Mahabubabad
-
సబ్‌స్టేషన్ బోరు పరుల పాలు..
హన్మకొండ: కొందరు అధికారుల తీరుతో టీజీ ఎన్పీడీసీఎల్ పరువు మసకబారుతోంది. నవ్విపోదురు కాక నాకేంటి అన్న చందంగా టీజీ ఎన్పీడీసీఎల్లో ఓ సీనియర్ అధికారి తీరు ఉంది. అక్రమాలు నియంత్రించాల్సిన సదరు అధికారి తానే దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు పాల్పడడంలో దిట్ట అయిన ఆ అధికారి చివరకు సబ్ స్టేషన్ బోరు నీటిని కూడా వదలడం లేదనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ముఖ్య ఇంజనీర్ నిర్వాకం సంస్థ పరువు తీసేలా ఉందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పంట పొలాలకు సబ్‌స్టేషన్ బోరు నీరు.. 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో సబ్ స్టేషన్, సి బ్బంది అవసరాల కోసం ఎన్పీడీసీఎల్ యాజమాన్యం బోరు తవ్వించి విద్యుత్ మోటారు బిగించింది. ఇదే విద్యుత్ స్టేషన్‌కు సమీపంలో టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ముఖ్య అధికారితో పాటు సమీప బంధువుల పంట పొలాలున్నాయి. ఈ పంట పొలాలకు ఈ ముఖ్య అధికారి తన అధికారంతో బోరు నీటిని అక్రమంగా వాడుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. సంస్థ నిధులతోనే బోరుకు మరమ్మతు.. టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం దేవోజీ తండాలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించింది. ఇదే సమయంలో సబ్ స్టేషన్, సిబ్బంది నీటి అవసరాల కోసం బోరు తవ్వించి మోటారు బిగించింది. ఈ బోరు నుంచి సదరు ముఖ్య అధికారి అక్రమంగా సాగు నీటి అవసరాలు తీర్చుకుంటున్నాడని విద్యుత్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా యథేచ్ఛగా జరుగుతున్న ఏ ఒక్కరూ నియంత్రించడం లేదని విద్యుత్ ఉద్యోగ వర్గాలు మొత్తుకుంటున్నాయి. బోరు మోటారు మరమ్మతుకు వస్తే బాగు చేయించే వరకు క్షేత్ర స్థాయి అధికారిని సదరు అధికారి తీవ్రంగా వేధించే వారనే ఆరోపణలున్నాయి. తన సొంత పొలానికి సాగు నీటిని వాడుకుంటూ మోటారు పాడైతే కూడా క్షేత్ర స్థాయి అధికారిని బెదిరించి సంస్థ నిధులతో బాగు చేయించి తన సాగు నీటి అవసరాలు తీర్చుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆరోపణలు కోకొల్లలు. దీనిపై యాజమాన్యం స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. దుర్వినియోగానికి పాల్పడుతున్న టీజీ ఎన్పీడీసీఎల్ అధికారి సాగు నీటి అవసరాలకు సబ్ స్టేషన్ బోరు వాడుకుంటున్న వైనం -
ములుగు కోర్టులో బాంబు కలకలం
ములుగు: ములుగు జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం సృష్టించింది. కోర్టు ప్రాంగణంలో 25 చిన్న ౖసైనెడ్ గ్యాస్ బాంబులను సోమవా రం పేల్చనున్నట్లు ఆదివారం జిల్లా కోర్టుకు మెయి ల్ చేశారు. తమిళ మంత్రి సెంథిల్ బాలాజీపై ఉన్న సీబీఐ కేసులను ఉపసంహరించుకోవాలని ఆ మె యిల్లో పేర్కొన్నారు. ఆదివారం సెలవుదినం కా వడంతో అధికారులు మెయిల్‌ను చూడలేదు. సోమవారం విధులకు హాజరైన కోర్టు అధికారులు మెయిల్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు జిల్లా కోర్టుకు చేరుకుని న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందిని సు రక్షిత ప్రాంతానికి తరలించి కోర్టు ప్రాంగణాన్ని త మ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీమ్‌తో కోర్టులోని ప్రతీ ప్రదేశాన్ని త నిఖీ చేశారు. ఇందులో బాంబు లభ్యంకాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మెయిల్ ఎ క్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? ఇది ఆకతాయిల పనా? లేక ఏదైనా కుట్ర ఉందా అనే కో ణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తె లంగాణలో పలు జిల్లా కోర్టులకు బెదిరింపుల కలకలం రేపగా, సోమవారం ములుగు జిల్లా కోర్టుకు కూడా అలాంటి హెచ్చరిక రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో కోర్టు పరిస రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. డాగ్ స్క్వా డ్, బాంబు డిస్పోజల్ టీమ్‌తో పోలీసుల తనిఖీలు లభ్యంకాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికార యంత్రాంగం -
కాంగ్రెస్‌ది ప్రజారంజక బడ్జెట్
స్టేషన్‌ఘన్‌పూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే చక్కటి బడ్జెట్ అని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ డివిజన్‌కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 3లక్షల 24వేల కోట్ల బడ్జెట్లో సబ్సిడీలు, పెన్షన్లు తదితర సేవలపై రూ.లక్ష ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఊబిలోకి నెట్టిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీల నేతలు కేవలం తమ ఉనికిని చాటుకునేందుకే బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారని, దీనిని ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే పేదల కోసం కొత్త పథకాలకు శ్రీకారం చుడుతుందని, రాష్ట్రంలో తెల్లరేషన్కార్డుదారులైన కోటి 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకాన్ని వర్తింపచేయనున్నట్లు తెలిపారు. దేవాదులకు రూ.వెయ్యి కోట్లు కోరుతా దేవాదుల పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరుతానని ఎమ్మెల్యే కడియం తెలిపారు. దేవాదుల పనులు పూర్తి చేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఒక్క ఘన్పూర్ నియోజకవర్గంలోనే లక్షా 24వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఏంఎసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, మార్కెట్, మున్సిపల్ వైస్చైర్మన్లు నూకల ఐలయ్య, నీల రాజమ్మగట్టయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు బెలిదె వెంకన్న, మంతెన ఇంద్రారెడ్డి, మందపురం అనిల్, ఇనుగాల వెంకటేశ్వర్‌రెడ్డి, బూర్ల శంకర్, కొంతం శ్రీను, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్లు దుంపల పద్మారెడ్డి, రాంరెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
పోలీస్ అని చెప్పి.. డబ్బు తస్కరణ
● వ్యక్తి అరెస్ట్, రిమాండ్ కురవి : పోలీస్ అని చెప్పి.. ఓ వ్యక్తి వద్ద నుంచి దౌర్జన్యంగా రూ.22, 300 తీసుకు న్న వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసినట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. ఎ స్సై కథనం ప్రకారం.. గత ఫిబ్రవరి 15వ తేదీన కురవి వీరభద్రస్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి జాతర జరుగుతోంది. మరిపెడ మండలానికి చెందిన పులిచింత శ్రీనివాస్.. మహిళల నృత్యం చూస్తున్నాడు. ఈ సమయంలో శ్రీనివాస్ వద్దకు కుర వి క్రైమ్ కానిస్టేబుల్ అని చెప్పుకుని ‘నువ్వు మహిళల వైపు అసభ్యకరంగా చూస్తున్నావ్.. అని నిన్ను అరెస్ట్ చేస్తున్న.. డబ్బులు ఇస్తే వదిలేస్తా లేనిపక్షంలో జైలుకు పంపిస్తా’ అని బెదిరించి అతడి దగ్గర రూ.18, 400 నగదును మహబూబాబాద్ మండలం గాంధీపురానికి చెందిన ఏర్పుల నాగరాజు తీసుకున్నాడు. అంతటి వదిలేయకుండా బాధితుడి ఫోన్‌పే ద్వారా రూ.3,900 ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు బాధితుడు శ్రీనివాస్‌కు అనుమానం వచ్చి కురవి పీఎస్‌లో క్రైమ్ కానిస్టేబుల్ నాగారాజు అనే వ్యక్తి ఉన్నాడా? అని వాకబు చేశాడు. ఎవరు లేరని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడి ఫోన్‌పే వివరాలు సేకరించి నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
మాజీ వీసీ లింగమూర్తి సేవలు చిరస్మరణీయం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ఎన్. లింగమూర్తి సేవలు చిరస్మరణీయమని, అనేక పరిపాలన పదవులు నిర్వర్తించి గొప్పపాలనాదక్షుడిగా పేరుగడించారని కేయూ వీసీ కె. ప్రతా ప్రెడ్డి అన్నారు. ఇటీవల మృతి చెందిన ప్రొఫెసర్ ఎన్. లింగమూర్తి యాదిసభను సోమవారం తెలంగాణ పూలే ఆశయసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సంగానిమల్లేశ్వర్ అధ్యక్షతన జర్నలిజం విభా గం సెమినార్‌హాల్‌లో నిర్వహించారు. ఈ సభలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తు తం యూనివర్సిటీలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల్లో లింగమూర్తి నియమించిన వారే 50శాతం మంది ఉండడం ఆయన పనితీరుకు గొప్ప నిదర్శనమన్నారు. ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ విద్యావేత్తగా, పరిపాలకుడిగా లింగమూర్తి ఆదర్శవంతమైన సేవలు అందించారని కొనియాడారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ మాజీ వీసీ ఇక్బాల్ అలీ, కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, కేయూ రిటైర్డ్ అధ్యాపకుల సంఘం జనరల్సెక్రటరీ వడ్డె రవీందర్, రిటైర్డ్ ప్రొఫెసర్లు గజ్జెల రామేశ్వరం,తౌటం శ్రీనివాస్, ఎం. సారంగపాణి, కేయూ పాలకమండలి సభ్యులు చిర్రరాజు, రమ, పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి చందామల్ల య్య, ఉపాధ్యక్షులు మెరుగు బాబుయాదవ్, జిల్లా అధ్యక్షుడు తాడూరి శాస్త్రి, కేయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు మాట్లాడారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి -
అనుమానాస్పద స్థితిలో రైతు మృతి
● వనపర్తిలో ఘటన లింగాలఘణపురం : ఓ రైతు వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వనపర్తిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దూరు మల్లయ్య (64) సోమవారం ఉద యం బావి వద్దకు వెళ్లి చెలుకలో గుంటుక తోలు తూ అక్కడే మృతి చెంది ఉన్నాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన మల్లయ్య మధ్యాహ్నం వరకు రాకపోవడంతో అతడి భార్య అండాలు ఫోన్ చేసింది. ఎత్తకపోవడంతో అనుమానంతో బావి వద్దకు వెళ్లి చూడగా గుంటుక వద్దే చెలుకలోనే మృతి చెంది కనిపించాడు. గెట్ల పంచాయితీలో ఎవరైనా చంపారా..? లేదా గుండెపోటు వచ్చిందా? ఎద్దు తన్నితే చనిపోయాడా అనే అనుమానం నెలకొంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రవణ్‌కుమార్ తెలిపారు. కల్తీ, కాలం చెల్లిన ఉత్పత్తులపై టాస్క్‌ఫోర్స్ కొరడా ● రూ.1,06,940 విలువైన ప్రొడక్ట్స్ స్వాధీనం గీసుకొండ: వరంగల్ గొర్రెకుంటకు చెందిన వెల్ మార్క్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లో గడువు దాటిన, పాడైన ఉన్న దాదాపు 16 రకాల రూ.1,06,940 వి లువైన ఉత్పత్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. టాస్స్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు సిబ్బందితో మార్క్ కంపెనీ నడుపుతున్న కింగ్ స్టన్‌కు చెందిన తయారీ, డిస్ట్రిబ్యూషన్ గోదాంలో దాడులు నిర్వహించారు. ఇందులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వివిధ రకాల స్వీట్లు, ఖారా, మురుకులు, లాలిపాప్స్, మ్యాంగో, ఫ్రూటీ, కాజా ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాశిబు గ్గకు చెందిన కంపెనీ ఓనర్ కింగ్ స్టన్తోపాటు సీజ్ చేసి ప్రాపర్టీని తదుపరి చర్యల నిమిత్తం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తికి అప్పగించారు. -
వేసవిలో ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ: వేసవిలో ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను అన్నారు. సోమవారం హనుమకొండలోని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజి యన్ కార్యాలయంలో వేసవిలో తీసుకోవాల్సిన జా గ్రత్తలపై నిర్వహించిన సమావేశంలో ఆర్ఎం మా ట్లాడారు. వేసవిలో వేడి గాలి నుంచి తల రక్షణ కోసం కాటన్ వస్త్రం తలపాగగా ధరించాలని, విధులకు వెళ్లినప్పుడు కనీసం 5 లీటర్ల తాగు నీటి క్యాన్ ను వెంట తీసుకెళ్లాలన్నారు. రాగి, జొన్న జావతో పాటు మజ్జిగ, కొబ్బరి నీరువంటి పానీయాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తీవ్ర దాహం, తల, కళ్లు తిరగడం, వాంతులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలన్నారు. సిబ్బంది ఆరోగ్యం బాగుంటేనే సంస్థ బాగుంటుందన్నా రు. అనంతరం డ్రైవర్లు, కండక్టర్లకు అందించే కరపత్రాలను ఆవిష్కరించారు. డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భానుకిరణ్, పి.మహేశ్, ఆర్టీసీ డిస్పెన్సరీ వైద్యాధికారి శృతి, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయ భాను -
విద్యుత్ సరఫరా మెరుగు
హన్మకొండ: డిజిటల్ టెక్నాలజీ, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఫీల్డ్ ఇన్నోవేషన్స్ వినియోగించి విద్యుత్ సరఫరా మెరుగుపరచడం, అంతరాయాలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న నేపథ్యంలో టీజీ ఎన్పీడీసీఎల్ అవార్డులు అందుకుంటుందని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఇటీవల న్యూ ఢిల్లీలో అందుకున్న అవార్డులను సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ సెక్రటరీ.. సీఎండీ, డైరెక్టర్లకు అందించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఆటోమేషన్ డిజిటల్ టెక్నాలజీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 12వ పీఎస్‌యూ ఎక్సలెన్స్ అవార్డు, ఇన్నోవేషన్ విభాగంలో ఇప్పా యి అవార్డు లభించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ నిరంతర పర్యవేక్షణ, మార్గదర్శకంలో ఈ అవార్డులు ఎన్పీడీసీఎల్కు రావడం గర్వంగా ఉందన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సి.ఈలు రాజుచౌహాన్, అశోక్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎం శ్రీనివాస్, డి.ఈలు అనిల్ కుమార్, భాస్కర్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
హుస్సేన్‌నాయక్‌కు మంద కృష్ణ పరామర్శ
గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మచ్చర్ల శివారు తార్యతండాకు చెందిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ తండ్రి లచ్చనాయక్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సోమవారం రాత్రి హుస్సేన్‌ను పరామర్శించారు. తొలుత లచ్చనాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఎడ్ల అశోక్‌రెడ్డి, చిలువేరు సమ్మయ్య గౌడ్, మేరెడ్డి సురేందర్, చెల్పూరు వెంకన్న, గుగ్గిళ్ల పీరయ్య మాదిగ పాల్గొన్నారు. -
సమ్మెకు సన్నద్ధం కావాలి
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు సమ్మెకు సన్నద్ధం కావాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సతీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్‌లోని పల్లా రవీందర్ రెడ్డి భవన్లో నిర్వహించిన ఆర్టిజన్, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల సమావేశంలో సతీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒకే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు వేర్వేరు సర్వీస్ రూల్స్ వర్తింపజేయడం సరికాదన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న వారికి ఒకే రకమైన సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలన్నారు. ఈ న్యాయమైన డిమాండ్ల సాధనకు దశల వారీగా ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 26, 30న అన్ని డివిజన్ కార్యాలయాల ఎదుట, ఏప్రిల్ 2న అన్ని సర్కిల్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదేనెల 7న ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్న నిర్వహించాలని, 8వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చంద్రారెడ్డి, కో–కన్వీనర్ చందర్ సింగ్, కోశాధికారి ప్రశాంత్, జాయింట్ సెక్రెటరీ వెంకన్న, ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్, ట్రాన్సో కో కన్వీనర్ వెంకటేష్, జేఏసీ నాయకులు రవీందర్, సృజన, భరత్, పాండు, సలీం పాషా, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సతీశ్ రెడ్డి -
‘వాహన్ పోర్టల్’ సేవలు షురూ!
ఖిలా వరంగల్ : వాహన వివరాలు ఇక నుంచి వాహన్ పోర్టల్‌లో కనిపించనున్నాయి. దేశవ్యాప్తంగా కొత్త వాహనాలు, లైసెన్సులు తదితర సేవలను వాహన్ పోర్టల్‌లో అందిస్తుండగా.. హైదరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా సోమవారం వాహన్ పోర్టల్ సేవలు అట్టహాసంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరంగల్ డీటీసీ సురేశ్‌రెడ్డి పర్యవేక్షణలో వాహన షోరూంలలో ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. గతంలోనే వాహన్ పోర్టల్‌పై షోరూంల యజమానులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. కాగా, వాహన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తయితే వాహన దారులకు మరిన్ని సౌకర్యాలు అందనున్నాయి. సేవలు అందేదిలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు రవాణాశాఖ సేవలు ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొ చ్చిన వాహన్ పోర్టల్ ద్వారా సేవలు అందనున్నాయి. ప్రధానంగా లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, వాహన బదిలీలు, ఎన్ఓసీలు, ఫిట్నెస్, పర్మిట్, బీమా, ఇంజిన్ ఛాసిస్ నంబర్వంటి సమాచారం ఈపోర్టల్ ద్వారా అందుతాయి. ఇక నుంచి పూర్తి పారదర్శకంగా సేవలు నమోదవుతాయి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా వాహన వివరాలు పరిశీలించే అవకాశం ఉంటుంది. వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించిన పక్షంలోనూ ఫీజు ఆన్లైన్లో చెల్లిస్తే కూర్చున్న చోట నుంచే తేలికగా ఆయా రాష్ట్రాలకు బదిలీ చేసుకునే అవకాశం దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతీ షోరూం సోమవారం ఈపోర్టల్కు అనుసంధానమైంది. తద్వారా ఏ రోజు విక్రయించిన వాహనాలు ఆ రోజే పోర్టల్‌లో నమోదవుతాయి. ఇదే క్రమంలో వాహనాల కొనుగోలుకు రుణం ఇచ్చే బ్యాంకులను అనుసంధానం చేశారు. ఈప్రక్రియతో బోగస్ ఫైనాన్స్ సంస్థల ఆటకు అడ్డుకట్ట వేసినట్లైంది. షోరూంల్లో పారదర్శకంగా సేవలు.. కొనుగోలు చేసిన వ్యక్తిగత వాహనాలన్నీ సోమవారం మధ్యాహ్నం వాహన షోరూంల్లో వాహన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అప్ డేట్ చేశారు. వాహన్ పోర్టల్ పూర్తి స్థాయిలో అమలుల్లోకి వచ్చింది. కొనుగోలు చేసిన చోట రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం లభించింది. జిల్లాలు ద్విచక్రవాహనాలు కార్లు / షోరూంలు జీపులు వరంగల్ 1,85,865 24,791 23 హనుమకొండ 2,16,234 48,513 26 జనగామ 61,036 8,537 12 జేఎస్ భూపాలపల్లి 95,681 11,258 7 ములుగు 4,433 3,767 2 మహబూబాబాద్ 1,23,103 9,096 17 ప్రారంభించిన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని షోరూంల్లో ఇకనుంచి లాంఛనంగా అమల్లోకి ఆర్టీఏ సేవలన్నీ ఆన్లైన్లోనే.. దేశవ్యాప్తంగా ఒకే విధానందేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వాహన్ పోర్టల్ సేవలు సోమవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దీంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాహన షోరూంల్లో వాహన్ పోర్టల్ సేవలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఇక నుంచి షోరూంల్లో వాహనదారులకు పారదర్శకంగా సేవలందుతాయి. ఎలాంటి జాప్యం ఉండదు. – సురేశ్‌రెడ్డి, డీటీసీ, వరంగల్ -
రికవరీలో రణం
అప్పు తిరిగి చెల్లించడంలో తీవ్ర జాప్యంస్త్రీనిధి రుణం..సాక్షి, మహబూబాబాద్: స్వయం సహాయక సంఘాల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం రుణాలు అందిస్తోంది. అయితే స్త్రీనిధి రుణాలు తీసుకున్న సంఘాలు తిరిగి సకాలంలో చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. కాగా, ఈ ఏడాది కొత్త రుణాల లక్ష్యాలను చేరుకోవడంలో పాత బకాయిలు కొరగాని కొయ్యగా మారాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రతీ నెల కిస్తీలు సక్రమంగా చెల్లించేలా చూడాల్సిన అధికారుల ఉదాసీనతే ఇందుకు కారణమని, దీంతో మొండి బకాయిలు పెరిగిపోతున్నాయని ఉన్నత అధికారులు అంటున్నారు. ఇచ్చిన రుణాలు ఇలా.. మహిళలు చేతి వృత్తులు, చిరు వ్యాపారాలు చేసుకునేందుకు, వ్యవసాయ పెట్టుబడులకు స్త్రీనిధి రుణాలు అందజేస్తారు. ఇందులో సువిధ, ప్రగతి, అక్షయ, సౌభాగ్య, ఐశ్వర్య పేరిట రుణాలు ఇస్తారు. ఇందులో వారి ఆర్థిక పరిస్థితి, పెట్టే యూనిట్ ఆధారంగా రూ. 50వేల నుంచి రూ. 5లక్షల వరకు రుణాలు ఇస్తారు. అయితే ఇందులో రూ. 50వేల లోపు రుణా లు 48గంటల్లో అందజేస్తారు. ఈ రుణాలకు ప్రతీ నెల కిస్తీల రూపంలో చెల్లించాలి. రికవరీలో జాప్యం.. వివిధ అవసరాల కోసం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో పలువురు మహిళలు జాప్యం చేస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 571 గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో 6,981 సంఘాలు, 32,473 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో గతంలో తీసుకున్న రుణాలు రూ.80కోట్లు ఉండగా ఇందులో రూ. 50కోట్లు వసూలు కాగా.. రూ. 30కోట్లు బకాయి పడ్డారు. ఇందులో రెగ్యులర్ బకాయిలు రూ. 20.905కోట్లు ఉండగా.. మొండి బకాయిలు మాత్రం రూ.10కోట్ల మేరకు ఉంటాయి. ఇందులో ప్రధానంగా మరిపెడ మండలంలో అ త్యధికంగా రూ.4.70కోట్లు, గూడూరు రూ.1.70కోట్లు, గార్ల రూ.1.20కోట్లు, బయ్యారం రూ. 2.22కోట్లు ఉండడం గమనార్హం. అదే విధంగా జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు, డోర్నకల్ మున్సిపాలిటీల పరిధిలో 81 ఎస్ఎల్ఎఫ్ల్లో 1040 సంఘాలు, అందులో 6,774 మంది సభ్యులు ఉన్నారు. వీరు తీసుకున్న రుణాల్లో మొత్తం రూ.15కోట్లకు గాను.. రూ.3కోట్ల మేరకు బకాయి పడ్డారు. ఇందులో రెగ్యులర్ రికవరీ రూ.1.88కోట్లు ఉంది. మిగిలిన రూ. 1.12కోట్లు మొండి బకాయి పడ్డారు. అధికారుల ఉదాసీనత.. రుణాల రికవరీలో కీలక పాత్ర పోషించాల్సిన అధికా రుల ఉదాసీనత వల్లే బకాయిలు పెరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గ్రామ స్థాయిలో సీఏలు, మండల స్థాయి సెర్ప్ అధికారులు, మున్సిపాలిటీల పరిధి లో మెప్మా, జిల్లా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహ రిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఆర్పీలు, సీఏలు మహిళల పేరిట రుణాలు తీసుకొని సొంత అవసరాలకు వాడుకోవడం, ఇందుకోసం అధికారులకు మామూళ్లు ముట్టచెబుతున్నట్లు ఫిర్యాదులు ఉ న్నాయి. దీంతో కొన్ని సంఘాలు సకాలంలో కిస్తీలు చెల్లించకపోయినా.. పట్టించుకోవడం లేదని, అందుకోసమే మొండి బకాయిలు పెరిగిపోతున్నాయని సీ్త్రని ధి అధికారులు చెబుతున్నారు. రికవరీ వేగవంతం చేస్తున్నాం..జిల్లాలో సీ్త్ర నిధి రుణాల బకాయిలు పేరుకుపోయిన మాట వాస్తవమే. సంఘాల సభ్యుల నుంచి సకాలంలో డబ్బులు రికవరీ చేయించడంలో కొందరు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.56కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు రూ.34కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చాం. రుణాలు చెల్లించడంలో బకాయి పడిన 2,600 సంఘాలకు నోటీసులు ఇచ్చాం. సకాలంలో రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని కోరుతున్నాం. మొండి బకాయిల కోసం రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నాం. –ఎస్.మధు, సీ్త్రనిధి జిల్లా బాధ్యులు● కొత్త రుణాల టార్గెట్‌కు బకాయిల అడ్డంకి.. అధికారుల ఉదాసీనతతో రికవరీలో వెనకడుగు పలు సంఘాలకు నోటీసులు జారీ చేసిన అధికారులు -
పరిహారం ఇస్తామని అగ్రిమెంట్ చేసుకోలేదు
దిగుబడి వస్తుందని, క్వింటాకు రూ.3500 చెల్లించి కొనుగోలు చేస్తామని చెప్పిన మాట వాస్తవమే. దిగుబడి రాకపోతే పరిహారం ఇస్తామని చెప్పలేదు. ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు. ఇచ్చిన విత్తనాలు వంద రోజుల పంట కాల పరిమితి ఉంటుంది. అందుకు తగినవిధంగా యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల దిగుబడి రాలేదు. – కత్తుల కుమార్, ఆర్గనైజర్ దిగుబడి వస్తుందని నమ్మించారు..దిగుబడి వస్తుందని నమ్మించారు. రెండు ఎకరాల్లో విత్తనాలు వేసిన దగ్గర నుంచి నీళ్లు పెట్టిన ప్రతీసారి మొక్కలు చనిపోతున్నాయి. విషయం చెబితే ఎన్నో రకాల మందులు పిచికారీ చేయించారు. అయినా ఫలితం లేదు. తీవ్రంగా నష్టం జరిగింది. కనీసం దున్నిన కూళ్లు కూడా వచ్చేలా లేవు. కంపెనీ వారు ఆదుకోవాలి. – వాసం పాపయ్య, రైతు● -
పెండింగ్ దరఖాస్తులపై దృష్టిపెట్టాలి
మహబూబాబాద్: ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్ వినతులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు ప్రజలకు జవాబు దారీతనంగా ఉండి సేవలందించాలన్నారు. ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. వసతి గృహాల్లో మెనూ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పా రు. కాగా, ప్రజావాణిలో 146 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కొన్ని వినతులు పరిశీలిస్తే.. ● మానుకోట మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామానికి చెందిన ఉప్పలయ్య తన భూమికి సంబంధించిన పాసుపుస్తకం ఇప్పించాలని వినతి అందజేశాడు. ● ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన ఆవుల పద్మ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని అధికారులు తెలపగానే.. ఉన్న ఇల్లు కూల్చివేసిన తర్వాత మంజూరు కాలేదని చెప్పారని, వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని వినతిలో కోరింది. ● మానుకోట మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన కె.వెంకటాద్రి 2023లో జరిగిన ప్రమాదంలో కుడి కాలు, చేయి కోల్పోవడం జరిగిందని, తనకు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని వినతిలో పేర్కొన్నాడు. వసతి గృహాల్లో మెనూ పాటించేలా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజావాణిలో 146 వినతులు -
ఫోన్ కూడా ఎత్తడం లేదు
విత్తనాలు ఇచ్చే ముందు ఎంతో తియ్యగా మాట్లాడి పంట దిగుబడి రావడం లేదని ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదు. రెండు ఎకరాల్లో రెండు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చేటట్లు లేదు. మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలి. – తాటి కొమ్మయ్య, రైతు కౌలు కూడా వచ్చేలా లేదుఎకరం చెలక నాలుగు వేలకు మునాబా(కౌలు)కు తీసుకుని ఆర్గనైజర్ మాటలు నమ్మి ఈజొన్న వేసిన. అసలు కంకులే రాలేదు. మొత్తం క్వింటా కూడా అయితయో కావో. మునాబా డబ్బులు, ఎరువులు, పురుగుమందులు, దున్నకం కూళ్లు అన్ని మీద పడుతున్నాయి. పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – బానోతు శారద, మహిళా రైతు ● -
‘బయ్యారం’ నీటిని విడుదల చేయాలి
డోర్నకల్: డోర్నకల్ మండలంలో వరి పంటలకు బయ్యారం చెరువు నుంచి నీటిని విడుదల చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎస్సారెస్పీ కాల్వల ఫీడర్ చానళ్లు, ఓటీలు సక్రమంగా లేకపోవడంతో చెరువులకు నీరుచేరని పరిస్థితి ఉందన్నారు. ఆకేరు, పాలేరు వాగుల చెక్‌డ్యామ్‌లు గతంలో వచ్చిన వరదలకు దెబ్బతిన్నాయని తెలిపారు. నియోజకవర్గంలో రైతులు సాగు చేసిన వరిపంటలు మరో ఇరువై రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్నాయని, ఒక తడి నీరు అవసరమన్నారు. దీనికి నీటిపారుదల శాఖమంత్రి స్పందించి బయ్యారం చెరువు నుంచి డోర్నకల్ ప్రాంతంలోని వాగులకు నీటిని వదలడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి నెహ్రూసెంటర్: రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులు వాణిజ్య పంటలు పండించాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు రాములునాయక్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాబునాయక్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వాణిజ్య పంటలు సాగు చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో క్షణికావేశంలో గడ్డిమందుతాగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తొందరపాటు నిర్ణయాలతో జీవితా లను ఆగం చేసుకోవద్దని సూచించారు. గడ్డిమందు నివారించాలని మంత్రులకు కలిసి కోరినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ సభ్యుల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. డీఏఓ సరిత, హార్టికల్చర్ అధికారి మరియన్న, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఎంఓ జగదీశ్వర్, ఏడీఏ శ్రీనివాసరావు ఉన్నారు. -
కలెక్టర్‌ను కలిసిన మాజీ మంత్రి సత్యవతి
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం పలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈసందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ఆకేరు, మున్నేరు వాగులు ఎండిపోయాయని ఉన్నతాధికారులతో మాట్లాడి ఎస్సారెస్పీ జలాలు వచ్చేలా చూడాలన్నారు. గతంలో ఎస్పారెస్పీ జలాలు విడుదల చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. పనులు చేసిన సర్పంచ్‌లకు బిల్లులు ఇప్పించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో మార్పుల వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది అందుబాటులో ఉండాలిగూడూరు: ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు 108 అంబులెన్స్ సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా మేనేజర్ బత్తిని మహేశ్‌గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో ఏజెన్సీ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు 108 అంబులెన్స్ వాహనాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందించిన సేవల వివరాలను పరిశీలించారు. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా వాహనంలో ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకో వాలని సూచించారు. అంబులెన్స్‌లో ఉన్న మందులు, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిబ్బంది హనుమంత్, ప్రశాంత్, లలిత, నాగరాజు, రామ్‌కుమార్ పాల్గొన్నారు. విద్యార్థుల ఇబ్బందులుడోర్నకల్: మున్సిపాలిటీలోని జెడ్పీహెచ్ఎస్ ఎదుట బురద రోడ్డుతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ ఎదుట డ్రెయినేజీ నిర్మాణం కోసం ఇరుపక్కలా రోడ్డును తవ్వారు. దీంతో భూమిలోని పైపులు పగిలి తాగునీటితో పాటు డ్రెయినేజీ మురుగునీరు రోడ్డుపైకి రావడంతో రోడ్డు బురదయమంగా మారింది. కాగా, పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు వస్తున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెచ్ఎం సోమయ్య సస్పెన్షన్ మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని మోడల్ యూపీఎస్ స్కూల్ హెచ్ఎం సోమయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వి.రాజేశ్వర్ సోమవారం తెలిపారు. సోమయ్యపై విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు, ఇతరుల నుంచి అందిన ఫిర్యాదు లేఖ ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల అడ్మిషన్లకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. అదేవిధంగా పాఠశాల స్కావెంజర్‌కు వేతనం అందించడంలో అవినీతి జరిగిందని రుజువైందని అన్నారు. దీంతో ఎంఈఓ నివేదిక ఆధారంగా సస్పెన్షన్ చేశామన్నారు. -
పారిశుద్ధ్య సమస్య పరిష్కరిస్తాం
మహబూబాబాద్: మానుకోట పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కరిస్తామని, ప్రజలు వాహనాల్లోనే చెత్త వేయాలని, రోడ్లపై వేయకూడదని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ అన్నారు. మున్సిపాలిటీలో పేరుకుపోయిన పారిశుద్ధ్య సమస్యలపై సోమవారం సాక్షి దినపత్రికలో ‘కొరవడిన పర్యవేక్షణ!’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి కమిషనర్ స్పందించారు. 11వ వార్డులో పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లను ఆదేశించారు. దీంతో శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ దగ్గరుండి కార్మికులతో ఏ క్యాబిన్ రోడ్డు వెంట పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేయించారు. భవానీగర్ తండాలో అసంపూర్తి కాల్వ వద్ద పరిసరాలను శుభ్రం చేయించారు.. పలు వార్డుల్లోనూ పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించారు. ఈమేరకు ఆయా ప్రాంతాల ప్రజలు సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా కమిషనర్ రాజేశ్వర్ మాట్లాడుతూ.. సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వాహనాల్లో చాలా వరకు తరచూ మరమ్మతులు రావడంతో సమస్యలు వస్తున్నాయన్నారు. పారిశుద్ధ్య సమస్యను పాలకమండలి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. కార్మికులు సక్రమంగా పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టరేట్ ఎదుట ధర్నా మహబూబాబాద్: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజ మౌళి, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి స్నేహబిందు డిమాండ్ చేశారు. సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ వ్యవస్థకు చట్టబద్ధత లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని ఎమ్మెల్యేలకు వినతులు ఇచ్చినా ఫలితం లేదన్నారు. చలో హైదరాబాద్‌కు పిలుపునివ్వగా అక్రమ అరెస్ట్‌లు చేశారన్నారు. కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. మే నెల మొత్తం సెలవులు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కుమ్మరికుంట్ల నాగన్న, దుర్గారావు, తిరుపతమ్మ, సులోచన, జ్యోతి, లలిత, ఉమా, సంధ్య, మల్లికాంబ పాల్గొన్నారు. -
అధిక ధర ఆశ చూపి.. నట్టేట ముంచి!
