Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

NASA-SpaceX Falcon 9 Rocket Sunita Williams Closer To Homecoming1
నింగిలోకి ఫాల్కన్‌.. వెల్‌కమ్‌ బ్యాక్‌ సునీతా విలియమ్స్‌!

వాషింగ్టన్‌: అంతరిక్షంలో చిక్కుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌‎ను తీసుకొచ్చేందుకు ముందడుగు పడింది. ఆమెను అంతరిక్షం నుంచి తిరిగి భూమి పైకి తీసుకొచ్చేందుకు తాజాగా నాసా-స్పేస్‌ ఎక్స్‌లు క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి. నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్‌ 9 (Falcon 9 Rocket) రాకెట్‌ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు కెన్నడీ స్పేస్‌సెంటర్‌ నుంచి నింగిలోకి తీసుకెళ్లింది. మూడోసారి రోదసీలోకి వెళ్లి అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (Sunita williams) త్వరలోనే భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. 2024 జూన్‌లో‎లో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్‌ విల్మోర్, నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ మిషన్ క్రూ-9 ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్‌‎లో వీరి పర్యటన వారం రోజులు. కానీ.. వీరు వెళ్లిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌‎లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ తిరిగి భూమిపైకి రాగా.. సునీత, బచ్‌ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. దీంతో, దాదాపు తొమ్మిది నెలలుగా సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌ (Butch Wilmore) అంతరిక్ష కేంద్రం (ISS)లోనే ఉంటున్నారు. Have a great time in space, y'all!#Crew10 lifted off from @NASAKennedy at 7:03pm ET (2303 UTC) on Friday, March 14. pic.twitter.com/9Vf7VVeGev— NASA (@NASA) March 14, 2025ఈ క్రమంలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్.. స్పేస్‎లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా, విల్మోర్‎ను వెంటనే భూమిపైకి తీసుకురావాలని నాసా, ఎలన్ మస్క్‌‎ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు మూడు రోజుల క్రితం క్రూ-10 మిషన్‌ (Crew-10 mission)ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రయోగాన్ని నిలిపేశారు. తాజాగా వారిని తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయోగం చేపట్టారు. డ్రాగన్‌ క్యాప్సుల్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన వారిలో అన్నె మెక్లెయిన్‌, నికోల్‌ అయర్స్‌, టకుయా ఒనిషి, కిరిల్‌ పెస్కోవ్‌ వ్యోమగాములు ఉన్నారు. ఇక, మార్చి 19న విలియమ్స్ అంతరిక్షం నుంచి బయల్దేరనున్నారు. వీలైతే మరో వారం రోజుల్లో ఆమె భూమి మీదకు వచ్చే అవకాశం ఉంది. Crew-10 is go for launch! pic.twitter.com/xyQzIJ7Abf— SpaceX (@SpaceX) March 14, 2025

Hyderabad to Pithapuram How Jana Sena Pawan Kalyan Politics Drastically Changed2
హైదరాబాద్‌ టు పిఠాపురం.. ఇదెక్కడి యూటర్న్‌ భయ్యా?

