
ఏఐలో చరణ్‌తేజ్ ప్రతిభ
● జేఈఈ స్కోర్ లేకుండానే ఐఐటీ హైదరాబాద్‌లో సీటు
యలమంచిలి రూరల్: యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లికి చెందిన జెర్రిపోతుల చరణ్‌తేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ కోర్సులో ప్రవేశాల కోసం జాతీయ పరీక్ష నిర్వహణ సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మెరిశాడు. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలో రెండు దశల్లో చరణ్‌తేజ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రంలో ఐఐటీలో సీటు సాధించిన 20 మంది విద్యార్థుల్లో ఒకరిగా నిలిచాడు. ఈ ఏడాది నుంచి దేశవ్యాప్తంగా ఐఐటీల్లో కొన్ని ఇంజనీరింగ్ కోర్సుల్లో ఐఐటీ జేఈఈ స్కోర్ లేకుండానే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఎన్‌టీఏ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన జెర్రిపోతుల చరణ్‌తేజ్‌కు ఐఐటీ హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ ఏడాది సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశం లభించింది. ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా రెండు వేలమందికి వివిధ ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. తనకు ఐఐటీ హైదరాబాద్‌లో సీటు దక్కడం పట్ల చరణ్‌తేజ్ ఆనందం వ్యక్తం చేశాడు. కోర్సు పూర్తి చేసి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మంచి ఉద్యోగం సాధించాలన్నదే తన లక్ష్యమని సాక్షికి తెలిపాడు. చరణ్‌తేజ్ తండ్రి నాగేశ్వర్రావు వివి ధ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఈ సందర్భంగా చరణ్‌తేజ్‌ను పలువురు అభినందించారు.
చరణ్‌తేజ్