
స్మార్ట్ మీటర్ ఉద్యోగుల ఆందోళన
నర్సీపట్నం: కొత్త జీతం వద్దు..పాత జీతమే ఇవ్వాలంటూ అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్ల ఉద్యోగులు ప్లకార్డులతో శుక్రవారం ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మార్చి 31వ తేదీ నుంచి ఉద్యోగులు విధులు బహిష్కరించి, ఆందోళన బాటపట్టారు. పాత జీతం ముద్దు.. కొత్త జీతం వద్దు, ఏడాది ఒప్పందం కొనసాగించాలి.. అంటూ నినాదాలు చేశా రు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. జాయినింగ్ లెటర్‌లో ఇచ్చిన ప్రకారం జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలన్నారు. పాత జాయినింగ్ లెటర్‌లో ఉన్న హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు.