగుతారా? ఎన్నికల ప్రణాళికను అమలు చేసేశామని అంటే జనం ఒప్పుకుంటారా? ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కె.ఎస్.లక్ష్మణరావుకు మంచిపేరే ఉంది. వామపక్షాల మద్దతు ఉంది.వైఎస్సార్‌సీపీ నేరుగా మద్దతు ప్రకటించకపోవడం ఒక మైనస్. కానీ ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతిలో మాత్రం వైఎస్సార్‌సీపీ మద్దతు వల్లే లక్ష్మణరావు ఓడిపోయారని దిక్కుమాలిన రాతలు రాశారు. వైఎస్సార్‌సీపీ ముద్రతో విద్యావంతులు దూరం అయ్యారని పిచ్చి విశ్లేషణ చేసింది. లక్ష్మణరావుకు ఓటు వేసిన వారు విద్యావంతులు కాదని ఈ పత్రిక చెప్పదలచినట్లుగా ఉంది. పూర్తి స్వార్ధంతో ,పత్రికా విలువను గాలికి వదలి, జర్నలిజాన్ని పచ్చి వ్యాపారంగా మార్చి ఎల్లో మీడియా కథనాలు ఇస్తోందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.అలా పిచ్చి రాతలు రాసిన ఎల్లో మీడియా ఉపాధ్యాయ నియోజకవర్గంలో కూటమి ఓటమిని మాత్రం కప్పిపుచ్చే యత్నం చేసింది. వారు చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లలో కూటమి పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్లు ఒప్పుకుంటారా? టీడీపీ, జనసేనలు మద్దతు ఇచ్చినందునే రఘువర్మ ఓడిపోయారని కూడా విశ్లేషిస్తారా? గాదెని గెలిపించిన టీచర్లు విద్యావంతులు కాదని ఈ ఎల్లో మీడయా రాసినా ఆశ్చర్యం లేదు. మండలి ఎన్నికల ఫలితాలవల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వంలో వచ్చే మార్పు పెద్దగా ఉండరు. కాని టీచర్లలో ఏర్పడిన వ్యతిరేకత సమజాంలో ఉన్న అశాంతికి అద్దం పడుతుందని చెప్పవచ్చు.ఉత్తర తెలంగాణలో టీచర్ల నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఇద్దరు ముఖ్య అభ్యర్థులు బారీగా డబ్బు వ్యయం చేశారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఎన్నికలో నిజాయితీ గెలిచిందని, మోడీ నాయకత్వానికి మద్దతు లభించిందని చెబితే చెప్పవచ్చు.అది మాట వరసకే తప్ప, ఈ ఎన్నికలలో మోడీ ప్రభావంతోనే ఓట్లు వేయడం, వేయకపోవడం ఉండకపోవచ్చు.ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఉన్న బలం వారి అభ్యర్ధి మల్క కొమరయ్య, అంజిరెడ్డిల గెలుపునకు ఉపకరించి ఉండవచ్చు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంతంలోనే బీజేపీకి అధిక సీట్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఇంతకుముందు సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిథ్యంవహించారు. ఈసారి ఆయన పోటీ చేయలేదు.ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్ర రెడ్డి ఓడిపోవడం, బీజేపీ అభ్యర్ధి అంజిరెడ్డి గెలవడం కచ్చితంగా కాంగ్రెస్ కు షాక్ వంటిదే. ఇది ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని కనబరుస్తుందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. దీనిని సరిదిద్దుకోకపోతే రేవంత్ నాయకత్వానికి కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 30 బోట్లు దగ్ధం

భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్రంలోని ఫిషింగ్‌  హార్బర్‌ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసు

title
జైశంకర్‌ పర్యటనలో ఖలిస్థానీల అత్యుత్సాహం.. ఖండించిన యూకే

లండన్‌ : యూకే పర్యటలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.

title
‘20 ఏళ్లుగా అనుకుంటున్నా.. కానీ రాహుల్ అనుకోలేదు’

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ ఎంతగానో సేవ చేసిన తనను పార్టీ &n

title
‘మెడలో తాళి, నుదుటున బొట్టు లేదు.. మీ భర్త మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు’: కోర్టు

ముంబై : వాళ్లిద్దరూ భార్యా, భర్తలు.

title
గోల్డ్‌ కేసులో ట్విస్ట్‌.. నటి రన్యారావు వెనక ఓ రాజకీయ నేత!?

కన్నడ నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

వీడియోలు

Advertisement