
ఎండల్లో మంటలు
●పారాహుషార్
జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలు – 8 2023–24లో ఫైర్‌కాల్స్ – 560
ప్రమాదాల్లో ఆస్తి నష్టం
రూ.327.42 కోట్లు
కాపాడిన ఆస్తి
రూ.205.66 కోట్లు
వేసవిలో అగ్ని ప్రమాదాలకు అవకాశం
అప్రమత్తతతో భారీ నష్టాలకు చెక్
అగ్నిమాపక కేంద్రాల్లో పీడిస్తున్న సిబ్బంది కొరత
జిల్లాలో అందుబాటులో 8 అగ్నిమాపక కేంద్రాలు
సాక్షి, అనకాపల్లి :
ఎండాకాలంలో భానుడు భగ్గుమంటున్నాడు. ఈ ఏడాది మార్చి నెల ప్రారంభం నుంచే అధికంగా ఉష్టోగ్రతలు నమోదవుతన్నాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగానే ఉష్టోగ్రతలు ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో అగ్నిప్రమాదాలు సంభవించడానికి అవకాశాలెక్కువగా ఉంటాయి. అగ్గిలా మండే ఎండలకు తోడు ఫైర్ యాక్సిడెంట్లు సంభవిస్తే ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించే పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలల వరకూ ప్రజలతో పాటు అగ్ని మాపక సిబ్బంది ఆప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేరకు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని 8 అగ్ని మాపక కేంద్రాలు ఉన్నప్పటికీ తీవ్రమైన ప్రమాదాలు సంభవించినప్పుడు నిమిషాల వ్యవధిలోనే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతోంది.
పారిశ్రామిక ప్రాంతంలో మరింత అప్రమత్తం..
జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన పరవాడ, రాంబిల్లి, అచ్యుతాపురం, కశింకోట మండల పరిధిలో ఒక వైపు పరిశ్రమలు, మరో వైపు ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా 560 అగ్నిప్రమాదాలు సంభవించాయి. వీటిలో 2 అత్యంత ప్రమాదకరమైనవి (రూ.10 లక్షలకు పైగా నష్టం సంభవించిన ప్రమాదాలు) కాగా, 40 మీడియం ఫైర్ కాల్స్ (రూ.2 లక్షల నుంచి రూ.10లక్షలలోపు నష్టం), 489 చిన్నపాటి అగ్ని ప్రమాదాలు సంభవించాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన 560 అగ్ని ప్రమాదాల్లో రూ.205 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించగా, రూ.327.42 కోట్ల ఆస్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. ఈ ప్రమాదాల్లో 32 మంది ప్రాణాలు కోల్పోగా, 19 మందిని అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడగలిగారు. అలాగే ఈ ప్రమాదాల్లో 20 పశువులు చనిపోగా, ఒక దాన్ని సిబ్బంది కాపాడారు. రెస్క్యూ చేస్తుండగా 18 మంది చనిపోగా..ముగ్గురిని బతికించగలిగారు.
అవగాహనకు మాక్‌డ్రిల్
జిల్లాలో సెజ్ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో..సేప్టీ ఆడిట్‌లో భాగంగా ప్రతి నెలా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. ఏ ప్రాంతంలో అయినా అగ్ని ప్రమాదం జరిగిన తక్షణమే ఆయా పరిధిలో ఉన్న ఫైర్‌స్టేషన్లకు సమాచారం ఇవ్వాలి. వేసవిలో ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్తంగా ఉండాలి. ఫార్మా కంపెనీలతో కలిసి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాం. ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ పేరిట శిక్షణ కల్పిస్తున్నాం. ఇవి కాకుండా జిల్లాలో వేసవిలో ఎక్కువగా తోటలు తగలబడినట్టు ఫైర్ కాల్స్ వస్తున్నాయి. ఎటువంటి అగ్నిప్రమాదం సంభవించినా 101 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి.
– వెంకట రమణ,
జిల్లా ఫైర్ అధికారి
●
ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు..
అవగాహన కోసమే వారోత్సవాలు..
అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం ఏటా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ వారోత్సవాల్లో భాగంగా, విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బందికి నివాళులర్పించడం, బస్టాండ్, మార్కెట్లు, సినిమా థియేటర్లు, మురికివాడల్లో అగ్ని మాపక నియంత్రణ పరికరాల వినియోగం, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన, ఎల్‌పీజీ స్టోరేజీ, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బందికి అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఎలా తమని తాము కాపాడుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో మొత్తం 6 ఫైర్ స్టేషన్‌ల్లో 75 మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటితో పాటుగా మరో రెండు అవుట్‌సోర్సింగ్ ఫైర్‌స్టేషన్లలో 25 మంది వరకూ సిబ్బంది ఉన్నారు.
జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలు
అనకాపల్లి 08924–222299
యలమంచిలి 08924–222299
నర్సీపట్నం 08924–231101
మాడుగుల 08924–235101
చోడవరం 08934–345199
సబ్బవరం 08924–231101
అవుట్ సోర్సింగ్ ఫైర్ స్టేషన్లు..
నక్కపల్లి 08924–231101
రావికమతం 08932–235101

ఎండల్లో మంటలు

ఎండల్లో మంటలు

ఎండల్లో మంటలు

ఎండల్లో మంటలు

ఎండల్లో మంటలు