
భారీ వర్షాలకు పొంగిన వాగులు
● గోదావరికి క్రమేపీ పెరుగుతున్న వరద
● కన్నాపురం అలుగువాగుకు వరద తాకిడి
ఎటపాక: తుపాను ప్రభావంతో నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మండలంలోని కన్నాపురం అలుగువాగుకు వరద ఉధృతి నెలకొంది. ప్రాజెక్టు నిండి పోవడంతో పొంగి పొర్లుతోంది. మురుమూరు, నందిగామ, తోటపల్లి, నెల్లిపాక, రాయనపేట, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి నదికి వరద పెరుగుతుండటంతో విలీన వాసులు ఆందోళన చెందుతున్నారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు వారిలో గుబులు రేపుతున్నాయి. మిర్చి నారు తయారు చేసుకుంటున్న రైతులు వర్షాలు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.