
తెలుగు మహాసభల లోగో ఆవిష్కరణ
విశాఖ స్పోర్ట్స్: 3వ ప్రపంచ తెలుగు మహాసభల లోగోను శాసనసభ స్పీకర్ చింతకాయల అయన్నపాత్రుడు సోమవారం ఈస్ట్‌పాయింట్ గోల్ఫ్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాష, యాస భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాషలో మాట్లాడాలన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రమేవ జయతే అంటూ నినదిస్తున్నామన్నారు. ఆంధ్రలో ఇప్పటికే రెండు సభలు నిర్వహించామన్నారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న పి.రామచంద్రరాజు మాట్లాడుతూ 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో అమరావతి గుంటూరు హైవే శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీ గ్రౌండ్స్‌లో ఈ సభ జరుగుతుందన్నారు. భాషాభిమానులే అన్ని బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రులతో సహా పలువురు గౌరవనీయుల్ని ఆహ్వానిస్తున్నామన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వై.రామారావు మాట్లాడుతూ గతేడాది 20 బ్లడ్‌బాంక్‌ల ద్వారా లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించి అందచేశామన్నారు. ఆరు బ్లడ్‌బాంక్‌ల ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగానే రక్తం అందించామన్నారు.
ఈ సందర్భంగా రక్తదానం చేయండంటూ ప్రచార రెడ్‌క్రాస్ సోసైటీ గోడపత్రికను స్పీకర్ అయ్యన్నపాత్రుడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ యువ వలంటీర్లు పాల్గొన్నారు.