
అప్పన్న కల్యాణోత్సవం
నేత్రపర్వంగా
● సందడిగా ఎదురు సన్నాహోత్సవం ● హరినామస్మరణతో మార్మోగిన సింహగిరి ● ఉత్సాహంగా రథోత్సవం.. పరవశించిన భక్తజనం ● భక్తులకు ముత్యాల తలంబ్రాల పంపిణీ
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
గరిష్టం/కనిష్టం
అనకాపల్లి : 35.6/24.0
చోడవరం : 37.0/29.0
రాగల ఐదు రోజులు జిల్లాలో ఆకాశం పొడిగా ఉండి, అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని ఆర్‌ఏఆర్‌ఎస్ వాతావరణ విభాగం శాస్త్రవేత్త వి.గౌరి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం మంగళవారం రాత్రి కనులపండువగా జరిగింది. భూదేవి, శ్రీదేవి సమేత అప్పన్న స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తుల హరి నామస్మరణలతో సింహగిరి మార్మోగింది. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కల్యాణోత్సవ ఘట్టాలను ఆలయ అర్చకులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. తొలుత ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద అర్చకులు, ముత్తయిదువులు పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. తదుపరి ముక్కోటి దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానాన్ని పలుకుతూ అలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు గరుడాళ్వార్ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వాద సంవాదాలతో సందడిగా ఎదురు సన్నాహం
ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారురంగు పల్లకీలో, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకీలో వేంజేపచేశారు. అమ్మవార్ల పల్లకీని, అయ్యవారి పల్లకీని సింహగిరి మాడవీధిల్లో చెరొకవైపు తీసుకెళ్లి పశ్చిమ మాడ వీధిలో జోడుభద్రాల వద్ద ఎదురెదురుగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచారు. అక్కడ ఎదురు సన్నాహోత్సవం వాద, సంవాదాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తుల ఆనందోత్సాహాల మధ్య వేడుకగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పూలదండలతో నృత్యాలు చేస్తూ ఎదురు సన్నాహోత్సవాన్ని రక్తి కట్టించారు. వ్యాఖ్యాతలుగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిచారకుడు కె.ఇ.లక్ష్మీనరసింహన్, నరసాపురానికి చెందిన ఆధ్యాత్మికవేత్త వంగల వెంకటాచార్యస్వామి వ్యవహరించారు.
కనుల పండువగా రథోత్సవం
సింహగిరి మాడ వీధిలో పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తులను రథంలో వేంజేపచేశారు. జాలరి పెద్ద కదిరి లక్ష్మణరావు రథసారధిగా నిలిచి రథ కదలికలను సూచిస్తుండగా, లక్ష్మీదేవి అమ్మవారి బంధువులుగా విశాఖ నగరం నలుమూలల నుంచి వచ్చిన జాలర్లు రథం నడిపే బాధ్యతలు చేపట్టారు. అశేష భక్తజనం స్వామి రథాన్ని తాళ్లతో లాగి పరవశించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తాడేపల్లిగూడేనికి చెందిన రాజరాజేశ్వరి కాళీమాత ట్రూప్ బృందంచే కాంతారా డ్యాన్స్, గోపాలపట్నంకి చెందిన శ్రీమన్నారాయణ కోలాటం బృందం ప్రదర్శన, ఎస్.కోటకి చెందిన పార్వతీపరమేశ్వర ట్రూప్‌చే చెక్కభజన తదితర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
న్యూస్‌రీల్

అప్పన్న కల్యాణోత్సవం

అప్పన్న కల్యాణోత్సవం