
ఇంటర్ టాపర్స్‌కు సత్కారాలు
కశింకోట/రోలుగుంట: ఇంటర్ పరీక్ష ఫలితాల్లో టాపర్స్‌గా నిలిచిన ఇద్దరు విద్యార్థినులకు అరుదైన గౌరవం లభిస్తోంది. కశింకోట మండలం తేగాడ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివి బైపీసీలో 983/1000 మార్కులు తెచ్చుకున్న కంట్రెడ్డి రాజులమ్మ సన్‌షైన్ స్టార్స్ పురస్కారానికి ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ దొండా చంద్రకళ తెలిపారు.ఈ నెల 15న విజయవాడలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోనున్నట్లు చెప్పారు. ఆమెతోపాటు ఇంటర్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అభినందనలు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావునాయుడు, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ ఆర్. జయప్రకాష్‌లు కూడా అభినందించారు. ఎంపీసీ గ్రూపు నుంచి 986 మార్కులు తెచ్చుకొని ఉమ్మడి విశాఖ జిల్లా టాపర్‌గా నిలిచిన రోలుగుంట మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని మడ్డు గౌతమి కూడా ఈ నెల 15న అమరావతిలో జరగనున్న టాపర్స్ సత్కార్‌కు ఎంపికై ంది. తల్లిదండ్రులతో కలిసి రావాలని ఇంటర్ బోర్డు కమిషన్ కార్యాలయం నుంచి ఆదివారం ఆహ్వానం అందింది. కళాశాల ప్రిన్సిపాల్ అప్పలరాజు, గణిత అధ్యాపకుడు సీనియర్ లెక్చరర్ సహదేవుడు ఆమెను అభినందించారు.

ఇంటర్ టాపర్స్‌కు సత్కారాలు