కొత్తగూడ: అధిక ధర ఆశ చూపి మొక్కజొన్న రైతులను నట్టేట ముంచారు. పాప్‌కార్న్ మొక్కజొన్న ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.. క్వింటాకు రూ.3500చెల్లించి తామే కొనుగోలు చేస్తామని సంబంధిత మొక్కజొన్న కంపెనీ ప్రతినిధులు నమ్మబలికారు. దీంతో కొంతమంది రైతులు సాగుకు ముందుకు వచ్చారు. మండలంలోని తాటివారివేంపల్లి, రౌతుగూడెం, సాదిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 50ఎకరాల్లో సాగు చేశారు. విత్తనాలు ఇచ్చిన వారి సలహాలు, సూచనల మేరకు రైతులు సాగు చేశారు. అయితే మొక్కజొన్న ఎదగకపోవడం, కంకులు వేయకపోవడంతో రైతులు ఆర్గనైసర్ కత్తుల కుమార్‌ను నిలదీశారు. ఆయన పలుమార్లు పొలాలు సందర్శించి వివిధ రకాల మందులు పిచికారీ చేయించారు. అయినా ఫలితం లేదని రైతులు తెలిపారు. ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్గనైజర్ మాయ మాటలు నమ్మి మోసపోయామని రైతులు అంటున్నారు. పొలం వద్దకు రావాలని, తాము నష్టపోయామని చెప్పేందుకు ప్రయత్నం చేస్తే ఫోన్ కూడా ఎత్తడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.ఎదుగుదల లేని పాప్‌కార్న్ మొక్కజొన్న ఆదుకోవాలని రైతుల వేడుకోలు -
కూసం రాజమౌళి సేవలు ఆదర్శం
గీసుకొండ: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి గంగదేవిపల్లి మాజీ సర్పంచ్, దివంగత కూసం రాజమౌళి సేవలు ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇటీవల మృతి చెందిన రాజమౌళికి బాలవికాస ఆధ్వర్యంలో ఆది వారం గంగదేవిపల్లిలో సంతాప సభ నిర్వహించా రు. ముందుగా రాజమౌళి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ గంగదేవిపల్లిలోని శిక్షణ కేంద్రానికి కూసం రాజమౌళి పేరు పెడతామని హామీ ఇచ్చా రు. అవసరమైతే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. రాజమౌళి సమాజం కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడని ఆమె ప్రశంసించారు. మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సర్పంచ్‌గా రాజమౌళి, తాను ఎమ్మెల్యేగా నేపాల్ వెళ్లానని గుర్తుచేసుకున్నారు. రాజమౌళి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ఉ న్న అన్ని గ్రామ పంచాయతీల గ్రామసభల్లో చర్చించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ రా జమౌళి అపారమైన సామాజిక స్పృహతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ఆయన చేపట్టిన అభివృద్ధి నమూనాను 90 దేశాల ప్రతి ని ధులు వచ్చి అధ్యయనం చేయడం గర్వకారణమని గుర్తు చేశారు. బాలవికాస డైరెక్టర్ సింగారెడ్డి శౌరెడ్డి మాట్లాడుతూ రాజమౌళి గ్రామానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఇంటిలో ఒక మొక్క నాటాలని అ న్నారు. గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ కూసం స్వరూప, వీఓఏల సంఘం ప్రతినిధులు మంత్రి సీతక్కకు వినతులు అందచేశారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎంపీఓ పాక శ్రీనివాస్, ఆర్ఐ సాంబయ్య, జీపీఓ జక్కుల రమ, ఎంసీపీఐ స్టేట్ కమిటీ మెంబర్ గోనె కుమారస్వామి, మాజీ సర్పంచ్ గోనె మల్లారెడ్డి, అధికార ప్రతినిధి చాడ కొమురరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, కూసం లింగయ్య, రాజమౌళి కుటుంబ సభ్యులు లలిత, రమేశ్,, ఈశ్వర్ పాల్గొన్నారు. సంతాప సభలో మంత్రి ధనసరి సీతక్క -
ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న కారు..
ఆత్మకూరు: కారు ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకా రం.. కాజీపేట సిద్దార్థనగర్‌కు చెందిన పర్రెపాటి రాకేశ్ (29) ఓ ఐటీఐ కళాశాలలో ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున మిత్రులతో కలిసి తన కారులో ములుగు వైపునకు వెళ్తున్నాడు. మార్గమధ్యలోని కటాక్షపూర్ సమీపంలో ఓ టిప్పర్‌ను అజాగ్రత్తగా పార్క్ చేశారు. పైగా లైట్లు కూడా వేయలేదు. దీంతో చీకట్లో టిప్పర్ కనిపించకపోవడంతో వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో కారు నడుపుతున్న రాకేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ముందు కూర్చున్న పత్రి వంశీకృష్ణకి తీవ్ర, వెనుక కూర్చున్న గంధం నాగశ్రావణ్ స్వల్పగాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న క్షతగాత్రుడు వంశీకృష్ణను 108లో నగరంలోని ఓ ఆస్పతికి తరలించారు. మృతుడి తల్లి పర్రెపాటి వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోష్ తెలిపారు. కాగా, హైవే163పై వాహనాలు పార్క్ చేయకుండా సంబంధింత అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. యువకుడి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు కటాక్షపూర్ సమీపంలో ఘటన -
కారుణ్య నియామక పత్రాలు అందజేత
కొత్తగూడ: ఐటీడీఎ పరిధిలో ఉద్యోగం చేస్తూ మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఆదివారం మండల కేంద్రంలోని ఐటీడీఎ గెస్ట్‌హౌస్‌లో కారుణ్య నియామక పత్రాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి కల్పనలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందన్నారు. కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలో తేజావత్ పద్మకు క్రీడా పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా, దయానారావు, చైతన్యకు ఆశ్రమ పాఠశాలలో వాచ్‌మెన్‌గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు చెప్పారు. ఇంకా చాలా మంది కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని, వారికి త్వరలోనే నియామక పత్రాలు అందజేసేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ తండ్రి వీరయ్య ఇటీవల మృతి చెందగా.. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, మండల నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ది మోసపూరిత బడ్జెట్
● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసపూరితంగా ఉందని, అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం నానా తంటాలు పడుతున్నారని, దానిలో పర్సంటేజీలు తీసుకొని బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ అంతా అంకెల గారడీగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల విషయంలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, రావుల రవిచందర్‌రెడ్డి, ముత్యం వెంకన్న, గుండా రాజశేఖర్, అశోక్, నాయిని రంజిత్‌రెడ్డి, నరేశ్, లక్ష్మణ్, రాము, సరోజ, పల్లా రాంచంద్రారెడ్డి, ఆదిల్, మహబూబ్ పాషా, తేళ్ల శ్రీనివాస్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఉద్యమకారుల స్మారక వారోత్సవాలు
కేయూ క్యాంపస్: భారత జాతీయ ఉద్యమకారులైన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతి సందర్భంగా ఈనెల 23నుంచి 30వ తేదీ వరకు స్మారక వారోత్సవాలను విద్యాసంస్థల్లో నిర్వహించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహా రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు కాకతీయ యూ నివర్సిటీ మొదటి గేట్ నుంచి రెండో గేట్ వరకు ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు బోయినపల్లి అజయ్, కేయూ నా యకులు వంశీ, అశోక్ నాయక్, అనిల్, వరుణ్, వీరన్న, మాన్సింగ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవిద్య కుటుంబానికి పరామర్శ
కేయూ క్యాంపస్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాకతీయ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ విద్యార్థిని శ్రీవిద్య కుటుంబ సభ్యులను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బానిగండ్లపల్లిలో కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు ఆదివారం పరామర్శించారు. తొలుత శ్రీవిద్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీవిద్య తల్లి మాట్లాడుతూ తన కుమార్తె మరణానికి కారకులైన వారిపై చర్య తీసుకోవాలని కోరారని కేయూ విద్యార్థి సంఘం నాయకుడు బొట్ల మనోహర్ తెలిపారు. శ్రీవిద్య కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కేయూలోని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు మంద భాస్కర్, కుమ్మరి శ్రీనాథ్, నవీన్, నాగరాజ్, లంక రాజ్‌గోపాల్, మాచర్ల శరత్చంద్ర, సోమేశ్, మట్టెడ కుమార్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
ఔట్సోర్సింగ్ వైపు అద్దెబస్సు డ్రైవర్లు!
హన్మకొండ: ఔట్సోర్సింగ్ డ్రైవర్ల నియామకాల్లో ఏజెన్సీలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉంది. ఏజెన్సీలు దళారులను నియమించుకుని అద్దెబస్సు డ్రైవర్లే లక్ష్యంగా వసూళ్ల దందా కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వసూళ్ల గుట్టు తెలిసినా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అధికారుల కనుసన్నల్లోనే ఔట్సోర్సింగ్ నియామకాల దందా కొనసాగుతోందని చర్చించుకుంటున్నారు. ఆయా డిపోల్లో కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటానికి పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్‌లో డ్రైవర్ ఉద్యోగం పర్మనెంట్ అవుతందని ఆశ చూపుతూ దళారుల ద్వారా ఔట్సోర్సింగ్ ఎజెన్సీలు లాక్కుంటున్నాయని అద్దె బస్సు యజమానులు మొత్తుకుంటున్నారు. తగ్గుతున్న డ్రైవర్ల అవసరం.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పర్యావరణ పరి రక్షణ పేరుతో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాయి. వాటిని విస్తరిస్తున్న క్రమంలో ఆర్టీసీలో డ్రైవర్ల అవసరం తగ్గుతోంది. ఈ క్రమంలో కొత్తగా డ్రైవర్ల నియామకాలు చేపట్టే అవకాశం లేదని, అలాంటప్పుడు పర్మనెంట్ పేరుతో తీసుకుంటున్న వారి పరిస్థితి ఏంటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. వరంగల్ రీజియన్‌లో ఇప్పటికే వరంగల్–2 డిపో 115 విద్యుత్ బస్సులతో జేబీఎం సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా వరంగల్ మహానగరానికి మరో 100 విద్యుత్ బస్సులు రానున్న క్రమంలో హనుమకొండ డిపోను కేటాయించడానికి యాజమాన్యం సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో కొత్తగా ఆర్టీసీ సొంతంగా రెగ్యులర్ డ్రైవర్ల నియామక ప్రక్రియ చేపట్టే అవకాశం ఏ మాత్రం లేదని సుస్పష్టం. మరోవైపు రాష్ట్ర రాజధానిలో సిటీ బస్సులుగా విద్యుత్ బస్సులు నడపనుండడంతో నగరంలోని ఆయా డిపోల్లోని డ్రైవర్లను ఇతర డిపోలకు సర్దుబాటు చేయనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏ రకంగా చూసినా డ్రైవర్ల రిక్రూట్మెంట్కు అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకుల అభిప్రాయం. రూ.50వేల వరకు వసూళ్లు! పర్మనెంట్ పేరుతో అద్దెబస్సు డ్రైవర్లను లాక్కుంటూ వారి నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేలకు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముందుగా డబ్బులు చెల్లించని వారి నుంచి తర్వాత ఇచ్చే జీతాల నుంచి రికవరీ చేసుకునేల ఒప్పందం చేసుకుంటున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో ఇప్పటికే 50 మంది అద్దెబస్సు డ్రైవర్లను ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు తీసుకోగా తాజాగా భూపాలపల్లి డిపో పరిధిలో నలుగురు, హనుమకొండలోని మూడు డిపోల నుంచి 36 మంది, తొర్రూరు డిపో పరిదిలో 8 మంది. పరకాల డిపో పరిఽధిలో నలుగురు, జనగామ డిపో పరిధిలో ఇద్దరు అద్దె బస్సు డ్రైవర్లను ఔ ట్సోర్సింగ్ ఏజెన్సీలు తీసుకుని ఆర్టీసీకి డ్రైవర్లుగా పంపనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని ఇతర రీజియన్లలో అద్దె బస్సు డ్రైవర్లను ఔట్సోర్సింగ్ డ్రైవర్లుగా తీసుకోవద్దని అక్కడి అఽధికారులు ఆదేశాలు జారీ చేశారని, అయితే వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ అధికారులు మాత్రం అద్దెబస్సు డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని ఔట్సోర్సింగ్ డ్రైవర్లుగా తీసుకోవడంలో ఉన్న ఆంతర్యమేమిటని అద్దెబస్సు యజమానులు ప్రశ్నిస్తున్నారు. అద్దెబస్సులు కూడా ఆర్టీసీకి సేవలందిస్తున్నాయని, ఈ క్రమంలో అద్దె బస్సు డ్రైవర్లను తీసుకుంటే అద్దె బస్సులు నిలిచిపోనున్నాయని, దీనికి ఆర్టీసీ అధికారులతే బాధ్యత అని అద్దె బస్సుల యజమానులు పేర్కొంటున్నారు. దళారులను నియమించి లాక్కుంటున్న ఏజెన్సీలు పర్మనెంట్ అవుతుందని ఆశ చూపుతూ వసూళ్లు ఆర్టీసీ డిపో అధికారుల చేతి వాటం? -
ఎంజీఎం రిటైర్డ్ ఆర్ఎంఓ రాజేశ్వర్‌రావు మృతి
వరంగల్ చౌరస్తా: ఎంజీఎం ఆస్పత్రి రిటైర్ట్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీరాం రాజేశ్వర్‌రావు (78) ఆదివారం ఉదయం వరంగల్ గిర్మాజీపేటలోని ఆయన నివాసంలో మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి తర్వాత గుండెనొప్పితో బాధపడుతుండగా ఆస్పత్రికి తరలించిన అనంతరం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ రాజేశ్వర్‌రావు ఎంజీఎంలో ఆర్ఎంఓగా పనిచేసిన కాలంలో ప్రశంసలు అందుకున్నారు. అలాగే, పేదలకు వైద్యసేవలు అందించి మంచి పేరు సంపాదించుకున్నారు. రాజేశ్వర్‌రావు మృతికి డీఎస్పీ కిరణ్‌కుమార్, పెద్ద ముప్పారం సర్పంచ్ భరత్, పెరిక సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు అచ్చ వినోద్‌కుమార్, హైకోర్టు న్యాయవాది పురుషోత్తమరెడ్డి, వరంగల్ న్యాయవాదులు మల్లికార్జున్, ధనుంజయ, డాక్టర్ పి.సాంబశివరావు, డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ అన్వర్‌పాషా, డాక్టర్ రంజిత్‌కుమార్, డాక్టర్ బందెల మోహన్‌రావు, డాక్టర్ సంగని మల్లేశ్వర్, కీత విజయ్‌కుమార్, శరత్‌కుమార్ సంతాపం తెలిపారు. -
ముగిసిన చదరంగం పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ పబ్లిక్‌గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి నాలుగో ర్యాంకింగ్ చదరంగం పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఆక్యుపంక్చర్ డాక్టర్ ఎన్.సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. చదరంగంలో మేధో సంపత్తి పెంపొందుతుందని, తల్లిదండ్రులు పిల్లలను చెస్‌లో ప్రోత్సహించాలని ఆయన సూచించారు. చెస్ టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి.కన్నా మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా 66 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, ప్రేమ్‌సాగర్, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సౌత్‌జోన్ పోటీలకు కేయూ జట్టుకేయూ క్యాంపస్: కొట్టాయంలోని ఎంజీ యూనివర్సిటీలో జరుగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. ఎం.త్రివేణి, బి.కావ్య, జి.ఐశ్వర్య, బి.మీనాక్షి, బి.నందిని, డి.సాయిప్రసన్న, పి.శ్రీలత, బి.రాహేలు, కె. శిరీష, డి.పూజిత, మహేశ్వరి, బి.సౌమ్య, జి.వెన్నెల, బి.నాగజ్యోతి, డి.వైష్ణవి, యు.సంజన జట్టులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జట్టుకు హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ కె.మధుకర్ కోచ్ కం మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ముస్త్యాలపల్లిలో యువతుల అదృశ్యం దామెర : ఇద్దరు యువతులు అదృశ్యమైన సంఘటన మండలంలోని ముస్యాలపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శాతరాశి శ్రీవాణి శనివారం సాయంత్రం 6 గంటలకు బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అలాగే, ఈనెల 20న సిలువేరు మిన్ను అదృశ్యమైంది. మిన్ను డీ ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా అనారోగ్యంతో మధ్యలోనే మానేసి ఇంటివద్దే ఉంటుంది. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో శ్రీవాణి తల్లి జయ, మిన్ను తండ్రి శంకర్ ఫిర్యాదుమేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 8712685228, 8712685020 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై సూచించారు. పిడుగుపాటుకు ఆవు మృత్యువాత దేవరుప్పుల : మండలంలోని రామరాజుపల్లిలో పి డుగుపాటుకు శనివారం రాత్రి ఉప్పునూతుల నాగరాజుకు చెందిన పాడి ఆవు మృత్యువాత పడింది. ఆదివారం ఉదయం రోజువారీగా తన వ్యవసాయ పొలం వద్ద ఆవును చూసేందుకు వెళ్లగా పిడుగుపాటుకు మృత్యువాత పడి కనిపించింది. ఘటనా స్థలి ని పశువైద్య సిబ్బంది పరిశీలించారు. కాగా, పశువు మృత్యువాత పడడంతో సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని, రైతును ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. -
కొరవడిన పర్యవేక్షణ!
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు సగానికిపైగా వాహనాలు మరమ్మతుల బారిన పడడంతో సమస్య తలెత్తుతోంది. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అలాగే దోమల సంఖ్య పెరిగి కంటి మీద కనుకులేకుండా పోతుందని, రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా మున్సిపల్ కమిషనర్ పనితీరుపై పలువురు కౌన్సి లర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలను కూడా కమిషనర్ పట్టించుకోవడం లేదు. ఇటీవల కార్యాలయం నిర్వహణ విషయంలో కలెక్టర్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లక్షకుపైగా జనాభా.. జిల్లాలోనే అతి పెద్ద మున్సిపాలిటీ మానుకోట. మన్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉన్నారు. కాగా విద్యా, వ్యాపారం, ఉద్యోగ రీత్యా నివాసం ఉండే వారితో కలిపితే లక్ష జనాభా దాటుతుంది. 12 ట్రాక్టర్లు, 19 నాలుగు చక్రాల ఆటోలు, 14 మూడు చక్రాల ఆటోలు ఉండగా వాటిలో సగానికిపైగా మరమ్మతుల బారిన పడ్డాయి. వాటితో పాటు రోడ్డు స్వీపింగ్ మిషన్, కాల్వలు శుభ్రం చేసే మిషన్లు మరమ్మతుల బారిన పడి తుప్పు పడుతున్నాయి. ప్రతీరోజు 33 టన్నుల చెత్తసేకరణ చేసి సిగ్నల్ కాలనీ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డు, గాంధీపురం శివారులోని చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. 143 మంది కార్మికులు.. మున్సిపాలిటీలో 36 వార్డులకు కేవలం 143 కార్మికులు ఉండగా వారిలో కొంత మంది హాజరు కాకపోవడంతో పాటు కొంత మంది కార్మికులు అధికారుల ఇళ్లలో పని చేస్తున్నారు. సిబ్బంది కొరత, వాహనాల మరమ్మతులతో కొన్ని వార్డుల్లో రోజు వాహనం రాకపోవడంతో ప్రజలు రోడ్లపై చెత్త వేస్తున్నారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. దోమలు, పందుల సంఖ్య పెరుగుతోంది. ఫాగింగ్ కూడా నామమాత్రంగా చేస్తున్నారు. కాల్వలు తీయడం మరిచారు.. చాలా కాలనీల్లో కాల్వలను శుభ్రం చేయడం లేదు. కాల్వలు చెత్తాచెదారంతో నిండాయి. దీంతో దుర్గంధం వెదజల్లుతోందని ఆయా ప్రాంతాల ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వల విషయంలో పలుమార్లు కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదని అంటున్నారు. కమిషనర్ తీరుపై అసంతృప్తి.. మున్సిపల్ కమిషనర్ కేవలం కార్యాలయానికే పరిమితమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సాయంత్రం సమయంలో మాత్రం ఎక్కడికి వెళ్లకుండా ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారులతో బిల్లులు, ఫైళ్లు ఇతరత్రా విషయాలపై మాట్లాడుతున్నారు. పర్సంటేజీ లెక్కలు చూసుకుంటున్నారే తప్ప..పారిశుద్ధ్యం, ఇతర సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో కార్మికులు కాలనీల్లో తూతూమంత్రంగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు ఈనెల 10న మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఆసమావేశంలో పారిశుద్ధ్యం, పందుల సమస్యపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ కమిషనర్‌ను ఆదేశించారు. పందుల పెంపకందారులతో సమావేశమై, పందులను పట్టణానికి దూరం ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ, నేటి వరకు పందుల పెంపకందారులతో సమావేశం పెట్టలేదు. కలెక్టర్ సీరియస్.. ఈనెల 11న కలెక్టర్ స్నేహ శబరీష్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయాన్ని ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉన్న ఫైళ్లు, బీరువాలు, చెత్తాచెదారం చూసి కలెక్టర్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, నేటికి కార్యాలయంలో నిర్వహణ పనులు చేయకపోవడంతో పాటు ఎక్కడి చెత్త అక్కడే ఉంది. కనీసం కార్యాలయంలో బూజు కూడా శుభ్రం చేయించడం లేదు. కమిషనర్‌ను బదిలీ చేస్తే మానుకోట మున్సిపాలిటీలో పాలన గాడిన పడుతుందని పలువురు కౌన్సిలర్లు, ప్రజలు విమర్శిస్తున్నారు. మానుకోట పట్టణంలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం అసంపూర్తి కాల్వలతో అపరిశుభ్రంగా పరిసరాలు కాలనీల్లో పందుల స్వైరవిహారం కమిషనర్ తీరుపై కౌన్సిలర్ల అసంతృప్తి -
రసాయన రహిత వ్యవసాయంతో మేలు
డోర్నకల్: రసాయన రహిత వ్యవసాయంతో అన్ని విధాలా మేలు జరుగుతుందని డీఏఓ బి.సరిత అన్నారు. మండలంలోని చిలుకోడు, గొల్లచర్ల, అమ్మపాలెం రైతు వేదికలతో పాటు సీరోలు మండలం మన్నెగూడెం రైతు వేదికలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న రైతు మహోత్సవ కార్యక్రమం, ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని టీవీ ద్వారా రైతులు, అధికారులు తిలకించారు. అనంతరం రైతులతో శాస్త్రవేత్తల ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించి వివిధ పంటల్లో యాజమాన్య పద్ధతులు, భూసార పరీక్షల ప్రాధాన్యం, పంట మార్పిడి విశిష్టత గురించి రైతులకు అవగాహన కల్పించారు. డీఏఓ మాట్లాడుతూ.. పూర్వపు వ్యవసాయ పద్ధతులు లాభదాయకమని, రసాయన రహిత వ్యవసాయంతో మేలు జరుగుతుందని తెలిపారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్‌రెడ్డి, ఏడీఏ విజయచంద్ర, కేవీకే శాస్త్రవేత్త క్రాంతికుమార్, ఏఓలు అనిల్‌కుమార్, చాయారాజ్, ఏఈఓలు అవినాష్, పవన్, చరణ్, ఎర్ర కర్ణ, భరత్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. -
సమయం లేదు మిత్రమా..
మహబూబాబాద్: పన్నుల వసూళ్లలో జిల్లా వెనుకబడింది. గత ఆర్థిక సంవత్సరం 93శాతం వసూలు కాగా.. ప్రస్తుతం ఇప్పటి వరకు 63శాతం వసూలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో 9రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా.. వందశాతం వసూలు చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. మల్టీపర్పస్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు పన్నులు వసూళ్లు చేస్తున్నారు. అయితే పూర్తి బాధ్యత పంచాయతీ కార్యదర్శులపైనే ఉంది. 18 మండలాలు.. 482 జీపీలు.. జిల్లాలో 18 మండలాల్లో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా, జిల్లాలో 1,687మంది మల్టీపర్పస్ వర్కర్లు ఉండగా వారితో పాటు బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం 2024– 25లో ఇంటి పన్నుల డిమాండ్ 4,94,36,938 ఉండగా.. రూ.4,59,95,402 వసూలు చేశా రు. 93శాతం వసూలు చేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. 63 శాతం మాత్రమే.. జిల్లాలో ఈనెల 20వ తేదీ వరకు రూ.4,90,14,538 డిమాండ్‌కు కేవలం రూ.3,09,92,606 వసూలు చేసి 63శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తొమ్మిది రోజుల్లో పన్నులు వసూలు అవుతాయని చెబుతున్నారు. అయితే వందశాతం మాత్రం పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. కనీస గత ఆర్థిక సంవత్సరం వసూలైన 93 శాతం కూడా దాటే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు 63శాతమే పన్నుల వసూలు మరో 9రోజులు మాత్రమే గడువు గత ఆర్థిక సంవత్సరంలో 93శాతం పన్నుల సేకరణ పన్నుల వసూళ్ల వివరాలు ఇలా.. మండలం జీపీలు డిమాండ్ వసూలు గంగారం 12 5,88,227 5,30,744 మానుకోట 41 26,616,08 22,858,73 చిన్నగూడూరు 11 7,76,235 6,24,065 డోర్నకల్ 26 12,374,67 9,66,328 నెల్లికుదురు 31 35,326,00 25,456,18 పెద్దవంగర 26 18,445,73 12,660,01 ఇనుగుర్తి 13 14,380,17 9,55,646 తొర్రూరు 31 34,270,92 22,140,76 సీరోలు 18 16,156,05 10,159,36 గార్ల 20 59,982,95 36,797,98 కొత్తగూడ 24 20,346,67 12,470,50 బయ్యారం 29 50,145,81 30,265,81 నర్సింహులపేట 23 21,985,90 13,219,50 మరిపెడ 48 21,338,01 12,719,78 కేసముద్రం 29 28,628,41 16,868,13 దంతాలపల్లి 18 19,594,05 11,082,17 గూడూరు 41 47,353,13 25,808,70 కురవి 41 49,556,21 26,650,62 మొత్తం 482 4,90,14,538 3,09,92,606 -
ఇంటర్మీడియట్ దశ కీలకం
హన్మకొండ : విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ కీలకమని ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ సీఈఓ ఇరుకుళ్ల మునీందర్ అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ‘ఫిజిక్స్ వాలా’ ఆధ్వర్యంలో జేఈఈ, నీట్‌పై విద్యార్థులు, తల్లిదండ్రుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఫర్ఫెక్ట్ ఫౌండేషన్ కోచింగ్‌తోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండేళ్ల ఐఐటీ, జేఈఈ కోచింగ్ ఇస్తున్నామన్నారు. ఈ దశలో రెండు సంవత్సరాలు తమ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే అద్భుత ఫలితాలు సాధించొచ్చని చెప్పారు. వివిధ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఐఐటీ, నీట్లో లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇస్తామన్నారు. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న విద్యా సంస్థ ‘ఫిజిక్స్ వాలా’ ను హనుమకొండలో ఆఫ్‌లైన్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ రామన్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా విద్యావ్యవస్థలో ఎన్నో వేల మంది సాధారణ విద్యార్థులు ఐఐటీ, నీట్‌లలో ఉత్తమ ర్యాంకులు సాధించేలా ప్రోగ్రాం రూపొందించి అద్భుత ఫలితాలు సాధించామన్నారు. సదస్సులో ‘ఫిజిక్స్ వాలా’ అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ సీఈఓ మునీందర్ -
ఉద్యమకారుడికి ఆర్థికసాయం
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కోట ప్రవీణ్ కిడ్నీలు పాడైపోయి చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయం ‘ఆపన్న హస్తం అందించరూ’ అనే శీర్శికతో శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి పలువురు దాతలు స్పందించారు. ఆదివారం వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ప్రవీణ్‌ను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా చికిత్స నిమిత్తం రూ. 10 వేలు అందించినట్లు మాజీ ఎమ్మెల్యే పీఏ హరికృష్ణ తెలిపారు. అలాగే, 16వ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు సుంకరి శివ రూ. 3 వేలు, ఏనుమాముల మార్కెట్ మాజీ చెర్మన్ చింతం సదానందం రూ. 2 వేలు, గజ్జి రాజు రూ. 2 వేలతోపాటు పలువురు తమకు తోచిన సాయం అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. -
దళిత యువతకు దన్ను..
న్యూశాయంపేట : దళిత నిరుద్యోగ యువత తమ కాళ్లపై నిలబడేలా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలు అందించి వారి స్వయం ఉపాధికి బాటలు వేయనుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం పడకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆటోలు, సోలార్ కంట్రోల్ పంపు యూనిట్ల పంపిణీ చేయనుంది. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా రవాణా రంగంలో రాణించేలా ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశం. ముఖ్యంగా డెలివరీ బాయ్స్‌గా స్విగ్గీ, జొమాటో వంటి పేరొందిన సంస్థల్లో గిగ్ వర్కర్లగా పనిచేసే వారికి ఈవీ వెహికిళ్లు వరంగా మారనున్నాయి. దీంతో పాటు వ్యవసాయ అవసరాలకు సోలార్ కంట్రోల్ పంపు యూనిట్స్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ రంగంలో ఎస్సీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్యావరణ హితం.. ఆర్థిక భరోసాయే పథకం ఉద్దేశం పెట్రోల్‌తో పోలిస్తే ఈవీ స్కూటర్లు, ఆటోల మె యింటెనెన్స్ చాలా తక్కువ. దీనివల్ల లబ్ధిదారులకు రోజువారీ ఆదాయం మెరుగు పడుతుంది. కాలుష్య రహిత సమాజం కోసం ప్రభుత్వం ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తోంది. సోలార్ పంపుసెట్లతో పొలాల్లో వెలుగులు, నిరుద్యోగ యువతకు చేతినిండా పనికల్పించాలనే ఉద్దేశంతో భారీ రాయితీతో కూడిన కంట్రోల్ యూనిట్లు అందించి ఆర్థిక భరోసా కల్పించాలని సర్కారు నిర్ణయించింది. సబ్సిడీతో కూడిన రుణాలు స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లతో పాటు టువీలర్‌పై చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి 90 శాతం సబ్సిడీ, 10 శాతం లబ్ధిదారుడి వాటాతో రూ.లక్ష విలువైన ఈవీ స్కూటర్‌ను అందించనుంది. అలా గే, ఎలక్ట్రిక్ ఆటో ప్యా సింజర్ గూడ్స్ వాహనాల విలువ ఒక్కొక్కటి రూ.3 లక్షలు కాగా 70 శాతం రాయితీ అందించనుంది. మిగతా 30 శాతం లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. సోలార్ పంపు కంట్రో ల్ యూనిట్ ఒక్కొక్కటి రూ.3 లక్ష ల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. యూనిట్ విలువను బట్టి రూ.5 లక్షల వరకు రాయితీ ఇస్తుంది. మిగతా సొమ్ము లబ్ధి దారుడు భరించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు ఈనెల 24వ తేదీ గడువు అర్హులైన ఆసక్తి గల నిరుద్యోగ యువత నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈనెల 24 వ తేదీ వరకు గడువు ఉంది. ఆన్లైన్ ద్వారా టీ జీఓబీఎంఎంఎస్.సీజీజీ.జీఓవీ.ఇ న్ వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించాలి. ఫొటోతో కూడిన దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్‌కా ర్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ ప త్రాలు జత చేయాల్సి ఉంటుంది. టు, త్రీ వీలర్ కోసం శాశ్వత డ్రై వింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సో లార్ పంపు కంట్రోల్ యూనిట్ కోసం రెండు ఎకరాల భూమి, పట్టదారు పాస్‌బుక్, నీటి లభ్యత బో రు ఉన్నట్లు జీపీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. టు, త్రీ వీలర్ కోసం 2025 జూలై,1 నాటికి 21 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. సోలార్ పంపు యూనిట్ల కోసం 21 నుంచి 60 వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ.లక్ష 50వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు మించి ఆదాయం ఉండొద్దు. బ్యాంకు కాన్సెంట్ తప్పని సరి. గడిచిన ఐదేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం పొందని వారే ఈ పథకాలకు అర్హులు.ఉమ్మడి జిల్లాకు మంజూరైన యూనిట్లు జిల్లా జనాభా టువీలర్ త్రీవీలర్ సోలార్ యూనిట్లు జనగామ 1,19,796 110 54 12 హనుమకొండ 1,96,046 179 90 19 వరంగల్ 1,28,568 117 60 12 మహబూబాబాద్ 1,04,508 96 48 10 ములుగు 46,473 40 21 05 జేఎస్ భూపాలపల్లి 92,017 87 41 09 స్వయం ఉపాధి దిశగా సాగడానికి ప్రభుత్వం తోడ్పాటు ఎలక్ట్రిక్ వాహనాలతో ఆర్థికాభివృద్ధి సాధించడానికి బాటలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో ఈవీ స్కూటర్లు, ఆటోలు సోలార్ పంపు కంట్రోల్ యూనిట్ల పంపిణీకి చర్యలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు 1,010 యూనిట్లు ఆన్లైన్లో దరఖాస్తుకు ఈనెల 24 వరకు గడువు -
పేదల సంక్షేమానికి ప్రాధాన్యం
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డితొర్రూరు: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు. మండలంలోని 53మంది లబ్ధిదారులకు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్‌కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్‌లతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు, రైతును రాజును చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా పలు కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో భరోసానిస్తుందన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కౌన్సిలర్ ముద్దసాని సురేశ్, నాయకులు పింగిళి ఉష, ఇట్టె శ్యాంసుందర్‌రెడ్డి, ముద్దం విక్రమ్‌రెడ్డి, బసనబోయిన రాజేష్, మహబూబ్‌రెడ్డి, ప్రతికంఠం దేవేందర్‌రాజు పాల్గొన్నారు. -
ఆపన్నహస్తం అందించరూ!
