వై.రామవరం: స్థానిక వారపుసంతలో మండల లోతట్టు గ్రామాలనుంచి వచ్చిన ప్రజల ఆధ్వర్యంలో సోమవారం మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. తమకు మావోయిజం వద్దని, అభివృద్ధే ముఖ్యమని నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు. గతంలో మావోయిస్టులు అడ్డుకోవడంతో మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం, సెల్ టవర్ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకో వద్దని కోరారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఇకపై ఎవరూ మావోయిస్టు పార్టీలోకి వెళ్లమని ప్రతిజ్ఞ చేశారు.