
అవార్డు అందుకున్న విద్యార్థులకు సత్కారం
ఉత్తమ విద్యార్థులను సత్కరించిన ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి
నర్సీపట్నం: రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి, అధ్యాపకులు జి.చిన్నారావు, శర్మ గురువారం సత్కరించారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఎంఎల్టీ విద్యార్థిని సిరసపల్లి హరిత 989 మార్కులు, బ్యాంకింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సులో మౌళి కిరణ్ 978 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచారు. వీరిద్దరనీ ఘనంగా సత్కరించారు. అధ్యాపకుల సూచనలను పరిగణనలోకి తీసుకుని ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో కళాశాలకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని ప్రిన్సిపాల్ అన్నారు.