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏపీ ప్రజలకు శుక్రవారం పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో.. కొత్త పవన్‌ కల్యాణ్‌ కనిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా ఆయన ప్రసంగం సాగడమే అందుకు కారణం. రాజకీయాల్లో పవన్‌ ఎలా ఉండకూడదని ఆయన అభిమానులు అనుకున్నారో.. సరిగ్గా అలాగే ఆయన నిన్న కనిపించారు. అసలు అంశాలన్నీ పక్కన పడేసి.. అవసరం లేకపోయినా మత, ప్రాంతీయ అంశాలను తెర మీదకు తెచ్చి మరీ ఊగిపోయారాయన. విలువలు వదిలేసి.. అధికారంలోకి వచ్చాక పవన్‌ రాజకీయంలో మార్పు కనిపిస్తోంది. కుల, మత, జాతి, ప్రాంతీయ రాజకీయాలకు తాను వ్యతిరేకుడినని.. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని ఆరాధిస్తానని తొలినాళ్లలోనే ప్రకటించుకున్న పవన్‌.. మొత్తంగా మారిపోయారు. రాజకీయాన్ని బాగా ఒంట బట్టిచ్చుకుని మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టానంటూ పవన్‌ మాట్లాడారు. ఈ కామెంట్లు టీడీపీ పొత్తుపై అసంతృప్తితో ఉన్న కేడర్‌ను సంతృప్తి పరచడానికో లేదంటే.. నిజంగా మనసులోంచి వచ్చిన మాటలో తెలియదు. పనిలో పనిగా.. ఏదో తిట్టాలని కదా అని వైఎస్సార్‌సీపీని ఓ నాలుగు మాటలు అన్నారు. ఈ క్రమంలో తనను జనాలకు బాగా దగ్గర చేసిన సినిమాలను తక్కువ చేసి మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమేనని ఇంక దానితో తనకు అవసరం లేదన్నట్లుగా ఒక్క మాటతో తేల్చేశారు. డిగ్రీ పూర్తి చేసి ఉంటేనా?.. సగటు మధ్య తరగతి మనిషిగా బతకడమే పవన్‌ కోరిక అట. చంటి సినిమాలో మీనాను పెంచినట్టు తనను పెంచారట. తాను డిగ్రీ పూర్తి చేసి, ఎస్సైని కావాలన్నది తన తండ్రి కోరిక అని, కానీ తాను డిగ్రీ కూడా పూర్తి చేయలేదని చెప్పారు. అటువంటి తాను బయటకు వెళ్తే ఏమవుతానో అని ఇంట్లో నిత్యం భయపడేవారన్నారు. అలాంటిది తాను సినిమాలు, రాజకీయం చేయడం కుటుంబ సభ్యులకూ ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. అయితే పవన్‌ కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఉండేవారేమో అంటూ కొందరు సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఓట్ల కోసం కాదంట!!.. జనసేన విజయానికి ఏడు సిద్ధాంతాలే కారణమని, ఎంతో ఆలోచించి వీటిని రూపొందించామని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా? పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి, మామయ్య కేంద్ర మంత్రి అయ్యుండాలా? అని పవన్‌ ప్రశ్నించారు. దశాబ్దం పాటు పార్టీని నడపడంతో వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం ఎంతో కోల్పోయానన్నారు. సమాజంలో మార్పు కోసం వచ్చానని, ఓట్ల కోసం కాదని కామెంట్‌ చేశారు. అన్‌అపాలజెటిక్‌ సనాతనినే అంట.. భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయాల్సిన సమయం ఇదేనని, సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని, దానిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. ఇతర మతాలను గౌరవించాలని సనాతన ధర్మం నేర్పిందన్నారు. హైదరాబాద్‌లో పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు తమ సత్తా చూపుతామని ఒక నాయకుడు వ్యాఖ్యానించడం దారుణం అంటూ మండిపడ్డారు. పవర్‌ స్టార్‌ను అంత మాట అన్నారా?.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్‌ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్‌ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరిగినప్పుడు నేను వివక్ష అనుభవించా.. గోల్టీ.. గోల్టీ.. అంటూ అవమానించారని ఆయన తెగ ఫీలైపోయారు.ఎంత మార్పు!గత జనసేన ఆవిర్భావ సభలకు.. ఈసారి సభకు జనసేనానిలో చాలా మార్పు వచ్చింది. అందుకు అధికారంలో ఉండడం, అదీ చంద్రబాబు కింద ఉండడమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో జనసేన ఆవిర్భావం రోజు నుంచి.. గత జనసేన సభల్లో.. పవన్‌ ఎక్కువగా ప్రజలకు కనెక్ట్‌ అయ్యే అంశాలపై దృష్టి పెట్టేవారు. అవసరం ఉన్నా.. లేకున్నా.. అప్పటి ప్రభుత్వాలను విమర్శిస్తూ ఆవేశంగా ఊగిపోయేవారు. అది ప్రజల్లో మాస్‌ హిస్టీరియాలాంటి స్థితిని తెచ్చింది. అయితే.. 👉గత మీటింగ్‌లలో పవన్‌ వ్యాఖ్యలు కొన్నిసార్లు విచిత్రంగా.. అసంబద్ధంగా ఉన్నా.. ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడంలో మాత్రం పవన్‌ ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి.. అందునా హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. ప్చ్‌.. బహుశా అందుకేనేమో ఆయన వాటి ఊసెత్తలేదు. 👉ఎప్పటిలాగే సొంత విషయాల్లో ‘కొత్త కోణం’ ఆవిష్కరించిన ఆయన.. అవసరం లేకున్నా.. హిందూ, హిందీ భాష టాపిక్స్‌ తీసుకొచ్చి మాట్లాడారు. అలాగే.. నేషనల్‌ మీడియా తనపై రాసినవంటూ కొన్ని అంశాలంటూ ఊగిపోయారు. లెఫ్ట్‌, రైట్‌, సెంట్రల్‌ ఐడియాలజీ మార్చేశానని, చెగువేరా ఫాలోవర్‌ కాస్త నుంచి సడన్‌గా సనాతని డిఫెండర్‌ అయిపోయానిని కథనాలు(వాస్తవాలు) రాశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. అయితే..గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, అధికారంలో ఉన్నా లేకున్నా.. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిలా విలువలుతో కూడిన రాజకీయాలు చేయడం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం బహుశా చంద్రబాబు & కోకు మాత్రమే కాదు తన వల్లా కాదనే విషయాన్ని పవన్‌ పిఠాపురం ప్రసంగంతో తేల్చేశారు.

family ends life in kakinada3
హోలీ వేళ కాకినాడలో విషాదం.. చదవు రాకపోతే చంపేస్తారా? నాన్న..

