
పాడేరు ఘాట్‌లో వాహనం బోల్తా
● 15 మందికి గాయాలు ● ‘ఫైర్’ అధికారుల తక్షణ స్పందనతో తప్పిన ప్రాణాపాయం
మాడుగుల: పాడేరు రోడ్డులో ఏసుప్రభువు విగ్రహం టర్నింగ్ పాయింట్ వద్ద ఆదివారం తెల్లవారు 3 గంటల సమయంలో బొలెరో వాహ నం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. అయితే ఫైర్ అధికారులు వెంటనే స్పందించి బోల్తా పడిన వాహనాన్ని తప్పించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణనష్టం జరగలేదు. స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి రాజేశ్వరరావు కథనం ప్రకారం.. వీరంతా ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా కొడవలస, సీతమామిడి గ్రామాల నుంచి తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట వలస వెళ్తున్నారు. దీంతో వాహనం అదుపు తప్పడంతో వీరికి గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ నుంచి క్షతగాత్రులను తమ వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి తీవ్రంగా గాయాలైన ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు.

పాడేరు ఘాట్‌లో వాహనం బోల్తా

పాడేరు ఘాట్‌లో వాహనం బోల్తా