గీసుకొండ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కోట ప్రవీణ్ దీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. కిడ్నీలు పాడైపోయి చికిత్స కోసం డబ్బులు లేని దుస్థితిలో ఉన్నాడు. ప్రవీణ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 నుంచి 2014 వరకు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఇటీవల రెండు కిడ్నీలు పాడైపోయి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు, చికిత్స చేయించడానికి అవసరమైన డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. దీనిపై దాతలు స్పందించి ప్రవీణ్‌కు ఆపన్న హస్తం అందించాలని కుటుంబీకులతోపాటు ఉద్యమకారుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుర్రం రఘు కోరుతున్నారు. సహాయం చేయాలని అనుకునే వారు 9908413955 నంబర్‌కు ఫోన్ పే చేయాలని వారు వేడుకుంటున్నారు. కాగా, శనివారం గీసుకొండ మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఉద్యమకారుడు నమిండ్ల ప్రమోద్ , ప్రభుత్వ టీచర్ కర్ణకంటి రామ్మూర్తి , గుర్రం రఘు, నాగుర్ల వెంకటేశ్వర్లు, సిరిసే శ్రీకాంత్, కొమరెళ్లి కిరణ్.. ప్రవీణ్‌కు ఆర్థిక సాయ అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ పాడైన కిడ్నీలు.. చికిత్స కోసం డబ్బులు లేని దుస్థితి దాతలు ఆదుకోవాలని వేడుకోలు -
బమ్మెరలో చైన్‌స్నాచింగ్
పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలో చైన్ స్నాచింగ్ జరిగింది. దుండగులు శుక్రవారం సాయత్రం ఓ వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును అపహరించుకెళ్లారు. ఎస్సై దూలం పవన్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధురాలు మానుపాటి సోమనర్సమ్మ గ్రామంలోని దుర్గమ్మ ఆలయం వెనుక ఆవులను మేపుతోంది. ఈ సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి.. వృద్ధురాలితో మాటలు కలిపి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కున్నాడు. అనంతరం అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్‌పై మరో వ్యక్తితో కలిసి పరాయ్యాడు. దీంతో సోమనర్సమ్మ బోరున విలపిస్తూ ఇంటికెళ్లి తన కుమారుడికి ఘటనను వివరించింది. దీంతో ఆమె కుమారుడు పోలీసులకు విషయం తెలుపగా వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకిరాంరెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా అనుమానితలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ శనివారం తెలిపారు.● వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు చోరీ ● ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు -
వ్యవసాయం, ఇరిగేషన్‌పై చిన్నచూపు
జనగామ: ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయం, ఇరిగేషన్‌పై చిన్నచూపు చూసిందని, ఈ బడ్జెట్ పేరుగొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడారు. బడ్జెట్లో మహిళలు, యువత, పెన్షనర్లు, ఉద్యోగులకు ఐదు పీఆర్సీలు, ఒక డీఏ పెండింగ్, ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికుల కోసం ఊసే ఎత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు స్కూటీ, వృద్ధులకు రూ. 4వేల పింఛన్, రైతులకు పెట్టుబడి కింద రూ.15వేలు, రాజీవ్ యువ వికాసానికి రూ.6వేల కోట్లు, అంబేడ్కర్ అభయ హస్తం కింద ఒక్కొక్కరికి రూ.12 లక్షలు, షాదీముబాక్, కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, బీసీ వర్గాలకు ప్రతీ సంవత్సరం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని..బడ్జెట్లో గుండుసున్నా చూపించారన్నారు. బడ్జెట్ అంచనాలకు అటు ఇటుగా ఉండాలే తప్ప, మొత్తానికి మొత్తం జీరో చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన రెండున్నరేళ్లలో రూ.3.80 లక్షల కోట్లు అప్పు చేసి జీరో అభివృద్ధిని చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఇర్రి రమణారెడ్డి, తాళ్ల సురేష్‌రెడ్డి, సేవెల్లి మధు, గునిగంటి వెన్నెల, మామిడాల రజిత, అనూష, అనిత, ఉల్లెంగుల సందీప్, నీల యాదగిరి తదితరులు ఉన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులోని వనిత టీస్టాల్‌ను యథాస్థానంలోనే ఉండే విధంగా కలెక్టర్ చొరవ చూపించాలని ఎమ్మెల్యే కోరారు. ఆరు గ్యారంటీలకు డబ్బులు ఏవి? జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
మైనార్టీల సంక్షేమాభివృద్ధికి పెద్దపీట
ఖిలా వరంగల్: రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీల సంక్షేేమాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రంజాన్ సందర్భంగా శనివారం ఉదయం 10గంటలకు ఖిలావరంగల్ పెట్రోల్ బంక్ జంక్షన్‌లోని ఈద్గామైదానంలో ఈద్గా అభివృద్ధి కమిటీ ప్రతినిధి ఎంఏ జబ్బార్ ఆధ్వర్యంలో ఈద్గా మత గురువు మౌలానా మహ్మద్ నౌమాన్ రాజ్ నేతృత్వంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి సురేఖ, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తహసీల్దార్ ఇక్బాల్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్ర జా ప్రభుత్వం పేద ముస్లింల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా రూ.కోటితో మట్టెవాడ, రూ.కోటితో ఖిలావరంగల్, రూ.60 లక్షలతో ఎల్బీనగర్, రూ.40 లక్షల వ్యయతో చింతల్ ఈద్గాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని, ఆ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సోదరభావం, దాతృత్వం, ఆధ్యాత్మికత, మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ముస్లింలు ప్రశాంత వాతావరణంలో రంజాన్ పర్వదినాన్ని జరుపుకునేలా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. ఈద్గా ప్రతినిధి చాంద్‌పాషా, ఎండీ ముగ్దూం, మహమ్మద్ షకీల్, మీర్జా హసన్ అలీబేగ్, యాకూబ్, సర్వర్, మాషూక్, అబీబ్, అంకూస్, మహమ్మద్ జానీ, రబ్బానీ, ఎండీ అమ్జద్, స్థానిక కార్పొరేటర్లు పోశాల పద్మ, కాంగ్రెస్ నేతలు గోపాల నవీన్‌రాజ్, మీసాల ప్రకాశ్, కేడల పద్మ, జనార్ధన్, కొత్తపెల్లి శ్రీనివాస్, బాసాని శ్రీనివాస్, కర్రె కుమార్, పగడాల సతీశ్, శ్రీరామ్ రాజేశ్, దామోదర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రూ.3కోట్ల వ్యయంతో ఈద్గాల అభివృద్ధి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ -
‘బంగారు’ దీప్తి..
● పరుగు పందెంలో దీప్తి జివాంజీకి గోల్డ్‌మెడల్ పర్వతగిరి: ఒడిశా రాష్ట్ర రా జధాని భువనేశ్వర్‌లో ఇటీవల జరిగిన 24వ జాతీ య పారా అథ్లెటిక్స్ చాంపియన్ –2026 పోటీల్లో వరంగల్ జిల్లా కల్లెడ గ్రా మానికి చెందిన జివాంజీ దీప్తి పరుగు పందెంలో బంగారు పతకం సాధించారు. 57.75 సెకన్ల వ్యవధిలో నిర్ణీత గమ్యానికి చేరుకుని తెలంగాణ నుంచి పాల్గొని బంగారు పతకం సాధించారు. శనివారం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో దీప్తికి పతకం అందజేశారు. బాలికలపై వీధి కుక్కల దాడి ● శివనగర్‌లో ఘటన ● ఎంజీఎంకు తరలింపు ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్‌లోని నాలుగు జెండాల లేన్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం గుడియ చందన, వేణు దంపతుల కూతురు అక్షర , బుర్రి అన్నపూర్ణ, ప్రసాద్ దంపతుల కూతురు సంజిత ఇంటి ఎదుట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ బాలికలపై వీధి కుక్కలు దాడికి పా ల్పడ్డాయి. తల్లిదండ్రులు గమనించి కేకలు వేయడంతో కుక్కలు పారిపోయాయి. అప్పటికే గాయపడిన ఇద్దరు బాలికలను తల్లిదండ్రులు ఎంజీఎం తరలించారు. చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరారు. ఈ విషయం తెలిసి స్థానిక కార్పొరేటర్ ప్రవీణ్.. బాలికలను వారి ఇంటి వద్ద పరామర్శించారు. డివిజన్ పరిధిలోని వీధికుక్కలను ఆదివారం పట్టుకుని తరలిస్తామని తెలిపారు. యువకుడికి కత్తిపోట్లు ● మానుకోటలో ఘటన మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బుక్కబజారు ప్రాంతంలో నివాసం ఉండే బయ్య శివరాజన్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల ఓ వైన్స్ షాపులో క్యాంటీన్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కొందరు యువకులు వచ్చి మద్యం సేవించి వెళ్లిన సందర్భంలో అతడితో ఘర్షణ పెట్టుకున్నారు. అనంతరం శనివారం రాత్రి మరికొందరు యువకులు వచ్చి శివరాజన్‌తో మళ్లీ ఘర్షణ పెట్టుకుని కత్తితో దాడిచేసి గాయపరచగా ఛాతి కుడివైపు భాగంలో, తలపై, ఎడమ చెవిలో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సై ప్రశంత్ బాబు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి చిన్నమ్మ కుమారుడు రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు ఆస్పత్రిలోనే ఎఫ్ఐఆర్ నమో దు చేసి విచారణ చేస్తున్నామని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. -
అదనపు కట్నం కోసమే జంట హత్యలు
కాజీపేట అర్బన్: అదనపు కట్నం కోసమే మామ భాషబోయిన రాజశేఖర్, భార్య రాజశ్రీని భర్త పొక్కుల ప్రవీణ్ హత్య చేసినట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం మడికొండ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల కడిపికొండ రాజీవ్‌గృహకల్ప సముదాయంలో జరిగిన తండ్రీకూతుళ్ల హత్య వివరాలు వెల్లడించారు. కడిపికొండ రాజీవ్‌గృహకల్ప సముదాయంలో నివాసముంటున్న భాషబోయిన రాజశేఖర్ తన పెద్ద కుమార్తె రాజశ్రీని 2023, నవంబర్ 18వ తేదీన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలికి చెందిన పొక్కుల ప్రవీణ్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహ సమయంలో రూ. 3 లక్షల కట్నంతోపాటు అన్ని రకాల సామగ్రి అందజేశాడు. ప్రవీణ్, రాజశ్రీ దంపతులకు ఏడాదిన్నర కుమారుడు జయాన్స్, ఆరు నెలల కూతురు దివిషా ఉన్నారు. ఈ క్రమంలో కూతురు పుట్టినప్పటి నుంచి హైదరాబాద్‌లోని కొకాకోలా కంపెనీలో ఉద్యోగం మానేసి వ్యాపారం ఏర్పాటు చేసుకుంటానని, అందుకు అదనపు కట్నం తీసుకురావాలని ప్రవీణ్.. భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయంపై రాజశ్రీ తన తండ్రి రాజశేఖర్‌కు పలుమార్లు తెలిపింది. తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని చెప్పింది. దీంతో తండ్రి రాజశేఖర్ తన బిడ్డను వేధిస్తే చంపుతానని ప్రవీణ్‌ను హెచ్చరించాడు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన రాజశ్రీ, ప్రవీణ్ మధ్య అదనపు కట్నం విషయంపై గొడవ జరిగింది. ఈ సమయంలో అదే గదిలో ఉన్న మామ తనను చంపుతాడని ప్రవీణ్ బయపడ్డాడు. దీంతో తానే ఇద్దరిని చంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా ప్లాన్ ప్రకారం 18వ తేదీ తెల్లవారుజామున మామ రాజశేఖర్, భార్య రాజశ్రీ నుదుటిపై సుత్తితో మోదాడు. వారు బతికుంటే తనకు ప్రమాదమని భావించి డీజిల్ పోసి నిప్పటించాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు పిల్లలను తీసుకుని బయటకొచ్చి ఇరుగుపొరుగు వారిని నమ్మించేందుకు యత్నించాడు. వెంటనే 108, డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో రాజశేఖర్ రెండో కుమార్తె తేజశ్రీ ఘటనా స్థలికి చేరుకుని ఎలా చనిపోయారని ప్రవీణ్‌ను ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని వారిలో వారే గొడవపడి కాల్చుకున్నారని తెలిపి పరారయ్యాడు. శనివారం సాయంత్రం తన పిల్లలతో పాటు తనపై కేసు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు కడిపికొండ బ్రిడ్జి ప్రాంతంలో కనిపించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా మామ, భార్యను హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎస్సైలు రాజ్‌కుమార్, రామ్మోహన్, సిబ్బంది పాల్గొన్నారు. మామ, భార్యను చంపిన ఘటనలో నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి -
బీసీలను మోసం చేసిన ప్రభుత్వం
హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో 56 శాతం ఉన్న బీసీలకు 3.8 శాతం మాత్రమే నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని బీసీ సబ్‌ప్లాన్ సాధన కమిటీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కె.మురళీమనోహర్ అన్నారు. 2026–2027 బడ్జెట్లో బలహీనవర్గాల కు తక్కువ నిధులు కేటాయించినందుకు నిరసనగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ తీరును నిరసిస్తూ బడ్జెట్ ప్రతులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె.మురళీమనోహర్ మాట్లాడుతూ 2026–2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించి బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. ప్రతీ బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీని విస్మరించిందని మండిపడ్డారు. మూడు బడ్జెట్లలో ఇదే తీరుగా మోసం చేసిందన్నారు. ప్రొఫెసర్ ఎం.సారంగపాణి, ప్రొఫెసర్ వడ్డే రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో బీసీలకు తక్కువ నిధులు కేటాయించడంతో పాటు కేటాయించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదని విమర్శించారు. బీసీ సంఘాల నాయకులు బుట్టి శ్యామ్ యాదవ్, ఎదునూరి రాజ మొగిలి, చందా మల్ల య్య మాట్లాడుతూ బడ్జెట్లో బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు, వివిధ కుల సమాఖ్యలకు కేటాయిస్తున్న నిధుల్లో కూడా రూపాయి ఖర్చు చేయకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు, నాయకులు దారబోయిన సతీశ్, ప్రొఫెసర్ బెనర్జీ, ప్రొఫెసర్ గోపు సుధాకర్, తాడిశెట్టి క్రాంతి, గొల్లపల్లి వీరస్వామి, ఆయా సంఘాల నాయకులు జిలకర శ్రీనివాస్, పల్లెబోయిన అశోక్, సంపత్ పటేల్, దార జనార్ధన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ మురళీమనోహర్ బడ్జెట్లో తక్కువ కేటాయింపులపై నిరసన -
తలసరిలో లాస్ట్
జీడీడీపీలో ఫస్ట్..సాక్షి, వరంగల్: భౌగోళిక హద్దుల్లోని వస్తుసేవల ఉత్పత్తుల్లో ఉమ్మడి వరంగల్‌లో హనుమకొండ జిల్లా 30,480 కోట్లతో గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీడీపీ)లో ప్రథమ స్థానంలో నిలవగా, తలసరి ఆదాయంలో మాత్రం రూ.2,37,809తో చివరి స్థానంలో ఉందని తెలంగాణ సోషియో ఎకానమిక్ నివేదిక 2026 పేర్కొంది. అంతేకాదు తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే హనుమకొండ చిట్టచివరి స్థానం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే, పారిశ్రామికీకరణలో భాగంగా హనుమకొండ జిల్లాలో 703 ఫ్యాక్టరీలు, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 82 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈలు అత్యధికంగా హనుమకొండలో 3 7,362 ఉండగా, అత్యల్పంగా ములుగులో 5,515 ఉన్నాయి. ఉదయ్ పోర్టల్‌లో 2020 జూలై నుంచి 2025 డిసెం బర్ 22 వరకు రిజిస్టర్ అయిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఎక్కువగా హనుమకొండలో 7,517 ఉంటే ములుగులో 1,636 ఉన్నాయి. ఇక వరంగల్ జిల్లా విషయానికొస్తే జీడీడీపీలో రెండో స్థానం, ఫ్యాక్టరీ, ఎంఎస్ఎంఈ, ఉదయ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయినమాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లలో రెండో స్థానంలో నిలిచింది.తెలంగాణ సోషియో ఎకానమిక్ నివేదికలో హనుమకొండ జిల్లా స్థానం జీడీడీపీ, ఫ్యాక్టరీలు, ఎంఎస్ఎంఈలో వరంగల్ రెండో స్థానం ఉమ్మడి వరంగల్‌లో తలసరి ఆదాయంలో ములుగు జిల్లా ఫస్ట్ -
పారదర్శకంగా ఎంటీఎస్ పోస్టుల ఎంపిక
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగణన 2026 కోసం జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 16 టెక్నికల్ అసిస్టెంట్, 1 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విధితమే. ఈ మేరకు శనివారం టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు మొత్తం 243 మంది దరఖాస్తు చేసుకోగా అందులో భాగంగా మెరిట్ ఆధారంగా 84 మంది అభ్యర్థులకు శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నైపుణ్య పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తమ మార్కులతో ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించిన వారిని పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా స్పష్టం చేశారు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పో స్టుకు మొత్తం 52 మంది దరఖాస్తు చేసుకోగా 1:6 రేషియోలో మె రిట్ ఆధారంగా 6 మంది అభ్యర్థుల కు ఇంటర్వ్యూ నిర్వహించి ఒకరిని ఎంపిక చేశామన్నారు. ఇన్చార్జ్ ఉపాధి అధికారి రవికాంత్, సీపీఓ చిన కో ట్యా నాయక్, సూపరింటెండెంట్ ఫణికుమార్ పాల్గొన్నారు. పరీక్షకు పిలిచారు.. వద్దన్నారు జనగామ: జనగణన–2026 సేవలకు సంబంధించి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ నియామకాల కోసం పరీక్ష ఉంటుందని సమాచారం అందించి, తమను కేంద్రంలోకి అనుమతించలేదని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్లో జనగణన కోసం ఔట్ సో ర్సింగ్ ప్రాతిపదికన (16)టెక్నికల్ అసిస్టెంట్, ఒక మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టుల భర్తీ కోసం జిల్లా ఉపాధి అధికారి (ఇన్చార్జ్) రవికాంత్ ఆధ్వర్యంలో పరీక్ష న్విహించారు. మె రిట్ ఆధారంగా 84 మందిని పిలవాల్సి ఉండగా, సుమారు 13 మందికి అదనంగా మెసెజ్ పంపించారు. పరీక్షకు మెరిట్ ఆధారంగా లోపలికి అనుమతించగా, మిగతా వారు ఆవేదనకు గురయ్యారు. తమను ఎందుకు అనుమతించడం లేదంటూ నిరసన తెలిపారు. ఈ విషయమై రవికాంత్ మాట్లాడుతూ కంప్యూటర్ ఆపరేటర్లు మెసేజ్ పంపించే క్రమంలో సుమారు 10 నుంచి 13 మందికి అదనంగా సమాచారం వెళ్లిందన్నారు. పరీక్షకు అనుమతించని క్రమంలో వారికి జరిగిన తప్పిదాన్ని వివరించామని, ఈ విషయాన్ని కలెక్టర్ దృ ష్టికి సైతం తీసుకెళ్లామన్నారు. వచ్చే ఉద్యోగ మేళాలో వీరికి ఫస్ట్ ప్రియార్టీ ఇవ్వాలని కలెక్టర్ చెప్పారన్నారు. -
సిరుల పంట.. నువ్వులు
మహబూబాబాద్ రూరల్: వేసవి(రబీ)లో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని అర్జించి పెట్టే పంటల్లో ను వ్వుల సాగు ఒకటి. ఈ పంట అన్నదా తల ఇంట్లో సిరులు కురిరిస్తుంది. ఈ క్రమంలో ఈ పంటను ఏ సమయంలో సాగు చేయాలి.. ఏ నేలలో చేయాలి.. విత్తనం ఎలా చల్లాలి.. చీడపీడల నివారణకు ఏ మందులు వాడాలి అనే అంశాలపై మహబూబాబాద్ మండలం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ● రబీలో ‘ఆరుతడి’గా నువ్వులు సా గు చేసి అధిక దిగుబడి పొందొచ్చు. ● నువ్వుల్లో నూనె శాతం 46 నుంచి 56 వరకు ఉంటుంది. ప్రొటీన్లు 20 నుంచి 25 శాతం వరకు ఉంటాయి. ● విటమిన్లు, అమైనో ఆమ్లాలతోపాటు పాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ● ఖరీఫ్ పంటలు ఆలస్యంగా వేసినప్పుడు, రెండో పంటగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో విత్తుకుని అతి తక్కువ సమయంలో పంట ఉత్పత్తిని పొందొచ్చు. ● రబీ పంటగా నువ్వుల సాగులో చీడపీడల బెడద తక్కువ ఉంటుంది. విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందొచ్చు. ● మురుగు నీరు నిల్వని, తేలికపాటి నేలలు సాగుకు అనుకూలం. పొడి దుక్కి ఉండేలా చూసుకోవాలి. ● విత్తనాన్ని సన్నని ఇసుకలో కలిపి సమంగా వెదజల్లాలి. రకాలు: ● రాజేశ్వరి, శ్వేత, చందన, హిమ వంటి రకాలతోపాటు ఇతరత్రా అనువై న రకాలను సాగుకు ఎంచుకోవాలి. ● రకాలను బట్టి 80 నుంచి 85 రోజుల కాలపరిమితి ఉంటుంది. ● విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. ● పూత, కాయ అభివృద్ధి, గింజ కట్టుదశలో తడులు ఇవ్వాలి. ● విత్తిన 35 నుంచి 40 రోజుల వరకు, 65 నుంచి 70 రోజుల వ రకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. ● పంట పెరిగే దశల్లో పిండినల్లి, ఆకుమచ్చ, వెర్రి తెగులు ఆశిస్తాయి. ● వాటి నివారణకు సకాలంలో నివారణ చర్యలు చేపట్టడం ద్వారా నువ్వుల సాగు దిగుబడిలో మంచి ఫలితాలు పొందొచ్చు. -
పూర్తి కమిటీలు ఎప్పుడు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఇంకా పూర్తిస్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృతస్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 2025, నవంబర్ 22న ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాతో ఆగిపోయింది. పూర్తిస్థాయి కమిటీలకు మోక్షం కలగకపోగా, పార్టీ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులు.. డీసీసీ అధ్యక్షుల్లో ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన వారికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ‘కుడా’చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని నియమించగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్‌కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో కీలక ప్రజాప్రతినిధులు అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లకావత్ ధన్వంతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్, మహబూబాబాద్‌కు ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమలను ఖరారు చేయగా, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి పైడాకుల అశోక్‌కు దక్కింది. డీసీసీ అధ్యక్షుల సంధర్భంగా హనుమకొండ, ములుగు జిల్లాలు మినహా.. మిగతా నాలుగు జిల్లాల్లో సీనియర్లు అలకకు గురికాగా, కేడర్‌లో తర్జన భర్జన జరిగింది. ఈ నేపథ్యంలో అందరినీ అధిష్టానం బుజ్జగించింది. తాజాగా పూర్తిస్థాయి కమిటీల కూర్పు విషయం వచ్చే సరికి మళ్లీ రాజకీయ సిఫారసులు పెరగడం తలనొప్పిగా మారుతుందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. జంబోజెట్ జాబితా... అందుకే పెండింగ్? నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం ఆరు జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ఇంకా పెండింగ్‌లోనే పెట్టింది. దీంతో స్థానిక కేడర్‌లో గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఫిబ్రవరి చివరి వారంలోనే జిల్లాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితర పోస్టులకు టీపీసీసీకి జాబితా పంపించనట్లు తెలిసింది. ఉగాది సందర్భంగా 14 జిల్లాల కమిటీలను ప్రకటించిన అధిష్టానం ఆరు జిల్లాల కమిటీలను మాత్రం ప్రకటించలేదు. జిల్లా కమిటీల్లో అన్ని పోస్టులు కలిపి 30 నుంచి 50 మంది దాటకుండా ఉండేలా జాబితా రూపొందించాల్సి ఉండగా.. అంతకుమించి పంపడం వల్ల వడపోత చేస్తున్నట్లు సమాచారం. వరంగల్, జనగామ జిల్లాల్లో కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల మధ్య పొసగకపోవడం వల్ల అక్కడినుంచి కూడా జంబోజెట్ జాబితా వెళ్లినట్లు తెలిసింది. ఇక హనుమకొండ, ములుగు జిల్లాల జాబితాపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన వెలువడవచ్చంటున్నారు. కమిటీలు ఆలస్యం కావడం పట్ల పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చాలాచోట్ల గ్రూప్ రాజకీయాలు, కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు, స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోటీ కారణంగా కమిటీలు ఆలస్యం అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. డీసీసీ అధ్యక్షులను నియమించి నాలుగు నెలలు పూర్తిస్థాయి కార్యవర్గంపై ఇంకా గందరగోళం పొరుగు జిల్లాల్లో కార్యవర్గం, కమిటీలు ఖరారు ఉమ్మడి వరంగల్‌లో ముందుకు కదలని పరిస్థితి ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ -
కానరాని వార్డు అధికారులు
తొర్రూరు: మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరుస్తూ అభివృద్ధి పనులను సులభతరం చేసేందుకు, ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా వార్డుస్థాయి అధికారులను నియమించారు. ప్రతీ వార్డుకు ఒకరిని కేటాయించారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ అధికారులు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా వరకు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, ఫలితంగా వార్డుల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొత్త పాలకవర్గాలు కొలువైన నేపథ్యంలో వార్డు అధికారుల పనితీరు మెరుగుపడుతుందేమోనని ప్రజలు ఆశిస్తున్నారు. పనులన్నీ అస్తవ్యస్తం.. జిల్లాలో 5 మున్సిపాలిటీలు, 98 వార్డులు ఉన్నాయి. వార్డు పరిధిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోందన్న వాదనలున్నాయి. కోతులు, కుక్కల బెడద పెరుగుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో మున్సిపాలిటీ అధికారులు, పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సమస్య తీవ్రతను వార్డు అధికారులే ఉన్నతాధికారులకు నివేధించి చొరవ చూపాల్సి ఉంది. అసెస్మెంట్లు ఇష్టారీతిన సాగుతున్నాయి. డబ్బులిస్తే తప్ప కొందరు ఔట్సోర్సింగ్ సిబ్బంది పనులు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటికి అడ్డుకట్టపడాలన్నా, మున్సిపల్‌కు ఆదాయం సక్రమంగా సమకూరాలన్నా వార్డు అధికారుల పనితీరే అత్యంత కీలకం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారుల ఎంపిక సర్వేలోనూ వార్డు అధికారులు చాలా మంది అంటీముట్టనట్లుగా ఉన్నారన్న విమర్శలు కోకొల్లలు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పని చేసిన కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్న ప్రచారమూ జరిగింది. ఇలాంటి సందర్భాల్లో వారు కేవలం కార్యాలయానికే పరిమితమవుతూ, తమకు కేటాయించిన విధులపై అంతగా దృష్టిసారించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పట్టణ వాసులను అసంతృప్తికి గురిచేస్తోంది. జిల్లాలోని మున్సిపాలిటీల వివరాలు మున్సిపాలిటీ వార్డులు మహబూబాబాద్ 36తొర్రూరు 16మరిపెడ 15డోర్నకల్ 15కేసముద్రం 16విధి నిర్వహణపై నిర్లక్ష్యం కార్యాలయాలకే పరిమితం క్షేత్రస్థాయిలో కరువైన పర్యవేక్షణ -
వెనకడుగు
సాక్షి, మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం ప్రభుత్వం విడుదల చేసే సామాజిక, ఆర్థిక నివేదికలో జిల్లా వెనకబడింది. స్థూల జాతీయ, తలసరి ఆదాయంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే వెనకబడి ఉంది. పంటల సాంద్రతలో మధ్యస్థంగా ఉండగా.. ఉత్పత్తి రంగంలో వెనకడుగు, అటవీ విస్తీర్ణంలో మొదటి పది స్థానాల్లో జిల్లాకు తొమ్మిదో స్థానం దక్కింది. అక్షరాస్యత వంటి అంశాల్లో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. జీడీడీపీలో వెనకబడి సంవత్సర కాలంలో జిల్లాలో ఉత్పత్తి చేసే వస్తుసేవల విషయంలో ఇతర జిల్లాలతో పోలిస్తే మానుకోట వెనకబడి ఉంది. స్థూల జాతీయ ఆదాయంలో రాష్ట్రంలో రూ.3,41,080కోట్లతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలువగా మహబూబాబాద్ జిల్లా రూ.23,060 కోట్లతో 24వ స్థానంలో నిలిచింది. జిల్లాలో వ్యవసాయం మినహా ఇతర ఉత్పత్తి చేసే అవకాశం లేనందున ఈ పరిస్థితి నెలకొంది. కనీసం వ్యవసాయ పంటల ఉత్పత్తి ఆధారంగా పరిశ్రమలు పెడితే జీడీపీ పెరిగే అవకాశం ఉంది. తలసరి ఆదాయంలో 29వ స్థానం తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.11,29,735తో మొదటి స్థానంలో నిలువగా రూ.2,56,485తో మానుకోట రాష్ట్రంలో 29వ స్థానంలో నిలిచింది. అయితే ఉపాధి అవకాశాలు తగినంతగా లేకపోవడం.. సంవత్సరంలో పనిదొరికే రోజుల సంఖ్య తగ్గడంతో తలసరి ఆదాయం కూడా తగ్గినట్లు స్పష్టమవుతుంది. ఉపాధి హామీలో మెరుపులు ప్రతీ ఒక్కరికి పనికల్పించి, వలసలను నివారించాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లా కాస్త మెరుగ్గా ఉంది. గడిచిన ఏడాది జిల్లాలో 28.6లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో జిల్లాలో 26.5లక్షల పనిదినాలు అంటే 92.40శాతం లక్ష్యం చేరుకొని జిల్లాను మెరుగైన స్థానంలో నిలపారు. తొంభైశాతం గ్రామీణప్రాంతమే.. జిల్లాలో మొత్తం 482 గ్రామాలు, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం.. మొత్తం జనాభా 7,74,549 మంది ఉండగా ఇందులో గ్రామీణ ప్రాంతంలో 6,98,173 మంది నివసిస్తున్నారు. పట్టణాల్లో కేవలం 76,376 మంది మాత్రమే నివాసముంటున్నారు. అయితే 2016లో మహబూబాబాద్ జిల్లా కేంద్రం కావడంతో విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో మార్పులు వచ్చాయి. తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం పట్టణాల్లో కూడా జనాభా పెరిగింది. దీంతో ప్రస్తుతం పట్టణ జనాభా 2లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. 52.61శాతం శ్రామికులు జిల్లా జనాభాలో 52.61శాతం మంది శ్రామిక వర్గం ఉంది. రైతులు 1,22,597 మంది, వ్యవసాయ కూలీలు 2,04,458 మంది, కుటీర పరిశ్రమలు, కులవృత్తులు చేసేవారు 7,427మంది, ఇతర శ్రామికులు 73,002 మంది మొత్తం 4,07,484 మంది శ్రమనే నమ్ముకొని జీవిస్తున్నవారున్నారు. సీ్త్ర, పురుషుల నిష్పత్తి ఆందోళనకరం సీ్త్ర, పురుషుల నిష్పత్తిలో జిల్లా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో సీ్త్ర, పురుషుల నిష్పత్తి 995 మంది, పట్టణ ప్రాంతంలో 1,035గా ఉంది. ఆరు సంవత్సరాలలోపు పిల్లల నిష్పత్తి సగటున 903కు పడిపోయింది. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 901, పట్టణ ప్రాంతంలో 917 ఉంది. దీంతో జాతీయ ఆరోగ్య సంస్థ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి ఆబార్షన్లు, లింగనిర్ధారణ పరీక్షలపై ఆరా తీస్తుంది. సగటున 2.04 ఎకరాల భూమి వ్యవసాయమే ఆధారంగాఉన్న జిల్లాల్లో మహబూబాబాద్ ఒకటి. జిల్లాలో సగటున వ్యవసాయం చేసే రైతులకు 2.04 ఎకరాల చొప్పున భూమి ఉంది. ఇందులో షెడ్యూల్ కులాలకు చెందిన 15,676 మంది చేతిలో 8,414 ఎకరాలు, షెడ్యూల్ తెగలకు చెందిన 81,735 మంది చేతిలో 63,568 ఎకరాలు ఉంది. ఇతర వర్గాలకు చెందిన 91,398 మంది ఆధీనంలో 91,645 ఎకరాలు ఉంది. పశుసంపద ఇలా.. జిల్లాలో 1.82 లక్షల పశువులు, 1.30 లక్షల గేదెలు, 6.78 లక్షల గొర్రెలు, 1.78లక్షల మేకలు, 8 వేల పందులు ఉన్నాయి. 11వేల కుక్కలు, 11.10 లక్షల కోళ్లు జిల్లాలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.జీడీడీపీలో 24వ స్థానంలో మానుకోట తలసరి ఆదాయంలో 29వ స్థానం ఉత్పత్తి రంగంలోనూ వెనుకే.. టాప్ టెన్‌లో అటవీ విస్తీర్ణం -
కేఎల్ఎన్రెడ్డి కాలనీలో చైన్‌స్నాచింగ్
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి కేఎల్ఎన్రెడ్డి కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం చైన్‌స్నాచింగ్ జరిగింది. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కేఎల్ఎన్రెడ్డి కాలనీలో నివాసముంటున్న మోడం స్వప్న ఇంటి నుంచి శుక్రవారం మధ్యాహ్నం తాను పనిచేస్తున్న మగ్గం వర్క్‌షాపునకు వెళ్తోంది. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మెడలోంచి బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు. ఈమేరకు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నేడు పలు పుష్పుల్ రైళ్ల రద్దు కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో ఆపరేషన్స్ రీజన్స్ కారణంగా శనివా రం పలు రూట్లలో ప్రయాణించే పుష్పుల్ ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఏ.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు అయిన రైళ్ల వివరాలు.. కాజీపేట–డోర్నకల్(67765)వెళ్లే పుష్పుల్, డోర్నకల్ టు విజయవాడ(67767), విజయవాడ టు డోర్నకల్(67768), డోర్నకల్ టు కాజీపేట(67766), సికింద్రాబాద్ టు వరంగల్(67761), వరంగల్ టు సికింద్రాబాద్(67762)వెళ్లే పుష్ఫుల్ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్ఓ వివరించారు. ‘ఫలితాలు వెంటనే ప్రకటించాలి’ఎంజీఎం: తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు 2024 నవంబర్ 30న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహించిన ఫార్మసిస్ట్ గ్రేడ్ – 2 ఉద్యోగ పరీక్ష నియామకాల ఫలితాలను వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షులు ఉప్పు భాస్కరరావు డిమాండ్ చేశారు. ముందుగా.. 633 ఫార్మసిస్ట్ గ్రేడ్ – 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు, అనంతరం మరో 99 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించిందని, దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 732కు పెరిగిందని వివరించారు. ఈ పోటీ పరీక్షలకు రాష్ట్రంలో 24,578 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, దీర్ఘకాలికంగా ఫలితాలు ప్రకటించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీంతో నిరుద్యోగ ఫార్మసీ అభ్యర్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్టర్లు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో సరైన పరిష్కారంతో సమస్యను పరిష్కరించి అర్హులకు నియామక ఉత్తర్వులు అందజేయాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకంవిద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇంటర్ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించడంతోపాటు అందుకు నిధులు కేటాయించడంతో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ జవాబు పత్రాల వాల్యుయేషన్ క్యాంపు వద్ద సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి (ప్లెక్సీకి) క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఇ.శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ సంఘం బాధ్యులు జితేందర్‌రెడ్డి, ఆర్.శ్రీనివాస్‌రావు, బి.సునీత, పుష్పలత, శ్రీదేవి, జూనియర్ లెక్చరర్ల సంఘం హనుమకొండ జిల్లా బాధ్యులు మహిపాల్‌రెడ్డి, రేవతి, జ్యోతిర్మయి, కృష్ణమోహన్, సంధ్యారాణి అధ్యాపకులు పాల్గొన్నారు. -
జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన కలెక్టర్
మహబూబాబాద్ రూరల్: జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య జిల్లాలోని గూడూరు మండలం మచ్చర్ల శివారు తార్యతండాలో ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్‌ను పరామర్శించేందుకు నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో శుక్రవారం రాత్రి మానుకోట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఈమేరకు ఆయనను కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, ఆర్డీఓ కృష్ణవేణి, డీఎస్పీ తిరుపతిరావు మర్యాదపూర్వంగా కలిశారు. నాణ్యమైన భోజనం అందించాలిగార్ల: విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పాఠశాలల హెచ్ఎంలను ఆదేశించారు. శుక్రవారం గార్లలోని కస్తూర్బాగాంధీ, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయ న ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత కేజీబీ వీలో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని స్టోర్‌రూంను పరిశీలించి బాలికలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలన్నారు. అనంతరం గిరిజన బాలికల ఆశ్ర మ పాఠశాలను సందర్శించి, సైన్స్ ల్యాబ్ పరి కరాలు, కంప్యూటర్ గదిని తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ బా లికలకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. గార్ల పంచాయతీలో క్రీడామైదానం కోసం ప్రభుత్వ భూమిని కేటా యించాలని సర్పంచ్ బానోత్ పార్వతి హతీ రాం అడిషనల్ కలెక్టర్‌ను కోరగా, వెంటనే తహ సీల్దార్‌ను పిలిచి ప్రభుత్వ స్థలం గుర్తించి కేటా యించాలని సూచించారు. తహసీల్దార్ శారద, ఎంపీఓ శ్రీలక్ష్మి, రాజేష్, పంచాయతీ కార్యదర్శి రమేశ్‌నాయక్, జీపీఓ దీపక్, హెచ్ఎంలు జోగ య్య, ఉషారాణి, పీడీ పద్మ పాల్గొన్నారు. -
పెద్దపీట
సంక్షేమ రంగాలకు బడ్జెట్లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యంసాక్షి, మహబూబాబాద్ : తెంలగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను సజీవంగా ఉంచారని కొందరు చెబుతుండగా.. కేటాయింపులు అరకొరగా ఉన్నాయని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం.. బడ్జెట్లో విద్యాశాఖకు ప్రాధాన్యత కల్పించారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు 2026–27 విద్యాసంవత్స రం నుంచి బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయనున్నారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలులోకి రానుంది. పాలిటెక్నిక్ కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 15 కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. అదే విధంగా నైపుణ్య శిక్షణ కోసం ఐటీఐ, ఏటీసీ కళాశాలల్లో మొత్తం 242 మంది చదువుతుండగా.. వీరికి నెలకు రూ.2వేల చొప్పున ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు నిధులు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్లో రూ.5,500 కోట్లు కేటాయించింది. జిల్లాలో మొదటి విడతలో 10,181 ఇళ్లు కేటాయించగా.. కొన్ని గృహప్రవేశాలు కాగా.. మిగితావి వివిధ దశల్లో ఉన్నాయి. ఇక రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించిన క్రమంలో రెండో విడతలో లబ్ధిదారులకు ఇళ్లు లభించనున్నాయి. కొత్త పింఛన్‌పై ఆశలు.. చేయూత పథకానికి నిధులు కేటాయించిన నేపథ్యంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురిస్తున్నా యి. జిల్లాలో 98,967మందికి నెలకు రూ.26,12,90,128 అందజేస్తున్నారు. అయితే రెండు సంవత్సరాలుగా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో అన్ని అర్హతలు ఉండి జిల్లా వ్యాప్తంగా 12వేల మందికి పైగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించిన నేపథ్యంలో కొత్త పింఛన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారికి మోక్షం కలగనుంది. డిజిటల్ హెల్త్ కార్డులతో ఉద్యోగుల్లో ఊరట.. ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని 13వేల మంది ఉద్యోగులు, పెన్షర్లకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటర్ నేషనల్ స్కూల్స్‌కు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో అయ్యగారుపల్లి, మహబూబాబాద్ నియోజకవర్గంలో బొద్దుగొండ ప్రాంతాల్లో భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశారు. బడ్జెట్లో కేటాయించిన నిధులతో పనులు జరగనున్నాయి. వ్యవసాయ రంగానికి మొత్తం రూ. 23,179కోట్లు కేటాయించారు. కాగా, జిల్లాలోని 2లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని లెక్కలు వేస్తున్నారు. విద్యార్థులకు అల్పాహారం, యంగ్ ఇండియా స్కూల్స్‌కు నిధులు చేయూత నిధులతో కొత్త పింఛన్లపై ఆశ కేటాయింపులపై రాజకీయ వర్గాల్లో మిశ్రమ స్పందనవివిధ వర్గాల మనోగతం -
కేయూ బ్లాక్ గ్రాంటు రూ.165.47 కోట్లు
● గత ఏడాది కంటే రూ.20 కోట్ల పెంపు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీకి (2026–2027)బ్లాక్‌గ్రాంట్ గత ఆర్థిక సంవత్సరం కంటే సుమారు రూ.20 కోట్ల వరకు పెరిగింది. కాకతీయ యూనివర్సిటీలోని టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్టు, చౌట్సోర్సింగ్ ఉద్యోగులకు కలిపి వేతనాల పద్దుకింద మొత్తంగా రూ. 165,47,33,000ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్లో కేటాయించింది. ఇందులో గ్రాంట్ ఇన్ఎయిడ్ వేతనాల కింద రూ.129,83,31,000 కేటాయించగా, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల కోసం గ్రాంట్ రూ.35,64,02,000 కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం 2025–2026 బడ్జెట్లో బ్లాక్గ్రాంటు రూ.145,62,71,000 కేటాయించింది. కాగా, యూనివర్సిటీ అధికారులు ప్రతిపాదించిన మేర నిధులు కేటాయించలేదని సమాచారం. అయినా గతంకంటే రూ.20 కోట్ల వరకు పెరుగుదలపై కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఉమ్మడి వరంగల్‌ను విస్మరించిన బడ్జెట్
న్యూశాయంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాను విస్మరించారు. రాష్ట్ర రాజధానిపై పెట్టిన శ్రద్ధ రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌పై చూపలేదు. వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు, కొత్త ప్రాజెక్ట్‌లు పరిశ్రమ ఊసేలేదు. దేవాదుల పథకం పూర్తి చేసేందుకు నిధుల కేటాయింపులు లేవు. ఎంజీఎం ఆస్పత్రికి నిధుల మాటేలేదు. నిరుద్యోగులను మోసం చేశారు. – తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
బడ్జెట్లో కార్మిక వర్గంపై చిన్నచూపు
హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కార్మిక వర్గంపై చిన్నచూపు చూపింది. ఎన్నికల ముందు కార్మికవర్గానికి ఇచ్చిన హామీల అమలులో విఫలమైంది. ఇప్పటి వరకు మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి ఆశించిన మేరకు నిధుల కేటాయించలేదు. అంగన్వాడీ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.18వేల వేతనం ఊసేలేదు. మధ్యాహ్న భోజన కార్మికులు, వీఓఏ, ఆర్సీలకు రూ.10 వేలు, మున్సిపల్ కార్మికులకు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు నెలకు రూ.24 వేల వేతన హామీ బడ్జెట్లో ప్రస్తావించలేదు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి సంక్షేమ బోర్డు, ఆటో కార్మికులకు రూ.10 వేల భృతి హామీ విస్మరించారు. – నాయిని రవి, బీఆర్టీయూ హనుమకొండ జిల్లా కన్వీనర్ -
అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు
● ఎస్పీ శబరీష్ చిన్నగూడూరు: అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శబరీష్ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్సై ప్రవీణ్‌కుమార్, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మండలంలోని సర్పంచ్‌లతో మాట్లాడారు. గ్రామ భద్రతలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణపై ఆయా గ్రామాల సర్పంచ్‌లు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతేగాకుండా హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో ద్విచక్రవాహనాలు ఉన్న ప్రతీ ఒక్కరికి హెల్మెట్ ఉండాలన్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాల వినియోగంపై దృష్టిసారించి సమాచారం అందించాలన్నారు. అన్ని అంశాలపై సర్పంచ్‌లు పూర్తి బాధ్యత వహించి మండలంలోని ఏవేని మూడు జీపీలు వారంలోపు వందశాతం రిజల్ట్ పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై వెంకటయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెకు సన్నద్ధం కావాలి
హన్మకొండ : విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సన్నద్ధం కావాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ట్రాన్స్‌కో విభాగం కన్వీనర్లు కందికొండ వెంకటేష్, పొగాకు భరత్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని ట్రాన్స్‌కో వరంగల్ జోన్ కార్యాలయం ఆవరణలో ట్రాన్స్‌కో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టిజన్ల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల సాధనకు దశవారీగా ఉద్యమం నిర్వహిస్తూ చివరి అస్త్రంగా ఏప్రిల్‌లో సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికై నా తమ డిమాండ్లు పరిష్కరించాలన్నారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులు సంబంధిత అధికారి అనుమతి లేకుండా ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి విద్యుత్ సౌధకు వెళ్లొద్దని ఆంక్షలు విధించడం అన్యాయమని అన్నారు. చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన మెమోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యుత్ ఆర్టిజన్ జెఏసీ నాయకులు శ్రీనాథ్, ఐలయ్య, రాజన్న, జయచందర్, రాజేష్, సుజన, మల్లికార్జున్, శ్రీనివాస్, రజనీకాంత్, సంజీవ, కిరణ్, మధు, అశోక్, శ్రీలక్ష్మి, కల్యాణి, తదితరులు పాల్గొన్నారు. కందికొండ వెంకటేష్ -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మహబూబాబాద్: రైతుల సమస్యలు పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మొక్కజొన్నలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెగిన చెరువు కట్టలకు వెంటనే శాశ్వత మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రరావు, గడ్డం అశోక్, మదన్‌లాల్ పాల్గొన్నారు. గేట్లో సంతోష్‌కు 64వ ర్యాంక్ఇనుగుర్తి: ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన గేట్లో గుగులోతు సంతోష్ 64వ ర్యాంక్ సాధించాడు. గురువారం రాత్రి విడుదలైన ఫలితాల్లో మండలంలోని మీట్యతండా గ్రామ పంచాయతీలోని మర్రికుంట తండాకు చెందిన గుగులోతు సుమన్, పద్మ దంపతుల కుమారుడు సంతోష్ 64వ ర్యాంకు సాధించాడు. ఆయన ఐఐటీ(బీహెచ్‌యూ)వారణాసిలో మైనింగ్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా, సంతోష్ జాతీయస్థాయిలో ర్యాంక్ సాధించడంతో గ్రామస్తులు, బంధుమిత్రులు అభినందించారు. -
ఎస్టీ కమిషన్ సభ్యుడికి పరామర్శ
గూడూరు: మానుకోట జిల్లా గూడూరు మండలంలోని మచ్చర్ల శివారు తార్యతండాకు చెందిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ తండ్రి లచ్చనాయక్ సోమవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య శుక్రవారం రాత్రి హుస్సేన్‌నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. లచ్చనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి దళిత రత్న కొండ్ర ఎల్ల య్య, జిల్లా అధ్యక్షుడు బోడ ఎల్లయ్య, టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ స్ విక్టిమ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ దగ్గు రాజేందర్, కేసముద్రం మున్సిపల్ చైర్మన్ బానోతు సునీత వెంకన్ననాయక్, గోపా డివిజన్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్యగౌడ్, పురుషోత్తం తదితరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు. -
ఆటోను ఢీ కొట్టిన కారు
మరిపెడ రూరల్: ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం శివారు సీతారాంపురం స్టేజీ వద్ద మహబూబాబాద్–సూర్యపేట 365 జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ కుటుంబం ఓ శుభకార్యం నిమిత్తం ఆటోలో మహబూబాబాద్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో సీతారాంతండా స్టేజీ సమీపంలో మహబూబాబాద్ నుంచి అతివేగంగా వస్తున్న కారు ఆటోను ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రామస్వామి వెంకన్న (55) మృతి చెందగా, మరో ఆరుగురు.. పిట్టల శ్రీనివాస్, పిట్టల పద్మ, గాలి గిరి, గాలి అరుణ, కేసరి శేషమ్మ, ఆటో డ్రైవర్ రవీందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పిట్టల పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ఐదుగురిని మానుకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉన్న పిట్టల పద్మను ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడు రామస్వామి వెంకన్నది సూర్యపేట కాగా, శుభకార్యానికి బంధువుల ఇంటికి వచ్చి మత్యువాత పడ్డాడు. మరిపెడ పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ యాస రవి, చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒకరి మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు పురుషోత్తమాయగూడెం వద్ద ఘటన -
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే వివిధ రంగాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని, బడ్జెట్ నిరాశపరిచిందని పలువురు సామాజిక, ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు విద్యావంతులు, ఆర్థికవేత్తల
విద్యారంగానికి మొండిచేయిహన్మకొండ : రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. రూ.3,24,234 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం రూ.26,674 కోట్లు మాత్రమే కేటాయించింది. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 7.6 శాతం నిధులు కేటాయించగా ఈసారి 8.22 శాతం మాత్రమే కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామన్న హామీకి తూట్లు పొడిచింది. ఈ బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. – గడ్డం నాగార్జున, ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజన్ లేదు.. విషయం లేదు..హన్మకొండ : అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విజన్ లేదు.. విషయం లేదు.. క్లారిటీ లేదు.. కమిట్మెంట్ లేదు.. సరుకు లేదు.. సురుకు లేదు.. ఇది బడాయి, బోగస్, బుకాయింపు, భ్రమల బడ్జెట్. సామాన్య ప్రజలకు, పెట్టుబడిదారులకు, మార్కెట్‌కు విశ్వాసం కల్పించడంలో విఫలమైంది. ఓటు వేసిన వాళ్లకు వెన్నుపోటు పొడిచారు. ఆరు గ్యారంటీలకు మంగళం పాడారు. డిక్లరేషన్లకు నీళ్లు వదిలారు. యువత బతుకుదెరువుకు సమాధి కడుతూ భవిష్యత్‌ను శాశ్వతంగా దెబ్బతీసే బడ్జెట్ ఇది. – ఏనుగుల రాకేష్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు -
పర్యాటకం @ ఇనుపరాతి గుట్టలు
అక్రమ మైనింగ్ జరిగిన ప్రదేశంగుట్టల శివారులో రిజర్వాయర్దర్మసాగర్ : హనుమకొండ జిల్లాలో అటవీ ప్రాంతంగా పిలువబడే ధర్మసాగర్ మండలంలోని దేవునూరు ఇనుపరాతి గుట్ట పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్థానికులతోపాటు పర్యావరణ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో ఈ గుట్టలు విస్తరించి ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో ఒక శాతం అటవీ సంపద ఉన్నది ఈ ప్రాంతమే. దేవునూరు అటవీప్రాంతాన్ని వరంగల్ త్రినగరి ఊపిరితిత్తులుగా పిలుస్తుంటారు. కానీ, ప్రస్తు తం ఈ అటవీ భూముల్లో అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. రెవెన్యూ, అటవీశాఖల ఆధునిక డిజిటల్ సర్వేలో సుమారు 3,900 ఎకరాల అటవీ శాఖ దేవునూరు గుట్టల్లో ఉన్నట్లు తేలింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు, అటవీ సంరక్షణ చట్టం –1980 ప్రకారం దట్టమైన వృక్ష సముదాయం ఉండి రిజర్వ్ ఫారెస్ట్ పక్కన లేకున్నా ఆ ప్రాంతాన్ని అడవిగా పరిగణించాలి. కావునా దేవునూరు గుట్టలను రిజర్వ్ ఫారెస్ట్‌గా పరిగణించి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. జంతు, వృక్ష జాతులకు నెలవు దేవునూరు ఇనుపరాతి గుట్టల్లో ఎన్నో రకాల జంతు, వృక్ష జాతులున్నాయి. ఇక్కడ ఎలుగుబంట్లు, జింకలు, కొండ గొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు, నక్కలతోపాటు అనేక పక్షి జాతులు, వివిధ రకాల ఔషధ మొక్కలతోపాటుగా ఇప్ప, నార, వేప, చింత, రావి లాంటి వృక్షజాతులు ఉన్నాయి. ఆహారం, పశుగ్రాసం, ఔషధ మొక్కలు, వంట చెరుకు నిలయంగా ఈ గుట్టలు విరాజిల్లుతున్నాయి. ఈప్రాంతంలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్టవేసి జీవవైవిధ్య పార్కుగా అభివృద్ధి చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఇనుపరాతి గుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ప్రభుత్వనికి ఆదాయం సమకూరనుంది. కనీస వసతులుగా వాచ్ టవర్, పిక్నిక్ గద్దెలు, నైట్ క్యాంపు కల్పిస్తే వన సంపదకు రక్షణగా ఉంటుందనేది పలువురి అభిప్రాయం. ఇక్కడి ప్రజలు ముక్త కంఠంతో క్వార్జ్ మైనింగ్ ఏర్పాటును అడ్డుకోవడం అభినందనీయం. నగరానికి కూతవేటు దూరంలోనే.. వృక్ష, జంతు జాతులకు నెలవు గుట్టల్లో కొలువైన ప్రాచీన ఆలయాలు అభివృద్ధి చేయాలంటున్న పర్యావరణ ప్రేమికులుహనుమకొండలోని ఏకై క అటవీ ప్రాంతమైన ఇనుపరాతి గుట్టలు ఎకో టూరిజానికి అనుకూలంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. వన్య సంపద ఉన్న ఈ ప్రాంతాన్ని రిజర్వ్ అడవిగా ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. సెక్షన్ 4, తెలంగాణ అటవీ చట్టం ప్రకారం ఇప్పటికే ఎన్నో భూసార, తేమ పరిరక్షణ చర్యలు చేపట్టినందుకున ఈ ప్రాంతం పర్యాటక పర్యావరణానికి అనుకూలమని స్పష్టమైంది. కావున ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
బీజేపీ నాయకుడి ఆత్మహత్య
హసన్‌పర్తి: భారతీయ జనతాపార్టీ హసన్‌పర్తి మండలశాఖ మాజీ అధ్యక్షుడు కడిపికొండ సంతోష్‌రెడ్డి(38) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఇంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అన్నాసాగరం గ్రామానికి చెందిన కడిపికొండ సంతోష్‌రెడ్డికి పదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన కల్యాణితో వివాహం జరిగింది. వీరికి పదినెలల కుమారుడు ఉన్నాడు. కొంతకాలం పాటు వీరి కాపురం సవ్యంగానే సాగింది. అయితే గతేడాది నుంచి వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. ప్రస్తుతం సంతోష్‌రెడ్డి అత్తింటి వద్దనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. కాగా, గురువారం రాత్రి సంతోష్‌రెడ్డి వ్యవసాయ బావి వద్దనే పురుగుల మందు తాగాడు. దీంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కాగా, బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రాంచెంద్రారెడ్డి, సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి, బీజేపీ మండల అధ్యక్షుడు మారం తిరుపతి తదితరులు సంతోష్‌రెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఫాస్ట్‌ఫుడ్ హోటల్ నిర్వాహకుడి పరార్ వరంగల్: వరంగల్ స్టేషన్‌రోడ్డులోని ఫాస్ట్‌ఫుడ్ హో టల్ నిర్వాహకుడు సుమారు రూ.30 లక్షల వరకు ఎగనామం పెట్టి పరార్ కావడంతో పెట్టుబడి పెట్టి న ఫైనాన్సర్లు లబోదిబోమంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజేష్‌సింగ్ 8 ఏళ్ల క్రితం వ రంగల్ బస్టాండ్ సమీపంలో బండి పెట్టుకుని కుటుంబంతో సహా టీ, హోటల్ నిర్వహించేవాడు. బస్టాండ్ నిర్మాణంలో భాగంగా తాత్కాలిక నిర్మాణాలు తొలగించడంతో రైల్వేస్టేషన్ రోడ్‌లోని ఆయకర్ భవన్ పక్కనే ఉన్న ఖాళీ స్థలం లీజుకు తీసుకుని అంతకుముందు ఉన్న పరిచయాలతో ఫైనాన్సర్ల వద్ద రూ.లక్షల్లో అప్పుగా తీసుకుని కొత్తగా టీ హో టల్తోపాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించాడు. హోటల్ పెద్దగా ప్రారంభించడంతో కిరాణ సామగ్రి, చికెన్ సప్లైదారులు ముందుగా సరుకులు సరఫరా చేసి వారం, నెలవారీగా వసూలు చేసుకునే వారు. ఇలా అందిన కాడికి అప్పులు చేసిన రాజేష్ సింగ్ రెండు రోజులుగా హోటల్ తీయలేదు. ఉగాది పండుగ వల్ల తీయలేదని అనుకున్నారు. ఈక్రమంలో ఉగాది తర్వాతరోజు డబ్బులు ఇస్తానని హామీ ఇవ్వడం, రెండు రోజులుగా షాపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఫైనాన్సర్లు శుక్రవారం హోటల్ తలుపు తీయగా లోపల మొత్తం ఖాళీగా కనిపించింది. దీంతో ఫైనాన్సర్లు, చికెన్, కిరాణ సామగ్రి సప్లయర్స్ పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. రాజేష్‌సింగ్ సుమారు రూ.30 లక్షల వరకు అప్పుపెట్టినట్లు సమాచారం.● కుటుంబ కలహాలే కారణం ● నివాళులర్పించిన పార్టీ శ్రేణులు రూ.30 లక్షల వరకు ఎగనామం లబోదిబోమంటున్న ఫైనాన్సర్లు -
బడ్జెట్ కేటాయింపులు సరిగాలేవు
జనగామ రూరల్: విద్యారంగానికి 15శాతం కేటాయిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. గత బడ్జెట్లో విద్యారంగానికి 7.57 శాతం కేటాయించగా ఈసారి 8.22 శాతం కేటాయించారు. 105 యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం, 2,500 ప్రీ ప్రైమరీ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ స్థాపన, పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం వంటి కార్యక్రమాలు లక్ష్యాలు చేరుకోడానికి నిధులు సరిపోవు. కనీసం 20 శాతం నిధులు కేటాయించాలి. – డీ.శ్రీనివాస్, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
చిన్నారుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్‌గృహకల్ప సముదాయంలో బుధవారం తెల్ల వారుజామున మామ రాజశేఖర్, భార్య రాజశ్రీని భర్త ప్రవీణ్ హత్య చేసిన విషయం తెలిసింది. ఈ ఘటనతో అనాథలైన చిన్నారుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తెలిపారు. ఈమేరకు గురువారం కడిపికొండలోని రాజీవ్‌గృహకల్ప సముదాయంలోని ఘటనాస్థలిని కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డితో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మడికొండ పీఎస్ ఆవరణలో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు. ప్రభుత్వానికి చిన్నారుల వివరాలు తెలియజేసి వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎస్సైలు రాజ్‌కుమార్, రామ్మోహన్, రాజబాబు, సిబ్బంది పాల్గొన్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత -
భార్యపై భర్త హత్యాయత్నం
మహబూబాబాద్ రూరల్ : భార్యపై భర్త కత్తితో హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో జరిగింది. రూరల్ ఎస్సై వి.దీపిక తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారులోని కొత్త గుంపులు ప్రాంతానికి చెందిన వీరబోయిన నరేశ్ 12 ఏళ్ల క్రితం తమ సమీప నివాసి విజయను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని క్యాంటీన్లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈక్రమంలో ఇటీవల దంపతుల మధ్య తగాదా జరగగా రెండు రోజుల క్రితం భార్య తన తల్లిగారింటికి వెళ్లింది. అక్కడ తమ బంధువుల ఇంటిఎదుట కూర్చొని ఉండగా నరేశ్ ఆగ్రహంతో వచ్చి కత్తితో హత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు 108లో జనరల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించారు. ఈ ఘటనపై విజయ తల్లి తుర్క కళమ్మ ఫిర్యాదు మేరకు నరేశ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి విజయ కొంతకాలంగా చాలా సమయం పాటు ఫోన్ మాట్లాడుతుండడంతో నరేశ్ అనుమానం పెంచుకున్నట్లు సమాచారం. దీంతో నరేశ్ తరచూ భార్యతో గొడవ పెట్టుకుంటున్నాడని, ఈ క్రమంలోనే ఆమైపె హత్యాయత్నం చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కంబాలపల్లిలో ఘటన -
కొనలేం.. కొబ్బరి బోండాం!
కాజీపేట: పెరుగుతున్న ఎండలతో పాటు కొబ్బరి బోండాం ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. కొబ్బరిబోండాం వ్యాపారులు సీజన్‌ను ఆసరాగా చేసుకొని బోండాం ధరలను అధికంగా పెంచి విక్రయిస్తున్నారు. నగరానికి ఆంధ్రా ప్రాంతం నుంచి కొబ్బరిబోండాలు దిగుమతి చేసుకుంటారు. అయితే కొబ్బరిబోండాల ధరలు వ్యవసాయదారుడి వద్ద కొనుగోలు చేస్తున్న ధరలకన్నా మూడు రెట్లు అధికంగా విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ.30, రూ.35 కు ఒక బోండాన్ని విక్రయించే వ్యాపారులు ప్రస్తుతం రూ.60 వరకు పెంచి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొబ్బరిబోండాం కొనలేని పరిస్థితి ఉందని అంటున్నారు. చిన్న బాటిళ్లలో విక్రయాలు.. వ్యాపారులు చిన్న బాటిళ్లలో కొబ్బరి నీరు విక్రయిస్తూ అధిక ధరలు తీసుకుంటున్నారు. లీటర్ కొబ్బరి నీరు రూ.140కి విక్రయిస్తున్నారు. ఎండలు మండిపోతుండడంతో ధరలు ఇంకా పెంచి విక్రయిస్తున్నారని కొనుగోలు దారులు వాపోతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే బోండాల దిగుబడి లేదు.. దూరం నుంచి తెప్పించి విక్రయిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారని కొనుగోలు దారులు పేర్కొంటున్నారు. -
వైభవంగా ఉగాది ఉత్సవం
వేయిస్తంభాల ఆలయంలో● సీతారామచంద్రస్వామి వారి కల్యాణ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం హన్మకొండ కల్చరల్ : నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీపరాభవ నామసంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం నిర్వహించిన ఉత్సవం వైభవంగా సాగింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పంచాంగశ్రవణం కవిసమ్మేళనంలో మాట్లాడుతూ ప్రజలకు నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేశ్‌బాబు, దేవాలయ ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పాల్గొన్నారు. అలరించిన కవిసమ్మేళనం.. కవిసమ్మేళనంలో కవితలు అలరించాయి. వల్సపై డి, తిరునగరి నరేందర్, మెరుగు అనురాధ, రామరత్నమాల, అరుణకీర్తిపతాక, తాండ్ర చిరంజీవి, వ హిద్గుల్షన్, బిటవరం శ్రీమన్నారాయణ తదితరులు చదివిన కవితలు అలరించాయి. అనంతరం క వులను సన్మానించారు. సేవాసమితి సభ్యులు చొల్లే టి కృష్ణమాచారి, సిబ్బంది మధుకర్ పాల్గొన్నారు. ఉదయం 5గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభం ఉదయం 5 గంటల నుంచి ఆలయప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూలగణపతికి ప్రత్యేక పూజలు, శ్రీరుద్రేశ్వరస్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు జరిపారు. విష్ణు ఆలయంలో హనుమాన్ లక్ష్మణ సమేత శ్రీసీతారాముల పంచలోహ విగ్రహాలను ప్రతిష్ఠించారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అంకురారోపణ, కలశస్థాపన, పాంచారాత్ర ఆగమానుసారంగా ఋత్వికరణ, షోఢశోపచారపూజలు, కాళీకాపూజ మహా హారతి, మహానివేదన, ఉగాది పచ్చడి నివేదన చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కుటుంబసమేతంగా దేవాలయాన్ని సందర్శించి ఉత్సవాలను ప్రారంభించారు. అలరించిన పంచాంగపఠనం, కవి సమ్మేళనం -
చెరువులో పడి గొర్రెల కాపరి మృతి
● ముల్కలగూడెంలో ఘటన ఐనవోలు: చెరువులో పడి ఓ గొర్రెల కాపరి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ముల్కలగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల రాజు(42) వ్యవసాయంతోపాటు గొర్రెల పోషణ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉగాది పండుగ సందర్భంగా గొర్రెలను శుభ్రం చేయడానికి మందను ముల్కల చెరువులోకి తీసుకెళ్లాడు. అక్కడ గొర్రెలను శుభ్రం చేస్తుండగా చెరువులో లోతు ఎక్కువ ఉండడంతో బురదలో చిక్కుకుని ఊపిరాడక మృతిచెందాడు. మృతుడికి భార్య రేణుక, కుమారై జ్యోతి, కుమారులు శేఖర్, రాజ్‌కుమార్ ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మట్టి తరలించడంతోనే.. కొందరు కాంట్రాక్టర్లు నీళ్లు లేని సమయంలో చెరువు మట్టిని ఇష్టారీతిన తరలించడంతో లోతు ఎక్కడ.. ఎంత మేర ఉందో తెలియపోవడంతో పలువురు నీటిలో మునిగి చనిపోతున్నట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే చెరువులో పడి గతంలో ఇద్దరు మృతి చెందారని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఎండాకాలంలో మట్టిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఎండాకాలం.. బైక్ భద్రం
ఖిలా వరంగల్ : వేసవి వచ్చేసింది. రోజురోజుకూ భానుడు ప్రతాపం బెంబేలెత్తిస్తోంది. ఫలితంగా టే బుల్ ఫ్యాన్లు, విసన కర్రలను బయటకు తీయాల్సిన సమయం ఆసన్నమైంది. అంతేకాకుండా నెత్తి న టోపీ, భుజాలపై రుమాళ్లు పెట్టుకుని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమంలో వేసవిలో ప్రచండ భానుడి ప్రతాపం నుంచి ఉపశమ నం పొందేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న మనం బైక్(ద్విచక్రవాహనాలు)ల విషయానికి వ చ్చేసరికి ఆశ్రద్ధ వహిస్తున్నాం. ఇది సరికాదు. మన ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అదే మాదిరి బైక్‌ల విషయంలోనూ అలాగే తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ వాహనాలు మరమ్మతుకు గురవడంతోపాటు మైలే జీ తగ్గనుంది. దీనికి ప్రధాన కారణం ఎండలో ఎక్కడపడితే అక్కడే నిలపడమే. పార్కింగ్ స్థలాలు తక్కువ.. వరంగల్ ఉమ్మడి జిల్లాతోపాటు నగర వ్యాప్తంగా పార్కింగ్ స్థలాలు తక్కువ కనిస్తున్నాయి. ఫలితంగా వాహనాలను రోడ్డు పై పార్క్ చేయడం వల్ల టై ర్లు పంక్చర్ కావడంతో సకాలంలో గమ్యానికి చేరడం కష్టంగా ఉంటుంది. ఇంటి నుంచి ఆఫీస్, ఆఫీస్ నుంచి ఇంటికి, వ్యాపారులు షాపుల ఎదుట మండుటెండలో బైక్‌లు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుండడంతోపాటు తరచూ మరమ్మతులకు గురవుతోంది. చివరకు మై లేజీ కూడా తగ్గిపోవడం, కలర్ షేడ్ కావడం, పెట్రో లు ఆవిరైపోవడం వంటివి ఉంటాయని మెకానిక్‌లు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రత 30 నుంచి 40 డిగ్రీలుపైబడి ఉంటోంది. ఈ నేపథ్యంలో బైక్‌ల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వాహనం ఎండలో నిలిపారో పెట్రోల్ ఆవిరే.. ద్విచక్రవాహనాలకు తగ్గనున్న మైలేజీఎండాకాలంలో వేడికి ఇంజిన్ ఆయిల్ త్వరగా పలుచబడుతుంది. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయానికి ఇంజిన్ ఆయిల్‌ను మార్చుకోవడం మంచిది. వాహన ట్యాంకుపై మందం కవర్ ఉండేలా చూసుకోవాలి. సీట్ల కవర్లు సాధారణంగా ఉంటే త్వరగా వేడెక్కి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా వేడిగా వెలివేట్ క్లాత్ వంటి సీట్ కవర్ వాడాలి. ఎండలో ఎక్కువ సమయం పార్క్ చేస్తే బైక్‌లు దెబ్బతింటాయి. వేసవిలో బైక్‌పై దూరప్రయాణం చేయాల్సిన వారు మధ్య మధ్యలో ఆగి 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వలన ఇంజిన్ వేడి తగ్గుతుంది. వాహనాలను ఎక్కువ సమయం పార్క్ చేయాల్సి వస్తే చెట్టునీడన గాని షెడ్డల్లోగాని నిలపాలి. ఆధిక ఉష్ణోగ్రతతో టైర్లలో గాలి తగ్గిపోతుంది. -
వ్యక్తి మృతిపై అనుమానం