కాకినాడ రూరల్‌: అభం శుభం తెలియని ఆ పసి పిల్లల పాలిట ఆ తండ్రి కాలయముడయ్యాడు. కారణమేంటో తెలియదు కానీ.. ఇద్దరు చిన్నారులను బలిగొన్నాడు. అంతటితో ఆగక తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉలిక్కిపడేలా చేసే ఈ సంఘటన కాకినాడలోని తోట సుబ్బారావు నగర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. భార్యా పిల్లలతో చీకూచింతా లేని కుటుంబం. ఆర్థికంగా దన్నుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీలో ఉద్యోగం. ఏమైందో ఏమో కానీ, అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే పిల్లలను నిర్దాక్షిణ్యంగా నీటిలో ముంచి, ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆపై తాను ఉరి వేసుకున్నాడు. హోలీ పండగ పూట కాకినాడ రెండో డివిజన్‌లోని తోట సుబ్బారావు నగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్‌(37) వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్‌ అకౌంట్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా భార్యాపిల్లలతో తోటసుబ్బారావు నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. పిల్లలు జోషిత్‌(7) ఒకటో తరగతి, నిఖిల్‌(6) యూకేజీ చదువుతున్నారు. ఇలాఉండగా తోట సుబ్బారావు నగర్‌లో తన ప్లాట్‌ నుంచి హోలీ పండగ వేడుకల కోసం భార్య తనూజ, పిల్లలతో కలిసి వాకలపూడిలో తాను పనిచేస్తున్న ఓఎన్జీసీ కార్యాలయం వద్దకు వెళ్లాడు. అక్కడ హోలీ వేడుకల్లో భార్యను ఉండమని చెప్పి, పిల్లలకు టైలర్‌ వద్ద కొలతలు తీయించి తెస్తానని ఇంటికి వచ్చాడు. ఇంట్లో బాత్రూం బకెట్‌ నీటిలో ఇద్దరు పిల్లలను ముంచి, ఊపిరాడకుండా చేసి హతaమర్చాడు. తర్వాత బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంట వరకూ భర్త, పిల్లలు రాకపోయేసరికి కంగారుపడిన భార్య ఫోన్‌ చేసినప్పటికీ సమాధానం రాలేదు. దీంతో ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది తోట సుబ్బారావునగర్‌లో చంద్రకిశోర్‌ ఇంటికి వచ్చారు. తలుపులు బలవంతంగా తెరిచేసరికి బెడ్రూంలో ఉరి వేసుకుని చంద్రకిశోర్‌ కనిపించాడు. పిల్లలు బాత్రూంలో విగతజీవుల్లా కనిపించారు. విషయం తెలుసుకున్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఓఎన్జీసీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కళ్లెదుటే భర్త, పిల్లలు శవాలుగా పడి ఉండడంతో భార్య తనూజ స్పృహ కోల్పోయింది. బంధువుల సపర్యలతో స్పృహలోకి వచ్చిన ఆమె రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఆమెను ఓదార్చడం బంధువులకు కష్టంగా మారింది. సర్పవరం ఎస్సై శ్రీనివాస్‌కుమార్‌ కేను నమోదు చేశారు. సీఐ పెద్దిరాజు విచారణ చేపట్టారు. చంద్రకిశోర్‌ బెడ్రూంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుత జనరేషన్‌లో తన పిల్లలు సరిగ్గా చదవడం లేదని మనస్తాపం చెంది చనిపోతున్నట్టుగా రాసి ఉందని తెలిసింది. ఈమధ్యే పిల్లల స్కూలు కూడా మార్చినట్టు బంధువులు తెలిపారు.

Prakash Raj Counter To Pawan Kalyan4
తమిళులపై కామెంట్స్‌.. పవన్‌కు ప్రకాష్‌రాజ్‌ కౌంటర్‌

చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కౌంటరిచ్చారు నటుడు ప్రకాష్‌ రాజ్‌. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.నటుడు ప్రకాష్‌రాజ్‌ ట్విట్టర్‌ వేదికగా..‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please..’ అంటూ కామెంట్స్‌ చేశారు."మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please... 🙏🏿🙏🏿🙏🏿 #justasking— Prakash Raj (@prakashraaj) March 14, 2025ఇక, అంతకుముందు.. పవన్‌ కల్యాణ​ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్‌ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్‌ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరినప్పుడు నేను వివక్ష అనుభవించాను. గోల్టీ గోల్టీ అని నన్ను అవమానించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జాతీయ విద్యావిధానంపై తమిళనాడు, కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూపాయి సింబల్‌ను తొలగించారు. ఆ స్థానంలో తమిళనాడులో ‘రూ’ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. కాగా మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్టుగా చేర్చడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఇప్పటికే సీఎం స్టాలిన్‌ దీనిపై స్పందించారు. ‘తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొందరు మమ్మల్ని అడుగుతున్నారు. కానీ, ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో చెప్పడం లేదు. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు.

Man Attacks on Devotees at Golden Temple Five Injured5
స్వర్ణ దేవాలయంలో భక్తులపై దాడి.. ఐదుగురికి గాయాలు

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల స్వర్ణదేవాలయం(Golden Temple)లో దారుణం చోటుచేసుకుంది. ఆలయానికి వచ్చిన భక్తులపై ఒక వ్యక్తి ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు ఆలయ సిబ్బందితో పాటు ముగ్గురు భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు, భక్తులు ఉలిక్కిపడ్డారు.శిరోమణి గురుద్వారా కమిటీ(Shiromani Gurdwara Committee) ప్రతినిధి ప్రతాప్‌ సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం ఆలయంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని సిబ్బంది ప్రశ్నించగానే అతను దాడికి పాల్పడ్డాడు. ఆలయ సిబ్బందితో పాటు అక్కడున్న భక్తులపై రాడ్‌తో దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వ్యక్తి హర్యానాకు చెందినవాడని, ఈ ఘటన అనంతరం ఆలయ సిబ్బంది అతనిని పట్టుకుని తమకు అప్పగించారన్నారు. గాయపడిన భక్తులు మోహాలీ, బఠిండా, పటియాలా నుంచి వచ్చినవారని తెలిపారు. గాయపడినవారందరినీ గురు రామ్‌దాస్‌ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు వచ్చిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది కోరుతున్నారు.పోలీస్‌ కమిషనర్‌ గురుప్రీత్‌ సింగ్‌ భుల్లార్‌ మీడియాతో మాట్లాడుతూ దర్బార్‌ సాహిబ్‌ కాంప్లెక్స్‌(Darbar Sahib Complex)లోని రెండవ అంతస్థులో అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని ఆలయంలో పనిచేస్తున్న జస్బీర్‌ సింగ్‌ గుర్తించి, కిందకు రమ్మని కోరగా, అందుకు అతను నిరాకరించాడన్నారు. దీంతో జస్బీర్‌ సింగ్‌ రెండవ అంతస్థుకు వెళ్లి అతనిని కిందకు దిగాలని కోరారు. అయితే అతను వెంటనే ఒక రాడ్‌తో జస్బీర్‌ సింగ్‌పై దాడి చేశాడు. దీనిని చూసిన ఇతర సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో వారు కూడా గాయపడ్డారు. నిందితుడిని జుల్ఫాన్‌గా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని గురుప్రీత్ సింగ్‌ తెలిపారు.ఇది కూడా చదవండి: West Bengal: హోలీ వేళ యువకుని హత్య

Rasi Phalalu: Daily Horoscope On 15-03-2025 In Telugu6
ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం.. శుభవార్తలు వింటారు

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.పాడ్యమి ప.1.02 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: ఉత్తర ఉ.7.48 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: సా.5.02 నుండి 6.46 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.18 నుండి 7.47 వరకు, అమృతఘడియలు: రా.3.29 నుండి 5.15 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.13, సూర్యాస్తమయం: 6.06.మేషం: పనులలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.వృషభం: ఆర్థిక విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. ధన్యయం.కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.సింహం: వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు.తుల: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.వృశ్చికం: కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.ధనుస్సు: ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగప్రాప్తి. భూలాభాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.మకరం: కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమకు ఫలితం కనిపించదు. నిరుద్యోగుల యత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. ఆలయ దర్శనాలు.కుంభం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.మీనం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

Top Director Insulted Comments On Nayanthara7
మోడ్రన్‌ డ్రెస్‌లో నయనతార.. తొలిరోజే అవమానం

సినిమా అనేది కలల ప్రపంచం. రంగులరాట్నం లాంటి ఈ ప్రపంచంలో అందలం ఎక్కడమే కాదు, అవమానాలు, ఆవేదనలు ఎదురవుతుంటాయి. అన్నీ ఎదురొడ్డి నిలబడగల శక్తి ,పట్టుదల, శ్రమ, కృషి ఉంటేనే ఉన్నత స్థాయికి ఎదగగలరు. ఇందుకు చిన్న ఉదాహరణ నయనతార. దక్షిణాదిలోనే అగ్ర కథానాయకిగా వెలిగిపోతున్న నటి ఈమె. అంతేకాకుండా, నిర్మాతగా, వ్యాపారవేత్తగానూ రాణిస్తున్న నయన జీవితం తెరిచిన పుస్తకం అని తనే చాలా ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. అయితే ఆమె జీవితంలోనూ కొన్ని చేదు అనుభవాలతో కూడిన పేజీలు ఉన్నాయి. కేరళలోని ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన నయనతార అసలు పేరు డయానా కురియన్‌ అని తెలిసిందే. . అయితే ఆమె, ఈ స్థాయికి చేరుకునేందుకు పడ్డ శ్రమ, అవమానాలు, ఆవేదనలు చాలానే ఉన్నాయి. నటనపై ఆసక్తితో ఈ రంగానికి వచ్చిన నయనతారకు కోలీవుడ్‌లో ముందుగా అవకాశం కల్పించింది నటుడు, దర్శకుడు పార్థిబన్‌. అయితే చెప్పిన సమయానికి నయన రాకపోవడంతో తిరిగి పంపించేసినట్లు పార్థిబన్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నయనతార కథానాయకిగా నటించిన తొలి తమిళ చిత్రం అయ్యా. అయితే ఈ చిత్ర షూటింగ్‌ తొలి రోజునే నయన దర్శకుడు హరి ఆగ్రహానికి గురయ్యారు. తొలి రోజున మోడ్రన్‌ దుస్తుల్లో గ్లామర్‌గా షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిన ఆమెను చూసి దర్శకుడు టెన్సన్‌ పడ్డారు. ఈమెను ఇక్కడ నుంచి వెంటనే బయటకు పంపించేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి నయనతార పనికి రాదు అని అన్నారు. సాయంతం వేరే డ్రస్‌ మార్చి చూద్దాం అని చెప్పారట. ఈ విషయాన్ని ఆ చిత్ర కథానాయకుడు శరత్‌కుమార్‌ ఇటీవల ఒక వేదికపై చెప్పారు. ఆ తరువాత తన పాత్రకు తగ్గట్టుగా వేషధారణను మార్చుకుని అయ్యా చిత్రంలో నటింపజేశారట. అయితే ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడం, ఆ తరువాత రజనీకాంత్‌కు జంటగా చంద్రముఖి చిత్రంలో నటించే అవకాశం వరించడం వంటివి జరగడంతో నయన అగ్ర కథానాయకిగా ఎదిగారు. ప్రేమ వ్యవహారంలో నయనతార చాలా ఆటుపోట్లను ఎదుర్కొన్నారని చెప్పక తప్పదు. ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలతో జీవితాన్ని సుఖమయం చేసుకున్నారు.

Mumbai Indians face Delhi Capitals in WPL 2025 final today8
ఢిల్లీ ఈ సారైనా సాధించేనా!

