ముగిసిన నాటిక పోటీలు | - | Sakshi

ముగిసిన నాటిక పోటీలు

Mar 31 2025 6:48 AM | Updated on Mar 31 2025 6:48 AM

అనకాపల్లి టౌన్‌: పట్ణణంలోని వి.వి. రమణ రైతు భారతి కేంద్రంలో జ్యోతి సరళ స్మారక కళాపరిషత్‌, డైమండ్‌ హిట్స్‌ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటిక పోటీలు ఆదివారంతో ముగిసాయి. ఈ కార్యక్రమాన్ని బి.ఎం రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ నాటికలు ఆహూతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఆలోచింపజేసిన రేపటి శత్రువు..

ఈ కాలం పిల్లలు తన ఇల్లు, భార్య, తన సంతానం అని గిరి గీసుకుంటున్నారు. అందులో మరొకరికి స్ధానం లేదు. ఇది పెద్దవాళ్ళు అర్ధం చేసుకోవాలి. నష్టమయినా, కష్టమయినా ఈ జీవిత సత్యాన్ని జీర్ణం చేసుకోవాలి. లేకపోతే వాళ్ళ జీవితం దుర్భరమైపోతుందని ప్రదర్శించిన నాటకం ప్రేక్షకులను ఆలోచింపజేసింది.

యాంత్రిక యుగంలో..‘కొత్త సైన్యం’..

మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మానవ జీవితంలో వేగం పెరిగిపోయింది. ఈ వేగంలో మానవ సంబంధాలు బలహీనమై పోయాయి. పిల్లలు పట్టించుకోవడం లేదని వాళ్ళని ఆడిపోసుకోవడం అనవసరం. ఇది యాంత్రిక యుగం. అంటే మనిషి యంత్రంలా జీవిస్తాడనే అర్ధం. ఈ కాలానికి తగట్లు మనమే మారాలి. మన శేష జీవితాన్ని దేశానికి అంకితం చేయాలి... అని నిర్ణయిచుకున్న పెద్దలు ఈ నాటికలో కనిపిస్తారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్‌, బొడ్డేడ జగత్‌రావు, కర్రి దివాకర్‌, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement