
రమ్యమైనది రామనామం
నర్సీపట్నం: అతి పురాతన దేవాలయమైన నర్సీపట్నం కోమటి వీధి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వెలమ వీధి రామాలయంలోని శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవంలో స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు పాల్గొ న్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, మంగళసూత్రాలు సమర్పించారు.
తారువలో మాజీ డిప్యూటీ సీఎం బూడి..
దేవరాపల్లి: తారువలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు దంపతులు పాల్గొని సీతారాములు వారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన అన్నసమారాధనలో ముత్యాలనాయుడు వడ్డన చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.

రమ్యమైనది రామనామం