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో 17 సీజన్ల పాటు ఆడినా ఢిల్లీ జట్టు టైటిల్‌ గెలవలేకపోయింది. అదే యాజమాన్యానికి చెందిన మహిళల జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో వరుసగా రెండు సీజన్ల పాటు నిరాశపర్చింది. 2023, 2024 సీజన్లలో గ్రూప్‌ దశలో టాపర్‌గా నిలవడంతో ఫైనల్‌కు చేరిన క్యాపిటల్స్‌ రెండుసార్లూ ఫైనల్‌ మ్యాచ్‌లలో ఓడి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇప్పుడు తాజా సీజన్‌లో కూడా టాపర్‌గా ఫైనల్‌ చేరిన టీమ్‌ మరోసారి ట్రోఫీ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేడు జరిగే ఫైనల్లో 2023 చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడుతుంది. తాజా సీజన్‌ లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ ఢిల్లీనే నెగ్గి 2–0తో ఆధిక్యం ఉంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ కెప్టెన్ గా ఉన్న మెగ్‌ లానింగ్‌ గత ఏడాది ఢిల్లీకి టైటిల్‌ అందించడంలో విఫలమైంది. ఈసారి అది పునరావృతం కాకుండా సత్తా చాటాలని ఆమె పట్టుదలగా ఉంది. సీజన్‌లో ఏకంగా 157.89 స్ట్రయిక్‌ రేట్‌తో 300 పరుగులు చేసిన షఫాలీ వర్మ మరోసారి టీమ్‌కు కీలకం కానుంది.మెగ్‌ లానింగ్‌ కూడా 263 పరుగులతో టీమ్‌ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. జెమీమా రోడ్రిగ్స్‌ మాత్రం ఆశించినంత మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. ఫైనల్లోనైనా ఆమె రాణించాల్సి ఉంది. ఆల్‌రౌండర్‌గా జెస్‌ జొనాసెన్‌ టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబర్చింది. 137 పరుగులతో పాటు 11 వికెట్లు తీసిన ఆమెకు శిఖా పాండే (11) అండగా నిలిచింది. వీరిద్దరితో పాటు అనాబెల్‌ సదర్లాండ్‌ తమ బౌలింగ్‌తో ప్రత్యరి్థని కట్టడి చేయగలరు. దూకుడైన బ్యాటింగే ముంబై ప్రధాన బలం. నాట్‌ సివర్‌ 156.50 స్ట్రయిక్‌రేట్‌తో 5 అర్ధసెంచరీలు సహా 493 పరుగులు సాధించి అగ్ర స్థానంలో ఉంది. హేలీ మాథ్యూస్‌ (304) కూడా దూకుడైన ఆటకు మారు పేరు. కెపె్టన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా 156.29 స్ట్రయిక్‌ రేట్‌తో 236 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించింది. బౌలింగ్‌లో హేలీ, అమెలియా కెర్‌ కలిసి 33 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. సమష్టిగా సత్తా చాటడంతో ముంబై జట్టుదే పైచేయి. ఈ నేపథ్యంలో అంతిమ విజేత ఎవరు అవుతారనేది చూడాలి.

Digital ad industry estimated to cross Rs 62000 crore by 20259
డిజిటల్‌ జోరు..!

కొన్నాళ్ల క్రితం వరకు ప్రకటనలంటే పత్రికలు, టీవీలు, రేడియోల్లాంటి సాంప్రదాయ మాధ్యమాలకే పరిమితమయ్యేవి. ఇంటర్నెట్‌ వాడకం పెరిగిన తర్వాత నెమ్మదిగా డిజిటల్‌ వైపు మళ్లడం మొదలైంది. ఇక అందరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తుండటం, డేటా చౌకగా లభిస్తుండటంలాంటి అంశాల కారణంగా ఇది మరింతగా జోరందుకుంది. ఎంత లా అంటే .. అడ్వర్టైజింగ్‌ సంస్థలు తమ బడ్జెట్‌లో దాదాపు సగభాగాన్ని డిజిటల్‌కే కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆఖరు నాటికి దేశీయంగా డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌ విభాగం, సాంప్రదాయ మాధ్యమాలకు మించి ఏకంగా రూ. 62 వేల కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అడ్వర్టైజింగ్‌ పరిశ్రమలో డిజిటల్‌ మీడియా చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. నగరాలు మొదలుకుని గ్రామాల వరకు ఇది అసాధారణ స్థాయిలో విస్తరిస్తోంది. దీంతో డిజిటల్‌ యూజర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. సాం ప్రదాయ మీడియాని మించి డిజిటల్‌పై భారీగా వెచ్చిస్తున్నాయి. అంతర్జాతీయ అడ్వర్టైజింగ్‌ దిగ్గజం డెంట్సు నివేదిక ప్రకారం.. దేశీఅడ్వర్టైజింగ్‌ పరిశ్రమ ప్రస్తుతం రూ. 93,166 కోట్లుగా ఉంది. 2025 ఆఖరు నాటికి ఇది సుమారు మరో 10 శాతం పెరిగి రూ. 1,12,453 కోట్లకు చేరుతుందని అంచనా. 2022లోలో రూ. 40,685 కోట్లుగా ఉన్న డిజిటల్‌ విభాగం ఈ ఏడాది ఆఖరుకల్లా రూ. 62,045 కోట్లకు.. అంటే మొత్తం అడ్వర్టైజింగ్‌ బడ్జెట్లలో సగానికి పైగానే వాటా దక్కించుకునే అవకాశం ఉంది. గతేడాది విషయం తీసుకుంటే 44 శాతం వాటాతో డిజిటల్‌ అగ్రస్థానంలో ఉండగా, టీవీ 32 శాతం, ప్రింట్‌ మీడియా 20% వాటాతో తర్వాత స్థానాల్లో నిల్చాయి. ఏఐలాంటి టెక్నాలజీ ఊతంతో టార్గెట్‌ ఆడియన్స్‌ను సరిగ్గా చేరుకునే వెసులుబాటు ఉండటం డిజిటల్‌కి సానుకూలాంశంగా ఉంటోంది. టెలికం అత్యధిక కేటాయింపులు.. టెలికం రంగ సంస్థలు తమ మీడియా బడ్జెట్లలో 64 శాతం భాగాన్ని డిజిటల్‌కి కేటాయిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ సెగ్మెంట్‌ తమ బడ్జెట్లలో 94 శాతం భాగాన్ని డిజిటల్, టీవీ మాధ్యమాలకు కేటాయిస్తోంది. సాంప్రదాయ అడ్వర్టైజర్లే కాకుండా, డైరెక్ట్‌ టు కన్జూమర్‌ బ్రాండ్లు, స్టార్టప్‌లు మొదలైనవి ఎక్కువగా ఆన్‌లైన్‌ ప్రకటనలపైనే దృష్టి పెడుతున్నాయి. క్విక్‌–కామర్స్, ఈ–కామర్స్, విద్యా రంగ సంస్థల్లాంటివి మరింతగా కస్టమర్లకు చేరువయ్యేందుకు డిజిటల్‌ మాధ్యమాల మీదే ఆధారపడుతున్నాయి. షార్ట్‌ వీడియోలు, సోషల్‌ కామర్స్‌లపై ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల డిజిటల్‌ బడ్జెట్లూ ఎక్కువగానే ఉంటున్నాయి. దేశీయంగా డిజిటల్‌ విప్లవం ప్రజల జీవితాలు, పరిశ్రమలు, సమాజంలో పెను మార్పులు తీసుకొస్తోందని, కృత్రిమ మేథ కూడా ఇందుకు దోహదపడుతోందని డెంట్సు దక్షిణాసియా సీఈవో హర్ష రజ్దాన్‌ చెప్పారు. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవీయ కోణానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని, పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలకు పెద్ద పీట వేస్తూ పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సోషల్‌ మీడియా హవా...డిజిటల్‌ మీడియా కేటగిరీలో చూస్తే 30% వాటాతో (రూ. 11,962 కోట్లు) సోషల్‌ మీడియా అగ్రస్థానంలో ఉండగా, ఆన్‌లైన్‌ వీడియోలు 29%, పెయిడ్‌ సెర్చ్‌ 23% వాటా దక్కించుకున్నాయి. టెలికం కంపెనీలు తమ డిజిటల్‌ మీడియా బడ్జెట్లో 80% భాగాన్ని ఆన్‌లైన్‌ వీడియో, సోషల్‌ మీడియా, పెయిడ్‌ సెర్చ్‌లకు కేటాయిస్తున్నాయి. ఈ–కామర్స్‌ కంపెనీలైతే తమ మొత్తం మీడియా బడ్జెట్లో 61 శాతాన్ని డిజిటల్‌ మీడియాకు కేటాయిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ అదే తీరు.. తెలుగు రాష్ట్రాల్లోనూ డిజిటల్, సోషల్‌ మీడియా ప్రకటనలు జోరుగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వీటికి భారీగానే బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. రాజకీయేతర డిజిటల్‌ ప్రకటనల వ్యయాలపై నిర్దిష్ట డేటా లేకపోయినప్పటికీ గత కొన్నాళ్లుగా, చాలా వేగంగా వృద్ధి చెందుతోందని ఓటీఎస్‌ అడ్వర్టైజింగ్‌ అకౌంట్‌ డైరెక్టర్‌ సాయి సిద్ధార్థ్‌ నల్లూరి తెలిపారు. దక్షిణాదివ్యాప్తంగా 2020 నాటి నుంచి గణాంకాలు చూస్తే డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌ 30 శాతం వృద్ధి రేటు కనపర్చిందని చెప్పారు. విద్య తదితర రంగాలు డిజిటల్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని, ఈ సేవల కోసం స్పెషలైజ్డ్‌ ఏజెన్సీలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్‌ తర్వాత సాంప్రదాయ మీడియాపై ప్రకటనల వ్యయాలు తగ్గాయని వివరించారు. – సాక్షి, బిజినెస్‌డెస్క్‌

Chilli farmers lost by trusting the coalition government10
సర్కారు మోసం.. మిర్చి రైతు హాహా‘కారం’

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: మిరప రైతుల నెత్తిన టీడీపీ కూటమి ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టింది. మద్దతు ధర పేరిట ఊరించి ఊహల పల్లకిలో ఊరేగించి నిలుపునా ముంచేసింది. మద్దతు, మార్కెట్‌ ధరల మధ్య వ్యత్యాసానికితోడు రైతుల ఖాతాకు జమ చేస్తామని కొంతకాలం, బోనస్‌ ఇచ్చే ఆలోచన చేస్తున్నామంటూ మరికొంత కాలం నాన్చింది. ఇప్పుడు మార్కెట్‌లో ధరలు ఎగబాకిపోతున్నందున ఇక మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెబుతోంది. మరి నష్టానికి అమ్ముకుంటున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల నోరు పెగలడం లేదు. బోనస్‌ విషయంలో చేతులెత్తేశారు. తేజ రకం తప్ప మిగిలిన రకాలన్నీ నేటికీ మద్దతు ధర కంటే తక్కువగానే పలుకుతున్నాయి. అయినా సరే ధరలు ఎగబాకిపోతున్నాయంటూ అసెంబ్లీ సాక్షిగా మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడుతూ అబద్ధాలు వల్లె వేస్తున్నారు. విదేశాలకు ఎగుమతుల ఆర్డర్లు తగ్గడంతో పంట మార్కెట్‌కు వచ్చే సమయంలోనే ధరల పతనం మొదలైంది. మరో వైపు ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనతో మసాలా కంపెనీలు కూడా కొనుగోలు నిలిపివేశాయి. ఇదే విషయమై ఓ వైపు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రం హెచ్చరికలు చేసినా, మార్కెటింగ్‌ శాఖ ముందుగానే గుర్తించించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా రంగంలోకి దిగి మిర్చి యార్డుకు వెళ్లి మిరప రైతులకు బాసటగా నిలవడంతో కూటమి పెద్దలు నానా హంగామా చేశారు. చేతిలో ఉన్న మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి ఆదుకోవల్సింది పోయి కేంద్రానికి లేఖలు రాశామని, సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారని.. మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం దిగివచ్చేసిందంటూ ఊదరగొట్టారు. కేంద్రంపై భారం మోపి.. చేతులెత్తేశారు దిగుబడుల్లో కనీసం 30 శాతం (3 లక్షల టన్నులపైన) పంట సేకరిస్తే రూ.3,480 కోట్లు ఖర్చవుతుందని.. ఆ భారం కేంద్రమే భరించేలా ఒప్పిస్తామంటూ తొలుత రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. ఆ తర్వాత మార్కెట్‌ ధర, మద్దతు ధర మధ్య వ్యత్యాసంలో 50 శాతం (మిగతా 50 శాతం కేంద్రం) భరించేలా ఫిబ్రవరి మూడో వారంలో ఎకరాకు 5 క్వింటాళ్ల చొప్పున 25 శాతం (2.9 లక్షల టన్నులు) పంటకు రూ.846.15 కోట్లు, 50 శాతం (5.83 లక్షల టన్నులు) పంట కొనుగోలుకు రూ.1,692.31 కోట్లు, 75 శాతానికి (8.75 లక్షల టన్నులు) రూ.2,538.46 కోట్లు ఖర్చవుతుందని అధికారులు రెండోసారి ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. రూ.11,781 చొప్పున కేంద్రం కొంటుందంటూ కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని గొప్పగా ప్రకటించారు. అన్నీ తెలిసి దొంగ నాటకాలు సీఎం చంద్రబాబు మిర్చి రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులతో గత నెల 21న ఏర్పాటు చేసిన సమావేశంలో తమకు శుభవార్త చెబుతారని రైతులు ఎంతగానో ఆశగా ఎదురు చూశారు. 25 శాతానికి మించి కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితులు కన్పించడం లేదంటూ తేల్చి చెప్పేశారు. వాస్తవానికి మద్దతు ధర పెంచాలన్నా, 25 శాతానికి మించి కొనుగోలు చేయాలన్నా, కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేయాల్సిందే. నాటి భేటీలో వారం పది రోజుల్లో మరోసారి భేటీ అయ్యి తాము నిర్దేశించిన మద్దతు ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చేసి మూడు వారాలు దాటినా మళ్లీ ఆ ఊసెత్తడం లేదు. ధరలు పెరిగిపోయాయంటూ అబద్ధాలు మద్దతు–మార్కెట్‌ ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ హంగామా చేశారు. ఆ మేరకు యార్డులో మిర్చి విక్రయించిన రైతుల వివరాలను సేకరించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోంది. పైగా ఈ హడావుడి తర్వాత మార్కెట్‌లో ధరలు పెరిగిపోతున్నాయంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా పోటీపడి స్టేట్‌మెంట్లు ఇస్తూ సమస్యను నీరుగార్చేస్తున్నారు. వాస్తవానికి గురువారం మిర్చి యార్డులో తేజ రకానికి మాత్రమే గరిష్టంగా రూ.14 వేలు, కనిష్టంగా రూ.5,500 పలికింది. తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు ఎంతో కొంత బోనస్‌ ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు.ఈయన పేరు కన్నెబోయిన బాలసాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లి స్వగ్రామం. తనకున్న మూడెకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేశారు. ఎకరాకు రూ.1.75 లక్షలు ఖర్చయ్యింది. గతేడాది ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ ఏడాది తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో 15 క్వింటాళ్ల లోపే వచ్చింది. సగానికి పైగా తాలు. గత సీజన్‌లో క్వింటా రూ.23వేల నుంచి రూ.27 వేల మధ్య పలికిన తేజ రకం కాయలు నేడు రూ.11వేల నుంచి రూ.12 వేల మధ్య పలుకుతున్నాయి. తాలు రకానికి గత సీజన్‌లో క్వింటాకు రూ.17 వేలు ధర వస్తే ఈ ఏడాది రూ.5 వేలు కూడా దక్కలేదు. ‘గత నెల మొదటి వారంలో 40 బస్తాలు గుంటూరు యార్డుకు తీసుకొస్తే క్వింటాకు రూ.15 వేలు ధర వస్తే నేడు 50 బస్తాలు తెస్తే క్వింటా రూ.11 వేలు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ.11,781గా ప్రకటించిన తర్వాత ధరలు మరింత పతనమయ్యాయి. రైతులను పట్టించుకునే నాథుడే లేడు. మిర్చి పంట అమ్ముకోవాలంటే భయం వేస్తోంది. ఇళ్ల వద్ద కూలీలతోపాటు ఎరువులు, మందుల షాపుల వారు కాచుకుని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. క్వింటాకు రూ.20 వేలు ధర పలికితే పెట్టుబడి వస్తుంది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం’ అని బాలసాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాగు, దిగుబడి లెక్కలివి.. రాష్ట్రంలో 2023–24 సీజన్‌లో 6 లక్షల ఎకరాలకు పైగా మిరప సాగైంది. 14.50 లక్షల టన్నులకుపైగా దిగుబడులొచ్చాయి. అలాంటిది 2024–25లో వరుస వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్వాకంతో కేవలం 3.95 లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప సాగైంది. దిగుబడి 11 లక్షల టన్నులొస్తాయని అంచనా వేయగా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కన్పించడం లేదు. మరోపక్క గుంటూరు మార్కెట్‌ యార్డుకు ఈ ఏడాది 4.76 లక్షల టన్నులు మిరప వస్తుందని అంచనా వేయగా, జనవరిలో 61 వేల టన్నులు, ఫిబ్రవరిలో 1.10 లక్షల టన్నులు రాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 1.09 లక్షల టన్నులొచ్చాయి. ఈ నెలలో మరో లక్ష టన్నులు, ఏప్రిల్‌లో 65 వేల టన్నులు, మేలో 30 వేల టన్నులు మార్కెట్‌కు వస్తాయని అంచనా. ఈ దుస్థితి ఏనాడు లేదు దశాబ్దాలుగా మిర్చి పంటను పండిస్తున్నా. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. కాయలు కోత కోద్దామంటే కూలీలు వచ్చే పరిస్థితి లేదు. గత సీజన్‌లో కిలో ఎండు మిర్చి తీతకు రూ.10 ఇస్తే, ఈ ఏడాది రూ.25 ఉంది. గతేడాది తేజ రకం మిర్చి క్వింటా రూ.20 వేలకు పైగా అమ్మితే ఈ ఏడాది రూ.10 వేలకు మించి కొనడం లేదు. విచిత్రంగా మిర్చి ధర తగ్గి కూలీల ధర పెరగటం దారుణం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.11,781 దేనికీ సరిపోదు. – దొండపాటి అంజయ్య, అడిగొప్పుల, పల్నాడు జిల్లాఅప్పులే మిగిలాయి3 ఎకరాల్లో మిరపసాగుకు ఎకరాకు రూ.75 వేలకుపైగా పెట్టుబడి పెట్టా. వైరస్‌ సోకి ఎకరాకు 8 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. మార్కెట్‌లో ధర లేదు. చివరికి క్వింటా రూ.9 వేలకు అమ్ముకున్నా. కనీస పెట్టుబడి కూడా మిగల్లేదు. అప్పులు మాత్రమే మిగిలిపోయాయి. – అహ్మద్, కమాన్‌దొడ్డి, కొసిగి మండలం, కర్నూలు జిల్లా

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
నింగిలోకి ఫాల్కన్‌.. వెల్‌కమ్‌ బ్యాక్‌ సునీతా విలియమ్స్‌!

వాషింగ్టన్‌: అంతరిక్షంలో చిక్కుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్

title
మన ఏడు రెస్టారెంట్లు ఆసియాలో బెస్ట్‌...

ఉత్తమ హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లను గుర్తించడంలో ప్రసిద్ధి చెందిన సంస్థ ‘50 బెస్ట్‌’ఆవిష్కరించిన ఆసియా ఉత్తమ రెస్టారెం

title
గ్రీన్‌ కార్డు శాశ్వత నివాసానికి... హక్కు కాదు: వాన్స్‌

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: అమెరికా వలస విధానంపై ఇప్పటికే ప్రపంచ

title
అమెరికాలోనూ నో ట్యాక్స్‌..! ట్రంప్‌ భారీ పన్ను ప్రణాళిక

భారత్‌లో మాదిరిగానే అమెరికాలోనూ ఆదాయపు పన్నుకు సంబంధించి భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.

title
ఇంజిన్ పేల్చేశారు.. ట్రైన్ కిటికీలు పగలగొట్టారు..!

న్యూఢిల్లీ: పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బలోచిస్తాన్

National View all
title
స్వర్ణ దేవాలయంలో భక్తులపై దాడి.. ఐదుగురికి గాయాలు

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల స్వర్ణదేవాలయం(

title
West Bengal: హోలీ వేళ యువకుని హత్య

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌(West Bengal)లోని ఉత్తర 24 పరగణా జిల్లాలో హోలీ వేళ

title
తమిళులపై కామెంట్స్‌.. పవన్‌కు ప్రకాష్‌రాజ్‌ కౌంటర్‌

చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కౌంటరిచ

title
మన ఏడు రెస్టారెంట్లు ఆసియాలో బెస్ట్‌...

ఉత్తమ హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లను గుర్తించడంలో ప్రసిద్ధి చెందిన సంస్థ ‘50 బెస్ట్‌’ఆవిష్కరించిన ఆసియా ఉత్తమ రెస్టారెం

title
ప్రశాంతంగా ముగిసిన  హోలీ, రంజాన్‌ ప్రార్థనలు

న్యూఢిల్లీ: దేశమంతటా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి.

NRI View all
title
గ్రీన్‌కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్‌.. అమెరికా పౌరసత్వం కట్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసార

title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

title
సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా?

న్యూఢిల్లీ: కరీబియన్‌ దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు వి

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

Advertisement
Advertisement