● అంత్యక్రియలు పూర్తయిన వారం రోజుల తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని గంగాపూర్‌లో ఓ వ్యక్తి ఇటీవల మృతి చెందగా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తూ అంత్యక్రియలు పూర్తయిన వారం రోజు లకు మృతదేహాన్ని బయటకు తీసి గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసుల కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన బందారం సురేశ్(40) భార్యాపిల్లలతో కలిసి హైదరాబా ద్లో ఉంటున్నాడు. ఈనెల 12న మృతి చెందగా స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే సురేశ్ మృతిపై అనుమానం ఉందని కుటుంబీకులు హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు గంగాపూర్‌లో సురేశ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పలు ఆధారాలను మెడికల్ కాలేజీ వైద్యులు తీసుకెళ్లారని, వాటి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జవహర్‌నగర్ ఎస్సై వేణు మాధవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ డాక్టర్ జక్కం సురేందర్, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఆర్ఐ వంశీకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య దేవరుప్పుల : కుటుంబంలో జరిగిన స్వల్ప గొడవతో మనస్తాపం చెందిన ఓ యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం చిప్పరాళ్లబండ తండాలో చోటుచేసుకుంది. ఎస్సై సృజన్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని కడవెండి రెవెన్యూ పరిధి చిప్పరాళ్లబండతండా గ్రామానికి చెందిన భూక్య శ్రీను(35)కు ధర్మాపురం పరిధి సీత్యతండాకు చెందిన రోజాతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఉగాది పండుగ రోజున ఆలస్యంగా ఎటో వెళ్లొచ్చిన భర్తను భార్య మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీను క్షణికావేశంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం వెంటనే హనుమకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పటిక పట్టివేత● ముగ్గురు అరెస్ట్, లారీ సీజ్ కురవి: అక్రమంగా తరలిస్తున్న రూ.8లక్షల విలువైన 70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పటికను పట్టుకుని ముగ్గురి అరెస్ట్ చేయడంతోపాటు లారీని సీజ్ చేసినట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. గుడుంబా తయారీ కోసం ఏపీలోని చిత్తూరు నుంచి మహబూ బాబాద్ జిల్లా కేంద్రానికి తరలిస్తున్న నల్ల బెల్లం లారీని గురువారం కురవి శివారు సోమ్లతండా వద్ద మహబూబాబాద్ టాస్క్‌ఫోర్స్, కురవి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నట్లు చెప్పారు. అనంతరం నిందితులు గుగులోత్ సుమన్, ఆరెపల్లి మధు, బొల్లా విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సీఐ హతీరామ్, ఎస్సై తాహేర్బా బా, కురవి సెకండ్ ఎస్సై జయకుమార్, పీసీలు సమ్మయ్య, హరిబాబు, నరేశ్, భద్రు, బాబు, తదితరులు పాల్గొన్నారు. -
మార్గదర్శకాలపై మండిపాటు
హన్మకొండ : ట్రాన్స్‌కో వరంగల్ జోన్ చీఫ్ ఇంజనీర్ వ్యవహార శైలిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉద్యోగులు క్షేత్ర స్థాయిని వీడడం, అధికారులను కలవడంపై ఇటీవల ట్రాన్స్‌కో వరంగల్ జోన్ యాజమాన్యం జారీ చేసిన మెమో వివాదాస్పదమైంది. ఈ మెమో(క్రమ శిక్షణ మార్గదర్శకాలు)పై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. క్రమ శిక్షణ మార్గదర్శకాల పేరుతో ఇటీవల మెమో జారీ చేశారు. దీని ద్వారా క్షేత్ర స్థాయి ఉద్యోగులు సంబంధిత అధికారి అనుమతి లేకుండా ట్రాన్స్‌కో వరంగల్ జోన్ కార్యాలయానికి, హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధాకు రావొద్దని ఆంక్షలు విధించారు. ఇక నుంచి ఏ ఉద్యోగి, ఆర్టిజన్ అయినా తమ సమస్యల పరిష్కారం కోసం వరంగల్ జోన్ కార్యాలయం, విద్యుత్ సౌధాకు వెళ్లడానికి సంబంధిత కంట్రోలింగ్ అధికారి అనుమతి తీసుకోవాల్సిందేనని సూచించారు. దీనిని ఉల్లంఘిస్తే సంబంధిత ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడితే కంట్రోలింగ్ అధికారులపై చర్యలు తప్పవని మెమోలో పేర్కొన్నారు. ఇలాంటి ఆంక్షలు విధిస్తే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ట్రాన్స్ కో వరంగల్ జోన్లో ఇటీవల జారీ చేసిన క్రమశిక్షణ మార్గదర్శకాలు ఉద్యోగుల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. సమస్యలు చెప్పుకునే అవకాశమే లేకుండా ఆంక్షలు విధిస్తున్నారని మండిపడుతున్నారు. క్షేత్ర స్థాయి ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటారని, వాటిని అధికారులకు దృష్టికి తీసుకెళ్లడానికి అనుమతి అవసరమని చెప్పడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు విధిస్తే తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక రకంగా ఉద్యోగులను వేధించడమేనని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆంధ్ర అధికారి కావడంతోనే కఠిన ఆంక్షలు.. ఆంధ్ర అధికారి కావడంతోనే తెలంగాణ ఉద్యోగులపై కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు ప్రవేశ పడుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇంకా ఆంధ్ర అధికారుల పెత్తనం కొనసాగడం బాధాకరమని ఉద్యోగులు, సంఘాలు పేర్కొన్నాయి. వరంగల్ జోన్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికై నా ట్రాన్స్ కో చీఫ్ ఇంజనీర్ తీసుకున్న కఠిన నిర్ణయాలను ఉపసంహరించుకుని, తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలని ఉద్యోగులు, సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు ట్రాన్స్‌కోలో వివాదాస్పదమవుతున్న మెమో చీఫ్ ఇంజనీర్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు -
ఉద్యోగం.. ఉద్యమం
కోచ్ ఫ్యాకర్టీలో భూనిర్వాసితులతోపాటు స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలికాజీపేట: కాజీపేట శివారులోని అయోధ్యపురంలో నిర్మితమవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించాలంటూ రైల్వే జేఏసీ చేపట్టిన ఉద్యమం ఊపందుకుంటోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజలు జిల్లా కేంద్రంలో భారీ రైల్వే ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కమ్యూనిస్టు నాయకులు బీఆర్ భగవాన్ దాస్, మడత కాళిదాసు ఆది నుంచి కోచ్ ఫ్యాక్టరీ సాధనకు ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. సీపీఐ పార్టీ పక్షాన ఎక్కడా సమావేశం జరిగినా వీరి ప్రసంగాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశమే ప్రధానంగా వినిపించేది. వీరి పోరాట ఫలితంగా ఒక దశలో కోచ్ ఫ్యాక్టరీ వచ్చినట్లుగానే అందరూ భావించారు. 1980లో అప్పటి పాలకుల ఆదేశం మేరకు అధికారులు ధర్మసాగర్ మండల కేంద్రం సమీపంలో ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో కోచ్ ఫ్యాక్టరీని అక్కడకు తరలించారు. తెలంగాణ ఉద్యమానికి సమానంగా కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం.. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంతోపాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించాలని కోరుతూ ఉద్యమం మరోమారు ఊపందుకుంది. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం కాజీపేటకు రైల్వే వర్క్ షాపు షెడ్ మంజూరు చేసింది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముగిసిన అనంతరం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం స్థల సేకరణకు అవసరమైన నిధులు మంజూరు చేసి 160 ఎకరాల మెట్టుగుట్ట సీతారామచంద్ర స్వామి దేవాదాయ భూములను కోర్టు అనుమతితో కొనుగోలు చేసింది. ఈ విధానం ద్వారా ఏళ్లుగా దేవాలయ భూములను సాగుచేసుకుంటున్న రైతులకు పరిహారం చెల్లించి సేకరించిన భూములను రైల్వే శాఖకు అప్పగించింది. ఆ స్థలంలో మొదటగా రైల్వే శాఖ పీఓహెచ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వీటన్నింటి మార్పిడి చేసి ప్రజల ఆకాంక్ష మేరకు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రకటించింది. తదనుగుణంగా ఆ స్థలంలో దాదాపు రూ.687 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు మరో మూడు నెలలో పనులు పూర్తికానున్న నేపథ్యంలో స్థానిక నిరుద్యోగ యువతకు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలనే నినాదం మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సభలు, సమావేశాలతో పాటు ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించి రైల్వే శాఖకు పంపిస్తున్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ప్రారంభమైన ప్రాంతాల్లో మొద టి దఫా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో కల్పించిన విధంగా కాజీపేట యూనిట్లో భూ నిర్వాసితులతోపాటు ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతకు రిజర్వేషన్ సౌకర్యం ఇవ్వాలని డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. ఇటీవల కోచ్ ఫ్యాక్టరీ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో మహాదీక్ష నిర్వహించి విజయవంతం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు విన తి పత్రాలు అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షను గుర్తించి తగు నిర్ణ యం ప్రకటిస్తుందనే ఆశాభావాన్ని జేఏసీ నేతలు, నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో ఊపందుకుంటున్న పోరు కేంద్ర ప్రభుత్వంపైనే నిరుద్యోగుల ఆశలు ప్రకటన కోసం ఎదురుచూపులు -
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
భూపాలపల్లి అర్బన్ : దుండగులు నిప్పంటించడంతో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన బుధవారం రాత్రి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు చల్లూరిపల్లిలో చోటు చేసుకుంది. బాధితుడు చెలిమేటి లింగయ్య, సుగుణ దంపతుల కథనం ప్రకారం.. ఉగాది పండుగ సందర్భంగా బుధవారం రాత్రి లింగయ్య, సుగుణ దంపతులు తమ కుమారుడు సంతోష్ ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో దుండగులు ఇంటికి నిప్పంటించారు. ఈ ప్రమాదంలో ఇంటి పక్కన కట్టెసి ఉన్న 4 ఆవులు తీవ్రంగా గాయపడి నడవలేని స్థితికి చేరుకున్నాయి. 20కి పైగా నాటు కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో నిల్వ చేసిన 20 బస్తాల ధాన్యం, రూ.10 వేల నగదు, దుస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. గాయపడిన పశువులకు వైద్యం చేయించేందుకు సుమారు రూ.50 వేల వరకు ఖర్చవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న 12వ వార్డు కౌన్సిలర్ బొంతల సతీశ్ కుమార్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం మంటలతో పశువులకు గాయాలు చల్లూరిపల్లిలో ఘటన -
నరసింహమూర్తికి ఉగాది పురస్కారం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వేద పండితుడు తాటిపాముల నరసింహమూర్తి ఉగాది పురస్కారం అందుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది పంచాంగ అరవనం ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు నరసింహామూర్తికి ఉగాది పురస్కారం అందజేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. విజిలెన్స్ సభ్యుల ఎంపికకు ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటుకు జిల్లాలో ఐదుగురు సభ్యులను ఎంపిక చేస్తామని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాక సంచాలకుడు శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ, ఉన్నత చదువులు చదివిన వారికి మొదట ప్రాధాన్యత ఉంటుందని, కుల ధ్రువీకరణ పత్రం ఉండాలని తెలిపారు. ఎలాంటి పోలీసు కేసులు ఉండని వారు అర్హులని తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో వివరాలు అందజేయాలని తెలిపారు. ఇతర వివరాలకు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయం సంప్రదించాలని కోరారు. రామప్పలో నేషనల్ డిఫెన్స్ కాలేజీ అధికారులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్‌పై శిక్షణ ఇచ్చే అధికారులు సచిన్ బాద్షా, తరుణ్‌గుప్తా, ఇవాన్ అలెగ్జాండర్, అంజన వశిష్టలు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామ ప్ప శిల్పకళసంపద బాగుందని వారు కొని యాడారు. వారి వెంట కోఆర్డినేటర్ సందీప్, తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్ల రాజు, ఏఎస్సై సాంబారావు, ఆర్ఐ రమేశ్ పాల్గొన్నారు. ఘనంగా వసంత నవరాత్రోత్సవాలు షురూ హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం చైత్రమాసం పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి నిర్మాల్య సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వసంత నవరాత్ర ఉత్సవాలు జరపడానికి అనుజ్ఞాప్రార్థన జరిపి పూర్ణాభిషే కం నిర్వహించి అమ్మవారిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలి మా దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్న అనంతరం అమ్మవారి సన్నిధిలో జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఉగాది పర్వదినం కావడంతో భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. లక్ష పుష్పార్చనలో భాగంగా ఉత్సవాల మొ దటిరోజు పసుపు రంగు చామంతులకు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు జ్యోతి ష్య పండితులు రాధాకృష్ణశర్మ సిద్ధాంతిచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. -
వైభవంగా సీతారాముల ఊరేగింపు
● ప్రారంభమైన సీతారామ కల్యాణ వసంత నవరాత్రి వేడుకలు ● పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమ మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో 68వ కల్యాణ వసంత నవరాత్రి వేడుకలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమ, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతిరమేష్ దంపతులు పూజలు నిర్వహించి, రథంలాగి ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళవాయిద్యాలతో సీతారామ, లక్ష్మణ, ఉత్సవమూర్తులను రథంలో కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలో విఘ్నేశ్వర పూజ, అఖండ కలశ విగ్రహ ప్రతిష్ట, మధ్యాహ్నిక భోగం, నీరాజనం, మంత్ర పుష్ప పూజలు చేశారు. కార్యక్రమంలో బ్రహ్మశ్రీ గుడి రాధాకృష్ణమూర్తి, ఆలయ ప్రధానార్చకులు ఎంవీ కృష్ణప్రసాద్, ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ గురునాథరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, వాంకుడోత్ కొమ్మాలు, జ్ఞానేశ్వర్, యాకన్న, విజయ్, కార్తీక్, సోమశ్రీను, రవికుమార్, నరసింహారావు, శక్రు పాల్గొన్నారు. -
పరాభవాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ● శ్రీరామ ఆలయంలో పంచాంగ పఠనంమహబూబాబాద్ రూరల్ : శ్రీపరాభవనామ సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. నూతన తెలుగు సంవత్సరాది, శ్రీపరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో గురువారం పంచాంగ పఠనం ఏర్పాటు చేశారు. బ్రాహ్మణోత్తములు బ్రహ్మశ్రీ గుడి రాధాకృష్ణమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ఎమ్మెల్యే మురళీనాయ క్, డీసీసీ అధ్యక్షురాలు ఉమ, మున్సిపల్ చైర్ పర్స న్ జ్యోతిరమేష్ దంపతులు హాజరై శ్రీసీతారాముల సన్నిధిలో పంచాంగ పఠనాన్ని ప్రారంభించారు. ఆలయంలో పూజలు చేయగా ఆలయ ప్రధాన అర్చకులు ఎంవీ.కృష్ణప్రసాద్ ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ గుడి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ పరాభవ నామ సంవత్సరాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే పరా అంటే దివ్యశక్తి, ఆదిపరాశక్తి అని, భవ అంటే పరమశివుడు అని తెలిపారు. ఈ పరాభవ నామ సంవత్సరం పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మన జీవితాలను నడిపించే సంవత్సరం అని భావించవచ్చని సూచించా రు. పరాభవం అంటే ఓటమి కాదని, మనల్ని మనం తెలుసుకునే ఒక అవకాశమని వివరించారు. పడిపోవడం సహజంకానీ లేచినిలబడటం గొప్పతనమని, భయపడకుండా నమ్మకంతో ముందుకు సాగాలని, దైవానుగ్రహంతో విజయాన్ని సాధించాలన్నారు. కార్యక్రమంలో సహ అర్చకులు మారేపల్లి కౌశిక్ శర్మ, హరి శ్రీవాస్తవ, ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఊరె గురునాధరావు, ఓంనారాయణ లోయ, రమేష్, అజయ్ సారథి రెడ్డి, అరుణ, పద్మం ధనలక్ష్మి, మాధవి, లావణ్య పాల్గొన్నారు. -
గ్యాస్ కొరత.. హోటళ్ల మూత!
మహబూబాబాద్: గ్యాస్ కొరత లేదని.. సరిపోను నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా.. వ్యాపారులు, ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. అంతకుముందు గ్యాస్ బుక్ చేసిన మరుసటి రోజే సిలిండర్ డెలివరీ చేసేవారు కానీ ప్రస్తుతం వారం పది రోజులైనా డెలివరీ చేయడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ కొరత ఉందని నిర్వాహుకులు హోటళ్ల మూసివేస్తున్నారు. 2,11,531 కనెక్షన్లు.. జిల్లాలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 2,11,531 గ్యాస్కనెక్షన్లు ఉన్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.924 ఉండగా రూ.984కు చేరింది. డెలివరీ బాయ్ అదనంగా తీసుకునే డబ్బులతో కలిపితే వినియోగదారులు రూ.1,000 చెల్లించాల్సి వస్తుంది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.115 పెరిగింది. గ్యాస్ ధరలు పెరిగినా పరిస్థితులను అర్థం చేసుకున్న ప్రజలు డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ, బుక్‌చేస్తే సుమారు వారం నుంచి పది తర్వాత సిలిండర్ వస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. మూత పడుతున్న హోటళ్లు జిల్లా కేంద్రంలో సుమారు 100కిపైగా హోటళ్లు ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో సగానికిపైగా టిఫిన్ హోటళ్లు మూత పడ్డాయి. అయితే హోటళ్లు మూసివేయడానికి కేవలం గ్యాస్ కొరత, పెరిగిన ధరలే కారణమని నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం. ఇక కొంత మంది వ్యాపారులు ఇదే అదునుగా టిఫిన్ ధరలు సుమారు రూ.10వరకు పెంచారు. పెరిగిన వంట చెరుకు డిమాండ్.. క్వింటా వంట చెరుకు అంతకు ముందు రూ.600 ఉండగా ప్రస్తుతం రూ.800 తీసుకుంటున్నారు. గ్యాస్ కొరతతో మిల్లుల్లోని వంట చెరుకు పూర్తిగా అయిపోయింది. దాంతో వంట చెరుకు డిమాండ్ పెరిగింది. కర్రీ పాయింట్ నిర్వాహుకులు ఎక్కువగా వంట చెరుకుపై ఆధార పడుతున్నారు. పెద్ద హోటళ్లలో బట్టీలు ఉండడంతో వారు హోటళ్లు కొనసాగిస్తున్నారు. చాలా మంది వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లనే వినియోగిస్తున్నట్లు సమాచారం. కొరత లేదన్న మంత్రి రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని సంబంధిత మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. సంబంధిత అధికారులు గ్యాస్ గోదాంలు, కార్యాలయాలు, హోటళ్లలలో తనిఖీలు చేస్తున్నారు. అధికారులు కొరతలేదని చెబుతున్నా.. వినియోగదారులు ఆయా ఏజెన్సీల వద్ద ఖాళీ సిలిండర్లతో క్యూలో ఉంటూనే ఉన్నారు. బుకింగ్ చేసి పదిరోజులు గడిచినా సిలిండర్లు రాకపోవడంతో ఏజెన్సీల వద్ద గంట తరబడి వినియోగదారులు పడిగాపులు గాస్తున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లా కేంద్రంలోని కొండపల్లి గోపాల్‌రావునగర్ కాలనీకి చెందిన మహ్మద్ సిద్దిక్ మాత్రం తన టిఫిన్ సెంటర్లో ధరలు పెంచకుండా కేవలం రూ.25కే అల్పాహారం అందిస్తున్నారు. గ్యాస్ కొరత లేదు గ్యాస్ కొరత లేదు. కానీ బుకింగ్ బాగా పెరిగింది. దాంతో డెలివరీ సమస్య మాత్రమే ఉంది. బ్లాక్‌లో విక్రయాలు జరుగకుండా చర్యలు తీసుకున్నాం. బుకింగ్ పెరగడంతో డెలివరీ వారం రోజులు పడుతుంది. వినియోగదారులు సహకరిస్తే ఇబ్బందిలేకుండా చూస్తాం. – బోనగిరి ప్రసాద్, మేనేజర్, హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ, మానుకోట పెరిగిన ధరతో చిరువ్యాపారులపై భారం బుక్ చేస్తే వారం తర్వాతే సిలిండర్ డెలివరీ పెరిగిన బుకింగులు.. ఆలస్యమవుతున్న సిలిండర్ల సరఫరా -
భద్రతా సూచనలు పాటించాలి
● ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని మహబూబాబాద్ రూరల్ : ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆర్పీఎఫ్ అధికారుల ఆదేశాల మేరకు భద్రతా సూచనలు పాటించాలని ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని అన్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో గురువారం తనిఖీలు చేపట్టి, ప్రయాణికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని మాట్లాడుతూ సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆళ్లకుంట నవీన్ కుమార్ ఆదేశాల మేరకు వేసవి కాలం, వేసవి సెలవులు, శాంతిభద్రతల దృష్ట్యా ప్రయాణికులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. రైల్వే పరిసరాల్లో ప్రజలు అనధికారికంగా బండ్లను ఆపోద్దని, పట్టాలు దాటొద్దని, పేలుడు పదార్థాలతో ప్రయాణించడం నేరమని వివరించారు. వేసవికాలంలో మంటలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై వివరించారు. రైల్వే అభివృద్ధి, రైల్వే ఆస్తుల రక్షణ, ప్రయాణికుల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తామని, ఇందుకు ప్రజలు, ప్రయాణికులు సహకరించాలని కోరారు. -
పిచ్చుకలు.. ప్రకృతి నేస్తాలు!
తగ్గిపోవడానికి కారణాలెన్నో.. పిచ్చుకల సంతతి తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. విద్యుత్తు ,పెట్రోల్ వంటివి వినియోగం, సెల్టవర్ల కారణంగా పెరుగుతున్న రేడియేషన్, పట్టణీకరణ పేరుతో ఎక్కడికక్కడ సిమెంట్ ఇళ్ల నిర్మాణాలు, కనీసం ఇవి గూడు పెట్టుకునే ఆవాసాలు లేకపోవడం, వ్యవసాయంలో పురుగు మందులు, క్రిమి సంహారక మందుల వినియోగం బాగా పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఖిలా వరంగల్: జీవ పరిణామ క్రమంలో ఉద్భవించిన అద్భుత జంతుజాలమే పక్షులు.. ఈ సంపద ప్రకృతి వరప్రసాదం. అందులో పిచ్చుకలు.. ప్రకృతికి అందం, మానవాళికి జీవవైవిధ్యంతోపాటు ఆనందాన్ని అందిస్తాయి. ఒకప్పుడు ఉదయం లేవగానే నగర, పట్టణ,గ్రామాల్లో ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేవి. ఇళ్లల్లోకి వచ్చి కిచకిచమంటూ పలకరించేవి. చప్పుడు చేయగానే తుర్రుమంటూ ఎగిరిపోతుండేవి. కాలక్రమంలో ఈబుజ్జి పక్షులు మన జీవితాల నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించడంతో పాటు వాటి ప్రాఽధాన్యం మానవాళికి తెలియజేయడం కోసం ఏటా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిచ్చుకలతో మానవాళికి మనుగడ.. చూసేందుకు చిన్నవిగా ఉండే పిచ్చుకలు మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పంటలను ఆశించే వివిధ కీటకాలను తినడం ద్వారా తెగుళ్లు రాకుండా పరోక్షంగా రైతులకు మేలు చేస్తాయి. వివిధ పంటల్లో పరాగ సంపర్కం జరిగేలా చేసి దిగుబడులు పెంచుతాయి. నేలను సారవంతం చేస్తూ భూమిలో మొక్కలు మొలకెత్తేందుకు దోహదం చేస్తాయి. మనమేం చేయాలంటే.. అవగాహన ఉన్న కొందరు గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు తమ పంట పొలాల్లో పక్షుల కోసం ప్రత్యేకంగా టీ ఆకారంలో కర్రలను ఉంచడం ద్వారా వాటిపై పక్షులు వాలుతుంటాయి. ● పొలం గట్లపై మోదుగు, సీమ చింత, మల్బ రీ, నేరేడు వంటి పండ్ల చెట్లను పెంచడం ద్వారా పక్షులు పంట పొలాలకు దగ్గరలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ● నగరాల్లో ప్రత్యేక గూళ్లు లభ్యమవుతున్నాయి. ఇంటి ఫోర్టికో వద్ద, పరిసరాల్లో ఆ గూళ్లను ఏర్పాటు చేసి అక్కడక్కడా డబ్బాల్లో ధాన్యం గింజలు, తాగునీరు అందుబాటులో ఉంచాలి. సంరక్షణ బాధ్యతగా భావించాలి.. మానవ జాతి మనుగడతో ముడిపడి ఉన్న పిచ్చుకల సంరక్షణను బాధ్యతగా భావించాలి. అందరూ తమ ఇళ్ల ముందు మొక్కలు నాటి, ఇంటి సరిసరాల్లో పిచ్చుకలు నివసించడానికి వీలుగా చెక్కతో తయారు చేసిన డబ్బాలను అమర్చాలి. వాటిలో ధాన్యం, నీళ్లు అందించాలి. పిచ్చుకలు ఇళ్లల్లో నివసిస్తే ఆ ఇంటికి శుభ సూచకంగా భావిస్తారు. – గాదె స్వరూప్‌రెడ్డి పక్షి ప్రేమికుడు హనుమకొండ మందుల వినియోగం తగ్గాలి.. తెగుళ్లు నివారణ కోసం విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వినియోగం వల్ల పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులతోపాటు పిచ్చుకల మనుగడకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది. రైతు నేస్తాలుగా వీటిని పరిగణించి వాటికి ప్రత్యేకంగా ఆవాసాలు కల్పించాలి. పిచ్చుకల దినోత్సవాలను నిర్వహించడం ద్వారా ఈచిన్న పక్షులను మన జీవితాల్లోకి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు జరగాలి. – డాక్టర్ అరుణ్‌జ్యోతి, కేవీకే శాస్త్రవేత్త ● ఆహ్లాదాన్ని పంచే అతి చిన్న పక్షులు రక్షిస్తేనే పర్యావరణ సమతుల్యత నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -
ఉగాది పురస్కారానికి సమ్మక్క పూజారి కృష్ణయ్య ఎంపిక
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్య ఉగాది పురస్కారానికి ఎంపియ్యారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంలో చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణే రూపంలో అమ్మవారిని గద్దైపెకి సమ్మక్క పూజారులతో కలిసి కొక్కెర కృష్ణయ్య తీసుకొస్తారు. ఈ క్రమంలో క్రిష్ణయ్యను ప్రభుత్వం ఉగాది పురస్కారానికి ఎంపిక చేసింది. గురువారం ఆయన హైదరాబాద్‌లో సీఎం చేతుల మీదుగా పురస్కారం అందుకోవాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఆయన హైదరాబాద్ వెళ్లలేకపోయారు. ఉగాది పురస్కారానికి ఎంపికై న కృష్ణయ్యను సమ్మక్క– సారలమ్మ పూజారులతో పాటు మేడారం గిరిజన అభ్యుదయ సంఘం యువకులు, స్థానిక ఆదివాసీలు, భక్తులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్(తూర్పు)నియోజకవర్గ పరిధి ఎల్బీనగర్లోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ‘ఈద్ కా తోఫా’ ‘ఇఫ్తార్’ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లింలకు కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రేమ, దయ, త్యాగానికి ప్రతీకన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడేలా ప్రతీ ఒక్కరు ముందుకు రావాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. పండుగల సందర్భంగా అవసరమైన సాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద, పీసీసీ నాయకులు మీసాల ప్రకాశ్, నవీన్‌రాజు, కార్పొరేటర్లు ఫుర్ఖాన్, సోమిశెట్టి ప్రవీణ్‌కుమార్, ఆర్డీఓ సుమ, డీఎండబ్ల్యూఓ రమేశ్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రంజాన్ కానుకల పంపిణీ, ఇఫ్తార్ విందులో డీసీసీ అధ్యక్షుడు ఆయూబ్తోపాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఆయన వర్గీయులు కనిపించకపోవడంతో పలువురు గుసగుసలాడుకున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ -
కేఎంసీలో నాలుగో కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశా ల ఈఎన్టీ విభాగంలో నాలుగో కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను పీఎంఎస్ఎస్వై ఆస్పత్రిలో బుధవారం విజయవంతంగా పూర్తిచేసినట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య అనిల్ తెలి పారు. జనగామ జిల్లా రాజవరం గ్రామానికి చెందిన బైరగోని నరేశ్, గౌతమి దంపతుల కుమారుడు రుద్రాంత్(నాలుగేళ్ల వయసు)కు ఎంజీఎం సూపరిండెంట్ హరిశ్చంద్రారెడ్డి సమక్షంలో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో డాక్టర్లు ఆనంద్ ఆచార్య, మనీష్‌కుమార్, సంపత్‌రావు, అనస్థీషీయా ప్రొఫెసర్లు మురళీ, హనుమంతరావు, ఆడియాలజిస్టులు వీణ, రతన్‌సింగ్ ముఖ్యపాత్ర పోషించారు. -
ఆలిండియా జూడో టోర్నమెంట్‌కు కేయూ జట్లు
కేయూ క్యాంపస్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ జూడో టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ జూడో పురుషుల, మహిళల జట్లు పాల్గొననున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వెంకయ్య బుధవారం తెలిపారు. చంఢీఘర్ యూనివర్సిటీలో ఈనెల 22 వరకు నిర్వహించనున్న జూడో పోటీల్లో పాల్గొనే జట్టులో ఎం.సాయికిరణ్నాయక్ (యూసీపీఈ, వరంగల్) ఎం.దర్శి త్నాయక్ (ఎల్బీ కాలేజీ, వరంగల్), కె.అనూష, డి.నక్షత్ర (టీజీఎస్‌డబ్ల్యూ ఆర్డీసీ, వరంగల్ వెస్ట్), డి.బేబీ లాహా (టీజీటీడబ్ల్యూ ఆర్డీసీ, వరంగల్ వెస్ట్) ఉన్నారని వెంకయ్య తెలిపారు. ఈజట్లకు టీజీటీడబ్ల్యూ ఆర్డీసీ కొత్తగూడెం ఫిజికల్ డైరెక్టర్ డి.శ్వేత మేనేజర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. 20 నుంచి కేవీలో అడ్మిషన్‌కు దరఖాస్తులుకాజీపేట అర్బన్ : కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతిలో ప్రవేశానికి ఈనెల 20వ తేదీనుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు అడ్మిషన్లకు దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 1వ తరగతిలో ప్రవేశానికి 6 నుంచి 8 ఏళ్ల వయసులోపు విద్యార్థులు అర్హులుగా పేర్కొంది. ఆన్లైన్లో kvadmissions అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక తొలి జాబితాను ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారు. -
టిప్పర్ ఢీకొని మహిళ దుర్మరణం
కురవి : టిప్పర్ ఢీకొని ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామంలోని 365/ఏ జాతీయ రహదారిపై జరిగింది. సీరోలు ఎస్సై సంతోష్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాగటి పద్మ(50) మంగళవారం రాత్రి తన ఇంటి ఎదుట నిలబడి ఉంది. ఈ క్రమంలో టిప్పర్.. ఆమెను ఢీకొని ఆగకుండా వెళ్లింది. ఈ ఘటనపై స్థానికులు అదే రాత్రి సీరోలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీరోలు ఎస్సై సంతోష్ సిబ్బందితో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం సీసీ కెమెరాలను పరిశీలించగా టిప్పర్ ఆచూకీ లభ్యమైంది. దీంతో డ్రైవర్ నర్సింహస్వామి అరెస్ట్ చేసినట్ల ఎస్సై సంతోష్ బుధవారం తెలిపారు. న్యాయం చేయాలని ధర్నా.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగటి పద్మ కుటుంబీకులకు న్యాయం చేయాలని గ్రామస్తులు, బాధితులు సీరోలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళన చేసిన వారిలో ఉపేందర్, సంపత్, రామన్న, వెంకన్న తదితరులు ఉన్నారు. ఉప్పరిగూడెంలో ఘటన న్యాయం చేయాలని పీఎస్ ఎదుట ధర్నా -
వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు
వరంగల్ లీగల్ : వరంగల్ జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ తమిళనాడునుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి పంపినట్లు గమనించారు. దీంతో ఒక్కసారిగా బెంబేలెత్తిన కక్షిదారులు, న్యాయవాదులు పరుగున కోర్టు హాల్ నుంచి బయటికి వచ్చారు. జిల్లా జడ్జి ఫిర్యాదుతో బాంబు, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. గతంలో రెండు సార్లు ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ చేసి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కోర్టు సంబంధించి ప్రధాన ప్రవేశ మార్గాల్లో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. అశ్రునయనాల మధ్య శ్వేత అంత్యక్రియలు పూర్తి కాజీపేట అర్బన్ : నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కూతురు శ్వేత అంత్యక్రియలు బుధవారం నగరంలోని వికాస్‌నగర్‌లో అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. శ్వేత ఉన్నత చదువు కోసం అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లి అక్కడే భర్త సురేశ్‌రెడ్డి, ఇద్దరు పిల్లలతో ఉంటుంది. ఈ క్రమంలో ఈనెల 8వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, శ్వేత పార్థివదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేందుకు సమీప బంధువు కృష్ణారెడ్డి.. రాజ్యసభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి కేంద్రహోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. అమెరికాలోని భారత రాయబారి కార్యాలయ అధికారులను ఆదేశించడంతో శ్వేత మృతదేహాన్ని హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని నివాసానికి తీసుకొచ్చారు. బుధవారం పద్మాక్షిగుట్ట సమీపంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ‘గివ్ పేపర్ బ్యాక్’ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ కాజీపేట అర్బన్: యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘గివ్ పేపర్ బ్యాక్’ ప్రోగ్రాం వాల్‌పోస్టర్‌ను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ బుధవారం ఆవిష్కరించారు. కళాశాలలు, స్కూళ్లలో విద్యార్థుల వద్ద నుంచి వారి పాత నోట్ పుస్తకాలను సేకరించి రీసైకిల్ చేసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన పుస్తకాలను అందజేసే లక్ష్యం అభినందనీయమని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ కొనియాడారు. కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్లు సంపత్‌రెడ్డి, బాలప్రకాశ్, కిరణ్ కుమార్, హెచ్ఎంలు భాస్కర్‌రెడ్డి, సతీశ్పాల్, యూత్ ఫర్ సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
భద్రకాళి ఆలయంలో నేటినుంచి వసంత నవరాత్రులు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో గురువారంనుంచి వసంత నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని, ప్రతిరోజూ ప్రత్యేక పూలసేవ జరుగుతుందని ఈఓ రామల సునీత తెలిపారు. ఉగాదిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం 6గంటలకు ఐనవోలు రాధాకృష్ణశర్మ పంచాంగ శ్రవణం చేస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా బుధవారం బ్యాండ్‌మేళం చిత్రం యూనిట్ దేవాలయాన్ని సందర్శించింది. హీరో హీరోయిన్ రోషన్, శ్రీదేవి, రచయిత, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు సతీశ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉగాదిని పురస్కరించుకొని తెలంగాణ కుమ్మరి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు రుద్వారపు కుమారస్వామి ఆధ్వర్యంలో కొత్త మట్టి కుండలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవునూరి రామ్మూర్తి, నాగరాజు, భాస్కర్, సంతోష్, సముద్రాల రాజ్‌కోటి, రమేశ్‌మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
