
శాప్ కోచ్ అబ్బుకు కోచ్ రిఫ్రెష్ కోర్సు సర్టిఫికెట్
నర్సీపట్నం : స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా వారు పాటియాలా పంజాబ్లో వారం రోజులుగా నిర్వహించిన ఆల్ ఇండియా కోచ్ రిఫ్రెష్ కోర్స్లో నర్సీపట్నంకు చెందిన శాప్ కోచ్ కె.అబ్బు సర్టిఫికెట్ అందుకున్నారు. వివిధ రాష్ట్రాల నుండి 26 మంది పాల్గొన్నా రు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత చంద్రలాల్ (హర్యానా ఖేలో ఇండియా ఎక్సలెన్సీ మేనేజర్) చేతుల మీదుగా సర్టి ఫికెట్ అందుకున్నారు. కోచ్ అబ్బు ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారులను తయారు చేస్తున్నారు. అబ్బు కు నింజాస్ అకాడమి డైరెక్టర్లు వెలగా నారాయణరావు, సుత్తాపల్లి శ్రావణ్, శ్రీకాంత్, ఎన్ఆర్ఐ సురేష్, సీనియర్ కోచ్ శేఖర్ అభినందనలు తెలిపారు.