ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

Aug 17 2025 6:46 AM | Updated on Aug 17 2025 6:46 AM

ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

చింతపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) చింతపల్లి తాలూకా యూనిట్‌ అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ తెలిపారు. ఆ సంఘ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పిలుపు మేరకు శనివారం స్థానిక గిరిజన్‌ భవన్‌లో కేక్‌ కట్‌చేసి టీ తాగుదాం–ఉద్యోగులు సమస్యలపై చర్చిద్దాం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వోద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీజీఈఏ అసోసియేట్‌ అధ్యక్షుడు గసాడి పద్మనాభం, ఉపాధ్యక్షుడు తుచ్చా మదుసూధనరావు, కార్యవర్గ సభ్యులు శోభభన్‌బాబు, కన్నబాబు, పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement