
సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తుహిన్ సిన్హా
సబ్బవరం: స్థానిక పోలీస్ స్టేషన్‌ను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై సమీక్షించారు. ప్రధానంగా పేదలు, వృద్ధులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిస్కారానికి పోలీస్ సిబ్బంది నిరంతరం కృషి చేయాలని సూచించారు. బేసిక్ పోలీసింగ్‌తోపాటు, విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి సేవించే వివరాలు సేకరించి, అక్రమ రవాణా అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తరుచుగా నమోదవుతున్న నేరాలు, పెండింగ్ ఫైళ్లను పరిశీలించి ఆయా కేసుల పురోగతిపై సమీక్షించి, తగు సూచనలిచ్చారు. రౌడీ షీటర్లు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తుల వివరాలను సేకరించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. దొంగతనాల నియంత్రణకు గస్తీ విధులు మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆయన వెంట పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, సబ్బవరం సీఐ పిన్నింటి రమణ, ఎస్‌ఐలు సింహాచలం, దివ్య తదితరులున్నారు.
● గంజాయి రవాణాపై వివరాలు సేకరించాలని ఆదేశం

సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తుహిన్ సిన్హా