
గ్రూప్‌లో మెజారిటీ ఉన్నా.. మేట్‌ను రిజిస్టర్ చేయలేదు..
మాది మాకవరపాలెం మండలం మామిడిపాలెం గ్రామం. మా గ్రూప్‌లో 50 మంది ఉపాధి కూలీలున్నారు. వీరిలో మెజారిటీ 25 మంది కన్నా ఎక్కువగా కూలీలు మద్దతుంటే.. మేట్‌గా రిజిస్టర్ చేయాలి. నాకు 30మందికి పైగా కూలీల మద్దతు ఉంది. అయినా మేట్‌గా రిజిస్టర్ చేయలేదు. ఇలా 7 గ్రూపుల్లో నిబంధనలకు విరుద్ధంగా మేట్లను నియమించారు. అధికారులు నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉద్యమిస్తాం. – అడిగర్ల అప్పలనాయుడు,
మేట్, మామిడపాలెం గ్రామం, మాకవరపాలెం
●