
పర్యాటక అభివృద్ధితోనే యువతకు ఉపాధి అవకాశాలు
రంపచోడవరం: జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తే గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు) అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశం హాలులో బుధవారం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అధ్యక్షతన ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధి, మినీ పరిశ్రమల ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, పలువురు జెడ్పీటీసీలు,ఎంపీపీలు, సర్పంచ్‌లు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏజెన్సీలో జీడిపిక్కల కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లో మోసాలు లేకుండా చూడాలన్నారు. గిరిజన యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి జరగాలని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో యువత వ్యాపారాలు నిర్వహించుకునేందుకు రుణాలు అందజేయాలన్నారు. పర్యా టక ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టి పర్యాటకులసంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాల ని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యాటకాభివృద్ధి కోసం మంత్రితో చర్చించినట్లు తెలిపారు. రంపచోడవరంలో జీడిపిక్కల పరిశ్రమ ఏర్పాటుకు చర్య లు చేపట్టనున్నట్టు చెప్పారు. పర్యాటక శాఖకు చెందిన భవనాలకు 30 సంవత్సరాల లీజు రద్దు చేసి గిరిజనులతో నడింపిచాలన్నారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ ఏజెన్సీలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలిపారు. మారేడుమిల్లి జెడ్పీటీసీ గొర్లె బాలాజీబాబు మాట్లాడుతూ రబ్బరు పరిశ్రమ ఏర్పా టు చేయాలని, దావవాడ, దుంపవలస, పూతిగుంట వాటర్ ఫాల్స్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. పోలవరం ముంపు గ్రామాల్లోని యువతకు సబ్సిడీపై బో ట్లు ఇవ్వాలని ఎంపీపీ కుంజం మురళీ కోరారు. ఐ పోలవరం వద్ద సీతపల్లి వాగుపైరోప్ వే వంతెన నిర్మించాలని, భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టుల్లో బోట్ పాయింట్ ఏర్పాటు చేయాలని ఎంపీపీ బందంశ్రీదేవి కోరారు. రంపచోడవరంలో డివైడర్‌కు లైట్లు ఏర్పాటు చేయాలని సర్పంచ్ బొజ్జయ్య కోరారు.
పర్యాటకాభివృద్ధి, మినీ పరిశ్రమల ఏర్పాటు సమావేశంలో ఎమ్మెల్సీ అనంతబాబు