
మరింత మెరుగ్గా పోలీస్ భద్రతా ప్రమాణాలు
● విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి
● ఏఆర్ పోలీస్ కార్యాలయంలో వార్షిక తనిఖీలు
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ నగరంలోని విశాలాక్షినగర్ ప్రాంతం కై లాసగిరి జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ పోలీస్ కార్యాలయంలో శుక్రవారం విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి వార్షిక తనిఖీలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో పరేడ్ నిర్వహించారు. పోలీస్ జాగిలాలు డీఐజీకి సలాం చేశాయి. ఈ సందర్భంగా డీఐజీ పోలీసుల ఆయుధాలు, మోటార్ ట్రాన్స్‌నోర్ట్ విభాగం, డాగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు. సెక్యూరిటీ వెల్ఫేర్ విభాగం రికార్డులు పరిశీలించారు. ఇక్కడ నార్కోటిక్ జాగిలం బన్నీకి మత్తు పదార్థాలు కనిపెట్టినందుకు ఆయన రివార్డ్ ప్రకటించారు. వాహనాల నిర్వహణ, ఆయుధాల పనితీరు, శిక్షణ ప్రమాణాలు, భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ తుహిన్ సిన్హాను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీస్ భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరముందన్నారు.