హజ్ యాత్రికులు పలు జాగ్రత్తలు పాటించాలి
● హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ ఖుస్రూపాషాఎంజీఎం / న్యూశాయంపేట: పవిత్ర మక్కా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు ఆరోగ్య సంబంధించిన విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొని యాత్రకు సన్నద్ధం కావాలని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా సూచించారు. వరంగల్ ఐఎంఏ హాల్లో వరంగల్ హజ్ కమిటీ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకు సంబంధించిన యాత్రికులకు బుధవారం నిర్వహించిన మెడికల్ స్క్రీనింగ్ క్యాంపులో ఆయన మాట్లాడారు. ఇండియాలో కంటే సౌదీ అరేబియాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, వాటిని తట్టుకునే విధంగా సౌదీ ప్రభుత్వం పలు సూచనలు చేసిందని, వాటిని పాటించాల్సి ఉందని చెప్పారు. వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ ఉచిత స్కీనింగ్ క్యాంపును యాత్రికులు సద్వినియోగం చేసుకుని, ఆరోగ్యకరంగా ఉండి హజ్‌యాత్రను పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హజ్ యాత్ర గైడ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా హజ్ కమిటీ చైర్మన్ సర్వర్ మొహియొద్దీన్ ఘాజీ, కమిటీ సభ్యులు అఫ్జల్ మొహియొద్దీన్, అజీజ్, నజ్మొద్దీన్ గిలానీ, మహ్మద్ మాజిత్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
● మూడు తులాల బంగారు ఆభరణాల స్వాధీనం ● వివరాలు వెల్లడించిన పోలీసులు స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తానేదార్‌పల్లిలో గత నెల 3వ తేదీన జరిగిన చోరీని పోలీ సులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడు మోడెం తలుపులయ్యను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి మూడు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రైనీ ఐపీఎస్, ఇన్చార్జ్ ఎస్హెచ్ఓ మనీషానెహ్రా వివరాలు వెల్లడించారు. తానేదార్పల్లికి చెందిన గడెం కొమురయ్య కోళ్ల ఫామ్‌లో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజవోమంగి మండలం వంచంగి గ్రామానికి చెందిన తలుపులయ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా, ఈ నెల 3న కోళ్ల ఫారం వద్ద ఉన్న కొమురయ్య గది నుంచి తలుపులయ్య మూడు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితుడు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సీఐ జి.వేణు ఆధ్వర్యంలో సిబ్బంది శివునిపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా తలుపులయ్య అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ట్రైనీ ఐపీఎస్ తెలిపారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
పెద్దవంగర: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, డైట్ మెనూ కచ్చితంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం, బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కామన్ డైట్ మెనూ ప్రకారం బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ సమయానికి అందించాలని వార్డెన్‌కు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించాలన్నారు. షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక చొరవ చూపాలన్నారు. హాస్టల్ పరిసరాలు, కిచెన్ షెడ్, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్, ఎంపీడీఓ వేణుమాధవ్, ఆర్ఐ లస్కర్ తదితరులు పాల్గొన్నారు. అర్హులకు ‘డబుల్’ ఇళ్లు అందించేందుకు కృషి తొర్రూరు: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. డివిజన్ కేంద్రంలోని అన్నారం రోడ్డు, గోపాలగిరి రోడ్డులోని డబుల్ బెడ్రూం ఇళ్లను బుధవారం పరిశీలించారు. నిర్మాణాలు పూర్తయిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని, వివిధ దశల్లో ఆగిన నిర్మాణాల పూర్తికి చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీటి సౌకర్యం, డ్రెయినేజీలు, సీసీ రోడ్లు వంటి సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి అర్హులను గుర్తించాలని, ఇళ్ల కేటాయింపులో ఎలాంటి పైరవీలకు తావు లేదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, హౌజింగ్ అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
ముందస్తు గ్యాస్ బుకింగ్ చేయొద్దు
● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ మహబూబాబాద్: అనవసరంగా ముందస్తు గ్యాస్ బుకింగ్ చేయవద్దని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హెచ్‌పీగ్యాస్ గోదాం, మానుకోట మండలం మల్యాల గ్రామంలోని శ్రీధర్ ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ గోదాంను బుధవారం అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాంలలో ఉన్న నిల్వలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. 25రోజుల తర్వాత మాత్రమే గృహ అవసరాల కోసం బుకింగ్ చేసుకోవాలన్నారు. డీసీఎస్ఓ రమేశ్, తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. -
మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి
కొత్తగూడ: విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండలంలోని పొగుళ్లపల్లి ఏకలవ్య గురుకుల జూనియర్ కళాశాల, మండల కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాల, వంటగది, స్టాక్ రూంలను పరిశీలించారు. ఆశ్రమ పాఠశాల హాస్టల్లో కట్టెల పొయ్యి ఎందుకు వాడుతున్నారని, ఎల్పీజీ ఎందుకు వాడడం లేదని హెచ్డబ్ల్యూఓను ప్రశ్నించారు. మెనూ ప్రకారం ఈరోజు చికెన్ పెట్టాల్సి ఉండగా.. కూరగాయలు ఎందుకు వండారని అడిగారు. హెచ్‌డబ్ల్యూఓ అనూష సమాధానం ఇస్తూ విద్యార్థుల కోరిక మేరకు గురువారం ఉగాది సందర్భంగా చికెన్ అందించేందుకు ఈరోజు కూరగాయల భోజనంపెట్టినట్లు తెలిపారు. తనకు నెల రోజుల క్రితం హాస్టల్ బాధ్యతలు ఇచ్చారని, గతంలో మాది రిగానే కట్టెల పొయ్యి వాడుతున్నట్లు చెప్పారు. ఏటా పాఠశాలకు రూ.35 లక్షల గ్రాంట్ వస్తుందని, ఎలా వినియోగిస్తున్నారో బిల్లులు చూపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్పీజీ వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఉపాధ్యాయుల పనితీ రును సబ్జెక్టుల వారీగా పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీ చేశారు. తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ మున్వర్, ప్రిన్సిపాల్ గోవిందరావు, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆదిలక్ష్మి పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ -
కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫీజులకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, అలాగే మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల బ్యాక్ లాగ్ విద్యార్థులకు బీఏ, బీకాం, బీఎస్సీ, ఒకేషనల్ బీఏ(ఎల్) బీసీఏ, బీహెచ్ఎం సిటీ, పీడీసీ (ప్రిడిగ్రీకోర్సు) ఫస్టియర్, సెకండియర్ కోర్సుల పరీక్షలకు ఫీజు నోటిఫికేషన్ జారీచేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి, పి. వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుములేకుండా ఏప్రిల్ 4వతేదీ వరకు ఫీజు చెల్లించాలన్నారు. రూ. 50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 9వతేదీ వరకు చెల్లించుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. -
ఈద్ కా తోఫా.. ఇఫ్తార్‌కి దావత్
న్యూశాయంపేట : పవిత్ర రంజాన్ మాసం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ముస్లింలు ఈద్–ఉల్–ఫితర్‌ను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈద్ కా తోఫా పేరుతో రంజాన్ కానుకల పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేసింది. దీంతోపాటు అధికారిక ఇఫ్తార్ విందులను నిర్వహిస్తోంది. ఈ పండుగ సంతోషం కేవలం ఉన్నత వర్గాలకు పరిమితం కాకూడదని, నిరుపేద ముస్లిం కుటుంబాల్లో కూడా వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈద్ కా తోఫాలు అందజేసి రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు చేపట్టిన వారికి ఇఫ్తార్ దావత్‌లు ఏర్పాటు చేస్తోంది. ఇది కేవలం ఫలం, భోజనం మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యతను చాటే అద్భుత సందర్భం. మరో వైపు నూతన వస్త్రాలు అందజేసి నిరుపేద కుటుంబాల్లో పండుగ పూట వెలుగులు నింపుతోంది. మసీదులు, ఈద్గాలో కమ్యూనిటీ హాళ్లలో వేలాది మంది కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొనడం వరంగల్ లాంటి చారిత్రక జిల్లాలో సోదర భావా నికి నిలువుటద్దంగా నిలుస్తోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో తోఫాల పంపిణీ, ఇఫ్తార్ విందుల ఏర్పాటు పకడ్బందీగా జరుగుతున్నాయి. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా అర్హుడైన ప్రతీ నిరుపేద ప్రయోజనం పొందేలా అధికారులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందు (దావత్)లు కేవలం ముస్లింలకే కాకుండా అన్ని వర్గాల ప్రజల మధ్య సోదర భావం పెంపొందిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రతీ కాన్స్టెన్సీలో వెయ్యిమందికి పైగా ఉపవాస దీక్షా పరులు(రోజేదార్) విందులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన మసీదుల్లో ఏర్పాట్లు చేసి పేదలకు ఇఫ్తార్ సమయానికి అవసరమైన ఖర్జూరాలు, పండ్లు, మంచినీరు, పంపిణీ చేసేందుకు నిధులు విడుదల చేశారు. ప్రతీ పేద ముస్లిం కుటుంబం పండుగను ఆత్మగౌరవంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈద్‌కా తోఫా పేరుతో రంజాన్ కానుకలు అందజేస్తున్నారు. ఈ కిట్‌లో జత పురుషుల వస్త్రాలు (కుర్తా, పైజమా), మహిళలకు నాణ్యమైన చీర లేదా సల్వార్ కమీజ్‌లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికన మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారుల జాబితా రూపొందించారు. స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లక్షలాది రూపాయల వ్యయంతో అటు ఈద్ కా తోఫాల పంపిణీ, ఇటు అధికారిక ఇఫ్తార్ దావత్‌లు నిర్వహిస్తూ అందజేస్తున్నారు. ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా తోఫాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది. నియోజక వర్గ స్థాయిలో అన్ని మండలాల్లో ఆర్డీఓ, తహసీల్దార్ల ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక మసీదు కమిటీల సమన్వయం, సహకారంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పండుగకు ముందే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేల సంఖ్యలో ఉన్న పేద ముస్లిం కుటుంబాలు ఈద్‌కా తోఫాలు అందుకుంటున్నారు. ఇప్పటికే నిల్వలను మండల కేంద్రాలకు చేరవేసిన అధికారులు.. రంజాన్ పండుగ నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.జిల్లా ఈద్‌కా ఇఫ్తార్ తోఫాలు దావత్‌కు నిధులు వరంగల్ 3,000 రూ. 12 లక్షలు హనుమకొండ 2,500 రూ.10 లక్షలు మహబూబూబాద్ 1,250 రూ.05 లక్షలు జనగామ 2,000 రూ.08 లక్షలు జేఎస్ భూపాలపల్లి 750 రూ.03 లక్షలు ములుగు 750 రూ. 03 లక్షలు మొత్తం 10,250 రూ.41 లక్షలు నిరుపేద కుటుంబాల్లో సంతోషం రెట్టింపు ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలకు 10,250 కిట్లుపేద ముస్లింలకు పండుగకు ముందే తోఫాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది రంజాన్ పండుగకు మరిన్ని పంపిణీ చేయాలి. చాలా మంది నిరుపేదలకు అందడం లేదు. పండుగ రోజు ఓ నిరుపేద కుటుంబం కొత్త బట్టలు ధరించి సంతోషంగా ఉంటే అది సమాజానికే గర్వకారణంగా ఉంటుంది. రంజాన్‌కు ఐదు రోజుల ముందు ప్రత్యేక సెలవులు అధికారికంగా ప్రకటించాలి. – మహ్మద్ తాజుద్దీన్, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి స్టేట్ సెక్రటరీ -
చేనేత ఉత్పత్తులకు ‘టెండర్’ చిచ్చు
కాశిబుగ్గ: తెలంగాణలో చేనేత పరిశ్రమ వేలాది కుటుంబాలకు జీవనాధారం. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నేత కార్మికులకు ఈ వృత్తి సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోంది. తరాల నుంచి ఈ వృత్తిని నమ్ముకుని చాలీచాలని సంపాదనతో నెట్టుకొస్తున్న చేనేత కార్మికులపై పిడుగు పడినట్లు తెలంగాణ సర్కారు జీఓ జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాము రేయింబవళ్లు కష్టపడి పోగుపోగు కలుపుతూ తయారు చేసిన కార్పెట్లు, బెడ్షీట్ల కొనుగోళ్లకు టెండర్ విధానం గొడ్డలిపెట్టుగా మారిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల చర్యలతో తాము ఉపాధి కోల్పోయే దుస్థితి ఏర్పడుతుందని కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. చేనేత వృత్తితో వేల కుటుంబాలు ఉపాధి.. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సుమారు పదివేల చేనేత కుటుంబాలు ఆధారపడగా, అనుబంధంగా మరో 15వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 60కు పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, 35 వరకు మ్యాక్స్ సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ సంఘాల ద్వారా తయారు చేసిన కార్పెట్లు, బెడ్షీట్లు తెలంగాణలో ఉన్న టెస్కో ద్వారా కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆప్కో ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వ రంగ సంస్థలు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు సరఫరా చేసేవారు. టెస్కో ద్వారానే ఆయా సంఘాలకు డబ్బులు చెల్లించిన తర్వాత కార్మికులకు వేతనాలు ఇచ్చేవారు. టెండర్ విధానంతో ఆందోళన.. ఏడున్నర దశాబ్దాల నుంచి ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేస్తున్న విధానానికి స్వస్తి చెబుతూ టెండర్ విధానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించడంపై చేనేత కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నూతన విధానంతో ప్రైవేట్ వ్యక్తులు రంగ ప్రవేశం చేయడం వల్ల వేలాది మంది రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే చేతి నిండా పనిదొరకక పస్తులు ఉంటుంటే ‘పుండు మీద కారం చల్లినట్లు’ టెండర్ విధానం ఏమిటంటూ వాపోతున్నారు. 22 రకాల వస్తువుల జాబితాలో కార్పెట్లు, బెడ్షీట్లు.. ప్రస్తుతం ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్‌లో 22రకాల కేంద్రీకృత టెండర్ల విధానానికి అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఇందులో నేత కార్మికులకు సంబంధించిన కార్పెట్లు, బెడ్షీట్లకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. తమ గోడు వినిపిస్తున్నా సంబంధిత అధికారి చలించడం లేదంటూ చెబుతున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆందోళనలో వేలాది మంది కార్మికులు ఉన్నతాధికారుల తీరుపై మండిపాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు -
ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్మి మల్లారెడ్డి మహబూబాబాద్: కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, మినిమం బేసిక్ పే చెల్లించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య భద్రతతో పాటు హెల్త్ కార్డులు, నగదు రహిత వైద్యం అందించాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవులు ఇవ్వాలని మొదటి పీఆర్సీ సిఫార్సు మేరకు ప్రతీ సంవత్సరం వెయ్యి రూపాయల చొప్పున పెంచాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేని యెడల ఈనెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు స్వప్న, మంజుల, హరి, సంజీవ తదితరులు పాల్గొన్నారు. సమయపాలన పాటించని ఉపాధ్యాయులు!మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో సోమవా రం ఒంటిపూట బడులు ప్రారంభం కాగా.. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయానికి హాజరుకాలేదు. కాగా, వారు వచ్చే వరకు తాళాలు తీయలేదు. దీంతో విద్యార్థులకు ఎదురుచూపులు తప్పలేదు. ఏటిగడ్డ గిరిజన తండా ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉదయం 7:40గంటలకు హాజరుకావాల్సి ఉండగా.. 8:20గంటలు దాటినా రాలేదు. దీంతో పాఠశాల గదుల తాళాలు తీయలేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
సేంద్రియ వ్యవసాయంతోనే లాభదాయకం
ఖిలా వరంగల్: సేంద్రియ వ్యవసాయంతోనే ఖ ర్చులు తగ్గి అధిక లాభాలు వస్తాయని ప్రధాన శాస్త్రవేత్త వెంకన్న, ఉద్యాన శాఖ అధికారి తిరుపతి, ఏరువాక శాస్త్రవేత్త రాజ్‌కుమార్, మట్టి పరీక్షల ప్రయోగశాల వ్యవసాయ అధికారి గోవర్ధన్‌రెడ్డి, బయో కంట్రోల్ ల్యాబ్ శాస్త్రవేత్త బి. మాధవి అన్నారు. వరంగల్ వ్యవసాయ శాఖ భవనంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) సహకారంతో వరి పంటల ప్రాధాన్యమైన రకాల ప్రోత్సాహం, హెచ్‌టీ పత్తి సాగు ప్రతికూల ప్రభావాలు, భూసార పరీక్షల ఆధారంగా రసాయ ఎరువుల వాడకం, నూ తన వ్యవసాయ పద్ధతులపై రైతులకు 2రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. వారు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్న సన్న రకాల ఎంపిక, నాణ్యమైన విత్తనాల వినియోగం, పురుగులు, వ్యాధులు నియంత్రణ, నేల పరీక్షల ప్రాముఖ్యత, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ నెలకుర్తి రవీందర్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి, ఆశాదీప్, తదితరులు పాల్గొన్నారు. ప్రధాన శాస్త్రవేత్త వెంకన్న -
ఎర్ర బంగారమే
ఎటు చూసినా..వరంగల్: మిర్చి సీజన్ ఊపందుకోవడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి భారీ మొత్తంలో తరలివస్తోంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం సుమారు 70వేల వరకు మిర్చి బస్తాలు వచ్చాయి. దీంతో ఏ యార్డులో చూసినా ఎర్రబంగారమే దర్శనమిచ్చింది. గురువారం ఉగాది కావడంతో రైతులు ముందుగానే పంట కోసి మార్కెట్‌కు తరలించారు. పండుగతోపాటు రెండు రోజులు మార్కెట్‌కు సెలవు ప్రకటించడంతో రైతులు పెద్ద మొత్తంలో మిర్చి తీసుకొచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పంటకు అధిక ధరలు పలుకుతుండడంతో రైతులు ఎప్పటికప్పుడు కోసిన మిర్చిని మార్కెట్‌కు తరలిస్తున్నారు. సింగిల్ పట్టీ మిర్చికి 13వ తేదీన రూ.44వేలు ధర పలకగా సోమవారం అదే రకం మిర్చికి రూ.42వేలు పలికింది. యూఎస్ 341 రకం మిర్చికి రూ.22, 400 పలకగా రూ.21,600 పలికింది. కాగా, సరుకు ఎక్కువ వచ్చినప్పుడు ధర తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పక్క జిల్లాల నుంచి వస్తున్న మిర్చి.. వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందడంతో పక్క జిల్లాలో పండిన మిర్చి కూడా తరలి వస్తోంది. పక్క జిల్లాల్లోని మార్కెట్లు చిన్నవి కావడంతో అక్కడకు ఎక్కువ మిర్చి వస్తే ఒకటి, రెండు రోజులు సెలవు ప్రకటిస్తారు. వచ్చిన మిర్చి మొత్తం కాంటాలైన తర్వాతే మళ్లీ కొనుగోళ్లు చేపడతారు. వరంగల్‌లో మిర్చిని నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీల సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోకుండా సాగుతాయి. అందుకే రైతులు వరంగల్ మార్కెట్‌కు తీసుకొస్తారని మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు తెలిపారు. వరంగల్ మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి 70 వేల బస్తాల రాక -
28న జాతీయ లోక్ అదాలత్
తొర్రూరు: ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవా లని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్‌కుమార్ కోరారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని కోర్టు ఆవరణలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ధీరజ్‌కుమార్ మాట్లాడుతూ.. అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ అమూల్యమైన జీవి తాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిమినల్, భూతగాదలు, సివిల్, డ్రంకెన్ డ్రైవ్, ట్రాఫిక్ చలాన్లు వంటి కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏపీపీ రేవతిదేవి, సీఐలు గణేష్, రాజ్‌కుమార్, ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
డీఎల్పీఓ విచారణ
కేసముద్రం: మండలంలోని బిచ్యానాయక్తండాజీపీలో డీఎల్పీఓ స్వరూప సోమవారం విచారణ చేశారు. జీపీ కార్యదర్శి తప్పుడు లెక్కలు చూపుతున్నట్లు ఆరోపిస్తూ, ఆ గ్రామ సర్పంచ్ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎల్పీఓ జీపీని సందర్శించి, విచారణ జరిపారు. ఈ నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆమె తెలిపారు. భూదాన్ భూములు కాపాడాలినెహ్రూసెంటర్: మహబూబాబాద్‌లోని భూదా న్ భూములను కాపాడి, భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమానాయక్ సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించి బడా కబ్జాదారుల భూములను మాత్రం అధికారులు వదిలేస్తున్నారని ఆరోపించారు. కబ్జాకు గురవుతున్న భూములను రెవెన్యూ అధికారులు వెలికితీయాలని తెలిపా రు. భూదాన్ భూములను కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకుని పేదలకు పంపిణీ చేయాలన్నారు. రైల్వే అండర్‌బ్రిడ్జి రహదారి మూసివేతగార్ల: గార్ల రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి రహదారిని రైల్వే మూడో లైన్ మరమ్మతుల దృష్ట్యా ఈనెల 18 నుంచి 28వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు సోమవారం రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. కాగా జీవంజిపల్లి, గండి, గండితండా గ్రామాల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. రహదారి మూతపడినందున ప్రజలు రైల్వేశాఖకు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు. ఆరోగ్య రక్షణలో టీకా ముఖ్య భూమికనెహ్రూసెంటర్: వ్యాధుల నివారణ, పిల్లలు, తల్లులను రక్షించడంలో టీకా ప్రధాన పాత్ర పోషిస్తుందని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ తెలి పారు. మాతృ, శిశు మరణాలను గణనీ యంగా తగ్గించడంలో వ్యాధి నిరోధక టీకాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. రోగ నిరోధక శక్తి సన్నగిల్లినప్పుడు, టీకా కార్యక్రమం క్రమం తప్పితే పాత వ్యాధులు తిరిగి వ్యాప్తి చెందుతాయన్నారు. టీకాలు ప్రాణాలను కాపాడటమే కాకుండా ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, అనారోగ్యంతో ముడిపడి ఉన్న ఆర్థిక నష్టాలను కూడా తగ్గిస్తాయని పేర్కొన్నారు. సకాలంలో, సరైన మోతాదులో అవసరమైన టీకాలు తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మరింత బలోపేతం చేసుకోవచ్చని డీఎంహెచ్ఓ తెలిపారు. పనిచేయని లిఫ్ట్.. పేషెంట్ల పాట్లునెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నెలల తరబడి లిఫ్ట్ పని చేయకపోవడంతో పేషెంట్లు రెండు, మూడో అంతస్తులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్య ంగా చివరి అంతస్తులో ఆర్థోవిభాగం ఏర్పాటు చేయగా.. కాళ్లు విరిగిన వారు సర్జరీ అయిన వారు మెట్ల ద్వారా కిందకు రావాల్సిన దుస్థితి నెలకొంది. కాగా మరమ్మతు పనులు చేపట్టి లిఫ్ట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు. -
ప్లాట్‌ఫాం నిర్మించండి సారూ..
మహబూబాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫాం నిర్మించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేశాఖ అధికారులు ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో అమృత్‌భారత్ పథకంలో భాగంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరిస్తున్నారు. ఈమేరకు రైల్వే మూడో లైన్ పనులు చేపట్టారు. అయితే నాలుగో నంబర్ ప్లాట్‌ఫాం నిర్మించకపోవడంతో ప్రయాణికులు రైళ్లు ఎక్కేందుకు, దిగేందుకు, బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకరంగా రైల్వే మూడో లైన్‌ను దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. – మహబూబాబాద్ రూరల్ రైళ్లు దిగి మూడో ట్రాక్ దాటి వెళ్తున్న ప్రయాణికులు -
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026
సాక్షి, మహబూబాబాద్: తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి. అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిగితే ఆర్థిక భారం తప్పడంతో పాటు.. అధునాతన వైద్యం, అందుబాటులో టీకాలు ఉంటాయని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు అనుగుణంగా జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే జిల్లాలో మాత్రం సాధారణ ప్రసవాలు పెంచడంలో ఒక్క అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు ఉందనే విమర్శలు ఉన్నాయి. ఎన్ని చెప్పినా ప్రైవేట్ ఆస్పత్రుల ధోరణి మాత్రం మారడం లేదు. దీనికి తోడు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో 90శాతం సీజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రైవేట్‌కు వెళ్తే కోతలే.. పురిటి నొప్పులతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే 90శాతం గర్భిణులకు ఆపరేషన్ చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో అయితే సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా.. ప్రసవ సమయం రాకముందే ఆపరేషన్ చేసి లక్షల రూపాయలు వసూళ్లు చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఉన్నాయి. గత ఏడాది జనవరి నుంచి గత నెల వరకు అంటే 14నెలల వ్యవధిలో జిల్లాలో మొత్తం 9,030 ప్రసవాలు జరిగాయి. ఇందులో 4,290 ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగాయి. ఇందులో 446 (10.40శాతం) మాత్రమే సాధారణ ప్రసవాలు జరిగాయి. మిగిలిన 3,844 ప్రసవాలు అంటే 89.60శాతం ఆపరేషన్లు చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో కాస్త మెరుగు... ప్రైవేట్‌తో పోలిస్తే జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగానే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు, గార్ల, గూడూరు, తొర్రూరు, పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేస్తున్నారు. అయితే గతంలో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు. 14 నెలల్లో 4,740 ప్రసవాలు జరుగగా.. ఇందులో 1,836 ప్రసవాలు(38.73 శాతం) సాధారణం, 2,904ప్రసవాలు(61.26శాతం) సిజేరియన్ చేసినట్లు సమాచారం. అయితే ప్రభు త్వ ఆస్పత్రులకు వచ్చేవారిలో మొదటి కాన్పు అయి తే ప్రత్యేక వ్యాయామాలు, ఇతర పద్ధతుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మొదటి కాన్పు సిజేరియన్ జరిగి.. రెండో కాన్పు కోసం వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ సిజేరియన్ చేయాల్సి వస్తుందని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. పర్యవేక్షణ లేక.. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లను తగ్గించేందుకు పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భ్రూణ హత్యలు, అబార్షన్ల వల్ల జిల్లాలో సెక్స్‌రేషియో వెయ్యిమందికి 836కు పడిపోయిందని, దీనిపై ఆందోళనతో మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యేక బృందాలు పర్యటించి ఇక్కడి పరిస్థితిని గమనించాయి. వీటిని చక్కబెట్టాల్సిన అధికారులు.. పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు హడావుడి చేయడం.. వైద్యారోగ్యశాఖలోని కొందరు అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మకై ్క మామూళ్లు తీసుకుంటూ.. పాపం పనిలో పాలుపంచుకుంటున్నారే విమర్శలు ఉన్నా యి. కాగా, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని, అలాగే వారిని ప్రోత్సహిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. గత ఏడాది నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ప్రసవాల వివరాలు.. ఆస్పత్రులు సాధారణ సిజేరియన్ మొత్తం ప్రభుత్వ 1,836 (38.73 శాతం) 2,904 (61.26 శాతం) 4,740ప్రైవేట్ 446 (10.40 శాతం) 3,844 (89.60 శాతం) 4,290మొత్తం 2,282 (25.30 శాతం) 6,748 (74.70 శాతం) 9,030 -
గ్యాస్ కొరత.. ఎంతటీ పరిస్థితి వచ్చే..
గార్ల: ఈ ఫొటో చూడండి.. జిల్లాలోని గార్లలో సలీం అనే టీస్టాల్ నిర్వాహకుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అయిపోవడం, రీఫిల్లింగ్ లేకపోవడంతో కట్టెలు, బొగ్గుల పొయ్యిపై టీ చేస్తున్నాడు. ‘కమర్షియల్ సిలిండర్ల కొరత ఉంది. నాకు ఈ దుకాణమే జీవవనాధారం. బంద్ చేస్తే కుటుంబం గడవదు.. అందుకే కట్టెలు, బొగ్గుల పొయ్యి ద్వారా టీస్టాల్ నడుపుతున్నా’ అని వాపోయాడు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై యుద్ధం ఆపకుంటే గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడి, ఇళ్లలో సైతం కట్టెల పొయ్యిలపై వంటలు చేసే రోజులు వస్తాయని పేర్కొన్నాడు. -
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట : వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్‌రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు. సంపులో పడి వృద్ధురాలు.. నెక్కొండ: నీటి సంపులో పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పెద్దకొర్పోలులో జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మద్దిరాల వరమ్మ (85) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నెల 15న కళ్లు తిరిగి ఇంటి పక్కన ఉన్న నీటి సంపులో పడింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయమై మృతి చెందింది. మృతురాలి కుమారుడు సాంబయ్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోమవారం తెలిపారు. రైల్వే ట్రాక్‌పై యువకుడి ఆత్మహత్య జనగామ: జనగామ రైల్వేస్టేషన్ పరిధి బాణా పురం మధ్య రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు సో మవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. యశ్వంతాపూర్–గ్వాలియర్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదు. మృతుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుంది. బ్లూ జీన్స్ ప్యాంట్, తెలుపు రంగు టీ–షర్ట్ ధరించాడు. కుడి చేతికి కంకణధార కలిగి ఉన్నాడు. తల వెంట్రుకలు సుమారు 1/4 ఇంచుల పొడవులో చిన్నగా ఉన్నాయి. మృతుడి సమాచారం తెలిసిన వారు 9247800433 నంబర్‌కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు పేర్కొన్నారు. కుక్కల దాడిలో బాలికకు గాయాలు కేసముద్రం: కుక్కల దాడిలో ఓ బాలిక తీ వ్రంగా గాయపడింది. ఈ ఘటన ము న్సిపాలిటీ పరిధి అమీనాపురం శివారు హనుమంతరావు కాలనీలో సోమవా రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నా యి. కాలనీకి చెందిన జాటోత్ రజిత మనుమరాలు చిన్ను (ఐదేళ్ల వయసు) ఇంటి బయట ఆడుకుంటుడగా కుక్కలు దాడి చేసి మెడ, వీపు భాగాల్లో కరి చాయి. ఇంతలో స్థానికులు ఆ కుక్కలను తరమడంతో ఆ బాలిక ప్రాణంతో బయటపడింది. చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. -
డిమాండ్ అంచనా మేరకు చర్యలు తీసుకోవాలి
హన్మకొండ: వేసవిలో విద్యుత్ డిమాండ్ అంచనాల మేరకు సత్వర చర్యలు తీసుకోవాలని ఎస్ఈ, డీఈలను టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. వేసవిలో చేపట్టాల్సిన విద్యుత్ పనుల పురోగతిపై సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని కార్పొరేట్ కార్యాలయం నుంచి ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈ, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ 33 కేవీ, 11 కేవీ ఫీడర్ల వారీగా సమీక్షిస్తూ ఓవర్ లోడ్ లేకుండా లోడ్ బదలాయింపు చేపట్టాలన్నారు. అవసరమున్న చోట ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని, ఈ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు సంభవించే ప్రకృతి విపత్తుకు సమాయత్తం కావాలన్నారు. 17 సర్కిళ్ల పరిధిలోని మీటర్లు లేని అంగన్వాడీ కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన అమర్చాలన్నారు. మోడల్ సోలార్ గ్రామాల పను ల పురోగతిపై సమీక్షిస్తూ.. పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. సి.ఈలు టి.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, అన్నపూర్ణ, జీఎంలు శ్రీ నివాస్, నాగప్రసాద్, మల్లికార్జున్, వాసుదేవ్, వేణుమాధవ్, ఈఈ సివిల్ వెంకటేశ్వర్లు, డి.ఈలు అనిల్ కుమార్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
అంతరాయాలకు చెక్..
నెహ్రూసెంటర్. ప్రకృతి విపత్తుల సమయంలో విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు విద్యుత్‌శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాల వల్ల అంతరాయాలు ఏర్పడిన వెంటనే విద్యుత్ పునరుద్ధరించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీంలో వాహనాలతో పాటు సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఈ మేరకు మహబూబాబాద్ సర్కిల్ పరిధిలో 2 ఈఆర్టీ (ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్) వాహనాలు, టీంను సిద్ధం చేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అంతరాలు లేకుండా, విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో.. సబ్‌డివిజన్ స్థాయిలో 7 వాహనాలను సిద్ధంగా ఉంచామని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ వాహనాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ తదితర మెటీరియల్ ముందుగానే అందుబాటులో ఉంచుకొని, సమస్య వచ్చిన ప్రాంతానికి బృందాన్ని వెంటనే పంపించి వేగంగా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో.. ఈ ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాల ద్వారా హఠాత్తుగా సంభవించే భారీ వర్షాలు, ఈదురు గాలులు, పోల్స్ కూలిపోవడం వంటి సమస్యలను పరిష్కరిస్తారు. ఈఆర్టీ వాహనాలపై 1912 అని టోల్ ఫ్రీ నంబర్ ముద్రించి ఉంటుందని, ఎటువంటి సమస్యలకై నా ఈ నంబర్లో సంప్రదించవచ్చు. 24గంటలు నంబర్ అందుబాటులో ఉంటుంది. నిరంతర విద్యుత్ సరఫరానిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది. ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విద్యు త్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తుంది. అందుకోస మే ఎమర్జెన్సీ రిస్టోరేషన్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. – విజయేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్స్ ఏర్పాటు ప్రత్యేక వాహనాలు సైతం సిద్ధం -
ఆహార అవశేషాలతో బయోగ్యాస్
కేయూ క్యాంపస్ : గృహల్లో ఉత్పత్తయ్యే ఆహారఅవశేషాల(తడి వ్యర్థాలు, కూరగాయల తొక్కలు) నుంచి బయోగ్యాస్‌ను తయారు చేయొచ్చునని హైదరాబాద్ ఐఐసీటీచీఫ్ సైంటిస్టు ఎ. గంగాగ్నిరావు అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభా గం ఆధ్వర్యంలో క్యాంపస్‌లోని పరిపాలన భ వనం సెనేట్హాల్లో సోమవారం ‘కరెంట్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్ 2026’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. అలాగే ‘గృహా సంబంధ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి’ అనే అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అనంతరం కేయూ రిజి స్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ నూతన ఆవి ష్కరణలు మానవాళికి ఉపయోగపడాలన్నారు. హైదరాబాద్‌లోని హెట్రో డ్రగ్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.మురళి మాట్లాడుతూ యూనివర్సిటీలు, పరిశ్రమలు పరస్పరం అనుసంధానమై పనిచేసినప్పుడే నూతన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయన్నారు. కెమిస్ట్రీ విభాగం అధిపతి ఎన్.వాసుదేవరెడ్డి, సైన్స్‌విభాగాల డీన్ జి. హనుమంతు, బిట్స్ ఫిలానీ ఆచార్యుడు ఎ. అమిత్నాగ్, ఐఐసీటీ శాస్త్రవేత్తలు రవిశంకర్, ఆర్. నాగరాజు మాట్లాడారు. ఆచార్య ఎస్. జ్యోతి, అధ్యాపకులు మమత, టి. రాజమణి, రంగారెడ్డి, ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అబ్‌స్ట్రాక్ పరిశోధనపత్రాల బుక్‌లెట్‌ను అతిథులు ఆవిష్కరించారు. ఈసదస్సునేటి(మంగళవారం)తో ముగియనుంది. హైదరాబాద్ ఐఐసీటీ చీఫ్ సైంటిస్టు గంగాగ్నిరావు -
ఖనిజాల వెలికితీతలో
జియాలజిస్టుల పాత్ర కీలకంకేయూ క్యాంపస్ : ఖనిజాల వెలికితీతలో జియాలజిస్టుల పాత్ర కీలకమని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని జియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ అడ్వాన్స్‌సెస్ అండ్ చాలెంజెస్ ఇన్ జియాలజీ’ అనే అంశంపై క్యాంపస్‌లోని ఫిజిక్స్ సెమినార్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో వివిధ చోట్ల ఎన్నో రకాల ఖనిజాలు ఉన్నాయన్నారు. ఆ ఖనిజ సంపదను అన్వేషించి వెలికి తీయడం జియాలజిస్టులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్ మాట్లాడుతూ జియాలజీ కోర్సు విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కూడా లభిస్తున్నాయన్నారు. నూతన అన్వేషణ పద్ధతులతో బొగ్గు, లైమ్‌స్టోన్, క్వార్ట్గ్రానైట్ వంటి ఖనిజాల నిల్వలను మరింత కచ్చితత్వంతో గుర్తించొచ్చనన్నారు. హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ విశేసాయి మాట్లాడుతూ థార్వర్ క్లాటన్లో భూశిల వనరులు ప్రత్యేకంగా మినరల్స్ మట్టి పరిమాణాలు వాటి అన్వేషణ పద్ధతులు వివరించారు. అనంతరం కేయూలో జియాలజీ విభాగం అధిపతి ఆర్. మల్లికార్జున్‌రెడ్డి, ప్రొఫెసర్ ఎంఎం ఆస్లాం మహ్మద్, విశ్రాంత ఆచార్యులు వి. మాధవన్, ఎం. పాండురంగారావు మాట్లాడారు. ఈ సదస్సులో అతిథులు సదస్సు అబ్స్ట్రాక్ట్ (సావనీర్) ఆవిష్కరించారు. పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈసదస్సునేటి(మంగళవారం) తో ముగియనుంది. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం -
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
మహబూబాబాద్: ప్రతీ కార్యాలయంలో పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయడంతో పాటు, కార్యాలయాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సమాధానం ఇస్తూ వేగంగా పరిష్కరించాలన్నారు. సీనియర్ సిటిజన్స్, భూ సంబంధిత, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వ్యవసాయం, ఇరిగేషన్, దివ్యాంగుల సమస్యలపై వచ్చిన దరఖాస్తుల విషయంలో తక్షణమే పరిష్కరించి నివేదిక అందజేయాలన్నారు. ప్రజావాణిలో 156 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లాస్థాయ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజావాణిలో 156 దరఖాస్తులు -
వరంగల్ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు ఉందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్. మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ (గురువారం)ఉగాది పండుగ సందర్భంగా సెలవు ఉందని, ఈ సమయంలో మా ర్కెట్లో క్రయ, విక్రయాలు జరగవన్నారు. 20న(శుక్రవారం)మార్కెట్లో యథావిధిగా క్రయ, విక్రయాలు జరుగుతాయని, 21న(శనివారం) రంజాన్ పండుగ (ప్రభుత్వ సెలవు), 22న(ఆదివారం) వారాంతపు సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంటున్నారు. ఈ సమయంలో మార్కెట్లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవన్నారు. ఈవిషయాన్ని పరి గణనలోకి తీసుకుని రైతులు, వ్యాపారులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావొద్దని తెలిపారు. 23వ తేదీన (సోమవారం) మార్కెట్ పునఃప్రారంభమవుతుందన్నారు. -
మోదీ వైఫల్యంతోనే గ్యాస్ ధరల పెంపు
నెహ్రూసెంటర్: ప్రధాని మోదీ వైఫల్యంతోనే దేశంలో గ్యాస్ ధరలు పెరిగాయని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయ్‌సారథి విమర్శించారు. గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో గ్యాస్‌బండలతో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలన్నారు. అంతర్జాతీయ చమురు క్షేత్రాలపై సంపూర్ణ ఆధిపత్యం కోసం పశ్చిమాసియాలో యుద్ధానికి దిగాయన్నారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయని, దేశ ప్రధాని అమెరికాకు దాసోహమయ్యారని, యుద్ధంపై మోదీ మౌనం వీడాలని అన్నారు. గ్యాస్ ధరలు పెరిగినా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలని, ప్రధాని తక్షణమే ఇరు దేశాల మధ్య శాంతిచర్చలు జరిపేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బి.అజయ్‌సారథిరెడ్డి, పట్టణ సహాయ కార్యదర్శులు నవీన్, వెంకన్న, నాయకులు మామిండ్ల సాంబలక్ష్మి, వెలుగు శ్రావణ్, నాగెల్లి యాకమ్మ, మంద శంకర్, తండ శ్రీనాథ్, బొమ్మెర రమ, ముంజంపల్లి శ్రీను కూరాకుల పాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ వర్సిటీ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్ : వెల్లూరులోని విట్ యూనివర్సి టీలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు జరగను న్న ఆలిండియా హ్యాండ్ బాల్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ పురుషుల జట్టు పాల్గొనబోతుందని స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య ఆదివారం తెలి పారు. ఈ జట్టులో బి. సాయికుమార్, బి. వంశీ, ఎం. శ్రీరామ్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సంపే ట), డి. శ్రీనివాస్, బి. శివాజీ, బి. రాజేందర్, ఎం. సాయికుమార్, కె. గణేశ్ (యూసీపీఈ ,కేయూ), పి. సాయి (వాగ్దేవి డిగ్రీ కళాశాల, హనుమకొండ), వి.సాయికృష్ణ (ఎల్బీ కాలేజీ, వరంగల్), ఎం. రో హిత్ (కిట్స్, వరంగల్), పి. రామారావు, ఎం. శ్రీరా మ్, వై. భద్రు (ఎస్‌ఆర్‌అండ్‌బిజిఎన్‌ఆర్ డిగ్రీక ళా శాల, ఖమ్మం), కె. ధర్మభిక్షం (వికాస్ డిగ్రీ కళాశాల ,ఖమ్మం) ఉన్నారని వెంకయ్య తెలిపారు. ఈ జట్టుకు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రమేశ్కోచ్గా కొత్తగూడెం ఎంజేపీ టీబీ సీడబ్ల్యూ ఆర్డీసీ ఫిజికల్ డైరెక్టర్ రఘువరణ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య ఇనుగుర్తి : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కోమటిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారపు కరుణాకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన విలాసాగర్ మురళి (46) తనకున్న 20 గుంటల వ్యవసాయ భూమిని అమ్మి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇదిలా ఉండగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన మురళి ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తైలిపారు. -
నేటి నుంచి జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 16,17 తేదీల్లో రెండురోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆ విభాగం అధిపతి ఎన్. వాసుదేవరెడ్డి, పాఠ్యప్రణాళిక అధ్యక్షురాలు సవితాజ్యోత్స్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘కరెంట్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్’ (సీఆర్సీఎస్–2026) అనే అంశంపై యూనివర్సిటీలోని పరిపాలన భవనం సెనేట్హాల్లో ఉదయం 10గంటలకు ఈ సదస్సు నిర్వహించబోతున్నామని వారు తెలిపారు. ముఖ్యఅతిథిగా కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, హైదరాబాద్ ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ గంగాగ్నిరావు కీలకోపన్యాసం చేస్తారన్నారు. గౌరవ అతిథిగా సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు. నేటి నుంచి బధిరుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు హన్మకొండ అర్బన్ : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నగరంలో కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర బధిరుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రా రంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీనర్సమ్మ తెలిపారు. హనుమకొండలోని మయూరి గార్డెన్ లైన్, ప్రగతి నగర్ కాలనీ ఫేజ్–2లో ఉన్న ఈ పాఠశాలలో నేటి (సోమవారం) నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు వికలాంగుల సంక్షేమ శాఖ సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ, కులం, ఆదాయం ధ్రువపత్రాలు, ఆధార్డ్, రేషన్ కార్డు, నాలుగు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 94407 39423, 98666 73486 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. కేసముద్రం: పిచ్చి కుక్కల దాడిలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఆదివారం మున్సిపాలిటీ పరిధి చైతన్యనగర్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన కొమ్ము ముత్తమ్మ అర్ధరాత్రి సమయంలో బయటకు రాగా అక్కడే ఉన్న పిచ్చి కుక్కలు దాడి చేయడంతో కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, నెల రోజుల్లో నలుగురు వ్యక్తులపై కుక్కలు దాడి చేశాయి. దీంతో ప్రస్తుతం వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. బాలికపై అత్యాచారయత్నం? ● వ్యక్తికి దేహశుద్ధి.. ఓ గ్రామంలో ఘటన ఖానాపురం: బాలికపై వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలికను ఇదే గ్రామానికి చెందిన బోళ్ల ప్రసాద్ తన బైక్‌పై ఈనెల 13(శుక్రవారం) గ్రామంలోని ఓ కిరాణా షాపునకు తీసుకెళ్లాడు. షాపులో చాక్లెట్ కొనుగోలు చేసి బాలికకు అందజేసి సమీపంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం సదరు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడగా బాలిక రోదించింది. సమీపంలో పంట పొలాల వద్ద ఉన్న రైతులు కేకలు వేశారు. దీంతో బాలి కను గ్రామంలోకి ఇంటికి తీసుకెళ్లి వదిలేశాడు. ఈ విషయాన్ని కుటుంబీకులకు చెప్పొద్దని భయభ్రాంతులకు గురి చేసి వెళ్లిపోయాడు. బాలికకు స్నానం చేయించడానికి తల్లి తీసుకెళ్లగా జరిగిన విషయాన్ని తెలుపడంతో ప్రసాద్ ఇంటికి వెళ్లి దేహశుద్ధి చేశారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై ఆదివారం పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ సైతం చేపట్టినట్లు సమాచారం. -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
మరిపెడ రూరల్: ఇద్దరు యువకులు గంజాయి విక్రయించడానికి వచ్చి మరిపెడ పోలీసులు పట్టుబడ్డారు. ఈ ఘటన ఆదివారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులో చోటు చేసకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతే మండలానికి చెందిన బానోత్ సింహాద్రి, జర్పుల సింహాద్రి బైక్‌పై గంజాయి విక్రయించడానికి మండలానికి వచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై వీరభద్రరావు ఆధ్వర్యంలో ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న కిలో గంజాయితో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుంది. అనంతరం ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పోలీస్ సిబ్బంది సాయికిరణ్, శ్రీనివాస్, గణేశ్, రవీందర్, రమేశ్‌ను ఎస్సై అభినందించారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 3వ తెలంగాణ రాష్ట్ర స్థాయి రిలే కార్నివాల్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలను వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ గట్టు మహేశ్‌బాబు ము ఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, నిత్యం సాధన చేసే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలోనూ రాణించి జి ల్లా, రాష్ట్ర ఖ్యాతిని చాటాలని క్రీడాకారులకు సూచించారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ ఉమ్మ డి పది జిల్లాల నుంచి 363 మంది అథ్లెట్లు పాల్గొనగా, అండర్–14, 20 విభాగాలతోపాటు మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 28వ తేదీన చంఢీఘడ్‌లో జరగనున్న జాతీయ స్థాయి రిలే కార్నివాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం పలు విభా గాల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు సర్టిఫికెట్లు, పతలును అందజేశారు. అథ్లెటిక్స్ సంఘం బాధ్యులు పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, కిషన్ పాల్గొన్నారు. -
హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి
హన్మకొండ అర్బన్ : హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో ఆదివారం తెలంగాణ హమాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హమాలీ మహా గర్జన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హనుమకొండ కేంద్రంలో హమాలీల కోసం భూమి కేటాయించడంలో కృషి చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హమాలీలు రక్తాన్ని చెమటగా మార్చి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. హమాలీలకు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ బోర్డు ఏర్పాటు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ వంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొద్దిపాటి ఆలస్యం జరిగినా హామీలను తప్పకుండా నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుడు తన కష్టంతో సంపాదించే వ్యక్తి అని, సమాజాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమన్నారు. హమాలీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హమాలీల సంక్షేమం కోసం తన వంతు సాయంగా సీడీఎఫ్ నుంచి రూ.20 లక్షలు విడుదల చేస్తానని ప్రకటించారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హమాలీలు అంబేడ్కర్ జంక్షన్ నుంచి నిర్వహించిన భారీ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, రచయిత మిట్టపల్లి సురేందర్, గాయకులు చుక్క రాంనర్సయ్య, హమాలీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం, ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
అగ్ని ప్రమాదంలో హోటల్ దగ్ధం
● సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం కురవి: సీరోలు మండలం కాంపల్లి శివారులో అచ్చమ్మ దాబా హోటల్ శనివారం అర్ధరాత్రి నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కాంపల్లి నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365/ఏ పక్కన సక్రంనాయక్ తండాకు చెందిన బానోత్ అచ్చమ్మ కొన్ని సంవత్సరాల నుంచి హోటల్ నడుపుకుంటూ జీవిస్తోంది. నాలుగు రోజులుగా హోటల్ బంద్ చేసి తన బిడ్డ డెలివరీ కోసం మహబూబాబాద్ ఆస్పత్రికి వెళ్లింది. హోటల్ దగ్గర తన అమ్మానాన్నను కాపలా ఉంచింది. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళ్తున్న వాహనదారుడు చూసి అగ్నిమాపక శాఖ అధికారులకు అందించడంతో వారు సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. హోటల్ పక్కనే పార్కింగ్ చేసి ఉన్న నాలుగు హార్వెస్టర్ (వరి కోత మిషన్స్) లకు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని యజమాని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో వృద్ధులు ఆరుబయట నిద్రిస్తుండడంతో ప్రమాదం తప్పింది. -
అనుమానాస్పద స్థితిలో డాక్టర్ మృతి
నర్సంపేట/నర్సంపేట రూరల్: అనుమానాస్పద స్థితిలో డాక్టర్ మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగింది. నర్సంపేట టౌన్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. పట్టణంలోని శశి మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని అనస్థీషియా డాక్టర్ శశిధర్‌రెడ్డి (38), ఆయన భార్య గైనకాలజిస్ట్ సిందూరరెడ్డి కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. అయితే, ఏడాదిన్నర కాలం నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో వైద్యుడు శశిధర్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. ఆయన తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లే నాన్న.. ఎంత సేపు పడుకుంటావ్.. లే నాన్న.. ఎంత సేపు పడుకుంటావ్. అంటూ తండ్రి గదువ పట్టుకుని అటూ ఇటూ కదుపుతున్న ఆ చిన్నారులను చూసి అక్కడున్న వారంతా కంట తడి పెట్టారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అనస్తీషియా డాక్టర్ శశిధర్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించగా.. అతడి కుమారులు కృతిక్, అయాన్ మార్చురీ వద్దకు వచ్చారు. డాడీ ఎందుకు పడుకున్నావు లే. అంటూ ఏడవడంతో అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. -
సకలజనులను ఏకం చేస్తాం
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీకి భూ ములు ఇచ్చిన అయోధ్యపురం భూనిర్వాసితులు, నిరుద్యోగులు, రైల్వే ఉద్యోగుల పిల్లలు, అంప్రెటీస్ చేసిన వారికి కోచ్‌ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలని టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్, రిటైర్ట్ ప్రొఫెసర్ వెంకటనారాయణ డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కాజీపేట నుంచి ఢిల్లీ వరకు సకలజనులను ఏకం చేస్తామని వారు స్పష్టం చేశారు. కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ గేట్ ఎదుట ఆదివారం మహా నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా భగవాన్‌దాస్, కాళిదాస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య, న్యాయవాదులు గుడిమల్ల రవికుమార్, సాయి నరేందర్ మాట్లాడుతూ రైల్వే కోచ్‌ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కోరారు. రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు మాట్లాడుతూ కోచ్‌ఫ్యాక్టరీ నినాదం అందించిన భగవాన్‌దాస్, కాళిదాస్ స్ఫూర్తితో ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం చేస్తున్న ఉద్యమాలకు అందరూ సహకరిస్తున్నారని పేర్కొన్నారు. రాయబరేలి, లాతూరు, కపుర్తాల మాదిరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 80 శాతం ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరి పి.రవీందర్ మాట్లాడూతూ కేంద్రం ఉద్యోగాల విషయంలో కూడా న్యాయం చేయాలని కోరారు. కార్పొరేటర్లు రాధికరెడ్డి, జక్కుల రవీందర్, విజయశ్రీ రజాలీ మాట్లాడుతూ ప్రధాని మోదీ రామభక్తుడని, మెట్టురామన్న ఆలయ భూమిలో నిర్మిస్తున్న కోచ్‌ఫ్యాక్టరీలో నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇటీవల రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ తనిఖీ నిమిత్తం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వచ్చినప్పుడు భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు కల 35 ఏళ్ల నాటిదని, ఆంధ్ర పాలకులు రైల్వే జోన్, రైల్వే డివిజన్ తెచ్చుకున్నారని, తెలంగాణ పాలకులు కాజీపేట డివిజన్ ఏర్పాటు విషయంలో విఫలమైతున్నారని ఆరోపించారు. రైల్వే జేఏసీ నాయకులు, 70 మంది అయోధ్యపురం వాసులు దీక్షకు మద్దతు తెలిపారు. నాయకులు తొట్ల రాజు, బండారి సుకేందర్, పసునూరి మనోహర్, మర్యాల కృష్ణ, రైల్వే నాయకులు ఎ.సంతోష్‌కుమార్, పాక వేదప్రకాశ్, జానీ, రైల్వే సంఘ్ నుంచి యాకూబ్‌పాషా, మన్నె బాబురావు, మంద కుమార్ మాదిగ, నూనె అప్పారావు, పాపిరెడ్డి, హైదరాబాద్ నుంచి రైల్వే రిటైర్డ్ నాయకులు యుగేంధర్, జీఎస్.బాబురావు, వెంకటయ్య, కాజీపేట రైల్వే రిటైర్డ్ నాయకులు జి.సుధాకర్, పి.కృష్ణమూర్తి, ఎస్ఆర్వీ రావు, కె.సంగమయ్య, టి.సీతారాం తదితరులు పాల్గొన్నారు. భూనిర్వాసితులు, స్థానికులకు రైల్వే కోచ్‌ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలి రైల్వే జేఏసీ మహా నిరసన దీక్షలో వక్తల డిమాండ్ -
పీఎస్బీ.. భూమికి సారం
సంగెం: పంటల్లో రసాయన ఎరువుల వినియోగం తగ్గించుకుని జీవ ఎరువులు వాడడం వల్ల ఖర్చు తగ్గి అధిక దిగుబడులు సాధించొచ్చు. పీఎస్బీ (పాస్పరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా) జీవ ఎరువు వినియోగిస్తే నేలలో కరగకుండా మిగిలిన భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తుంది. ఫలితంగా మొక్కలకు నీరు, పోషకాలు సమృద్ధిగా అంది అధిక పంట దిగుబడులు వస్తాయని సంగెం మండల వ్యవసాయ అధికారి బస్వపత్రి జగదీశ్వర్ అన్నారు. ఈ మేరకు ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. భాస్వరాన్ని కరిగించే పీఎస్బీ.. భూమిలో ఏళ్ల తరబడి నిక్షిప్తమైన పోషకాల విడుదలకు పీఎస్బీ కీలకంగా వ్యవహరిస్తుంది. నేల స్వభావాన్ని బట్టి సహజంగా ఉండే పాస్పరస్(భాస్వరం) గడ్డకట్టి మొక్కలకు అందకుండా పోతుంది. దీంతో రైతులు అదనంగా ఖర్చులు చేయాల్సి వస్తుంది. నేల ఆమ్లగుణం కలిగి ఉంటే ఇనుము లేదా అల్యూమినియం పాస్పెట్లుగా.. క్షారగుణం కలిగి ఉంటే కాల్షియం లేదా మెగ్నీషియం పాస్పెట్లుగా మారి మొక్కకు అందకుండా నేలలో గడ్డలుగా పేరుకుపోతుంది. పీఎస్బీ జీవ ఎరువు ఈ గడ్డ కట్టిన భాస్వరాన్ని కరిగించి మొక్కలకు సు లభంగా అందేలా చేస్తుంది. దీని వల్ల మొక్కల పె రుగుదల బాగుండడమే కాకుండా, పుష్పించడం, గింజల నాణ్యత పెరుగుతుంది. ఫలితంగా రసాయన ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. వినియోగ విధానం.. పీఎస్బీని విత్తన శుద్ధి, వేర్ల ముంచివేత, నేలలో కలిపి వాడొచ్చు. దీనిని నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. పీఎస్బీ వినియోగంతో నేలలోని భాస్వరం కరిగి మొక్కలకు పోషకాలు అందుతాయి. తద్వారా నేల సారవంతమవుతుంది. ఎకరాకు లీటర్ పీఎస్బీ జీవ ఎరువును బాగా కుళ్లిన 200 కిలోల పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువులో కలుపుకోవాలి. కొద్ది మోతాదులో నీటిని చల్లుతూ తేమ ఆరిపోకుండా 15 రోజుల వరకు ఉండనివ్వాలి. తర్వాత పొలంలో చల్లుకోవాలి. నేలలో కలిసిపోయి మొక్కకు అందకుండా ఉన్న భాస్వరాన్ని ఇది కరిగించి అందేలా చేస్తుంది. విత్తన శుద్ధి.. రైతులు పీఎస్బీని విత్తనశుద్ధి చేస్తే మొక్కలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కిలో విత్తనానికి 10 మి.లీ. పీఎస్బీ జీవ ఎరువును బెల్లం లేదా గంజి జిగుట పదార్థంలో కలిపి నీడలో ఆరబెట్టాలి. తర్వాత భూమిలో విత్తనం విత్తుకోవాలి. వరినారు వేర్ల శుద్ధి.. లీటర్ పీఎస్బీ జీన ఎరువును 70 శాతం నీటిలో కలిపి నారుమడిలో చిన్న గుంత చేసి లేదా ప్లాస్టిక్ డబ్బాలో పోయాలి. ఇందులో పీకిన వరి నారును వేర్లు మునిగేలా 10–15 నిమిషాలు ఉంచి తర్వాత వరి నాటు వేసుకోవాలి. దీంతో వరి నారు శుద్ధి అయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవ ఎరువుల వినియోగంపై సందేహాలుంటే మండల వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు. భాస్వరాన్ని కరిగించి దిగుబడి పెంచే జీవఎరువు తగ్గనున్న పెట్టుబడులు వరి సాగు రైతులకు ఏఓ జగదీశ్వర్ సూచనలు -
కేయూ మాజీ వీసీ లింగమూర్తికి నివాళులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ఎన్.లింగమూర్తి అంత్యక్రియలు ఆదివారం హనుమకొండలోని పోచమ్మకుంటలో నిర్వహించారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.యాదగిరి, యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.సదానందం, జనరల్ సెక్రటరీ వడ్డె రవీందర్, పలు విభాగాల పలువురు అధ్యాపకులు తదితరులు లింగమూర్తికి నివాళుల ర్పించారు. కాగా, లింగమూర్తి మృతి విద్యారంగం, విద్యార్థి ఉద్యమానికి తీరని లోటని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వలీఉల్లాఖాద్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇద్దరి మృత్యువాత
మరిపెడ రూరల్: ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకై నా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు’ అని అందెశ్రీ రాసిన ఈ పాట ఇటీవల జరిగిన మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఓ ఘటన గుర్తుచేస్తోంది. ఈ నెల 11న మహబాబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామానికి చెందిన బావబామ్మర్దులు బల్లెం ఉదయ్‌కిరణ్, బండి భిక్షం ద్విచక్రవాహనంపై బంధువుల ఇంటికి వెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి తిరిగి స్వగ్రామం గాలివారిగూడేనికి 365వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టి వారు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కాగా, ఇసుక కోసం రాత్రి వేళ ఓ ట్రాక్టర్ ట్రక్కు డోర్ వేయకుండా వేలాడుతూ వెళ్తోంది. ట్రాక్టర్ లైట్లు కూడా డిమ్ముగా ఉండడంతో ద్విచక్రవాహనదారుడికి ట్రాక్టర్‌కు సంబంధించిన ఎలాంటి సిగ్నల్స్, లైటింగ్ కనిపించలేదు. దీంతో యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ట్రాక్టర్ ట్రక్కుకు వేలాడుతున్న డోర్‌కు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డుపై పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. ఆ సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ పక్కకు ఆపి 108 వాహనానికి ఫోన్‌చేసి వారి ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ, ఆ ట్రాక్టర్ డ్రైవర్ అలా చేయకుండా వారిని అక్కడే వదిలేసి, తనను ఎవరు చూడలేదని మానవత్వం మంటగలిసేలా సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని మరిపెడ సీఐ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ యువకుల మృతికి కారణమైన ట్రాక్టర్ మండలంలోని బాల్నిధర్మారం గ్రామానికి బాసిక లింగయ్యదిగా గుర్తించారు. ట్రాక్టర్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినట్లు సీఐ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పత్రాలు, అనుమతులు లేకుండా రాత్రి వేళ ఇసుక, మట్టి, కలప అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, మృతుల కుటుంబాలు కోరుతున్నాయి.డోర్ వేయకుండా వేలాడుతూ వెళ్లిన ట్రాక్టర్ వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టిన యువకులు పట్టించుకోకుండా వెళ్లిపోయిన ట్రాక్టర్ డ్రైవర్ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి బాల్నిధర్మారం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌గా గుర్తించిన పోలీసులు -
ఇంటింటికీ రాములోరి తలంబ్రాలు
● రూ. 151లు చెల్లిస్తే ఆర్టీసీ కార్గో ద్వారా బుకింగ్‌కు అవకాశంనెహ్రూసెంటర్: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవాస్థానంలో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో ఉపయోగించే తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ తలంబ్రాలను శుభకార్యాల్లో అక్షింతలుగా వాడితే సాక్షాత్త రాములోరి ఆశీస్సులు, అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం. దీనిలో భాగంగా ఆర్టీసీ కార్గో సేవల ద్వారా భద్రాద్రి రాములోరి తలంబ్రాలను భక్తులకు అందిస్తారు. ఆర్టీసీ ద్వారా బుకింగ్ చేసుకున్న భక్తుల ఇంటికి తలంబ్రాలు అందిస్తారు. భక్తుల కోసం.. భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవానికి వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా బుకింగ్ చేసుకుంటే తలంబ్రాలను సంస్థ ద్వారా పంపిణీ చేయనుంది. తలంబ్రాల కోసం రూ.151 చెల్లించి బుకింగ్ చేసి పేరు నమోదు చేసుకున్న భక్తులకు కార్గో సిబ్బంది స్వయంగా ఇంటికే తెచ్చి అందిస్తారు. ఈమేరకు ఆర్టీసీ ద్వారా చేపట్టే రాములోరి తలంబ్రాల సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బుకింగ్స్.. రాములోరి తలంబ్రాల కోసం మహబూబాబాద్, తొర్రూరు ఆర్టీసీ డిపో కార్గో సెంటర్లలో లేదా ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు. కాగా 93943 46777, 91542 98766 నంబర్లకు ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవచ్చని అర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలి శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి వెళ్లలేని భక్తులు ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా రూ.151 చెల్లించి పేరు నమోదు చేసుకుని తలంబ్రాలు పొందవచ్చు. ఈనెల 31వ తేదీ వరకు ఆర్డర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. – వి.కల్యాణి, ఆర్టీసీ డీఎం, మహబూబాబాద్ -
డిప్యుటేషన్లపై కసరత్తు?
● అయోమయంలో పంచాయతీ కార్యదర్శులు ● పైసల పంచాయితీ వీడియో వైరలవ్వడమే కారణమా.. ● ఒకరిద్దరు తప్పు చేస్తే అందరిపై వేటు వేయడం సరికాదని ఆవేదన ● కొంత మినహాయింపు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి ● జిల్లాలో 406 మంది సిబ్బంది ● నేడు విడుదల కానున్న జాబితా! మహబూబాబాద్: జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల డిప్యుటేషన్ ప్రక్రియపై కలెక్టరేట్లో కసరత్తు మొదలైంది. అయితే ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి డిప్యుటేషన్ విషయంలో కొంత మినహాయింపు ఇవ్వాలని, బదిలీ గైడ్స్లైన్స్ను పరిగణనలోకి తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కాగా, 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో తలెత్తిన సమస్యల వల్లే డిప్యుటేషన్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకరిద్దరు తప్పు చేస్తే అందరిపైన వేటు వేయడం సరికాదని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 406మంది పంచాయతీ కార్యదర్ళులు.. జిల్లాలో 18మండలాల్లో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా, 406మంది జూనియర్, సీనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. మిగితా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 179 జీపీ కార్యాలయాలకు మాత్రమే సొంత భవనాలు ఉండగా, 307 జీపీ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాల్లో నిర్వహిస్తున్నారు. కొన్ని మాత్రమే అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు.. ఇటీవ కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఈమేరకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఈఎంఐ, కరెంట్ బిల్లులు, మల్టీ పర్సప్ వర్కర్ల వేతనాలు, పాత సర్పంచ్ల బిల్లులు తీసుకోవాల్సి ఉంది. కానీ, చాలామంది పంచాయతీ కార్యదర్శులు.. వారు చేసిన ఖర్చుల బిల్లులు తీసుకున్నారు. కొంత మంది సగం బిల్లులు తీసుకున్నారు. పైసల పంచాయితీ కారణమా.. నిధులు విడుదలైన తర్వాత తలెత్తిన పైసల పంచాయితీనే పంచాయతీ కార్యదర్శుల డిప్యుటేషన్ ప్రక్రియకు అడుగులు పడినట్లు తెలుస్తోంది. గత కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌పై పంచాయతీ కార్యదర్శులను డిప్యుటేషన్‌పై బదిలీలు చేయాలని ఒత్తిడి వచ్చిందని, అయితే ఆయన బదిలీ చేయలేదని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. కాగా, ఈనెల 11న జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శుల వ్యవహారంపై మాట్లాడారు. జిల్లాలో ఒక పంచాయతీ కార్యదర్శి నిధుల విడుదలపై వ్యవహరించిన తీరు పై వీడియో వైరల్ అయిందని, దానిని ప్రస్తుత కలెక్టర్ స్నేహ శబరీష్‌కు పంపినట్లు చెప్పారు. దీంతో కార్యదర్శుల డిప్యుటేషన్ అనివార్యమని అర్థమవుతోంది. మంత్రి ఆదేశాలతోనే డిప్యుటేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందరిపై వేటా ? జిల్లాలో ఒకరిద్దరు చేసిన తప్పుకు అందరికీ డిప్యుటేషన్లు వేయడం ఎంత వరకు సమంజసమని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఓ ప్రకారం ఐదేళ్లకు ఒకసారి బదిలీలు ఉంటాయని, బదిలీల గైడ్‌లైన్స్ కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు. కాగా, ఈనెల 13న టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు వడ్డెబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యదర్శులు కలెక్టర్‌ను కలిసి విషయం వివరించారు. బదిలీల విషయంలో భార్యాభర్తలు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు, గర్భిణులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కనీసం మండలాల వారీగా కాకుండా నియోజకవర్గం వారీగా బదిలీ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా డీపీఓ కార్యాలయంలో మాత్రం కార్యదర్శుల డిప్యుటేషన్లు లేవని అది అంతా ప్రచారమేనని కొట్టిపారేస్తున్నారు. నేడు విడుదల.. కార్యదర్శుల డిప్యుటేషన్ జాబితా గోప్యంగా త యారుచేస్తున్నారు. ఇటీవలజనగామ జిల్లాలో డిప్యుటేషన్ చేశారు. ఆతర్వాత మానుకోట జిల్లాలోనే డిప్యుటేషన్ చేస్తున్నారు. దాదాపు జాబితా పూర్తయిందని, ఈనెల 16న (సోమవారం) విడుదల కానున్నట్లు సమాచారం.కలెక్టర్‌ను కలిశాం.. కార్యదర్శుల డిప్యుటేషన్ విషయంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశాం. భార్యాభర్తలు, పిల్లల చదువులు, దివ్యాంగులు, గర్భిణులు ఉంటే వారి విషయంలో కొంత మినహాయింపు ఇవ్వాలి. దగ్గర మండలాల్లో కేటాయించాలని కోరాం. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. – వడ్డెబోయిన శ్రీనివాస్, టీఎన్జీఓస్ జిల్లా అద్యక్షుడు డిప్యుటేషన్లు లేవుపంచాయతీ కార్యదర్శుల డిప్యుటేషన్ ప్రక్రియ లేదు. అదంతా ప్రచారమే. కార్యాలయంలో అలాంటి ప్రక్రియ లేదు. ఆ విషయంలో ఎలాంటి సమాచారం లేదు. –హరిప్రసాద్, డీపీఓ -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామంలో ఆదివారం మంద మధు, లేకోటి రమేశ్ నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నెరవేర్చడానికే ఇందిరమ్మ ఇళ్ల పథకమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. ఇంటి నిర్మాణం చేసుకుంటేనే బిల్లులు వస్తాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్, నాయకులు అంజయ్య, హరిసింగ్ పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు రూ.18వేల వేతనం ఇవ్వాలి
నెహ్రూసెంటర్: అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి స్నేహబిందు అన్నా రు. అంగన్వాడీల సమస్యలపై ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనం రూ. 18వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, వెంటనే అమలు చేయాలని కోరారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2026ను సవరించాలని, టీచర్, ఆయాలకు మే నెల సెలవులు ఇవ్వాలన్నారు. అంగన్వాడీల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో మల్లికాంబ, దుర్గా, కనకలక్ష్మి, సరస్వతి, కొమురమ్మ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
‘ముఖ’ చిత్ర కష్టాలు
