
పయనీర్ పరిశ్రమ కార్మికుల ఆందోళన
గేటు బయట కూర్చొని ఆందోళన చేస్తున్న పయనీర్ పరిశ్రమ కార్మికులు
అచ్యుతాపురం రూరల్ : కార్మికుల శ్రమను పయనీర్ పరిశ్రమ దోపిడీ చేస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము ఆరోపించారు. అధిస్తాన్(బ్రాండిక్స్)లో ఉన్న పయనీర్ పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం మధ్యాహ్నం ఏ, బీ షిఫ్ట్ కార్మికులు గేటు బయట ఆందోళన చేపట్టారు. వారికి సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పయనీర్ పరిశ్రమలో కార్మికులకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ వేయడం లేదన్నారు. అతి తక్కువ బోనస్ ఇచ్చి నైట్ డ్యూటీలు చేయిస్తూ కార్మికులను మోసం చేస్తున్నారన్నారు. యాజమాన్యం స్పందించి వెంటనే కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.