
కాలువలోపడి వ్యక్తి మృతి
● వరంగల్ జిల్లా వాసిగా గుర్తింపు
సీలేరు: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన ముత్తయ్య (42) అనే వ్యక్తి సీలేరులో ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతి చెందాడు. కూలిపనుల నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చాడు. మెయిన్‌రోడ్డులోని బజారు సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న కాలువలో శనివారం కాలుజారి పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. అతని దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం వరంగల్ జిల్లా వాసిగా సీలేరు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మృతుని బంధువులకు సమాచారం ఇచ్చినట్టు వారు పేర్కొన్నారు.