● వీబీ–జీరామ్‌జీలో ఫేషియల్ అటెండెన్స్ ● పలు సమస్యలతో రికార్డు కాని వైనం ● తగ్గుతున్న కూలీల సంఖ్య డోర్నకల్: వీబీ–జీరామ్‌జీ (ఉపాధి హామీ) పథకం అమలులో భాగాంగా పనుల వద్ద ఫేషియల్ అటెండెన్స్ పద్ధతి ప్రవేశ పెట్టారు. పనుల ప్రదేశంలో కూలీల ముఖాలను సెల్ఫోన్లో ప్రత్యేక యాప్ ద్వారా ఫొటో తీసుకుని పనులు ప్రారంభించడం, పనులు పూర్తయిన తర్వాత మరోసారి ఫొటో తీసి ఆన్లైన్లో హాజరు రికార్డు చేస్తున్నారు. అయితే పలు సమస్యలతో రికార్డు కావడం లేదు. దీంతో కూలీలకు సమస్యలు తప్పడం లేదు. అన్నీ సమస్యలే... ఉపాధి కూలీల హాజరు నమోదులో వివిధ రకాల సమస్యలతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతీ రోజు ఉదయమే మేట్ మస్టర్ల ద్వారా కూలీల వివరాలు ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని కూలీలతో పని ప్రదేశానికి వెళ్తున్నారు. పని ప్రదేశం వద్ద మేట్ ప్రతీ కూలీ ముఖాన్ని ఫోటో తీసి కూలీల హాజరు నమోదు చేస్తున్నారు. అయితే సిగ్నల్ లేకపోవడం, ఎండ ఎక్కువగా ఉండడం, వృద్ధుల ముఖ కవలికలు సక్రమంగా ఉండకపోవడంతో కూలీల హాజరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాప్‌లో హాజరు నమోదు కాకపోవడంతో పని ప్రదేశం నుంచి కూలీలు వెనుదిరిగి పోతున్నారు. నాలుగు గంటల పని పూర్తయిన తర్వాత మస్టర్ ప్రకారం కూలీలను గ్రూప్ ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉండగా నెట్వర్క్ సిగ్నల్స్ సమస్యలు ఎదురవుతున్నాయి. నాలుగు గంటల పని విధానం అమలులోకి రావడంతో కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. మేట్‌కు పని భారం.. మేట్లు సొంతంగా 5జీ సెల్‌ఫోన్, ఇంటర్నెట్ వినియోగిస్తూ కూలీల వివరాలను అప్లోడ్ చేయడం, పని ప్రారంభం, ముగింపు సమయంలో కూలీల ఫొటోలు తీయడం లాంటి విధులు నిర్వర్తిస్తున్నారు. మేట్లు కూడా కూలీలతో సమానంగా పనులు చేస్తున్నారు. వీరికి ఎలాంటి వేతనం అందకపోవడంతో మేట్ విధులు నిర్వర్తించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఐరిస్ ఫొటో క్యాప్చర్ అటెండెన్స్ విధానం ప్రారంభించి కొద్ది రోజులే అవుతున్నందున.. త్వరలో సమస్యలు పరిష్కారమవుతా యని అధికారులు చెబుతున్నారు. అయితే ఫొటో అటెండెన్స్ నమోదు కాక తాము పనులు కోల్పోతున్నామని, నాలుగు గంటల పని విధానాన్ని కూడా మార్చాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 3,97,455 మంది కూలీలు.. జిల్లాలో పథకం ద్వారా 3,97,455 మంది కూలీలు లబ్ధి పొందుతున్నారు. 2,01,430 కుటుంబాలకు సంబంధించి 3,97,455మంది కూలీలు ఉన్నారు. అత్యధికంగా గూడూరు మండలంలో 35,695 మంది కూలీలు ఉండగా.. అత్యల్పంగా చిన్నగూడూరు మండలంలో 7,955 మంది ఉన్నారు. భారంగా మారిన మేట్ విధులు ఉపాధి కూలీగా పని చేస్తున్న నాకు మేట్ విధులు భారంగా మారుతున్నాయి. సొంత ఫోన్, నెట్‌తో కూలీల ఫొటోలు తీస్తున్నా. మేట్ విధులకు ఎలాంటి వేతనం చెల్లించడం లేదు. కూలీలతో సమానంగా పని చేస్తున్నాను. – భాగ్యమ్మ, మేట్, గొల్లచర్ల కొత్త పద్ధతితో ఇబ్బందులు.. ముఖాన్ని ఫొటో తీయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒక్కోసారి ఫొటో తీయడం కుదరక పని లేకుండానే వెళ్లిపోతున్నాం. నాలుగు గంటల పని విధానాన్ని కూడా మార్చాలి. –సీతమ్మ, ఉపాధి కూలీ, గొల్లచర్ల -
గంజాయి సేవిస్తున్న యువకుల అరెస్టు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని మంగళికాలనీ, పత్తిపాక ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి అన్నారు. టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కేసు వివరాలను వెల్లడించారు. పట్టణ పరిధిలోని మంగళికాలనీ, పత్తిపాక, బాబునాయక్‌తండా, వినాయకతండా, సాంక్రియాతండా, పులిగోపాల్రెడ్డినగర్ తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ తనిఖీల్లో గంజాయి తాగుతున్న యువకులు మంగళికాలనీకి చెందిన తాళ్ల అభిషేక్, పత్తిపాకకు చెందిన నాయిని ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ. 50 వేల విలువ చేసే 12 గ్రాముల గంజాయి, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువత మత్తుకు బానిసై తమ జీవితాలు పాడుచేసుకోవద్దని సూచించారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే పోలీసులకు వెంటనే సమాచారం తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. టౌన్ ఎస్సైలు అలీంహుస్సేన్, షాకీర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఐలోని మల్లన్నకు పెద్దపట్నం
ఐనవోలు: ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర చివరి ఆదివారం పెద్ద పట్నం, గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మలతో మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి నిత్య పూజలు పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో నటరాజస్వామి మండపానికి ఎదురుగా ఉదయం 7 గంటల నుంచే 53 అడుగుల అతిపెద్ద పట్నం 11 రకాల రంగులతో సుమారు 50 మంది ఒగ్గు పూజారులు 6 గంటల పాటు శ్రమించి మహా పెద్దపట్నం వేశారు. పెద్దపట్నంపైకి ఉత్సవ మూర్తులు.. పెద్దపట్నం వేసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆలయ మూల మూర్తులైన అమ్మవార్లు గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ, మల్లికార్జునుడి ప్రతిరూపమైన ఉత్సవ విగ్రహాలను ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో మహా పెద్దపట్నంపైకి తీసుకొచ్చారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ శైవాగమోక్తంగా స్వామి, అమ్మవార్ల కల్యా ణం నేత్ర పర్వంగా నిర్వహించారు. కొబ్బరికాయలు, మంగళ హారతులు స్వామివారికి సమర్పించి అక్షతలను పెద్దపట్నంపై చల్లారు. పూజలు పూర్తయిన వెంటనే శివసత్తులు, ఒగ్గు పూజారులు, భక్తులు తన్మయత్వంతో బండారి (పసుపు) చల్లుకుంటు మహా పెద్దపట్నంపై నృత్యాలు చేసి ఓలలాడారు. -
పక్కాగా జనగణన నిర్వహించాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్: జిల్లాలో పక్కాగా జనగణన నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆదివారం జనాభా లెక్కలు 2027, శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి దశ జనగణన మే 11నుంచి జూన్2 వరకు, రెండోదశ ఫిబ్రవరి 2027లో జరుగుతుందన్నారు. 2027 మార్చి 1ని రెఫరెన్స్ తేదీగా పరిగణిస్తారన్నారు. డిజిటల్ విధానంలో సర్వే జరుగుతుందన్నారు. ప్రత్యేక పోర్టల్ గణన ప్రారంభానికి ముందు అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాసరావు, సీపీఓ విభాగం అధికారులు అశోక్, రామ్దన్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి మత్తులో వృద్ధ దంపతులపై దాడి
ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో యువకులు గంజాయి మత్తులో పగలు, రాత్రి రహదారులపై హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో శంభునిపేటలోని కందగట్ల శ్రీనివాస్, అతడి భార్యపై ఐరన్ రాడ్లతో శుక్రవారం రాత్రి దాడి చేశారు. తీవ్ర గాయాలైన వారిని స్థానికులు హుటాహుటినా ఆటోలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. దీనిపై శనివా రం బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బాధితులను సామాజిక కార్యకర్త ఎండీ ఫసి పరామర్శించారు. గంజాయి సేవించేవారు, సరఫరా చేస్తున్న వారిపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. -
విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక
ఆలోచనలు ప్రోత్సహించాలిహసన్పర్తి : విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, పరిశోధనా సంస్కృతిని పెంపొంచడం ప్రగతి ప్రాజెక్ట్ ఎక్స్పో లక్ష్యమని రేవల్సిస్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు రాజ్ సామల అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీలో శనివారం ‘ప్రగతి–నేషనల్ లెవల్ ప్రాజెక్టర్ ఎక్స్పో 26’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని 23 విశ్వ విద్యాలయాలతోపాటు పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని వందకు పైగా వినూత్న ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి రాజ్ సామల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వినూత్న ఆలోచనలను అభినందిస్తూ ఇంజనీరింగ్ విద్యలో ప్రాక్టిక్ లెర్నింగ్, ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మేరోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, ఆరోగ్య సాంకేతికత, స్మార్ట్ సిస్టమ్స్, సస్టైనబుల్ ఇంజనీరింగ్ వంటి విభిన్న రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈసందర్భంగా వోఎక్సెన్ విశ్వవిద్యాలయ బృందానికి ప్రథమ బహుమతి, ఎస్సార్ విశ్వవిద్యాలయ బృందం ద్వితీయ బహుమతి, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బృందం తృతీయ బహుమతి అందుకున్నారు. కార్యక్రమంలో కెనరా బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎన్. కుమార్, ఎస్సార్ యూనివర్సిటీ వీసీ దీపక్ గార్గ్, రిజిస్ట్రార్ పి.వి. రమణరావు, డీన్. అర్చనారెడ్డి, సి. హెచ్. హుస్సేన్ బాషా, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. రేవల్సిస్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు రాజ్ సామల -
పోలీసుల సరిహద్దు సమావేశం
● ములుగు ఎస్పీ, అటవీశాఖ అధికారుల హాజరు ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు సమావేశం శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్లో జరిగింది. దీనికి ములుగు జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్‌తోపాటు ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌భట్, ఛత్తీస్‌గఢ్‌లోని ఐజీ, ఎస్పీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గినప్పటికీ సరిహద్దు విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ అటవీ ప్రాంతం, పోలీసులు సంరక్షణ చర్యలు, మావోయిస్టు కదలికలు, ప్రాజెక్టు రక్షణ విషయాలపై అక్కడి పోలీసులు, అటవీశాఖ అధికారులతో విపులంగా చర్చించారు. మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్, సహాయక చర్యలు, సానుభూతి పరుల కదలికల విషయాలను ఇరురాష్ట్రాల అధికారులు చర్చించుకున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో జరిగే అక్రమ కలప రవాణా, గంజాయి, స్మగ్లింగ్ వంటి విషయాలను చర్చించారు. కర్రెగుట్టలో ఏర్పాటు చేసి పోలీసులు క్యాంప్ భద్రత విషయాలను కూడా చర్చించారు. ఇంకా తెలంగాణకు చెందిన కొంతమంది మావోయిస్టు పార్టీలో ఉన్నారని, వారి కదలికలు తెలుసుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీంతో పోలీసు భద్రత విషయాలను మరింత పటిష్టపర్చేందుకు వ్యూహరచన చేశారు. కేంద్ర బలగాల మోహరింపు విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. కాగా, గతంలో పోలీస్స్టేషన్లలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బెటాలియన్ ఉండేది. ఇప్పుడు కొన్ని మండలాల్లోని స్టేషన్లలో వాటిని ఎత్తివేశారు. తెలంగాణ పోలీసులను అదనంగా క్యాంప్‌లను పోలీస్స్టేషన్లలో చేయిస్తున్నారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్‌ను వెనక్కి పంపించడంతోపాటు ఇక్కడ తీసుకోవాల్సిన భద్రత విషయాలను కూడా చర్చించారు. -
ఢిల్లీలో వరంగల్ పారా అథ్లెట్ల సత్తా
వరంగల్ స్పోర్ట్స్: న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్లు సత్తా చాటారు. ఎ. లోకేశ్ (ఎఫ్–46) జావెలిన్‌త్రో, షాట్‌పుట్ విభాగాల్లో రెండు కాంస్య పతకాలు సాధించగా, పి. మమత (ఎ–55) జావెలిన్‌త్రో, షాట్‌పుట్ విభాగాల్లో సత్తా చాటి రెండు కాంస్య పతకాలు సాధించారు. ఇద్దరు క్రీడాకారులు హైదరాబాద్‌లోని ద్రోణాచార్య పారా అకాడమీలో కోచ్ వేణు వద్ద శిక్షణ పొందుతున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా హెచ్1 ఔషధాల విక్రయాలు ● సిరి మెడికల్ షాపుపై కేసు నమోదుఎంజీఎం : ప్రిస్క్రిప్షన్ లేకుండా హెచ్1 ఔషధాలు విక్రయిస్తున్న వరంగల్ ఎంజీఎం రోడ్డులోని సిరి మెడికల్ షాపుపై డ్రగ్ కంట్రోల్ అఽధికారులు కిరణ్‌కుమార్, శ్రవణ్‌కుమార్ కేసు నమోదు చేశారు. హనుమకొండలోని ఓ మెడికల్ షాపులో కొనుగోలు చేస్తున్న హెచ్1 ఔషధాలతో మత్తుకు అలవాటు పడుతున్నారనే విషయాన్ని గుర్తించి ట్రాస్క్ఫోర్స్ పోలీసులు పలువురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో ఎంజీఎం రోడ్డులోని సిరి మెడికల్ షాపులో విక్రయిస్తున్నట్లు సదరు యువకులు తెలుపడంతో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శివకేశవులు, సతీశ్‌కుమార్ డ్రగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శనివారం డ్రగ్ కంట్రోల్ అధికారులు సదరు మెడికల్ షాపులో హెచ్1 ఔషధాల వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. బైక్ ఢీకొని వృద్ధుడి మృతి టేకుమట్ల: బైక్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇ చ్చంతుల రాజకొంరయ్య(65) శనివారం వ్యక్తి గత పని మీద మండల కేంద్రానికి వచ్చాడు. తిరిగి నడుచుకుంటూ ఇంటికెళ్తున్న క్రమంలో మండలంలోని రాఘవరెడ్డి పేట గ్రామానికి చెందిన ఉమేందర్ బైక్‌తో రాజకొంరయ్యను ఢీకొన్నాడు. దీంతో ఆ వృద్ధుడు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడడంతో గమనించిన స్థానికులు 108లో చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై అమూల్య తెలిపారు. -
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ.. పలువురికి గాయాలు
తిరుమలగిరి (తుంగతుర్తి): లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమలగిరికి వస్తుండగా.. తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపునకు వెళ్తున్న లారీ వెలిశాల వద్ద బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సంతోష్‌గౌడ్‌కు కడుపులో గాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికురాలు బోళ్ల అంజమ్మకు చెయ్యి విరిగింది. మరో పది మందికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ దీపక్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతడిని అతికష్టం మీద బయటకు తీశారు. లారీ డ్రైవర్ కుడి కాలు విరిగింది. ఘటనాస్థలిని ఎసై్ౖస వెంకట్‌రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నాటక రంగానికి పూర్వ వైభవం తేవాలి
తొర్రూరు: సమాజానికి దిశానిర్దేశం చేసే నాటక రంగానికి పూర్వవైభవం తేవాలని సినీగేయ రచయిత కాసర్ల శ్యామ్ కోరారు. తొర్రూరులో చైతన్య కళాసమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి నాటక పోటీలు శనివారం ముగిశాయి. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ నాటకరంగాన్ని బతికించుకోవాల్సి న బాధ్యత అందరిపై ఉందని, సమాజంలోని రుగ్మతులను తొలగించేందుకు నాటకాలు ఎంతో దోహదపడుతాయన్నారు. నాటకాలతో ఒత్తిడి దూరం అవుతుందని పేర్కొన్నారు. అనంతరం జాతీయస్థాయి నాటక పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన గుంటూరుకు చెందిన ఉషోదయ కళానికేతన్ సంస్థకు, ద్వితీయ స్థానం సాధించిన హైదరాబాద్‌కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ సంస్థ కళాకారులకు నగదు, బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో చైతన్య కళాసమాఖ్య ప్రతినిధులు మన్నూరు ఉమ, పినాకపాణి, మంగళపల్లి శ్రీనివాస్, జినుగ సురేందర్‌రెడ్డి, లింగాల వెంకటనారాయణగౌడ్, సర్వి వెంకన్న, లేగల వెంకట్‌రెడ్డి, బుదారపు శ్రీనివాస్, మాచర్ల వెంకన్న, గడల శ్రీనివాస్, ఇమ్మడి రాంబాబు, కళాకారులు పాల్గొన్నారు. సినీగేయ రచయిత కాసర్ల శ్యామ్ -
కేయూ మాజీ వీసీ లింగమూర్తి కన్నుమూత
కేయూ క్యాంపస్: కేయూ మాజీ వీసీ, ఎకనామిక్స్ విభాగం విశ్రాంత ఆచార్యుడు, రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత ఎన్. లింగమూర్తి( 75) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హనుమకొండ బ్యాంకుకాలనీలోని తన నివాసంలో శనివారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఐదుగురు కుమార్తెలు. కరీంనగర్ జిల్లా చౌటుప్పల్‌లో జన్మించిన లింగమూర్తి డిగ్రీ, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఎంఫిల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పూర్తిచేశారు. కేయూలో ఎకనామిక్స్ విభాగంలో డాక్టరేట్ పొందిన లింగమూర్తి ఇదే యూనివర్సిటీలో అదే విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. 35 సంవత్సరాల పాటు బోధన, పరిశోధనానుభవం కలిగిన లింగమూర్తి పర్యవేక్షణలో 12మంది పరిశోధకులు డాక్టరేట్లు, 23 మంది పరిశోధకులు ఎంఫిల్ పట్టాలు పొందారు. ఆయన 8 పుస్తకాలు రాశారు. 35 పబ్లికేషన్స్ ఉన్నాయి. నాలుగు రీసెర్చ్ ప్రాజెక్టులు పూర్తి చేశారు. 2007 నుంచి 2010 వరకు కేయూ వీసీగా.. కాకతీయ యూనివర్సిటీలో 2007నుంచి 2010 వరకు వీసీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హయాంలోనే కేయూకు న్యాక్ ఏగ్రేడ్ లభించింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. లింగమూర్తి వీసీగా ఉన్న కాలంలోనే తెలంగాణ ఉద్యమం కేయూ కేంద్రంగా తీవ్రరూపం దాల్చింది. 2011లో ఉద్యోగ విరమణ పొందారు. కేయూ వీసీ, రిజిస్ట్రార్ సంతాపం.. లింగమూర్తి మృతికి కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం సంతాపం తెలిపారు. కాగా, బ్యాంకు కాలనీలో లింగమూర్తి భౌతిక కాయాన్ని కేయూ మాజీ రిజిస్ట్రార్లు శంకరయ్య, పురుషోత్తం, మల్లారెడ్డి, కేయూ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సదానందం, జనరల్ సెక్రటరీ రవీందర్, శాతవాహన యూనివర్సిటీ మాజీ వీసీ మహ్మద్ ఇక్బాల్ అలీ, కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ సందర్శించి నివాళులర్పించారు. లింగమూర్తి అంత్యక్రియలు హనుమకొండలోని పోచమ్మకుంటలో ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విద్యావేత్తగా పరిశోధనల పరంగా సేవలు ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ అధ్యాపక అవార్డు నేడు అంత్యక్రియలు -
రోదించిన కొర్కిశాల..
మొగుళ్లపల్లి : కూలీ పనులు చేసుకొ ని జీవనం సాగిస్తున్న రెండు కుటుంబాలు, వ్యవసాయాన్నే నమ్ముకున్న మరో కుటుంబంలో విషాదం అలు ముకుంది. వ్యవసాయ బావి పూడిక తీత పనులకు వెళ్లి మరి కొద్దిసేపట్లో ఇంటికి వెళ్దామనుకునే సమయంలో చోటు చేసుకున్న ప్రమాదం మూడు ఇళ్లను శోక సముద్రంలో ముంచింది. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామానికి చెందిన సుకినే దేవరావుకు చెందిన వ్యవసాయ భూమిలో సిద్దిపేటకు చెందిన శివరాత్రి కనకరాజు తన క్రేన్‌తో పూడిక తీత పనులు ప్రారంభించాడు. శనివారం సాయంత్రం కనకరాజు బావిలోనే ఉండగా, యజమాని దేవరావు (48), పిడిసిల్ల గ్రామానికి చెందిన పైడయ్య(53), దేవరావు సోదరుడు సుకినే మోహన్‌రావు, బండారి అభిలాశ్(16) బావి పై భాగంలో క్రేన్ మీద ఉండి రాయిని పైకి లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో క్రేన్‌తో సహా పైన ఉన్న నలుగురు బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో మోహన్‌రావు మినహా ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. అరుపులు.. కేకలు పెద్ద రాయిని పైకి లాగలేకపోయిన క్రేన్ ఒక్కసారిగా బావిలోకి పడబోయింది. ఈ క్రమంలో పైన ఉన్న దేవరావు, పైడయ్య, అభిలాశ్, మోహన్‌రావు సైతం అదుపు తప్పి బావిలో పడబోతుండగా బావిలో ఉన్న కనకరాజు భార్య లక్ష్మి కేకలు వేసింది. క్రేన్ బావిలో పడుతుందని, పక్కకు జరగాలని భర్తకు సూచించింది. దీంతో బావి ధరి అంచున ఉండడంతో కనకరాజు ప్రాణాలతో బయటపడ్డాడు. అతను తేరుకుని చూసే సరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఘటన నుంచి లక్ష్మి తేరుకున్నాక బావిలోని మృతదేహాలను చూసి కేకలు వేసింది. దీంతో ఈ కేకలు విన్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. చిట్యాల సీఐ మల్లేశ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మోహన్‌రావుకు తీవ్ర గాయాలు కాగా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పరీక్ష రాసొచ్చిన కొద్ది సేపటికే మృత్యుఒడికి.. కొర్కిశాల గ్రామానికి చెందిన బండారి అభిలాశ్ శని వారం పదో తరగతి వార్షిక పరీక్ష తెలుగు రాసి మ ధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటికొచ్చాడు. తన ఇంటి సమీపంలో బావి వద్ద క్రేన్ నడుస్తుండడంతో అక్కడికి వెళ్లి కూర్చున్నాడు. ఈ ఘటనలో అభిలాశ్ సైతం అక్కడికక్కడే మృతి చెందాడు. తొలి పరీక్షే చివరి పరీక్ష అయిందంటూ మృతుడి తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. అభిలాశ్ మృతి విషయం తెలుసుకున్న స్నేహితులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కాగా, మృతుడు దేవరావుకు భార్య, ఇద్దరు కుమారులు, పైడయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, అభిలాశ్కు చెల్లి ఉంది. ఒకే రోజు ముగ్గురు మృతి చెందడంతో కొర్కిశాల రోదించింది. గ్రామంతోపాటు మండలంలో విషాదఛాయలు అలుముకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. వ్యవసాయ బావిలో క్రేన్ పడి ముగ్గురి మృతి అందులో ఒకరు పదో తరగతి విద్యార్థి మూడు ఇళ్లలో విషాదం -
ఇక ప్రమాదాలకు అడ్డుకట్ట
ఖిలా వరంగల్: రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో ప్రత్యేక ని ర్ణయం తీసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాత్రివేళ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలొదులుతున్నారు. వాటిని అరికట్టేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలకు గతనెల 20వ తేదీ నుంచి రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు, రియర్ మార్కింగ్ ప్లేట్లను తప్పనిసరి చేసింది. ద్విచక్రవాహనాలతో సహా అన్నింటినీ వాటిపై అతికించుకోవాలని రవాణాశాఖ ఆదేశించింది. దీని బాధ్యతను గుర్తింపు ఉన్న ఓ సంస్థకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రిఫ్లెక్టివ్ స్టిక్కర్లపై రవాణాశాఖ లోగో, హోలో గ్రామ్, సీరియల్ నంబర్ కలిగిన క్యూఆర్ కోడ్ ఉంటుంది. 500 మీటర్ల దూరంలో ఉన్న వాహనం రాత్రివేళ రోడ్డుపై నిలిపిన వాహనం ఒక్కోసారి కనిపించకపోవడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఓవర్టేక్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనం ఎంత దూరం ఉందో తెలియక డ్రైవర్ ఆందోళన చెంది ప్రమాదాలపాలైన పరిస్థితి ఉంటోంది. రిఫ్లెక్టివ్ స్టిక్కర్లను అతికించుకోవడం ద్వారా 500 మీటర్ల దూరం నుంచే ముందు వెళ్లే వాహనం స్పష్టంగా కనిపిస్తుంది. తద్వారా రాత్రివేళ సంభవించే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చనేది అధికారులు భావన. రవాణావాహనాలకు తప్పనిసరిగా ఇకపై రవాణా వాహనాలపై క్యూఆర్ కోడ్ ఉన్న రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు, రియల్ మార్కింగ్ ప్లేట్లు తప్పనిసరి చేసింది. ఆర్టీఏ కార్యాలయాల వద్ద రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు విక్రయించే సంస్థ అందుబాటులో ఉంది. ఈవిధానం గతనెల 20 నుంచి అమల్లోకి వచ్చినా.. ఏర్పాట్లు ఆలస్యం కావడంతో నెలరోజులు గడువు పెంచింది. ఫిట్నెస్ జారీ.. రాష్ట్ర రవాణాశాఖ లోగోతోపాటు ప్రత్యేక సీరియల్ నంబర్ కలిగిన క్యూర్ కోడ్ నంబర్‌ను స్టిక్కర్‌పై ముద్రించి ఉంటుంది. స్టిక్కర్ అమర్చాక వాహన యజమానికి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. అందులో వాహనం నంబర్, తయారీ సంస్థ వివరాలు, ఫొటో, వారంటి వివరాలుంటాయి. ఇప్పటికే అఽ దీకృత డీలర్లను ఎంపిక చేసినందున వాహనదారులు వారివద్దనే స్టిక్కర్లను పొందాల్సి ఉంటుంది. ముమ్మరంగా తనిఖీలు.. ఫిట్నెస్ కోసం వచ్చే వాహనాలను అధికారులు ఇకపై క్షుణ్ణంగా తనిఖీలు చేయనున్నారు. స్టిక్కర్‌పై బార్కోడ్ నంబర్ లేకుంటే ధ్రువీకరణ పత్రం ఇవ్వబోమని అధికారులు చెబుతున్నారు. హైవేలపై రాత్రి వేళ, అర్ధరాత్రి, తెల్లవారుజామున ముందున్న వాహనాలను వెనుక నుంచి ఢీకొనే ఘటనలు పెరుగుతున్నాయి. అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, బ్రే క్ డౌన్‌తో వాహనాలు నిలిచిపోయిన సందర్భాల్లో రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించొచ్చని రవాణాశాఖ విశ్లేషిస్తోంది. వాహనాలకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు, రియల్ మార్కింగ్ ప్లేట్లు రాత్రివేళ రోడ్డుపై స్పష్టంగా కనిపించనున్న వెహికిల్స్ క్యూఆర్ కోడ్ ఉంటేనే ఫిట్నెస్ పత్రాలు జారీ వాహన యజమానులపై పెనుభారం ఉమ్మడి జిల్లాలో ట్రాన్స్పోర్ట్ వాహనాలు జిల్లా వాహనాల సంఖ్య వరంగల్ 35136 హనుమకొండ 55,271 మహబూబాబాద్ 28,644 ములుగు 3,144 జనగామ 15,126 జేఎస్ భూపాలపల్లి 5,860 -
కారు వేలానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
ఖిలా వరంగల్ : ఆ యువకులిద్దరు బంధువులు.. వరుసకు అన్నదమ్ములు.. ఎక్కడికై నా కలిసే వెళ్తా రు. ఇదే మాదిరి సెకండ్ హ్యాండ్ కారును వేలంలో దక్కించుకోవాలని ఉదయమే బైక్‌పై బయలుదేరారు. ఐనవోలు క్రాస్ వద్ద ఓ కంపెనీ నిర్వహించిన వేలంలో పాల్గొన్నారు. ఆనందంగా ఇంటికి తిరుగు ప్రయాణమైన వీరిని మృత్యువు బలితీసుకుంది. బైక్‌ను వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం మామునూరు పోలీస్ స్టేషన్ ఎదుట చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన శ్రీపతి రాజేశ్(35), వర్ధన్నపేటకు చెందిన శ్రీపతి వంశీ (26) ఉపాఽధి, ఉద్యోగ రీత్యా వరంగల్‌లో ఉంటున్నారు. వంశీ కాశిబుగ్గలో నివాసముంటూ ఓ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తుండగా.. రాజేశ్ రంగశాయిపేట గవిచర్ల క్రాస్ రోడ్డులో నివాసముంటూ రాజరాజేశ్వర సిమెంట్ షాపు ఏర్పాటు చేసుకుని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రాజేశ్, వంశీ సోదరులైనా స్నేహితులుగా ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరు శనివారం ఉదయం బైక్‌పై ఖిలా వరంగల్ మండలం పున్నేలు క్రాస్ వద్ద ఓ ఫైనాన్స్ సంస్థ నిర్వహించిన కారు వేలంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం తిరిగి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. పది నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటామని కుటుంబ సభ్యులకు చెప్పుకున్నారు. ఇంతలోనే ప్రాణాలు వదిలారు. బైక్ మామునూరు పోలీస్ స్టేషన్ ఎదుటకు చేరుకుంది. ఈ సమయంలో వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపునకు వెళ్తున్న ఓ కంపెనీ పాల వ్యాన్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. దీంతో రాజేశ్, వంశీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈవిషయం తెలిసి ఎస్సై శ్రీకాంత్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాద వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వ్యాన్ డ్రైవర్‌ను అదపులోకి తీసుకుని మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తుతోనే ప్రమాదం.. ప్రమాద సమయంలో పాల వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు తెలిపారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా రాగానే కళ్లు మూతలు పడి వాహనం అదుపు తప్పి ఎదురుగా బైక్‌ను ఢీకొందన్నారు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు రోడ్డుపై పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారని వారు పేర్కొన్నారు. బైక్‌ను ఢీకొన్న వ్యాన్.. అన్నదమ్ముల దుర్మరణం మామునూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఘటన ప్రమాదానికి వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తే కారణం! -
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
హసన్‌పర్తి: విద్యుదాఘాతంతో శివాజీనగర్‌లో శనివారం ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఇంట్లో ఉన్న రూ.మూడు లక్షల విలువైన సామగ్రి కాలిబూడిదైందని బాధితులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సై దేవేందర్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వీధిన పడిన కుటుంబం.. ప్రమాదంతో బాధిత కుటుంబం వీధిన పడింది. ఆ ఇంటిలో అక్కాతమ్ముళ్లు మానస, రుతికేశ్ మాత్రమే ఉంటున్నారు. పదేళ్ల క్రితం తల్లి మృతి చెందింది. వారు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
కోచ్ ఫ్యాక్టరీలో కొలువులివ్వాలి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీలో అయోధ్యపురం భూ నిర్వాసితులు, గ్రామస్తులకు, కాజీపేట పరిసర ప్రాంతాల వారికి, రైల్వే ఆక్ట్ అంప్రెంటీస్ చేసిన వారికి, ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అన్నారు. కాజీపేట రైల్వే ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవేందర్ మాట్లాడుతూ.. ఆదివారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ ఎదుట రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో మహా నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. -
శాంతికోసం మరియతల్లిని వేడుకోవాలి
కాజీపేట రూరల్ : ప్రపంచ దేశాలు.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలకాలని, శాంతి స్థాపనకు ప్రజలందరు మరియతల్లిని వేడుకోవాలని హైదరాబాద్ అగ్రపీఠ కాపరి మహాశ్రేష్ఠ కార్డినల్ అంతోని పూల సందేశమిచ్చారు. కాజీపేట ఫాతిమానగర్‌లో జరుగుతున్న ఫాతిమామాత తిరునాళ్ల మహోత్సవ వేడుకలు శుక్రవారంతో భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ముగింపులో ముఖ్యఅతిథిగా అంతోని పూల పాల్గొని దివ్యబలి పూజను సమర్పించి మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు నిలిచిపోయి ఆయా దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని మరియతల్లిని ప్రార్థించి వేడుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొని ప్రజలందరికి ఫాతిమామాత ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. వరంగల్ జిల్లా కులమతాలకు అతీతంగా నిలుస్తోందని అన్నారు. గురుశ్రీ సుధీర్, ఉమేష్ ప్రార్థన చేసి చివరి పూజబలిని నిర్వహించారు. ఓరుగల్లు పీఠ పాలనాధికారి ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్‌రెడ్డి పతాక అవరోహణ చేసి ఫాతిమామాత ముగింపు ఉత్సవాలను ప్రకటించారు. అంతోని పూ ల, డి.విజయపాల్‌రెడ్డి, ఫాదర్లను, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని అంతోని పూల, విజయపాల్‌రెడ్డి సన్మానించారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో గెలిచిన వా రికి బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చిన భక్తులు, విశ్వాసులు క్యాండిల్స్, కొబ్బరి కాయలు, తలనీలాలతో మరియమాతకు మొక్కులు సమర్పించారు. కార్పొరేటర్ మానసరాంప్రసాద్, విశ్రాంత అగ్రపీఠ కాపరి మహాపూజ్య జోసెఫ్ హరిష్, ఫాదర్లు కాసుమర్రెడ్డి, కొమ్మారె డ్డి జోసెఫ్, టి.జోసెఫ్, జి.అనుకిరణ్, సింగారెడ్డి ఇ న్నారెడ్డి, ఇతర గురువులు, దైవాంకితులు, కెథడ్రల్ చర్చీ కమిటీ, క్వాయర్ టీం, మఠకన్యలు, భక్తులు, విశ్వాసులు, వివిధ జిల్లాల ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ అగ్రపీఠ కాపరి కార్డినల్ అంతోని పూల ముగింపు ఉత్సవాలను ప్రకటించిన ఓరుగల్లు పాలనాధికారి ఫాదర్ విజయపాల్‌రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
అనుమానంతో కడతేర్చాడు
భూపాలపల్లి రూరల్ : మందు పెడుతుందనే అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటన జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం పెద్దాపూర్‌లో గురువారం రాత్రి జరిగింది. గ్రామస్తులు..ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన గోదారి సమ్మయ్య, అతడి భార్య సంధ్య (40) దాంపత్య జీవితం ప్రారంభంలో సాఫీగా సాగింది. అయితే కొంతకాలం తర్వాత కుటుంబ కలహాలు మొదలయ్యాయి. సంధ్య తనకు మందు పెడుతుందనే అనుమానం సమ్మయ్యలో అనుమానానికి కారణమైంది. దీంతో తరచూ గొడవలు జరగగా సంధ్య కొంతకాలంగా మండలంలోని ఆముదాలపల్లి గ్రామంలో పుట్టింట్లో నివసిస్తోంది. అయితే ఇటీవల పెద్దల సమక్షంలో సమ్మయ్య భార్యను తిరిగి ఇంటికి తీసుకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త గురువారం రాత్రి గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. హత్య అనంతరం సమ్మయ్య నేరుగా వెంకటాపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతురాలి సోదరుడు సుధాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యను హత్య చేసిన భర్త.. -
విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్
కేయూ క్యాంపస్ : ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జాబ్ క్యాలెండర్‌ను సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో శుక్రవారం తెల్లవారు జామునుంచే కేయూలోని వివిధ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి, విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగ జేఏసీ పిలుపునిస్తే ఇక్కడ అక్రమంగా అరెస్టులు చేశారని ఆరోపించారు. అరెస్టయిన వారిలో కామగోని శ్రావణ్, మంద శ్రీకాంత్, మర్రి మహేష్, ఎల్తూరి సాయికుమార్, రాచకొండ రంజిత్, అశోక్, సేవాలాల్, బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ తదితరులు ఉన్నారు. -
కేయూ సమస్యలను ప్రస్తావిస్తా..
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని సమస్యలు తెలుసుకునేందుకు వచ్చా.. ఇక్కడి సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. శుక్రవారం కేయూ సెనేట్ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను విన్నాక స్పందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాబోయే శానసమండలి సమావేశాల్లో కాకతీయ యూనివర్సిటీలోని సమస్యలపై చర్చిస్తానన్నారు.పార్ట్ టైం లెక్చరర్లను కాంట్రాక్టు లెక్చరర్లుగా కన్వర్సన్ చేయించేందుకు, కాంట్రాక్టు లెక్చరర్లను మినిమం టైం స్కేల్ చేయించేందుకు కృషిచేస్తానని తెలిపారు. సుమారు 650 ఎకరాల భూమి ఉండాలని, తగ్గిపోయిందన్నారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విషయంలో తాత్సారం చేస్తోందని ఈ విషయంలో తాను జాబ్ క్యాలెండర్ కంటే ముందే ఈడబ్లూఎస్ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నానని వివరించారు.10 శాతం ఈడబ్లూఎస్ ఇవ్వటం సమంజసం కాదని 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వమంటే ఇస్తలేరని పేర్కొన్నారు. ఏప్రిల్ 1నుంచి బస్సు సదుపాయం వచ్చే నెల 1వ తేదీనుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు బస్సు సదుపాయం కల్పించేందుకు రిజిస్ట్రార్ రామచంద్రంతో మాట్లాడి అంగీకరింపచేశారు. అలాగే లైబ్రరీ ఉదయం 8గంటలనుంచి రాత్రి 10గంటలవరకు కూడా తెరిచే ఉంచేలా రిజిస్ట్రార్ అంగీకరించారు. ఈ సమావేశంలో బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ బొడిగ సతీష్ పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న -
‘ఆవాస్ యోజన’ ఇళ్ల ఎంపికలో లోపాలు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డిహన్మకొండ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో చాలా లోపాలున్నాయని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ దీన్‌దయాళ్ నగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా బలోపేతం, ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం అమలు, ప్రశిక్షణ అభియాన్ పై చర్చించారు. జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఇష్టానుసారంగా జరుగుతోందని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ కార్పొరేటర్లను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పక్కదారి పడుతోందని తెలిపారు. ఈవారంలో నిర్వహించనున్న మండల స్థాయి ప్రశిక్షణ అభియాన్‌ను విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల్లో జరిగే ప్రశిక్షణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలన్నారు. ఇంటి పన్నులు బలవంతంగా వసూలు చేయవద్దని, ప్రజా సమస్యలపై పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్పీ.జయంత్, సండ్ర మధు, ఇతర పదాధికారులు పాల్గొన్నారు. -
అభినవ్ మృతదేహం
విద్యుదాఘాతంతో బాలుడి మృతి నర్సంపేట రూరల్ : విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన నర్సంపేట మండలంలోని మాధన్నపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..మాధన్నపేటకు చెందిన దూడెల సతీష్–జ్యోతి దంపతుల ఏకై క కుమారుడు అభినవ్ (10) నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఉదయం సైకిల్‌పై వెళ్తుండగా స్తంభం పక్కనే ఉన్న ఎర్త్ వైర్‌ను ముట్టుకోవడంతో విద్యుత్ షాక్‌తో కింద పడిపోయాడు. వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు సీపీఆర్ చేసి పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. దీంతో మాధన్నపేట గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. -
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
కాజీపేట : ఒకప్పుడు పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ కుమారుడు సురేందర్ రావుకు నేడు బుక్కెడు తిండి లేక తల్లడిల్లుతున్నాడు. చిన్ననాటి స్నేహితుడు విజయ్‌కుమార్ మిత్రుత్వాన్ని మరచిపోలేక నిత్యం పంపిస్తున్న ఆహారమే ఆయన ప్రాణాలను కాపాడుతోంది. కాజీపేట మండలంలోని కడిపికొండకు చెందిన కొండపర్తి మనోహర్‌రావు 1958లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మనోహర్‌రావుకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు సురేందర్‌రావు ఉన్నారు. కాగా ఇద్దరు కూతుర్లు, కోడలు అనారోగ్యంతో మృతిచెందగా కుమారుడు ఒంటరివాడయ్యాడు. 1996లో సురేందర్‌రావు ఒంటరిగా ఉండడాన్ని గమనించిన పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేరదీసి నాలుగేళ్లు ఆశ్రయం కల్పించారు. ఆ తర్వాత పట్టించుకునే వారు లేక చివరికి కడిపికొండలోని రాజీవ్ గృహకల్ప ఇళ్లకు చేరి జీవనం సాగిస్తున్నాడు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పందించి సురేందర్‌రావుకు చేయూతనందిస్తారనే ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల పింఛన్‌కు దరఖాస్తు.. ఒకనాడు వందల ఎకరాల భూములున్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి నేడు దివ్యాంగుల పింఛన్‌తో పాటు మనసున్న దాతల చేయూత కోసం ఎదు రు చూస్తున్నాడు. ఎంజీఎం ఆస్పత్రి ఆర్ధోపెడిక్ వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్తో దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండాపోయింది. మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు పెండింగ్‌లో ఉండటంతో రెండేళ్లుగా పింఛన్ అందుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.కె.సురేందర్ రావు,ఎస్బీఐ అకౌంట్ నంబర్ 62304832105, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0021300, బ్రాంచి మడికొండకు దాతలు సాయం అందించాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ కుమారుడు సురేందర్‌రావుకు చేయూత కరువు రాజీవ్ గృహకల్పలో ఆశ్రయం సీఎం పట్టించుకోవాలని వేడుకోలు -
ఆఫీస్ సబార్డినేట్ ఆత్మహత్య
డోర్నకల్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. డోర్నకల్ ఎస్సై గడ్డం ఉమ కథనం ప్రకారం.. అమ్మపాలెం గ్రామానికి చెందిన ఎస్కే జమాల్ (45) పీహెచ్సీలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం పీహెచ్సీ వద్ద పురుగు మందు తాగి ఇంటికి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న జమాల్ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం డోర్నకల్ పీహెచ్‌సీకి తీసుకు వచ్చారు. పీహెచ్సీలో పూర్తిస్థాయి వైద్యం చేసే అవకాశాలు లేకపోవడంతో 108వాహనంలో మహబూబాబాద్ తరలించే ప్రయత్నాలు చేస్తుండగా జమాల్ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే అప్పుల బాధతో జమాల్ మృతి చెందాడని భార్య సుల్తానాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


